నిరసన వెల్లువ
Published Fri, Jan 10 2014 2:26 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
పలాస, న్యూస్‌లైన్:రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెస్టుపై నిరసన వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా, రాస్తారోకోలు చేశారు. అరెస్టును ఖండిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. కాశీబుగ్గలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. సమైక్య నినాదాలు వినిపించారు. కృపారాణితో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా నినదించారు. సమైక్యాంధ్ర దోషులకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలాస కాశీబుగ్గ మున్సిపల్ కన్వీనర్ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డబ్బీరు భవానీశంకర్, యవ్వారి మోహన్‌రావు, తంగుడు సత్యం, తాళాసు ప్రదీప్‌కుమార్, కొల్లి జోగారావు, తమ్మినేని కూర్మారావు, బైపల్లి తిరుపతిరావు, కురాగౌడ, కూన శాంతారావు, మామిడి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో జరిగిన ధర్నాలో పార్టీ నాయకులు జి.జగన్మోహనరావు, రేగాన మోహనరావు, వి.చిరంజీవులు, కె.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే, రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కరిమజ్జి బాస్కరరావు,ఆబోతుల జగన్నాథంనాయుడు, దన్నాన అప్పలనాయుడు, పిల్లల ఆనంద్ పాల్గొన్నారు. రాజాం వైఎస్సార్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు, పార్టీ నాయుకులు బల్లా అచ్చిబాబు, పిట్టా జగదీష్, రూపిటి చిన్నప్పలనాయుడు, శాసపు జగన్‌లు పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణ శివారులోని పాలకొండ-శ్రీకాకుళం రోడ్డుపై తమ్మినేని వాణీసీతారాం, పార్టీ నాయకులు బైఠాయించి ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెండి గోవిందరావు, ధవళ అప్పలనాయుడు, దుంపల శ్యామలరావు, ఎండా విశ్వనాథం, కె.రమణ, బొడ్డేపల్లి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement