సాక్షి, శ్రీకాకుళం: పలాసలో లైంగికదాడికి గురైన బాలికల కుటుంబాన్ని మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, వైఎస్సార్‌సీపీ నేతలు పరామర్శించి ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ తరఫున రూ. 10 లక్షల రూపాయల చెక్కును అందజేశారు.
అనంతరం మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడుతూ.. పలాసలో బాలికలపై అత్యాచారం జరగడం చాలా బాధాకరమన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడూ జరగలేదన్నారు. బాధిత కుటుంబానికి మాజీ సీఎం వైఎస్ జగన్ రూ.10 లక్షల రూపాయలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని.. ఆయన ఆదేశాల మేరకు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి చెక్కు అందజేశామన్నారు.
‘‘నాలుగు నెలల్లోనే కూటమి ప్రభుత్వ వైఫల్యం కనిపిస్తోంది. ఐదేళ్లలో ఎప్పుడూ కరెంటు చార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు నాలుగు నెలల్లో భారీగా పెంచారు. చంద్రబాబుకు అబద్దాల చెప్పడం ఎప్పుడూ అలవాటే. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థతో గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం వైఎస్ జగన్ హయాంలోనే వచ్చింది. ఉద్దానం కిడ్నీ బాధితుల కోసం హాస్పిటల్ నిర్మించిన, ఇక్కడ ప్రజలకు 700 కోట్ల రూపాయలతో డ్రింకింగ్ వాటర్ అందించిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్’’ అని ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment