విశాఖ: రేపు విశాఖ నగరంలో అన్ని వార్డుల్లో రిలే దీక్షలు చేపట్టనున్నట్లు వైఎస్సార్‌సీపీ పార్టీ తెలిపింది. ఈ నిరసన కార్యక్రమంలో పీసీసీ చీఫ్ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మలను దహనం చేస్తామని వైఎస్సార్‌సీపీ నగర కన్వీనర్ వంశీ కృష్ణ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన బొత్స, చంద్రబాబులపై మండిపడ్డారు. వారు సమైక్య ఆంధ్రప్రదేశ్ ను కోరుకుంటున్నారా? రాష్ట్ర విభజనను కోరుకుంటున్నారా?తెలిపాలని డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఇప్పటికే దీక్షలు. భారీ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజలు ఉద్యమానికి బాసటగా నిలుస్తున్నారు. ఇప్పటికే సమైక్యంధ్రకు సీమాంధ్ర ఉద్యోగుల సంఘాల కూడా గత కొన్ని రోజుల నుంచి నిరసన చేపట్టడంతో రాష్ట్రంలో పాలన స్తంభించి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.
రేపు విశాఖ నగరంలో రిలే దీక్షలు
Published Thu, Aug 22 2013 12:30 PM | Last Updated on Sat, Jul 28 2018 6:33 PM
Advertisement
Advertisement