
సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జీ నర్సయ్య
సాక్షి, హైదరాబాద్: రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మరొక పోలీస్ అధికారిపై వేటు పడింది. ఈనెల 21న అవినీతి ఆరోపణలపై సరూర్‌నగర్ సబ్ ఇన్‌స్పెక్టర్ సైదులును సస్పెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా.. భువనగిరి డివిజన్ పరిధిలోని యాదగిరిగుట్ట రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ) జీ నర్సయ్య సస్పెండ్ అయ్యారు. స్టేషన్‌లోని ఓ మహిళా పోలీస్‌తో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఈ చర్యలు తీసుకున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
చదవండి: తనిఖీల వీడియో వైరల్: క్లారిటీ ఇచ్చిన సీపీ అంజనీ కుమార్
నర్సయ్య ప్రవర్తనపై సదరు మహిళ పోలీస్ పైఅధికారుల దృష్టికి తీసుకు వచ్చిందని తెలిసింది. దీంతో విధుల నుంచి తాత్కాలికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నర్సయ్య స్థానంలో ఎల్బీనగర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అటాచ్‌గా ఉన్న ఇన్‌స్పెక్టర్ బీ నవీన్ రెడ్డిని యాదగిరిగుట్ట రూరల్ సీఐగా బదిలీ అయ్యారు. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ ఎం భగవత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.
చదవండి: ఇదేమి చోద్యం? మూతికి ఉండాల్సిన మాస్క్ నంబర్ ప్లేటుకు ..
Comments
Please login to add a commentAdd a comment