State partition
-
విభజన తర్వాత అన్నీ కష్టాలే..!
మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చావేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ విజయనగరం పూల్‌బాగ్ : రాష్ట్ర విభజన తర్వాత ఉత్తరాంధ్ర అన్ని రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయిందని మాజీ మంత్రి, ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ప్రాంతంపై ఆది నుంచి అన్ని ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమను చూపిస్తూ, అభివృద్ధిని పక్కన పెట్టేశాయని పేర్కొన్నారు. లక్షలాది ప్రజలు కూలి కోసం వలస బాట పడుతున్నారని, దీనికి కేవలం పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. ఆరోగ్యం, పర్యాటకం, విద్యుత్ శక్తి, పరిశ్రమలు, పారిశుద్ధ్యం ఇలా ఏ రంగాన్ని తీసుకున్నా ఉత్తరాంధ్ర వెనుకబాటు స్పష్టంగా కనిపిస్తుందన్నారు. విద్యాభివృద్ధికి నిధులు కేటాయించడం లేదన్న విషయం బహిరంగానే తెలుస్తుందన్నారు. బుందేల్ ఖండ్, కోరాపుట్, బోలంగీర్, కలహాండి తరహాలో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల్లో 24 లక్షల ఎకరాలకు కనీసం ఒక పంటకైనా సాగునీరు అందించాలని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును ప్రారంభించాలని కోరారు. విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేయాలని, విమ్స్‌ను మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని, విజయనగరంలో గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలోని అన్ని పార్టీల మేధావులను పిలిచి ఈ నెల 25న చర్చావేదిక ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఉత్తరాంధ్రకు రావాల్సిన న్యాయపరమైన డిమాండ్ల సాధనకు ఈ నెల 23 నుంచి ఆగస్టు 15 వరకు సంతకాల ఉద్యమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఎమ్మెల్సీ కోలగట్లను కలిసిన కొణతాల విజయనగరంమున్సిపాలిటీ: ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం చేపడుతున్న చర్చావేదికలో తప్పనిసరిగా పాల్గొనాల్సిందిగా కోరుతూ మాజీ మంత్రి, చర్చవేదిక నాయకుడు కొణతాల రామకృష్ణ, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్ కోలగట్ల వీరభద్రస్వామిని కోరారు. ఆదివారం విజయనగరానికి వచ్చిన కొణతాల కోలగట్లను కలిసి తర్వాత మాట్లాడారు. అనంతరం కొణతాల మాట్లాడుతూ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వెంటనే ప్రారంభించాలని, ఇక్కడి ప్రజల వెనుకబాటుతనం, ఆకాంక్షల పేరిట ముద్రించిన కరపత్రాలను కోలగట్లకు అందించారు. ఆ సమయంలో మాజీ మంత్రి వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు, వైఎస్సార్ సీపీ నెల్లిమర్ల నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ పెనుమత్స సురేష్‌బాబు, లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి, వల్లూరి ప్రకాష్‌బాబు పాల్గొన్నారు. -
విభజనతో సీమాంధ్రకు ఎక్కువ నష్టం
మాచవరం, న్యూస్‌లైన్ :రాష్ట్ర విభజనతో సీమాంధ్రకు ఎక్కువ నష్టం జరుగుతుందని వైఎస్సార్ సీపీ నరసరావుపేట పార్టమెంటు అభ్యర్థి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు.స్థానిక అంబటి కోట య్య నివాసంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగంతో తెలుగు రాష్ట్రాన్ని సాధిస్తే ఇప్పుడు స్వార్థరాజకీయాల కోసం తెలుగురాష్ట్రాన్ని ముక్కలుచేశారన్నా రు. సమైక్య రాష్ట్రం కోసం పోరాడిన నాయకుడిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్రలో నిలుస్తారని ఆయన పేర్కొన్నారు. వైఎస్ జగన్‌పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని తన పర్యటనల్లో చూశనని చెబుతూ, రానున్న ఐదేళ్లలో నరసరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గంలో చేపట్టబోయే కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. గ్రామాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తానన్నారు. అనంతరం ఆయన కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు, గురజాల నియోజకవర్గ సమన్వయకర్త జంగా కృష్టమూర్తి, మండల కన్వీనర్ గుర్రం గురవారెడ్డి, యూత్ కన్వీనర్ జిలుగు వెంకటనరసింహారెడ్డి, అంబటి కోటయ్య, చౌదరి సంగరయ్య, వెలిశల అనిల్‌కుమార్, తండు కాసులు గౌడ్, గడ్డం రాములు, యర్రం రాములు, తానుగొండ్ల ఏడుకోండలురెడ్డి, పోలే సైమాన్, ముసలయ్య, పాతర్లపాటి వెంకటరెడ్డి, సింగడాల ముక్కంటి, నాగరాజు, మోదడుగు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జనభేరి వేదిక పలనాడు బస్టాండ్.. నరసరావుపేట వెస్ట్: చలో నరసరావుపేట నినాదంతో ఈనెల ఆరో తేదీ నరసరావుపేట లో పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే వైఎస్సార్ సీపీ జనభేరిని పల నాడు బస్టాండ్ ప్రాంతంలో నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రముఖ పారిశ్రామికవేత్త ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి చెప్పారు. శని వారం సభావేదికను ఆయనతోపాటు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. జనభేరికి ముఖ్యఅతిథిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి హాజరవుతున్నందున సభ నిర్వహణకు భారీ ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు చెప్పారు. జనభేరికి లక్షలాదిగా హాజరై విజయవంతం చేయాలని కోరారు. వీరి వెంట నాయకులు ఆళ్ళ పేరిరెడ్డి, ఇనగంటి శ్రీనివాసరెడ్డి, కాకుమాను ఫౌండేషన్ చైర్మన్ కాకుమాను సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు. -
నిరసన వెల్లువ
పలాస, న్యూస్‌లైన్:రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అరెస్టుపై నిరసన వెల్లువెత్తింది. జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం ధర్నా, రాస్తారోకోలు చేశారు. అరెస్టును ఖండిస్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబుల దిష్టి బొమ్మలను దహనం చేశారు. కాశీబుగ్గలోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాల వేసేందుకు వచ్చిన కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ సహాయ మంత్రి డాక్టర్ కిల్లి కృపారాణి కాన్వాయ్‌ను అడ్డుకుని నిరసన తెలిపారు. సమైక్య నినాదాలు వినిపించారు. కృపారాణితో మాట్లాడేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఆమెకు వ్యతిరేకంగా నినదించారు. సమైక్యాంధ్ర దోషులకు తగిన బుద్ధి చెబుతామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ పలాస కాశీబుగ్గ మున్సిపల్ కన్వీనర్ బళ్ల గిరిబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికార బలంతో రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డబ్బీరు భవానీశంకర్, యవ్వారి మోహన్‌రావు, తంగుడు సత్యం, తాళాసు ప్రదీప్‌కుమార్, కొల్లి జోగారావు, తమ్మినేని కూర్మారావు, బైపల్లి తిరుపతిరావు, కురాగౌడ, కూన శాంతారావు, మామిడి సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. పాతపట్నంలో జరిగిన ధర్నాలో పార్టీ నాయకులు జి.జగన్మోహనరావు, రేగాన మోహనరావు, వి.చిరంజీవులు, కె.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే, రణస్థలం మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పార్టీ నాయకులు ఆందోళన చేశారు. సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. కార్యక్రమంలో కరిమజ్జి బాస్కరరావు,ఆబోతుల జగన్నాథంనాయుడు, దన్నాన అప్పలనాయుడు, పిల్లల ఆనంద్ పాల్గొన్నారు. రాజాం వైఎస్సార్ జంక్షన్ వద్ద మానవహారం నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో జిల్లా ట్రేడ్ యూనియన్ కన్వీనర్ జీటీ నాయుడు, పార్టీ నాయుకులు బల్లా అచ్చిబాబు, పిట్టా జగదీష్, రూపిటి చిన్నప్పలనాయుడు, శాసపు జగన్‌లు పాల్గొన్నారు. ఆమదాలవలస పట్టణ శివారులోని పాలకొండ-శ్రీకాకుళం రోడ్డుపై తమ్మినేని వాణీసీతారాం, పార్టీ నాయకులు బైఠాయించి ఎమ్మెల్యేల అరెస్టుకు నిరసన తెలిపారు. వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు బెండి గోవిందరావు, ధవళ అప్పలనాయుడు, దుంపల శ్యామలరావు, ఎండా విశ్వనాథం, కె.రమణ, బొడ్డేపల్లి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.