Cheating AP People
-
రామ్మోహన్ నాయుడు అనుచరుడి దందా.. శిక్షణ పేరుతో యువతులపై వేధింపులు!
సాక్షి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలైంది. భారత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర లక్షల్లో వసూలు వేసి వారిని వేధింపులకు గురిచేస్తున్న వీడియో బయటకు వచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను వైఎస్సార్సీపీ షేర్ చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా వీడియోను షేర్ చేస్తూ..‘శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు. ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణ. శిక్షణ పేరుతో సెంటర్‌కి వచ్చిన అమ్మాయిల గదుల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్.. వాటిని అడ్డుపెట్టుకుని స్నేహితులతో కలిసి అమ్మాయిలను వేధింపులకు గురిచేస్తున్నాడు.బసవ రమణ వీడియోలు తీస్తున్న విషయాన్ని అమ్మాయిల ఇంట్లో చెప్పిన నలుగురు కుర్రాళ్లని బంధించి.. చిత్రహంసలకు గురిచేస్తున్నాడు. శ్రీకాకుళంలో మంత్రి రామ్మోహన్ నాయుడు పేరు చెప్పి.. బసవ రమణ దందాలు. షాపింగ్ మాల్స్, బార్స్‌కి వెళ్లి బిల్లులు చెల్లించకుండా బెదిరింపులకు సైతం పాల్పడుతున్నాడు. రమణ ఇలా దుర్మార్గాలకి పాల్పడుతున్నా.. పట్టించుకోని కూటమి ప్రభుత్వం. శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్‌కి కూడా రమణ సన్నిహితుడు. పాలన చేతగాకపోతే.. ఊరూరా ఇలాంటి దుర్మార్గులే రాజ్యమేలుతారు అనేదానికి ఇంతకంటే ఉదాహరణ కావాలా చంద్రబాబు అంటూ విమర్శించింది. 💣 Truth Bomb 💣శ్రీకాకుళంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అనుచరుడి ఘరానా మోసం బట్టబయలు ఇండియన్ ఆర్మీ కాలింగ్ అనే సెంటర్‌ను స్థాపించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక్కొకరి దగ్గర నుంచి రూ.5-10 లక్షల వరకూ వసూళ్లకి పాల్పడిన బసవ రమణశిక్షణ పేరుతో సెంటర్… pic.twitter.com/CdcgSdJUJE— YSR Congress Party (@YSRCParty) December 6, 2024 -
బాబు తీరుతో ఊసరవెల్లి సిగ్గుపడుతోంది
నెల్లూరు(సెంట్రల్): నాలుగేళ్లుగా పూటకో మాట, రోజుకో అబద్ధం చెపుతూ ఊసరవెల్లి రంగులు మార్చినట్లు చంద్రబాబు నాలుకలు మారుస్తూ ప్రజలను మోసం చేస్తున్న తీరు చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడుతోందని వైఎస్సార్సీపీ నెల్లూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు తీరుపై కాకాణి ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా ప్రతి ఏటా నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షలు ప్రజలు లేక వెలవెలబోయాయని విమర్శించారు. ఉపాధి కూలీలను సభలకు తరలించి కాలం వెళ్లదీశారని ఆరోపించారు. చంద్రబాబు తీరుపై ప్రజల్లో పూర్తిగా నమ్మకం సన్నగిల్లిందన్నారు. ప్రజాధనాన్ని వృథా చేస్తూ ప్రకటనలతో ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర రాజధానిలో ఒక్క ఇటుక కూడా శాశ్వత నిర్మాణం చేయలేదని, కానీ చంద్రబాబు ఇంటిని మాత్రం అధునాతన హంగులతో నిర్మించుకున్నారని అన్నారు. వంచనలకు బ్రాండ్ అంబాసిడర్ ఆంధ్రుల హక్కుల సాధన సమరపు సారధి చంద్రబాబు అంటూ ఆర్భాటపు ప్రకటనలు ఇస్తున్నారని, కానీ చంద్రబాబుకు సమరం అంటే ఎంటో తెలుసా అని ప్రశ్నించారు. వంచన, వెన్నుపోటు, అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి పదాలతో చం ద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ వంచన విధానాల వారధి అని పేరు పెడితే బాగుంటుందన్నారు. రాష్ట్రం అడ్డగోలు విభజనకు కారణమైన సీఎం చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష పేరుతో ప్రజలను వంచి స్తున్నారని పేర్కొన్నారు. అధికారులను పక్కన పెట్టి జన్మభూమి కమిటీలు, సాధికారమిత్రలతో సంక్షేమ పథకాలు అమలు చేయడం సిగ్గుచేటన్నారు. రాజధానిని ప్రపంచంలోనే నంబర్1గా నిర్మిస్తానని చెబుతున్న చంద్రబాబు నాలుగేళ్లుగా ఒక్క ఇటుక కూడా ఎందుకు నిర్మించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. ప్రజలకు అండగా ఉండాల్సిందిపోయి, ప్రజలను అండగా ఉండాలని కోరడం సిగ్గుచేటన్నారు. మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకున్న మంత్రి సోమిరెడ్డి కూడా వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు బొమ్మతో చేతి సంచి తప్ప ప్రజలకు ఏమైనా చేశారా అని ఎద్దేవా చేశారు. ఇలాంటి వ్యక్తిని ఎందుకు గెలిపించామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియదు జయంతికి, వర్ధంతికి కూడా తేడా తెలియని వ్యక్తి తమ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా రాసిచ్చిన పేపర్లు చదువుతారని అనడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. నాలుగేళ్లుగా కలసి కాపురం చేసిన బీజేపీ, టీడీపీలు హోదా వద్దని, ప్యాకేజి చాలని అనడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా ఎవరు రాసిచ్చిన స్క్రిప్ట్ చదివారో చెప్పాలని సీఎం చంద్రబాబును, మంత్రి లోకేష్‌లను ప్రశ్నించారు. ప్రత్యేక హోదా వైఎస్ జగన్మోహన్రెడ్డి వల్లనే సజీవంగా ఉన్నదనే విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కేసులకు భయపడుతున్నారని వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియాగాంధీనే ఎదిరించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చురకలంటించారు. టీడీపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. సమావేశంలో సుధీర్‌రెడ్డి, మెట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, వెంకటశేషయ్య, భాస్కర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల్ని మోసగించిన చంద్రబాబు
టెక్కలి : పదవి కాంక్షతో అధికారాన్ని దక్కించుకోవడానికి చంద్రబాబు ఎన్నికల ముందు మోసపూరితమైన హామీలు గుప్పించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్ అన్నారు. అధికారం వచ్చిన తరువాత ప్రజల్ని దగా చేశారని మండిపడ్డారు. రాష్ట్రస్థాయి పదవిని చేపట్టిన తరువాత మంగళవారం టెక్కలి వచ్చిన ఆయన్ని నియోజకవర్గ ఇన్చార్జి దువ్వాడ శ్రీనివాస్, నియోజకవర్గ పరిధిలోని వైఎస్ఆర్సీపీ నాయకులు అభినందించారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ముందు సాధ్యం కాని హామీలు ఇవ్వని ఏకైక రాజకీయవేత్త వైఎస్ జగన్మోహన్రెడ్డి అని కొనియాడారు. అయితే కేవలం అధికార దాహంతో సాధ్యం కాని హామీలను ఇచ్చి ఇప్పుడు ప్రజలను దగా చేస్తున్న ఘనత చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా యువతకు తీరని మోసం చేశారన్నారు. ఈ విషయంపై యువకులు ఆలోచన చేయాలన్నారు. దువ్వాడ శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇంటింటా ఉద్యోగమని, రుణాల మాఫీ అని చంద్రబాబు ప్రకటించి ఇప్పుడు ఆ హామీలు నెరవేర్చకుండా తన కొడుకును ప్రభుత్వ సొమ్ముతో విదేశాలకు పంపించడం ఎంత వరకు సమంజసమన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కురమాన బాలకృష్ణ, జెడ్పీటీసీ మాజీ సభ్యురాలు దువ్వాడ వాణి, వైఎస్ఆర్ సీపీ జిల్లా ప్రతినిధి తిర్లంగి జానకిరామయ్య పార్టీ నాయకులు బెండి గౌరీపతి పాల్గొన్నారు.