ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు అంటూ కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడం దారు ణమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు ‘ఎక్స్’వేదికగా ట్వీట్ చేశారు. జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా? డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా అని ప్రశ్నించారు.
ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా ? ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం?’అని నిలదీశారు. గాయపడిన జర్నలిస్టు శ్రీచరణ్‌ను కేటీఆర్ ఫోన్‌లో పరామర్శించారు.
సీఎం క్షమాపణ చెప్పాలి: బీజేపీ డిమాండ్
డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద నిరసన తెలుపుతున్న విద్యార్థులు అక్కడకు వెళ్లిన జర్నలిస్టులపై కూడా పోలీసులు చేయి చేసుకోవడాన్ని బీజేపీ ఖండించింది. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని వర్సిటీలు పోలీసుల లాఠీదెబ్బలతో రక్త మొడినట్టే.. మళ్లీ పోలీసుల దమనకాండ కనిపిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ ఓ ప్రకటనలో మండిపడ్డారు.
» ఓయూలో జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తూ టీయూడబ్ల్యూజే, టీడబ్ల్యూజేఎఫ్, సచివాలయ జర్నలిస్టులు, జర్నలిస్టుల సంఘాలు వేర్వేరు ప్రకటనలు విడుదల చేశాయి. పోలీసులపై ప్రభుత్వం వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశాయి. » మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులు జర్నలిస్టులపై జరిగిన దాడిని ఖండించారు.
» డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తుంటే పోలీసుల ద్వారా అణచివేయాలని చూడడం అప్రజాస్వామిక మని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ విమర్శించారు. పార్టీ నాయకులు రాకే‹Ùకుమార్, పల్లా ప్రవీణ్, కడారిస్వామి, పడాల సతీ‹Ùతో కలిసి బుధవారం తెలంగాణభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు.
» బీఆర్‌ఎస్పీ నేతలపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేసి, వారిని సరీ్వస్ నుంచి తొలగించా లని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment