వృద్ధుడు దూకేసిన నేలబావి (ఇన్‌సెట్‌లో) బెల్లాల ఆంజనేయులు (ఫైల్)
కాశీబుగ్గ: డబ్బై ఏడేళ్ల వయసు.. ఎన్నో కష్టాలు చూసి ఉంటారు. మరెన్నో అనుభవాలు మూటగట్టుకుని ఉంటారు. ఏడు దశాబ్దాల జీవితంలో ఎనలేని ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు. కానీ క్షణికావేశం ముందు ఆ అనుభవం ఎందుకూ కొరగాకుండా పోయింది. ఇంట్లో తాను అడిగిన కూర వండలేదని ఓ వృద్ధుడు ప్రాణం తీసుకున్నారు. పలాసలో గురువారం జరిగిన ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కదిలించింది. మరోవైపు కరోనా కారణంగా కంటైన్‌మెంట్ జోన్లలో ఉంటూ బయటకు వెళ్లలేకపోతున్న కొందరి మానసిక స్థితికి ఈ ఘటన అద్దం పడుతోందని స్థానికులు పేర్కొంటున్నారు.
కాశీబుగ్గ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పలాస 18వ వార్డు పరిధిలోని అన్నపూర్ణ వీధికి చెందిన బెల్లాల ఆంజనేయులు (77) గురువారం ఉదయం నేలబావిలో దూకి మరణించారు. గురువారం పప్పు వండాలని ఆంజనేయులు ఇంట్లో భార్య నాగరత్నంకు చెప్పారు. అయితే ఆమె వండకపోవడంతో కోపోద్రిక్తుడై క్షణికావేశంలో సమీపంలోని నేలబావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. స్థానికులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మృతునికి కుమారుడు ఉన్నాడు. కాశీబుగ్గ సీఐ వేణుగోపాలరావు సంఘట నా స్థలానికి చేరుకుని పరిశీలించారు. భార్యతో తగాదా పడి ఆత్మహత్య చేసుకున్నారా, లేక ఇంకేదైనా కారణం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment