సాక్షి, పలాస: లోకేష్ మాట్లాడేవన్నీ పనికి మాలిన మాటలంటూ మండిపడ్డారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఆదివారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, చంద్రబాబు ఎన్ని టీచర్ జాబ్‌లు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాట్లాడే మాటల మీద లోకేష్‌కు అసలు కంట్రోల్ ఉందా? అంటూ ధ్వజమెత్తారు.
భోగాపురం ఎయిర్ పోర్టు పనులు శరవేగంగా సాగుతున్నాయి. అవగాహన లేకుండా లోకేష్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5.6 లక్షల పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఐదేళ్ల కాలంలో సీఎం జగన్ 2.2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. చంద్రబాబు కేవలం 34 వేల ప్రభుత్వ ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు. సీఎం జగన్ లక్షా 43 వేల ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాల కల్పన గురించి లోకేష్ మాట్లాడటం హాస్యాస్పదం’’ అంటూ మంత్రి అప్పలరాజు దుయ్యబట్టారు.
లోకేష్, చంద్రబాబు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు. చంద్రబాబు రాజకీయ చరిత్రలో ఒక్క మంచి పని కూడా చేయ్యలేదు. మీకు మంచి జరిగితేనే ఓటు వేయండనే దమ్మున్న నాయకుడు సీఎం జగన్. ఇలా అడిగే దమ్ము చంద్రబాబు, లోకేష్‌కు ఉందా?. లోకేష్ చేసేవన్నీ దొంగ పాదయాత్రలు. ఉత్తరాంధ్రకు టీడీపీ చేసిన ఒక్క మంచిపని అయినా ఉందా?’’ అంటూ సీదిరి అప్పలరాజు నిలదీశారు.
చదవండి: అభివృద్ధి మీ కళ్లకు కనిపించడం లేదా చంద్రబాబూ..: మంత్రి ధర్మాన
Comments
Please login to add a commentAdd a comment