AP Govt Gives 50 Laks Compensation For Volunteer Lalitha | వలంటీర్‌ లలిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం - Sakshi
Sakshi News home page

వలంటీర్‌ లలిత కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం

Published Wed, Feb 10 2021 2:14 PM | Last Updated on Wed, Feb 10 2021 5:54 PM

AP Government Give Rs 50 Lakh To Volunteer Lalita Who Dies With Vaccine - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: రెండు రోజుల క్రితం జిల్లాలోని పలాసలో కరోనా వ్యాక్సిన్‌ వికటించి వలంటీర్‌ పిల్లా లలిత మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరణించిన వలంటీర్‌ లలిత కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించింది. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నుంచి 50 లక్షల రూపాయలు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటకు చెందిన లలితతో పాటు మరో 8 మంది వలంటీర్లు, వీఆర్వో ప్రసాద్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నారు. అప్పటి నుంచి అందరికీ స్వల్పంగా జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపించాయి. లలితలో ఈ లక్షణాలు తీవ్రంగా ఉండటంతో ఇంట్లోనే ఉంటూ టాబ్లెట్లు వేసుకున్నారు. కానీ లాభం లేకపోయింది. అస్వస్థతకు గురైన లలిత ఫిబ్రవరి 8(సోమవారం) తెల్లవారుజామున మృతి చెందారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement