
శ్రీకాకుళం : జిల్లాలోని పలాసలో దారుణం చేటుచేసుకుంది. వైద్యురాలి నిర్లక్ష్యంతో ఓ తల్లీ, బిడ్డ మృత్యువాత పడ్డారు. ఈ విషాదకరమైన సంఘటన శివదుర్గ విష్ణు ప్రియ ప్రైవేటు ఆస్పత్రిలో సోమవారం జరిగింది. ఆదివారం బైనపల్లి రేవతి (24) అనే మహిళకు పురిటి నొప్పులు రావడంతో.. ఆమె కుటుంబసభ్యులు కాన్పు కోసమని స్థానిక ప్రైవేటు అస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం తల్లీ, బిడ్డ మృతి చెందారు. కాగా, ఆస్పత్రిలోని వైద్యులు నిర్లక్ష్యం కారణంగానే రేవతి మృతిచెందారని ఆమె భర్త నరేశ్ ఆరోపించారు. డాక్టర్ గాయత్రికి వైద్యురాలిగా కనీస అర్హత కూడా లేదని.. ఆమె భర్త డాక్టర్ రాజ్‌కుమార్ నీడన మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు. హాస్పిటల్‌లో చేరిన మహిళల వద్ద నుంచి లక్షల రూపాయాలు వసూలు చేస్తున్నారని మృతురాలి బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment