సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవి చూసింది. ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధపడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ రాజీనామా ఆలోచనను ఉపసంహరించుకోవాలంటూ.. కాంగ్రెస్ నాయకులు ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. రెండో రోజుకు చేరిన నిరాహార దీక్షకు తెలంగాణ ఇన్‌చార్జ్ రామచంద్ర కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి సంఘీభావం తెలిపారు. రాహుల గాంధీ రాజీనామ ఆలోచనను విరమించుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment