
ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు
కాశీబుగ్గ: విశాఖ పరిపాలన రాజధానిని సాధించుకోవడానికి, అమరావతి పాదయాత్రను ఆపడానికి ఎంతకైనా తెగిస్తామని, అవసరమైతే రక్తమైనా చిందిస్తామని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు చెప్పారు.
విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా చేయాలని కోరుతూ పలాస జేఏసీ ఆధ్వర్యంలో పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో శనివారం నిర్వహించిన విద్యార్థుల ర్యాలీలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.
అమరావతి పేరుతో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు మోసం చేశారని, ఆ ప్రాంతంలో భవనాలు, రోడ్లు, పార్కులు అన్నీ గ్రాఫిక్స్‌లో మాత్రమే చూపించారని అన్నారు. ప్రపంచంలో అతిపెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ అమరావతేనని, వారి మనుషులకు భూములిచ్చి బహుజనులను దూరం పెట్టారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment