
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పలాస మండలం నెమలి నారాయణపురం వద్ద జాతీయ రహదారిపై ఈ ప్రమాదం సంభవించింది. జార్ఖండ్ నుంచి విశాఖపట్నం నుంచి బొలెరో వాహనం వెళ్తుండగా జరిగిన ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందగా, తొమ్మది మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను రెండు అంబులెన్స్‌లలో పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చికిత్స పొందుతూ ఇద్దరు యువకులు మృతి చెందారు. తీవ్రగాయాలపాలైన మరో యువకుడిని మెరుగైన చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందాడు. మరో తొమ్మిది మంది పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (మెరుపు వేగంతో బైక్.. ఇద్దరు మృతి)
Comments
Please login to add a commentAdd a comment