ఆర్టీసీ యాజమన్యం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా.. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు.
ఆర్టీసీ యాజమన్యం వ్యవహరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా.. నల్లగొండ జిల్లా యాదగిరి గుట్ట బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో.. కార్మికుల పనిగంటలను తగ్గించడంతో పాటు.. వేధింపులను ఆపాలను కోరుతూ.. ఆదివారం నుంచి రిలే దీక్షలను ప్రారంభించారు. డిపో మేనెజర్ వివరణ ఇచ్చే వరకు తాము దీక్షలు కొనసాగిస్తామని కార్మికులు తెలిపారు. ఈ దీక్షలకు మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు సంఘీభావం తెలిపారు.