ఒరేయ్! నా ఓటు వైఎస్సార్ సీపీకే! | My vote for YSRCP | Sakshi
Sakshi News home page

ఒరేయ్! నా ఓటు వైఎస్సార్ సీపీకే!

Published Fri, Apr 25 2014 2:43 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

ఒరేయ్! నా ఓటు వైఎస్సార్ సీపీకే! - Sakshi

ఒరేయ్! నా ఓటు వైఎస్సార్ సీపీకే!

 ఉదయం 9 గంటలైంది. రామాపురంలో ప్రచారాలు హోరెత్తారుు. నాయకులందరూ ఒకరి తర్వాత ఒకరు ఇంటింటి ప్రచారం చేశారు. పార్టీలపై విమర్శలు గుప్పించారు. నాయకుల ప్రసంగాలను మంచంపై సేద తీరుతూ విన్న రామన్న అనే వృద్ధుడు, తన మనవడు గోపికి మధ్య సంభాషణ ఇలా సాగింది...
 
 రామన్న: ఒరేయ్ మనవుడా మైకుల గోల పడలేకపోతున్నానురా. ఎవరేమిటి..!
 గోపి: వచ్చేనెల 7న ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలు తాతా...అన్ని పార్టీల అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు.
 
 రామన్న: ఇంటింటి ప్రచారమా అంటూ ఆశ్చర్యపోయూడు. అప్పట్లో విమానం మీద దగ్గరగా వచ్చి కరప్రతాలు జల్లేవారు. వాటిని చూసి ఊర్లో ఉన్న పెద్దలు ఎవరికి ఓటేయమని చెబితే వారికే వేసేవారం. మైకుల గోల ఉండేది కాదు.
 
 గోపి: ఇప్పడు కాలం మారింది తాతా... అంతా హైటెక్ ప్రచారాలు చేస్తున్నారు?

 రామన్న: ఏమి ప్రచారాలో ఏమో... డబ్బులు, మద్యంతో ఓటర్లకు గాలం వేస్తున్నారట. అన్నిపార్టీల వారు ఒకరిపై ఒకరు బురద జల్లుతున్నారు. చెడ్డోలు కూడా మంచోళ్లులా ప్రచారం చేసేస్తున్నారు...
 
 గోపి: తాతా ఎవరికి మద్దతిస్తావు..?
 రామన్న: ఇంకెవరికిస్తాంరా... ఇందిరమ్మ, ఎన్టీఆర్‌లా పాలించిన మహానుబావుడు వై.ఎస్.రాజశేఖరరెడ్డే. పింఛన్ ఇచ్చి ఆదుకున్నాడు. ఎన్నో పథకాలు ఇచ్చి ప్రజలకు మేలు చేశాడు. ఆ మహానుబావుడు తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి పెట్టిన వైఎస్సా ర్ సీపీకే మద్దతిస్తాను. ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తాను.               
 -న్యూస్‌లైన్, పలాస
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement