
సాక్షి, విశాఖపట్నం: చంద్రబాబు దేవుడితో కూడా రాజకీయాలు చేస్తున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఇప్పటిదాకా.. వ్యక్తుల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టిన చంద్రబాబు తాజాగా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రతి అంశాన్ని తండ్రీకొడుకులు రాజకీయం చేస్తున్నారు. లోకేష్ మాటలకు అతని బాడీ లాంగ్వేజ్‌కి సంబంధం ఉందా అంటూ మంత్రి ప్రశ్నించారు. చదవండి: (చంద్రబాబుకు పుట్టగతులుండవు: భానుచందర్)
టీడీపీ నాయకులు ఆకృత్యాలకు పాల్పడితే అరెస్టు చేస్తే తప్పు అన్నట్టు చంద్రబాబు వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. రామతీర్థ ఘటనలో సూరిబాబు అనే వ్యక్తి పాత్రను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుంటే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని అన్నారు. మందుల కొనుగోలు కుంభకోణంలో మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేస్తే చంద్రబాబు అదో నేరంగా మాట్లాడారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. చంద్రబాబు త్వరలో కటకటాల వెనక్కి వెళ్లడం ఖాయమని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. చదవండి: (‘మేనిఫెస్టో గొప్పతనం సీఎం జగన్ పాలనలోనే అర్థమైంది’)
Comments
Please login to add a commentAdd a comment