రైళ్ల రద్దుతో ప్రయూణికుల అవస్థలు
పలాస: హుదూద్ పెను తుపాను ప్రభావంతో ఈస్ట్‌కోస్టు రైల్వేశాఖ అధికారులు పలురైళ్లు రద్దు చేశారు. దీం తో ప్రయూణికులు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. పలాస రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల నుంచి రావాలసిన ఆదాయానికి భారీ గండి ఏర్పడింది. ప్రయాణికుల నుంచి రోజుకి రూ.3 లక్షలు ఆదాయం లభించేది. రెండు రోజుల్లో సుమారు రూ.6 లక్షలు నష్టం జరిగిందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ట్రైల్ బేసిడ్‌గా పాసింజరు రైళ్లను అధికారులు నడిపారు. పలాస రైల్వేస్టేషన్‌కు రావాల్సిన చెన్నై-హౌరా మెయిల్, బెంగళూరు-భువనేశ్వర్ ప్రశాంతి, యశ్వంత్‌పూర్-హౌరా, కొచ్చి-గౌహతి, హౌరా-సికింద్రాబాదు ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్, దిబ్రుగర్-కన్యాకుమారి, సికింద్రాబాదు-భువనే శ్వర్, త్రివేండ్ర-గౌహతి తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లు డైవర్ట్ చేశారు. పూరి-తిరుపతి ఎక్స్‌ప్రెస్‌ను రద్దు చేశారు. ఇదిలా ఉండగా హుదూద్ తుపాను ప్రభావం తీవ్రత తగ్గడంతో సోమవారం సాయంత్రం పలాస రైల్వేస్టేషన్‌కు పలు రైళ్ల రాకపోకలను ప్రారంభించాయి. భువనేశ్వర్ నుంచి విశాఖ పాసింజరు రైలును సోమవారం సాయంత్రం 6 గంటలకు ట్రయల్న్‌గ్రా నడిపించారు. అలాగే భువనేశ్వర్-పలాస ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ ఉదయం 11.30 గంటలకు పలాస రాగా, సాయంత్రం 6.30 గంటలకు భువనేశ్వర్‌కు తిరిగి వెళ్లింది. భువనేశ్వర్-ముంబై కోణార్క్ ఎక్స్‌ప్రెస్ వయా విజయనగరం, రాయపూర్ మీదుగా వెళ్లింది.
కొవ్వొత్తుల వెలుగులో రైల్వేసిబ్బంది సేవలు
ఆమదాలవలస: శ్రీకాకుళంరోడ్(ఆమదాలవలస) రైల్వేస్టేషన్ మీదుగా ప్రయాణించే రైళ్లు రద్దవ్వడంతో ప్రయూణికులు ఇబ్బంది పడ్డారు. అరుుతే ముందస్తుగా రిజర్వేషన్లు చేయించుకొన్న ప్రయాణికులు ఆ రిజర్వేషన్లు రద్దు చేసుకునేందుకు వారి సౌకర్యార్ధం రైల్వే బుకింగ్ కౌంటర్‌లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారు. ఆ కౌంటర్ నడిపించేందుకు విద్యుత్ సేవలు లేకపోవడంతో కంప్యూటర్లు పని చేయకపోవడంతో మ్యాన్యువల్‌గా సేవలు అందించేందుకు కౌంటర్‌లో రైల్వేసిబ్బంది కొవ్వొత్తివెలుగులో పనిచేస్తూ సేవలు అందించారు.
పలాస వరకు నడిచిన రెండు రైళ్లు
ఇచ్ఛాపురం: రైల్వే అధికారులు సోమవారం భువనేశ్వర్ నుంచి పలాస వరకు రెండు రైళ్లను నడిపారు. భువనేశ్వర్ - విశాఖ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ప్యాసింజర్‌గా మార్చి భువనేశ్వర్- పలాస మధ్య నడిపారు. ఉదయం పదిన్నర గంటలకు రైలు ఇచ్ఛాపురం చేరుకుంది. పలాస- పూరి మధ్య మరో రైలును కూడా ప్యాసింజర్‌గా నడిపారు. దీంతో పలాస వరకు ప్రయాణం చేసే వారి ఇబ్బందులు కొంతమేరకు తగ్గాయి. పూర్తి స్థాయిలో రైళ్ల రాకపోకలు ఎప్పటి నుంచి సాగుతాయో ఇంకా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల రావలసి ఉందని స్థానిక స్టేషన్ మేనేజర్ కె.డి.పట్నాయక్ చెప్పారు.