relay hunger strike
-
‘చందాలు దండుకునేందుకే అమరావతి పేరుతో యాత్రలు’
తాడికొండ: అమరావతి పేరుతో చందాలు దండుకునేందుకు కులవాదులు యాత్రలు చేయడం సిగ్గుచేటని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 689వ రోజు రిలే నిరాహార దీక్షలకు బుధవారం పలువురు ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబు అవినీతిని కప్పిపెట్టి, ప్రజలను మభ్యపెట్టేందుకే రాష్ట్రంలోని ఓ సామాజికవర్గం ఈ పాదయాత్రలు చేస్తోందని దుయ్యబట్టారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు రాష్ట్రమంతా తిరిగి చందాలు వసూలు చేసుకుంటూ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉంటూ వీరు చేస్తున్న ఆగడాలను ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. పేదల సమస్యలను పక్కన పెట్టిన రాజకీయ పార్టీలు అమరావతి చుట్టూ చక్కర్లు కొడుతూ చంద్రబాబు అవినీతిని కాపాడేందుకు పాట్లు పడుతుండటాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఎల్లో మీడియాలో తమ ఉద్యమాన్ని చూపనప్పటికీ.. బహుజన హక్కుల కోసం పోరాడుతున్న తమకు, మూడు రాజధానులకు ప్రజా మద్దతు ఉందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాదిగాని గురునాథం, బేతపూడి సాంబయ్య, బొలిమేర శ్యామ్యూల్, ఇంటూరి రాజు పలువురు దళిత నాయకులు, మహిళలు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమరావతిపై ‘డబ్బుల్’ గేమ్! -
రాజమండ్రిలో వికేంద్రీకరణకు మద్దతుగా రిలే నిరాహార దీక్ష
-
‘రాహుల్ రాజీనామాను ఉపసంహరించుకోవాలి’
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ.. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. రెండో రోజుకు చేరిన నిరాహార దీక్షకు తెలంగాణ ఇన్చార్జ్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి సంఘీభావం తెలిపారు. రాహుల గాంధీ రాజీనామ ఆలోచనను విరమించుకోవాలని కోరారు. -
ఇందిరాపార్క్‌లో అగ్రిగోల్డ్ బాధితుల రిలే నిరాహార దీక్ష
-
ప్రత్యేక హోదా ఇచ్చే వరకు పోరాటం
పెనుమంట్ర : జగనన్న స్పూర్తితో రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నేతలు మడమ తిప్పని పోరాటం కొనసాగించాలని పార్టీ ఆచంట నియోజకవర్గ సమన్వయకర్త కవురు శ్రీనివాసు పిలుపునిచ్చారు. మార్టేరులోని నాలుగు రోడ్ల కూడలిలో ప్రత్యేక హోదా కోరుతూ చేపట్టిన నిరాహార దీక్ష శిబిరంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రత్యేక హోదా భావితరాల కోసం ఎంతో అవసరమన్నారు. భవిష్యత్‌లో పిల్లల విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం ప్రత్యేక హోదా అత్యవసరమన్నారు. ఆంధ్రుల హక్కుగా ఉన్న ప్రత్యేక హోదా అంశాన్ని కేంద్రం కరివేపాకులా తీసి పారేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో హోదా ఇస్తామని వాగ్దానం చేసిన మోదీ ఇప్పుడు మాట తప్పడం అన్యాయమన్నారు. హోదా కోసం టీడీపీ నేతలు కేంద్రంపై చిత్తశుద్ధితో పోరాటం చేయడంలేదని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయటం చరిత్రాత్మకమని కొనియాడారు. వారి త్యాగం తెలుగువారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. జగనన్న హోదా కోసం రాజీలేని పోరు సాగిస్తున్నారని అన్నారు. సోమవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కార్యకర్తలను, నాయకులను కోరారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి తరలివచ్చిన నేతలు కార్యకర్తలు శిబిరంలో కూర్చుని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జిల్లా నాయకులు వైట్ల కిషోర్, అల్లం బులిరెడ్డి, ఆచంట, పోడూరు, పెనుగొండ, పెనుమంట్ర మండలాల పార్టీ కన్వీనర్లు ముప్పాల వెంకటేశ్వరరావు, రుద్రరాజు శివాజీరాజు, దంపనబోయిన బాబూరావు, కర్రి వేణుబాబు, వెలగల శ్రీనివాసరెడ్డి, దొంగ దుర్గాప్రసాద్, పడాల కేశవరెడ్డి, వెలగల నారాయణరెడ్డి, వై.వరప్రసాద్, కర్రి సురేష్‌రెడ్డి, చింతపల్లి చంటి, రామచంద్రరావు, కొవ్వూరి వేణుమాధవరెడ్డి, కవురు శెట్టి, గుడాల సుబ్బారావు ఆదివారం నాటి రిలే దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు తిరుపతి పెదకాపు, ఉన్నమట్ల మునిబాబు, అల్లం భాస్కరరెడ్డి, బుర్రా రవికుమార్, గుడిమెట్ల సత్యనారాయణరెడ్డి, వీరవల్లి స్వామి, బళ్ల బద్రి, పడాల కేశవరెడ్డి, షేక్ సాహెబ్, చిర్ల నరసింహారెడ్డి, కోనాల గంగాధరరెడ్డి, ఈది ప్రవీణ్ తదితరులు వారికి సంఘీభావం తెలిపారు. -
హోదా పోరు.. హోరెత్తిన ఏపీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు పదవులకు రాజీనామా చేసి ఢిల్లీలో ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు వెల్లువెత్తుతోంది. ఎంపీల దీక్షకు సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు రిలే దీక్షలు, వంటావార్పు, అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ‘ప్రత్యేక హోదా మన హక్కు’ అంటూ నినదించారు. రాష్టానికి హోదా సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కృష్ణాజిల్లా నందిగామ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇంచార్జి మెండితోక జగన్ మోహన్‌రావు ఆధ్వర్యంలో కృష్ణానదిలో జల దీక్ష నందిగామ గాంధీసెంటర్‌లో రిలే నిరాహార దీక్షలు కంచికచర్ల లో 65వ నంబర్ జాతీయ రహదారిపై వంట వార్పూ కార్యక్రమం విజయవాడ భవానీపురంలో వంటావార్పు కార్యక్రమం నూజివీడు ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో రెండవ రోజుకు చేరిన రిలే నిరాహారదీక్షలు గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో 2వ రోజు రిలేదీక్షలు, వంటావార్పు కార్యక్రమం విశాఖపట్నం జిల్లా పాడేరు అంబేద్కర్ కూడలి వద్ద రెండవ రోజూ కొనసాగుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలే నిరాహారదీక్షలు అరకులో నియోజక కన్వీనర్ చెట్టిఫాల్గుణ ఆధ్వర్యంలో రెండవ రోజూ కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు ఇసుక తోట వద్ద వైఎస్సార్ సీపీ సమన్వయకర్త వంశీకృష్ణ ఆధ్వర్యంలో వంటావార్పు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ కరపలో రెండవ రోజు కొనసాగుతున్న వైఎస్సార్ సీపీ రిలే నిరాహారదీక్షలు ఉప్పాడ సెంటర్లో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆద్వర్యంలో మూడో రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు చిత్తూరు జిల్లా చిత్తూరు జిల్లా కలెక్టరేట్ వద్ద గలా వైఎస్ఆర్ సర్కిల్లో జిల్లా మహిళాధ్యక్షరాలు గాయాత్రిదేవి ఆధ్వర్యంలో అన్నదానం ప్రకాశం జిల్లా మార్కాపురం గడియార స్తంభం సెంటర్లో వైఎస్సార్ విగ్రహం ముందు వైఎస్సార్ సీపీ రైతు విభాగం నాయకుడు ఉడుములకోటిరెడ్డి ఆధ్వర్యంలోరిలే దీక్షలు ఒంగోలు వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత ఆధ్వర్యంలో వంటావార్పు కోవూరు సమన్వయకర్త నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై వంటావార్పు.. లారీ డ్రైవర్లు, సిబ్బందికి భోజనం పెట్టిన నేతలు నెల్లూరు జిల్లా కావలిలో ఎమ్మెల్యే రామీరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు, డగదర్తి జాతీయ రహదారిపై బైఠాయింపు సూళ్లూరుపేట బస్ స్టాండ్ సెంటర్లో రెండో రోజు కొనసాగుతున్న నిరసన దీక్షలు నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం గోపన్నపాలెంలో దెందులూరు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు కొనసాగిన రిలే నిరాహారదీక్షలు, వంటావార్పు ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉంగుటూరు సెంటర్లో రెండో రోజూ నిరాహార దీక్షలు గోపాలపురంలో నియోజకవర్గ కన్వీనర్ తరి వెంకట్రావు అద్వర్యంలో రిలే నిరాహార దీక్ష, వంటావార్పు అనంతపురం జిల్లా జిల్లా కలేక్టరేట్ వద్ద వంటావార్పు.. పాల్గొన్న అనంతపురం వైఎస్సార్ సీపీ సమన్వయకర్త నదీం అహ్మద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగే పరశురాం, పార్టీ నేతలు చవ్వారాజశేఖర్ రెడ్డి, అనంతచంద్రారెడ్డి గుంటూరు జిల్లా గుంటూరులో బస్తాలు ఎత్తుకుని విద్యార్థుల ఆందోళనలు పొన్నూరులో రిలే నిరాహారదీక్షలో కూర్చున్న నియోజకవర్గ సమన్వయకర్త రావి వెంకటరమణ విజయనగరం జిల్లా విజయనగరం బాలాజీ జంక్షన్ వద్ద రోడ్డుపై వంటావార్పు కార్యక్రమం.. హాజరైన ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి, పట్టణ అధ్యక్షుడు ఆశపు వేణు, పార్టీ నాయకులు పిల్లా విజయకుమార్, యడ్ల రమణమూర్తి పార్వతీపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త జోగారావు, బొబ్బిలిలో సమన్వయకర్త డాక్టర్ పోలా అజయ్ కుమార్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు కర్నూలు జిల్లా నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో రెండోవ రోజు కొనసాగుతున్న రిలే నిరాహారదీక్షలు, పటేల్ కూడలిలో వంటావార్పు కార్యక్రమం నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో రూరల్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష -
రాష్ట్రాల హక్కులు పరిరక్షించాలి
విజయవాడ (మధురానగర్) : రాబోయే వస్తు సేవల పన్ను విధానంలో కేంద్రం ఏకపక్ష ధోరణి విడనాడి రాష్ట్రాలతో ఇచ్చిపుచ్చుకునే విధానంలో వ్యవహరించాలని, సమాఖ్య స్ఫూర్తితో రాష్ట్రాల హక్కులను పరిరక్షించాలని ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నుల శాఖ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి జి.సత్యనారాయణ డిమాండ్ చేశారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్‌లో అఖిల భారత వాణిజ్య పన్ను శాఖల సమాఖ్య ఆధ్వర్యాన కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష విధానాలను నిరసిస్తూ బుధవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ వస్తు సేవల పన్ను చట్టాన్ని కేంద్రం అన్ని రాష్ట్రాలతో కలిపి అమలు చేయాల్సి ఉందన్నారు. అయితే కేంద్రం రాష్ట్రాల అధికారాలను పూర్తిగా తన వద్దే ఉంచుకుని రాష్ట్రాలను బలహీనపరుస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేపట్టినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల వల్ల రాష్ట్రాల్లోని వాణిజ్య పన్నుల శాఖలు అలంకారప్రాయంగా మిగిలిపోయే ప్రమాదం ఉందన్నారు. సంఘ ఉఫాద్యక్షుడు మెహర్‌కుమార్, విజయవాడ ఒకటవ డివిజన్ డెప్యూటీ కమిషనర్ వై.కిరణ్‌కుమార్, నాలుగో తరగతి ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.గోవిందరాజులు నాయుడు మాట్లాడారు. శుక్రవారం వరకు రిలేదీక్షలు కొనసాగుతాయని నాయకులు తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వాణిజ్య పన్నుల శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కోట్‌పల్లి ప్రజల కల నెరవేర్చండి
కోట్‌పల్లి మండలంగా ప్రకటించండి డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి పెద్దేముల్: ‘పదవులు.. నిధులు.. అడగటం లేదు.. 30 ఏళ్లుగా కోట్‌పల్లి గ్రామ ప్రజలు కల నెరవేర్చండి.. మండలంగా ప్రకటించండి..’ అని డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కోట్‌పల్లి మండలంగా ప్రకటించాలని కోరుతూ ఆ గ్రామస్తులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు గురువారం నాటితో 9వ రోజుకు చేరుకున్నాయి. నేటి దీక్షల్లో డ్వాక్రా మహిళలు కూర్చున్నారు. రిలే నిరాహార దీక్షలకు డీసీసీబీ మాజీ చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నరేష్ మహరాజ్, జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పరి స్వరూప, సీసీఐ రాములు, వెంకటచారి, శ్రీనివాస్‌చారి, నర్సింలు, లక్ష్మన్, గయాజ్, ముజీబ్ తదితరులు సంఘీభావం తెలిపారు. అనంతరం లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కోట్‌పల్లిని మండల కేంద్రంగా ప్రకటించకపోతే జిల్లా మంత్రి మహేందర్‌రెడ్డిని అడ్డుకుంటామని, కలెక్టరేట్‌ను ముట్టడిస్తామమన్నారు. 1983లో కోట్‌పల్లి మండల కేంద్రంగా ప్రకటించాల్సి ఉండగా.. రాజకీయ ఒత్తిళ్లతో బంట్వారాన్ని మండల కేంద్రంగా ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్‌పల్లి గ్రామ ప్రజలు తొమ్మిది రోజుల నుంచి రిలే నిరాహరదీక్షలు చేపడుతున్నా ప్రభుత్వానికి ఎందుకు చలనం రాలేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా మంత్రి మహేందర్‌రెడ్డి చొరవ తీసుకుని కోట్‌పల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కోట్‌పల్లిని మండల కేంద్రంగా చేయకపోవడం ఇది రాజకీయ నాయకుల కుట్ర అని, తాండూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి రాజుగౌడ్ అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఇన్చార్జి ఎల్లారెడ్డి, ప్రవీణ్ పటేల్, యాలాల మండల ఇన్చార్జి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణ కోసం ప్రాణాలైనా అర్పిస్తాం
♦ రిలే నిరాహార దీక్ష ముగింపులో మంద కృష్ణ మాదిగ ♦ నమ్మకద్రోహులు రాజ్యమేలుతున్నారని ధ్వజం ♦ వర్గీకరణపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ♦ స్పష్టమైన విధానం ప్రకటించాలని డిమాండ్ సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ వర్గీకరణ కోసం 22 ఏళ్లుగా సాగుతున్న ఉద్యమం అనేక త్యాగాల సమ్మేళనమని, మలి దశలో జరుగుతున్న ఈ ఉద్యమంలో వర్గీకరణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధంగా ఉన్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం జంతర్ మంతర్వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్ష చివరి రోజు శుక్రవారం ఆయన ఉద్వేగంగా ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణే మాదిగ జాతికి సర్వస్వం అని, విద్య, ఉద్యోగ రంగాలతోపాటు ఆర్థిక, సామాజిక, రాజకీయ ఉన్నతి కే వలం ఎస్సీ వర్గీకరణతోనే సాధ్యమని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగల త్యాగాల మీద నిలబడ్డాయని పేర్కొన్నారు. చిన్నరాష్ట్రాల వల్లే అభివృద్ధి సాధ్యమని అంబేడ్కర్ చెప్పిన మాటను గౌరవించి ప్రత్యేక రాష్ట్ర సాధనలో మాదిగలు ముందున్నారని పేర్కొన్నారు. ప్రత్యేక తెలంగాణలో సామాజిక న్యాయం జరగాలని ఎమ్మార్పీఎస్ భావించిందని, కానీ దొరలకు మాత్రమే న్యాయం జరుగుతోందని మండిపడ్డారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టేందుకు భయపడుతున్న రోజుల్లో ఎమ్మార్పీఎస్ ఆత్మస్థైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపించిందని, వర్గీకరణ అంశం లేకుండా చంద్రబాబు ప్రసంగం ఉండేది కాదని పేర్కొన్నారు. అయితే ఆయన ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే మోసపూరితంగా వ్యవహరించడం నీచాతినీచమని విమర్శించారు. నమ్మక ద్రోహులు రాజ్యమేలడం బాధాకరమని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎస్సీ వర్గీకరణపై స్పష్టమైన విధానంతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ విషయంలో బీజేపీ ఆలస్యం చేయరాదని కోరారు. కాగా దీక్షకు సంఘీభావం తెలిపిన కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ పార్టీని శంకించవద్దని అన్నారు. తమ పార్టీ వర్గీకరణకు పూర్తి మద్దతుగా నిలిచిందని తెలిపారు. పంజాబ్‌లో కాంగ్రెస్ వర్గీకరణ చేసిందని, వర్గీకరణ బిల్లు ఎప్పుడు పెట్టినా మద్దతు తెలిపేందుకు అధిష్టానం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శి అమర్జిత్ కౌర్ మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైన ఉద్యమమని అన్నారు. అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఈ డిమాండ్‌పై లేఖలు రాశామని గుర్తుచేశారు. చివరి రోజు దీక్షలో ఎమ్మార్పీఎస్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాగడి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్ గౌడ్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కోళ్ల వెంకటేశ్, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామి, ఇతర నేతలు ప్రతాప్ కుమార్, గోవింద్ నరేశ్, మాతంగి ఓదేలు తదితరులు పాల్గొన్నారు. -
ఉమ్మడి రిజర్వేషన్ విధానానికి కాలం చెల్లింది
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఉమ్మడి రిజర్వేషన్ల విధానానికి కాలం చెల్లిందని, అందుకే దళితుల మధ్య అసమానతలు రోజురోజుకూ పెరుగుతున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఇక్కడి జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న మూడో రోజు రిలే నిరాహార దీక్షలో ఆయన మాట్లాడారు. 66 ఏళ్లుగా దేశంలో ఉమ్మడి రిజర్వేషన్ల విధానం అమలవుతోందని, దాని వల్ల దళితుల మధ్య ఐక్యత లోపించి అంతరాలు పెరిగాయని చెప్పారు. ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలు మాత్రమే రిజర్వేషన్లను అనుభవిస్తూ వెనకబడిన కులాలను, ఉపకులాలను విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వెనక్కి నెట్టాయని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంతరం ఘర్షణ వాతావరణానికి దారితీస్తోందన్నారు. ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల ఆర్థికంగా, రాజకీయంగా ఎదిగిన కులాలకే మేలు జరుగుతోందని, మిగిలిన కులాలు వెనకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయని 1965లో జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన లోకుర్ కమిషన్ పేర్కొందని చెప్పారు. 1996లో ఏపీలో నియమించిన రామచంద్రరావ్ కమిషన్, 2001లో యూపీ ప్రభుత్వం నియమించిన హుకుంసింగ్ కమిషన్, 2007లో కేంద్రం నియమించిన ఉషా మెహ్రా కమిషన్లు ఇచ్చిన నివేదికలు ఉమ్మడి రిజర్వేషన్ల వల్ల జరిగిన, జరుగుతున్న నష్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయని పేర్కొన్నారు. అసమానతలు తొలగి, ఘర్షణ వాతావరణం పోవాలంటే నూతన రిజర్వేషన్ విధానం రావాల్సిందేనని, దళితుల్లోని ప్రతి కులానికీ రిజర్వేషన్ ఫలాలు అందేలా వర్గీకరణ ఉండాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదు: కృష్ణయ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కాంట్రాక్టర్లపై ఉన్న ప్రేమ ఉద్యమకారులపై లేదని బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య విమర్శించారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం జరుగుతున్న రిలే నిరాహార దీక్షలకు ఆయన హాజరై మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రులు ఏమాత్రం సమయం దొరికినా కాంట్రాక్టర్లను కలుస్తున్నారని, కానీ ఉద్యమకారులకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎస్సీ వర్గీకరణపై చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ ముందుగా జంతర్ మంతర్ వచ్చేవారన్నారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం న్యాయమైనదని, బీసీల్లో ఉన్నట్టుగా ఎస్సీల్లో ఏబీసీడీ ఉంటేనే అందరికీ న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. దీక్షలో మందకృష్ణ మాదిగతో పాటు మహిళా సంఘం నేతలు జెరిపోతుల లత, చవటపల్లి విజయ, సత్తెక్క, వినోద, శ్రీరాంరాజమ్మ, నక్షత్ర, గంగమ్మ, రేణుకాదేవి, మాదురి, శోభ తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డిపోలో రిలే నిరాహార దీక్షలు
ఆర్టీసీ యాజమన్యం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా.. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో.. కార్మికుల పనిగంటలను తగ్గించడంతో పాటు.. వేధింపులను ఆపాలను కోరుతూ.. ఆదివారం నుంచి రిలే దీక్షలను ప్రారంభించారు. డిపో మేనెజర్ వివరణ ఇచ్చే వరకు తాము దీక్షలు కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు. ఈ దీక్షలకు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు సంఘీభావం తెలిపారు. -
ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ కోరుతూ రిలే దీక్షలు
ఇందిరాపార్కు (హైదరాబాద్) : ఒకే ర్యాంకు-ఒకే పింఛన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ సైనికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. నగరంలోని ఇందిరాపార్కులో పలువురు మాజీ సైనికులు మంగళవారం దీక్షలకు దిగారు. ఈ కార్యక్రమంలో త్రివిధ దళాల మాజీ సైనిక అధికారి విద్యాసాగర్ పాల్గొన్నారు. తమ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని ఆయన కోరారు. -
బాబూ..! ఎప్పుడు ఏం జరుగుతుందో !!
నెల్లూరు(పొగతోట): అత్యధిక సీట్లు సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ గిలగిల కొట్టుకుంటూ గద్దె దిగారు. ఏ రోజు ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసంటూ నెల్లూరు రూరల్ మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి పరోక్షంగా ముఖ్యమంత్రి చంద్రబాబునుద్దేశించి వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీలో ఆనం సోదరుల చేరికకు బాబు నిరాకరించినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతున్న సమయం లో వివేకా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తొలగించిన హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహారదీక్షలకు మాజీ ఎమ్మెల్యే మద్దతు ప్రకటించారు. సోమవారం ఆయన దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడమంటే ఉరి తీయడమేనన్నారు. పండగల రోజుల్లో ఉద్యోగుల కడుపుకొడితే వారి ఉసురు ఈ ప్రభుత్వానికి తగులుతుందని శాపనార్థాలు పెట్టారు. ఇక ఐదేళ్లు ఎన్నికలు లేవు కదా అని ప్రజలు, ఉద్యోగులతో ప్రభుత్వం ఆడుకుంటున్నట్టు కనిపిస్తోందని విమర్శించారు. రెండు వేల మంది ఉద్యోగులకు వేతనాలు ఇవ్వలేక తొలగించడం దారుణమన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం చెప్పేది ఒకటి, చేసేది మరొకటిలా ఉందన్నారు. అనంతరం తొలగించిన ఉద్యోగులు వంటా-వార్పు కార్యక్రమం నిర్వహించారు. రోడ్డు మీదనే భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో వివేకా వెంట కాంగ్రెస్ నాయకులు ఆసిఫ్‌పాషా, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల నాయకులు సునీల్‌కుమార్ పాల్గొన్నారు. -
హామీలను తుంగలో తొక్కిన బాబు
నెల్లూరు(పొగతోట): ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నయవంచకుడని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సమస్యల పరిష్కారం కోరుతూ ఆరురోజులుగా నెల్లూరు కలెక్టరేట్ ఎదుట హౌసింగ్ కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ ఇన్స్పెక్టర్లు, డేటాఎంట్రీ ఆపరేటర్లు రిలేనిరాహారదీక్ష చేస్తున్నారు. వీరికి మద్దతుగా శనివారం ప్రసన్నకుమార్‌రెడ్డి, నగర డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్లు దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి కింద రూ.2000 ఇస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వాటిని పక్కన పడేసి ఉన్న ఉద్యోగులను రోడ్డున పడేలా చేశాడని దుయ్యబట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ 2006లో ప్రతి గ్రామంలో పేదలకు ఇందిరమ్మ పథకం అందేందుకు రాష్ట్రంలో 2006లో 2,250 మంది వర్క్ ఇన్స్పెక్టర్లను నియమించారన్నారు. నేడు అధికారంలోకి వచ్చిన చంద్రబాబు జీతాలు ఇవ్వలేమని వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం దారుణమని మండిపడ్డారు. హైదరాబాద్‌లో క్యాంపు ఆఫీసుకు రూ.19 కోట్లు ఎలా ఖర్చు చేశాడని ప్రశ్నించారు. సాముహిక నిరసన తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలంటూ హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు సామూహిక ఉరితో నిరసన వ్యక్తం చేశారు. కలెక్టరేట్ గేట్‌కు ఎదురుగా 20 మంది ఉద్యోగులు సామూహికంగా ఉరి వేసుకుంటున్నట్టు తాళ్లను తగిలించుకున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే కుటుంబ సభ్యులతో ఆత్మహత్యలు చేసుకుంటామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పి.రూప్‌కుమార్‌యాదవ్, ఓబిలి రవిచంద్ర, డి.రాజశేఖర్, వూటుకూరు మాధవయ్య, జి.నాగరాజు, ఎండీ ఖలీల్ అహ్మద్, ఎం.ప్రశాంతికుమార్, హౌసింగ్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు నాగిరెడ్డి సునీల్‌కుమార్, బైనబోయిన పోలరావు, దవనం వెంకటసునీల్‌కృష్ణ, వైఎస్సార్సీపీ నాయకులు ఎస్కే షబ్బీర్, జాకీర్ పాల్గొన్నారు. -
స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలి..
పాల్వంచ, న్యూస్‌లైన్: కాలుష్య ప్రభావిత గ్రామాల్లోని యువకులకు, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పంచాలని, సీఎస్ఆర్ పాలసీని అమలుచేసి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక యువకులు ఆదివారం నవభారత్ వెంచర్స్, ఎనర్జీ ఇండి యా సంస్థ కార్యాలయం ఎదుట రిలే నిరాహా ర దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎండి.అక్బర్, రాంబాబులు మా ట్లాడుతూ నవభారత్ సంస్థ నుంచి వెలువడే కాలుష్యం వల్ల సమీపంలోని పాత పాల్వంచ, సంజయ్ నగర్, గాంధీనగర్, కేసీఆర్‌నగర్, రాజీవ్‌నగర్, సాయినగర్, శేఖరంబంజర, పాలకోయ తండా తదితర గ్రామాల ప్రజలు అనారోగ్యాల భారిన పడుతున్నారని అన్నారు. యాజ మాన్యం సీఎస్ఆర్ పాలసీని అమలు చేసి ఆయా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. స్థానికం గా ఉన్న నిరుద్యోగ యువతకు అర్హతను బట్టి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలని, వైద్యశిబిరాలు ఏర్పాటు చేయాలని, భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ దీక్షల్లో ఆనంద్, సాయి, వీరన్న, రమేష్, రవి తదితరులు పాల్గొన్నారు. వారికి బీసీ సంఘం నాయకులు రేగళ్ల శ్రీను, టీఎన్టీయుసీ నాయకులు గొర్రె వేణుగోపాల్, ఎల్‌హెచ్‌సీఎస్ నాయకులు మాలోతు కోటి, కాంగ్రెస్ నాయకులు ఎస్వీఆర్కే ఆచార్యులు ఈ దీక్షలకు సంఘీభావం తెలిపారు. -
జగన్ కోసం సాగుతున్న దీక్షలు
సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రజలకు సమన్యాయం చేయాలని లేదంటే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉం చాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి చే స్తున్న దీక్షకు మద్దతుగా జిల్లాలో ఆమరణ దీక్ష లు, పూజలు కొనసాగుతున్నాయి. ముగ్గురు పార్టీ నాయకులు ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకు చేరుకుంది. పాకాలలో పార్టీ మండల కన్వీనర్ పద్మజారెడ్డి, ఎస్సీ సెల్ నాయకుడు పూతలపట్టు లోక చేపట్టిన ఆమరణ దీక్ష మూడో రోజుకు చేరుకుంది. దీక్ష విరమించాలని వైద్యులు సూచించినా వారు స సేమిరా అన్నారు. గంగాధరనెల్లూరులో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టిన జిల్లా కన్వీనర్ నారాయణస్వామి దీక్షను శుక్రవారం పోలీసులు భ గ్నం చేశారు. పుంగనూరులో పార్టీ నాయకుడు జయకృష్ణ చేపట్టిన దీక్ష మూడో రోజుకు చేరుకోగా, రాత్రి పోలీసులు దీక్షను భగ్నం చేశారు. రిలే దీక్షల్లో 64మంది... వైఎస్ జగన్మోహన్రెడ్డి దీక్షలకు మద్దతుగా జి ల్లాలో శుక్రవారం 64 మంది రిలే నిరాహారదీ క్షలో పాల్గొన్నారు. తిరుపతిలో ఎమ్మెల్యే భూ మన కరుణాకరరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న రిలే నిరాహారదీక్షలో శుక్రవారం పార్టీకి చెందిన బీసీ మహిళలు 30 మంది పాల్గొన్నారు. రేణిగుంట గాంధీ సర్కిల్ వద్ద జరుగుతున్న రిలే దీ క్షలో ఐదో రోజున నలుగురు, కేఎల్ఎం ఆస్పత్రి వద్ద సీరాజ్ నాయకత్వంలో జరుగుతున్న రిలే దీక్షలో ఐదుగురు పాల్గొన్నారు. చిత్తూరులో ని యోజకవర్గ సమన్వయకర్త ఏఎస్.మనోహర్ నాయకత్వంలో 15 మంది మహిళలు, వడమాలపేటలో పార్టీ నాయకులు చేస్తున్న దీక్షలో పది మంది కార్యకర్తలు పాల్గొన్నారు. పలుచోట్ల పూజలు.. వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండా లని ప్రార్థిస్తూ సత్యవేడు నియోజకవర్గం సు రుటుపల్లెలోని పల్లికొండేశ్వర ఆలయంలో ని యోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం నేతృత్వంలో 1001 కొబ్బరి కాయలు కొట్టి, ప్రత్యేక పూజలు చేయించారు. చిత్తూరులో పార్టీ మ హి ళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీ దేవి ఆధ్వర్యంలో వినాయక ఆలయం వద్ద కొబ్బరికాయలు కొట్టారు. కుప్పంలో తిరుపతి గం గమ్మ ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి పూజలు చేయించారు. మదనపల్లెలో ఎమ్మెల్సీ దేశాయ్ తిప్పారెడ్డి నాయకత్వం లో ర్యాలీ, ధర్నా చేపట్టారు. పూతలపట్టు మండలం తలపులపల్ల్లె గ్రామంలో పా ర్టీ జిల్లా అధికార ప్రతినిధి బాబురెడ్డి వంటావా ర్పు కార్యక్రమం నిర్వహించారు. ముస్లింల సంఘీభావం వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బాగుండా లని కోరుతూ తిరుపతిలో ముస్లిం రైట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. పెద్ద మసీదు నుంచి తుడా సర్కిల్లోని వైఎస్ విగ్రహం వరకు సభ్యులు ర్యాలీ నిర్వహించారు. -
జననేతకు అపూర్వ మద్దతు
నర్సీపట్నం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర కోసం ఇప్పటివరకు రిలే నిరాహార దీక్షలు చేపట్టిన వైఎస్సార్సీపీ శ్రేణులు పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షతో ఉద్యమాన్ని ఉధృతం చేశాయి. జననేతకు జిల్లా వ్యాప్తంగా అనూహ్య మద్దతు లభిస్తోంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రాణత్యాగానికైనా సిద్ధమంటున్నారు. విశాఖలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, అభిమానులు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి తమ మద్దతు ప్రకటించారు. ఆశీల్‌మెట్ట సంపత్ వినాయకుని ఆలయం వద్ద వైఎస్సార్సీపీ నగర,జిల్లా కన్వీనర్లు వంశీకృష్ణ శ్రీనివాస్, చొక్కాకుల వెంకటరావు ఆధ్వర్యంలో 101 కొబ్బరి కాయలు కొట్టారు. నర్సీపట్నంలో పార్టీ నాయకులు పీలా వెంకటలక్ష్మి, బేతిరెడ్డి విజయ్‌కుమార్, ఎం.డి.బాషాలు ఆదివారం నుంచి ఆమరణ దీక్షలు చేపట్టారు. గొలుగొండ మండలంలో రాస్తారోకో చేపట్టారు. చోడవరంలో రిలే దీక్షలు పాటిస్తున్నారు. పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు అన్నంరెడ్డి అదీప్‌రాజ్, నాయకుడు బండారు సత్యనారాయణ దీనిని ప్రారంభించారు. చోడవరం, రోలుగుంట మండలాల యువజన విభాగం అధ్యక్షులు అల్లం రామఅప్పారావు, బండారు శ్రీనివాసరావు, గుడాల ప్రవీణ్‌కుమార్, కార్లె గీతాకృష్ణ, కొల్లి మురళీకృష్ణ దీక్షలో కూర్చున్నారు. చోడవరం నియోజకవర్గం ఎన్నికల పరిశీలకుడు పి.వి.ఎస్.ఎన్.రాజు, మాడుగుల నియోజకవర్గం నాయకుడు పి.వి.జె.కుమార్‌లు శిబిరానికి వచ్చి మద్దతు పలికారు. మునగపాకలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. అంతకుముందు మెయిన్‌రోడ్డుపై పార్టీ నేతలు నియోజకవర్గ సమన్వయ కర్త బొడ్డేడ ప్రసాద్ ఆధ్వర్యంలో బైఠాయించి జగన్మోహన్రెడ్డికి మద్దతుగా నినాదాలు చేశారు. పాడేరులో నియోజకవర్గ సమన్వయకర్త సీక రి సత్యవాణి ఆధ్వర్యంలో కాగడాలు, కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. పాతబస్టాండ్‌లోని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదుట కాగడాలతో జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. అనంతరం కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. -
రేపు విశాఖ నగరంలో రిలే దీక్షలు
విశాఖ: రేపు విశాఖ నగరంలో అన్ని వార్డుల్లో రిలే దీక్షలు చేపట్టనున్నట్లు వైఎస్సార్సీపీ పార్టీ తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను దహనం చేస్తామని వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీ కృష్ణ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బొత్స, చంద్రబాబులపై మండిపడ్డారు. వారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ను కోరుకుంటున్నారా? రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారా?తెలిపాలని డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఇప్పటికే దీక్షలు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే సమైక్యంధ్రకు సీమాంధ్ర ఉద్యోగుల సంఘాల కూడా గత కొన్ని రోజుల నుంచి నిరసన చేపట్టడంతో రాష్ట్రంలో పాలన స్తంభించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. -
పలాసలో జర్నలిస్టుల రిలే నిరాహార దీక్షలు
శ్రీకాకుళం : రాష్ట్ర విభజనను నిరసిస్తూ గురువారం కూడా జిల్లావ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు కొనసాగుతున్నాయి. సమైక్యాంధ్రను కోరుతూ పలాసలో జర్నలిస్టులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మరోవైపు వెటర్నరీ, వ్యవసాయ, విద్యుత్ శాఖ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసనలు తెలుపుతున్నారు. కాగా సీమాంధ్ర జిల్లాల్లో విభజన సెగలు కొనసాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా కామవరపుకోటలో సమైక్యవాదులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మరోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల రిలే నిరాహార దీక్షలు రెండోరోజుకు చేరాయి. తూర్పు గోదావరి జిల్లాలో సమైక్యాంధ్రకు మద్దతుగా పత్తిపాడు మండలం వానపల్లిలో సమైక్యవాదులు రోడ్డుపై వంటావార్పు చేపట్టారు. కాగా విభజనను నిరసిస్తూ కోరుకొండ మండలం నర్సాపురంలో ఇందిరాగాంధీ విగ్రహాన్ని సమైక్యవాదులు ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ జిల్లాలో సమైక్యాంద్రకు మద్దతుగా ఎర్రగుంట్లలో లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. అలాగే నెల్లూరుజిల్లా కావలిలో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. ఇక విజయనగరం జిల్లాలోనూ బంద్ కొనసాగుతోంది. డిపోల నుంచి బస్సులు కదలటం లేదు.