నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం చిన్నకందూరు గ్రామం వద్ద బుధవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో డీసీఎం డ్రైవర్ మృతిచెందాడు. భారీ వర్షాలకు రోడ్డు సరిగా కనిపించకపోవడంతో లారీ-డీసీఎం వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. దాంతో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుని వివరాలు తెలియరాలేదు.