
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో నూతన ఎయిర్‌పోర్ట్‌ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని నూటికి నూరుపాళ్లు పూర్తి చేస్తామని తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వరంగల్‌తో పాటు మరో మూడు (పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్) విమానాశ్రయాలను అభివృద్ధి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారని తెలిపారు.
పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం విషయంలో ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి ఉందని.. నివేదిక సానుకూలంగా వస్తే తర్వాత భూసేకరణకు వెళ్లొచ్చని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది. ఆ శాఖ నుంచి అనుమతి ఉంటే అక్కడ కూడా విమానాశ్రయాన్ని చేస్తామన్నారు.
‘‘ఆదిలాబాద్‌కు ఓవైపు చత్తీస్‌గఢ్, మరోవైపు మహారాష్ట్ర సరిహద్దులు ఉన్నాయి. దరిదాపుల్లో విమానాశ్రయం లేదు. అక్కడ ఏర్పాటు చేస్తే చాలామందికి ఉపయోగకరంగా ఉంటుంది. వరంగల్ విమానాశ్రయం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రో యాక్టివ్‌గా వ్యవహరిస్తూ భూసేకరణకు సర్క్యులర్ జారీ చేసింది. అక్కడ పూర్తిగా ఎయిర్‌ఫోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా విమానాశ్రయాన్ని నిర్మించి చూపిస్తాం. విమానయాన శాఖ వల్ల కేవలం విమాన ప్రయాణాలే కాదు.. టూరిజం ఉద్యోగ కల్పన మౌలిక సదుపాయాల కల్పన అభివృద్ధి పెరుగుతుంది’’ అని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment