చంద్రబాబు రాజకీయ ఉగ్రవాది.. | Sidiri Appalaraju Slams On Chandrababu In Visakhapatnam | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు రాజకీయ ఉగ్రవాదిగా మారిపోయారు’

Published Sun, Jan 19 2020 6:03 PM | Last Updated on Sun, Jan 19 2020 6:29 PM

Sidiri Appalaraju Slams On Chandrababu In Visakhapatnam - Sakshi

సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు హయాంలో రాజధాని విషయంలో జరిగిన తీవ్రమైన ఆర్థిక నేరాలకు సంబంధించిన సాక్ష్యాధారాలు తమ వద్ద ఉన్నాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి సిదిరి అప్పలరాజు అన్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం చంద్రబాబు టీడీపీ విషయంలో గందరగోళంలో ఉన్నారన్నారు. దీంతో బాబు మిగతా పార్టీనేతలను రెచ్చగొతున్నారని అప్పలరాజు మండిపడ్డారు. రాష్ట్రంలో అశాంతి నెలకొల్పి చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. చంద్రబాబు నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారని అప్పలరాజు ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాజకీయ ఉగ్రవాదిగా మరిపోయరని ఆయన విరుచుకపడ్డారు.

చదవండి: టీడీపీ బ్రిడ్జి పార్టీలా వ్యవహరిస్తోంది.

చంద్రబాబు మనసికస్థితిపై తమకు అనుమానాలున్నాయని తీవ్రంగా విమర్శించారు. విద్యార్థులు ఉన్నతస్థితికి వెళ్లాలంటే ఇంగ్లీష్‌ మాధ్యమ విద్య తప్పనిసరి అని అభిప్రాయపడ్డారు. దీనిపై చంద్రబాబు కోర్టులను సైతం ఆశ్రయించి అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతున్నారని అప్పలరాజు మండిపడ్డారు. బాబును ప్రతిపక్షంలో కూర్చోబెట్టినా బుద్ధిరావటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. విలన్‌గా పవన్‌ కల్యాణ్‌ నటన చాలా బాగుందన్నారు. గత చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆయన ఫైర్‌ అయ్యారు. హీరోగానే పవన్‌ నటనను ప్రజలు ఇష్టపడతారని.. ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలన్నారు. చంద్రబాబు వైఖరిలో మార్పు రాకుంటే ఇప్పుడున్న ఎమ్మెల్యేల బలం 23 నుంచి మరింత పడిపోతుందని అప్పలరాజు హెచ్చరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement