
వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజాప్రస్థానం: షర్మిల
ఇచ్చాపురం: వైఎస్ స్ఫూర్తితోనే మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర అప్రతిహతంగా కొనసాగిందని వైఎస్.జగన్మోహనరెడ్డి సోదరి షర్మిల తెలిపారు. ఇచ్చాపురం పాదయాత్ర ముగింపు సభలో ఆమె ప్రసంగించారు. జగన్ వదిలిన బాణం ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం చేరుకుందన్నారు. కాంగ్రెస్-టీడీపీ కలిసి చేస్తున్న ద్రోహం ఇక సాగదని చెప్పేందుకు చేసిన యాత్ర ఇదని షర్మిల తెలిపారు. ఆ మనసున్న మా రాజు రాజన్న ఇక లేడని తెలిసి కోట్లాది గుండెలు అల్లాడిపోయాయని, వందల గుండెలు బద్దలయ్యాయని షర్మిల అన్నారు. ఇది విజయయాత్ర కాదని, జగనన్నను జైలుకు పంపించినందుకు నిరసనగా 'మరో ప్రజా ప్రస్థానం' పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు.
‘జగనన్న విడుదలను ఆపడం కాంగ్రెస్-టీడీపీల తరం కాదని, ఒక్కడినే లక్ష్యంగా చేసుకుని వంద మంది కుట్రలు పన్నారని’ షర్మిల తెలిపారు. జగనన్న జననేతగా ఎదుగుతుంటే కాంగ్రెస్-టీడీపీల్లో వణుకు పుట్టిందన్నారు. జగన్ జైలుకు ఎలా ఎళ్లారన్నది ఎవ్వరికీ తెలియని అంశంగానే మిగిలిందన్నారు. ‘ 230 రోజులు, 3 వేల కిలో మీటర్లు ఆయా ప్రాంతాలు, ఆయా జిల్లాలో మాతో పదం కలిపాయన్నారు. పజలిచ్చే విజయమే జగన్‌ను నిర్దోషిగా బయటకు తెస్తుందని’ షర్మిల తెలిపారు.
ఒక్క మనిషి వెళ్లిపోతే ఆంధ్రరాష్ట్రమే అతలాకుతలమైపోయిందని , వైఎస్ బతికుంటే రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరయ్యేది కాదన్నారు. బతికున్నంత కాలం వైఎస్‌ను కాంగ్రెస్ పొగిడి, చనిపోయాక అభాండాలు వేశాలన్నారు. కాంగ్రెస్ పార్టీ వైఎస్ కుటుంబం మీద రాళ్లు వేసిందని, వేధించిందని.. వైఎస్ తర్వాత ప్రజలకు కాంగ్రెస్ వాళ్లు ఏం చేశామని చెబుతారని షర్మిల ప్రశ్నల వర్షం కురిపించారు.
వ్యవసాయాన్ని దండగ చేసి బాబు పాలన తెచ్చామని చెబుతారా?, ఉపాధిహామీ పేరిట ప్రజల శ్రమ దోపిడీ చేశామని చెబుతారా?,
రూ. 32 వేల కోట్ల విద్యుత్ సర్‌ఛార్జ్ వేశామని చెబుతారా?, 8 గంటల విద్యుత్, 30 కిలోల బియ్యం హామీ నిలబెట్టుకోలేకపోయామని చెబుతారా?, 108, 104లను నిర్వీర్యం చేశామని చెబుతారా?, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక మోసం చేశామని చెబుతారా?
వైఎస్ రెక్కల కష్టంపై అధికారంలోకొచ్చి ఆయన పథకాలను ఎత్తేశామని చెబుతారా?, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వక మోసం చేశామని చెబుతారా?, వైఎస్ రెక్కల కష్టంపై అధికారంలోకొచ్చి ఆయన పథకాలను ఎత్తేశామని చెబుతారా? అని నిలదీశారు.
రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొడుతోందని షర్మిల విమర్శించారు. కింది భాగం వారికి సాగు, తాగు నీరు ఉండదని తెలిసీ విభజన చేస్తోందన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లెక్కడి నుంచొస్తాయని ఆమె ప్రశ్నించారు. శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు సముద్రం నీరు తప్ప మంచి నీళ్లు లేవన్నారు. సీమాంధ్ర ఇక సహారా ఎడారి అవుతుందని విడగొడుతున్నారా? అని షర్మిల ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై షర్మిల మండిపడ్డారు. ఆంధ్రా ఉద్యోగులను వెళ్లిపోవాలంటున్నారంటే అర్థమేమిటన్నారు. హైదరాబాద్ లో బతకడం అంటే పాకిస్థాన్ లోబతికినట్లేనని కేసీఆర్ ను ప్రశ్నించారు. హైదరాబాద్ అభివృద్ధిలో సీమాంధ్రులకు భాగం లేదా? అని షర్మిల విమర్శించారు.
విభజన నిర్ణయంపై చర్చలు జరగాల్సిన అవసరం ఉందని, అంతవరకు వైఎస్‌ఆర్‌సీపీ ప్రజల తరఫున పోరాడుతుందన్నారు. :
సీఎం, బొత్స, కేంద్రమంత్రులు ఢిల్లీలో తెలుగు ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టారని, ఈ సమయంలో ప్రజల తరఫున నిలబడింది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని ఆమె గుర్తు చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు రాజీ నామా చేసి ప్రజల పక్షాన నిలబడ్డారన్నారు. ప్రజల కన్నా పదవులే ముఖ్యమని కాంగ్రెస్, టీడీపీ నాయకులు నిరూపించుకున్నారని ఆమె ఎద్దెవా చేశారు.