Cotton Barrage
-
ధవళేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక
-
కాటన్ బ్యారేజ్ 15.9 అడుగులకు చేరుకున్న నీటిమట్టం
-
ఉరకలేస్తున్న గోదావరి
దవళేశ్వరం: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి ఉరకలేస్తోంది. పరీవాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో బ్యారేజీ వద్దకు వచ్చి చేరుతున్న వరద నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తున్నారు. కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం ఆదివారం సాయంత్రానికి 9.70 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 1,25,693 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. నీటిమట్టం ఆదివారం సాయంత్రం భద్రాచలం వద్ద 14 అడుగులకు, పోలవరంలో 27.67 మీటర్లకు చేరింది. -
ధవళేశ్వరం కాటన్ బ్యారేజీకి పోటెత్తిన వరద
-
డెల్టా ఆధునికీకరణతో.. మళ్లీ అరకొరేనా!
సాక్షి, రాజమహేంద్రవరం: రబీ పంటకు నీటి విడుదల గడువు ఆదివారంతో ముగుస్తోంది. ముందుగా నిర్ణయించిన మేరకు మార్చి 31తో నీటిని నిలిపివేయాల్సి ఉన్నా పలు ప్రాంతాల్లో పంట పొట్టదశలో ఉండడంతో రైతుల విజ్ఞప్తి మేరకు ముందు పది రోజులు, ఆ తర్వాత మరో ఐదు రోజులు వెరసి ఏప్రిల్ 15 వరకు గడువు పొడిగించారు. ప్రస్తుతం తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 5,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. 15న సాయంత్రం 6 గంటలకు మూడు డెల్టా కాలువలను మూసివేయనున్నారు. ఇందుకు సంబంధించి ఆదివారం నిర్ణయం తీసుకోనున్నారు. 16 నుంచి మే 30 వరకు 45 రోజుల పాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టనున్నారు. గత ఏడాదిలాగే ఈ సారి జూన్ 1న కాలువలకు నీరు విడుదల చేయనున్నారు. 2,020 పనులు.. రూ.308 కోట్లు.. రబీ ఆరంభానికి ముందు గత ఏడాది నవంబర్‌లో కాకినాడలో నిర్వహించిన సాగునీటి సలహా మండలి సమావేశంలో డిసెంబర్ 31 నాటికి నాట్లు పూర్తి చే యాలని నిర్ణయించారు. మార్చి 31న కాలువలు మూసి వేసి మే 30 వరకు 60 రోజులపాటు డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. రైతుల విజ్ఞప్తి మేరకు అదనంగా 15 రోజులు నీరు విడుదల చేయడంతో డెల్టా ఆధునికీకరణ పనులకు 45 రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఏడాది రూ. 308 కోట్లతో 2,020 పనులు చేసేందుకు జలవనరులశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. డెల్టా ఆధునికీకరణ కింద రూ. 173 కోట్లతో 370 పనులు చేయనున్నారు. నీరు– చెట్టు పథకంలో రూ.135 కోట్లతో 1650 పనులు చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. పునరావృతం కాకూడదంటున్న రైతులు గత ఏడాది డెల్టా ఆధునికీకరణ పనులు ఆలస్యంగా ప్రారంభించారు. ఆధునికీకరణలో భాగంగానే రూ. 60 కోట్ల విలువైన పనులు చేపట్టారు. ప్రధాన కాలువలు, చానల్స్, పంట బోదెలు, డ్రైన్లలో పూడిక తీత, రిటైనింగ్ వాల్స్, హెడ్ స్లూయిజ్, స్లూయిజ్ పనులు చేపట్టారు. నెల రోజులు ఆలస్యంగా మే నుంచి పనులు చేయడం ప్రారంభించారు. మరికొన్ని పనులు హడావుడిగా మే నెలాఖరున ప్రారంభించారు. జూన్ 1నే నీరు విడుదల చేయాలన్న రైతుల పోరాటం ఫలించినా పనులు పూర్తి కాకపోవడంతో వారి ఆశలపై నీళ్లు చల్లినట్టైంది. జూన్ ఒకటిన అధికారులు కాలువలకు నీరు విడుదల చేసినా ఆధునికీకరణ పనులు మధ్యలో ఉండడంతో ఫలితం లేకపోయింది. కాంట్రాక్టర్లు ఎక్కడికక్కడ కాలువలకు అడ్డుకట్టలు వేసి పనులు చేయడంతో కాలువలకు పూర్తి స్థాయిలో నీరు 15 రోజులు ఆలస్యంగా అందింది. గత ఏడాది అదృష్టవశాత్తూ అక్టోబర్‌లో తుపాన్లు రాకపోవడం వల్ల పంట కోత ఆలస్యమైనా ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఈ ఏడాదైనా డెల్టా ఆధునికీకరణ పనులు సకాలంలో మొదలు పెట్టి నిర్ణీత గడువు మే 30 నాటికి పూర్తి చేసి జూన్ ఒకటిన నిరు విడుదల చేయాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. -
రక్షణ గోదారమ్మకెరుక
ధవళేశ్వరం బ్యారేజి దుస్థితి 169 గేట్లలో రూ.16.90 లక్షల విలుౖÐð న బ్రేక్ కాయిల్స్ చోరీ నామమాత్రంగా చర్యలు.. తేలని దోషులు అరకొరగా రక్షణ ఏర్పాట్లు 8 చాలీచాలని సిబ్బందితోనే కాలక్షేపం ‘సాక్షి’ పరిశీలన ఉభయ గోదావరి జిల్లాల వరప్రదాయినిగా నిలుస్తున్న ధవళేశ్వరంలోని సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజి రక్షణ ప్రశ్నార్థకంగా మారింది. దేశంలోనే అత్యధికంగా 175 గేట్లతో నిర్మించిన ఈ బ్యారేజి పరిరక్షణలో జలవనరుల శాఖ నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోంది. వరదల సమయంలో బ్యారేజి గేట్లను ఎత్తేందుకు ఉపయోగించే ఎంతో విలువైన బ్రేక్ కాయిల్స్ మాయమయ్యాయి. మరోపక్క చాలీచాలని సిబ్బందితోనే బ్యారేజి నిర్వహణ, రక్షణ చర్యలు చేపడుతున్నారు. ఈ అంశాలపై ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో నివ్వెరపరిచే నిజాలు వెలుగు చూశాయి. సాక్షి, రాజమహేంద్రవరం : ఉభయ గోదావరి జిల్లాల్లో ఏటా సుమారు 20 లక్షల ఎకరాలకు సాగునీరందించే ధవళేశ్వరం బ్యారేజి రక్షణను ప్రభుత్వం గాలికి వదిలేసింది. సుమారు రెండు నెలల కిందట జరిగిన బ్రేక్ కాయిల్స్ చోరీ ఘటనతో బ్యారేజి రక్షణలోని డొల్లతనం స్పష్టంగా బయటపడింది. గోదావరి నదికి సాధారణంగా జూన్ నుంచి సెప్టెంబర్ వరకూ ఎక్కువగా వరదలు వస్తూంటాయి. ఎగువ నుంచి వచ్చే వరద ఉధృతినిబట్టి వెనువెంటనే బ్యారేజి క్రస్ట్ గేట్లను అవసరమైన మేరకు ఎత్తి.. అదనపు జలాలను సముద్రంలోకి విడిచిపెడతారు. నాలుగు ఆర్్మలుగా నిర్మించిన కాటన్ బ్యారేజికి 175 గేట్లు ఉన్నాయి. టన్నులకొద్దీ బరువుండే ఈ ఇనుప గేట్లను సకాలంలో ఎత్తేందుకు బ్రేక్ కాయిల్స్ ఉపయోగిస్తారు. వరద నీటి నియంత్రణలో ఎంతో కీలకంగా ఉపయోగించే ఈ కాయిల్స్ చోరీకి గురయ్యాయి. అది కూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 169 గేట్లకు ఉండే బ్రేక్ కాయిల్స్ మాయమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.16.90 లక్షలని చెబుతున్నారు. ప్రస్తుతం వరదల సీజనే అయినప్పటికీ వీటిని ఇంతవరకూ తిరిగి ఏర్పాటు చేయలేదు. మరోపక్క ఇంత ముఖ్యమైన, విలువైన పరికరాలు చోరీకి గురవుతూంటే అధికారులు, సిబ్బంది ఏం చేస్తున్నారన్న ప్రశ్న. పుణేలో మాత్రమే దొరికే ఈ కాయిల్స్ రప్పించాలని భావించినా ఇప్పటికిప్పుడు లభ్యమయ్యే పరిస్థితి లేదు. ప్రత్యేకంగా ఆర్డర్ పెట్టి వీటిని తయారు చేయించుకోవాలని చెబుతున్నారు. మరోపక్క కాయిల్స్ ఉన్నప్పుడు కేవలం స్విచ్ ఆన్ చేయగానే గేట్లు వాటంతటవే తెరచుకునేవి. ఇప్పుడవి దొంగలపాలు కావడంతో ఒక్కో గేటుకు ఇద్దరు అదనపు సిబ్బందిని నియమించడం తప్పనిసరైంది. మొక్కుబడి చర్యలతో సరి బ్యారేజి నిర్వహణలో ఎంతో ప్రాధాన్యం ఉన్న పరికరాలు చోరీకి గురయితే అధికారులు నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. ముగ్గురు సెక్షన్ అధికారులను సస్పెండ్ చేసి, చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ జరిగిన సమయంలోని ఉన్నతాధికారులందరూ బదిలీపై వెళ్లిపోయారు. ప్రస్తుతం కొత్తవారు రావడంతో శాఖాపరమైన విచారణ జరుగుతుందో లేదో తెలియని పరిస్థితి. 240 మందికి.. 40 మందే సిబ్బంది బ్యారేజి నిర్వహణ, రక్షణ కోసం 240 మంది సిబ్బంది అవసరమవుతారు. కానీ ప్రస్తుతం 40 మంది మాత్రమే ఉన్నారంటే బ్యారేజి రక్షణ, నిర్వహణలో ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందో అర్థమవుతుంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద కాపలాగా ప్రైవేటు వ్యక్తులను నియమించారు. మూడు షిఫ్టుల్లో ఒక్కో ఆర్మ్ వద్ద ఆరుగురు చొప్పున నాలుగు ఆర్మ్‌ల వద్ద 24 మందిని నియమించారు. అయితే రాత్రిపూట విధులు నిర్వర్తించేవారికి కనీసం టార్చిలైట్‌ను కూడా అధికారులు సమకూర్చలేదు. ధవళేశ్వరంవైపు బ్యారేజి పైకి, జలాల కొలత చూసే ప్రాంతంలోకి ఇతరులు రాకుండా ఉండేలా ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. ఉభయ గోదావరి జిల్లాలకు ఎంతో కీలకమైన ప్రభుత్వం, జలవనరుల శాఖ పటిష్ట చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. పోలీసులు పట్టించుకోవడంలేదు బ్రేక్ కాయిల్స్ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. విచారణ ఎంతవరకూ వచ్చిందో తెలియదు. ప్రస్తుతం గేట్లు తెరవడానికి ఇద్దరు వ్యక్తులు అవసరమవుతున్నారు. బ్రేక్ కాయిల్స్‌కు ఆర్డర్ పెట్టాం. వీటిని పుణేలో తయారు చేస్తారు. రెండు నెలలు పడుతుందన్నారు. అన్నీ ఒక్కసారిగా కాకపోయినా విడతలవారీగానైనా రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం బ్యారేజి రక్షణగా బయటి వ్యక్తులను నియమించాం. మరో 20 రోజుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. రాత్రి వేళ బ్యారేజిపై కాపలా ఉంచాలని పోలీసు శాఖను కోరాం. – కృష్ణారావు, ఈఈ, హెడ్‌వర్క్స్, ధవళేశ్వరం బ్యారేజి -
కాటన్ బ్యారేజీని సందర్శించిన వైఎస్ జగన్
-
హమ్మయ్యా..!
ముఖం చాటేసిన మబ్బులు..గోదావరిలో అడుగంటుతున్న జలాలు.. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్‌కు సమీపంలో తేలిన ఇసుక తిన్నెలు.. కాలువల నుంచి శివారుకందని నీరు.. బీడువారిన పొలాలు.. మొన్నటి వరకు డెల్టా రైతులకు కళ్లముందు గోచరించిన దృశ్యాలివి. ఎల్‌నినో ప్రభావంతోగత వారం వరకు డెల్టా పరిధిలోని శివారు, మెరక ప్రాంతాల్లో సాగు ప్రశ్నార్థకమై రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అల్పపీడన ప్రభావంతో మూడు రోజులు వర్షాలు కురవడం... గోదావరికి ఎర్రనీరు పోటెత్తడం వంటి పరిణామాలు రైతులకు ఊరట కలిగించాయి. అమలాపురం :ఖరీఫ్ వరిసాగు జిల్లాలో 5.53 లక్షల ఎకరాల్లో జరుగుతుండగా, తూర్పు, పశ్చిమ డెల్టాల్లోనే సుమారు 4.20 లక్షల ఎకరాల్లో (75 శాతం) సాగుతుంది. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ ఆ రెండు డెల్టాలకు ధవళేశ్వరం సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్ నుంచి సాగు నీరందే సౌలభ్యం ఉండడం వల్ల ఇక్కడ ఖరీఫ్ సాగుకు పెద్దగా ఇబ్బంది ఉండదు. వర్షాలు పూర్తిస్థాయిలో పడకున్నా ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి జూన్ 10 నుంచి 15 మధ్య కాలంలో ఇరిగేషన్ అధికారులు నీటిని విడుదల చేస్తుంటారు. రైతులు నారుమడులు వేసుకునే సమయంలో రోజుకు కనిష్టంగా ఎనిమిది వేల క్యూసెక్కుల చొప్పున నీటిని వదులుతుంటారు. జూలై మొదటివారం నుంచి రుతుపవనాల ప్రభావంతో జోరుగా వర్షాలు పడడం, బ్యారేజ్ క్యాచ్మెంట్ ఏరియా నుంచి సమృద్ధిగా నీరు రావడం వల్ల నాట్లు వేసే సమయంలో కాలువల ద్వారా మూడు డెల్టాలకు కనిష్టంగా పది వేల నుంచి గరిష్టంగా 12 వేల క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేస్తుంటారు. అయితే ఈసారి ఎల్‌నినో ప్రభావంతో జూన్ 15 నుంచి కాలువలకు నీటిని విడుదల చేసినా అవసరమైన నీరు లేక చాలా రోజుల పాటు ఏడు వేల క్యూసెక్కుల మించి సరఫరా చేయలేకపోయారు. దీనివల్ల డెల్టాలోని శివారు, మెరక ప్రాంతాలకు నీరందక నారుమడులు వేయడం ఆలస్యమైంది. నీరందకపోవడానికి తోడు వర్షాలు లేక పరిస్థితి దారుణంగా మారింది. ఒకానొక సమయంలో శివారు, మెరక ప్రాంత రైతులు ఈ ఏడాది ఖరీఫ్ సాగు వదులుకోవాలనే ఆలోచనకు సైతం వచ్చారు. ప్రస్తుతం డెల్టాలో జోరుగా నాట్లు పడాల్సి ఉండగా, ఇంతవరకు ఐదు శాతం కూడా నాట్లు వేయలేదు. నారుమడులు సైతం 70 శాతం మించలేదు. మధ్యడెల్టాల్లో 50 శాతం మాత్రమే నారుమడులు పడ్డాయి. సమయం మించిపోతున్నా వాతావరణం కలిసిరాక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వర్షాలు.. వరద నీటితో ఊరట బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మూడురోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవడంతో డెల్టాలో పరిస్థితి మారింది. రైతులు పూర్తిస్థాయిలో సాగుకు సన్నద్ధమయ్యారు. నారుమళ్లు పూర్తయిన చోట దమ్ములు ఆరంభించారు. సాగు ఆలస్యమైన చోట రైతులు వెదజల్లు, డ్రమ్ సీడర్ పద్ధతిలో నాట్లు వేసేందుకు ముమ్మరంగా దమ్ములు చేస్తున్నారు. ఈ సమయంలో గోదావరికి ఎర్రనీరు పోటెత్తడం రైతుల్లో సాగుకు భరోసా కల్పించింది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల బ్యారేజీ వద్ద నీటిమట్టం పెరిగింది. కాలువలకు నీరు వదిలిన సరిగ్గా నెలరోజుల తరువాత ధవళేశ్వరం బ్యారేజీ నుంచి మిగుల జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మంగళవారం సాయంత్రం 9,604 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. పంటకాలువలకు సైతం నీటి విడుదలను పెంచారు. సోమవారం మూడు డెల్టాలకు 10,500 క్యూసెక్కుల నీరు విడుదల చేయగా మంగళవారం మరింత పెంచారు. జిల్లాలోని రెండు డెల్టాలకు కలిపి 5,400 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. దీనితో పంటకాలువలు నీటితో కళకళలాడుతున్నాయి. శివారు, మెరక ప్రాంతాలకు కూడా ఇప్పుడిప్పుడే నీరందుతుండడంతో రైతులు ఊపిరిపీల్చుకుంటున్నారు. సాగులో వెనుకబడ్డ తూర్పుడెల్టాలోని కరప, రామచంద్రపురం, మధ్యడెల్టాలోని అమలాపురం, ముమ్మిడివరం, పి.గన్నవరం, రాజోలు సబ్ డివిజన్ల పరిధిలోని శివారు గ్రామాల్లో సాగు ఊపందుకోనుంది. -
పూడికతీత మంత్రం
సాక్షి, కాకినాడ :జిల్లాను వరదలు.. భారీ వర్షాలు ముంచెత్తినా రెండవ పంటకు ప్రతిఏటా సాగునీటి కష్టాలే. గోదావరిపై సర్ ఆర్ధర్ కాటన్ నిర్మించిన ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద చాలినంత నీటి నిల్వల్లేక ఒకపక్క సాగునీటికి..మరొకపక్క తాగునీటికి ఇబ్బందులు ఎదుర్కోవడం పరిపాటిగా మారింది. బ్యారేజ్ వద్ద పేరుకుపోయిన ఇసుక వల్లే ఈ దుస్థితి దాపురించింది. ప్రతి ఏటా ఇసుక పూడికతీతపై చర్చ జరుగుతున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. ఇక నుంచి ప్రతి ఏటా ఆగస్టులో బ్యారేజ్ వద్ద ఇసుకపూడిక తీత తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా నెలకొన్న ఇసుక కష్టాలను ఈ పూడిక ద్వారా అధిగమించాలన్న యోచనకు ప్రభుత్వం వచ్చింది. వీటి కేటాయింపు, స్టాక్ పాయింట్ల ఏర్పాటు తదితర బాధ్యతలను నీటిపారుదల శాఖ ఈఎన్సీకి అప్పగించారు. గోదావరి బ్యారేజ్ వద్ద సుమారు ఎనిమిదిన్నర లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక పూడిక ఉందని గుర్తించిన యంత్రాంగం వీటి తొలగింపు కోసం అనుమతులు మంజూరు చేయాలని ఎప్పటి నుంచో కోరుతోంది. 1975-80ల మధ్య ఈ బ్యారేజ్‌లో పూడిక తీశారు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఈ పూడిక తీత జోలికి పోలేదు. ప్రస్తుతం ఇసుక రీచ్‌లకు గడువు ముగియడం...ఉన్న కొద్దిపాటి నిల్వలు అడుగంటిపోతుండడంతో ఇసుక కొరత రోజురోజుకు తీవ్రరూపం దాలుస్తోంది. రీచ్‌ల కేటాయింపునకు పర్యావరణ అనుమతులు లేకపోవడం ప్రధాన అడ్డంకిగా నిలవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగాా గత నెలలో జరిగిన జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశంలో బ్యారేజ్ వద్ద పూడికను తొలగించడం ద్వారా ఇసుక కష్టాలను అధిగమించవచ్చునన్న జిల్లా జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు, డ్వామా పీడీ సంపత్‌కుమార్ సూచనలు ఫలితాన్నిచ్చాయి. ఈ మేరకు పంపినప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో బ్యార్జే వద్ద పూడికతీతకు మార్గం సుగమమైంది. బ్యార్జ్కు ఇబ్బంది కలగకుండా... బ్యారేజ్‌కు ఎగువన రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రిజర్వాయర్ పాయింట్లయిన గోగుల్లంక, కేదార్లంక, కాతేరు పరిధిలో విస్తరించి ఉన్న ప్రాంతంలో సుమారు 2.50 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక పూడికను తొలగించేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పూడిక తొలగించేందుకు అర్హత గల ఏజెన్సీని గుర్తించడం.. కేటాయింపు బాధ్యతలను ఇరిగేషన్ ఈఎన్సీకీ, స్టాక్ పాయింట్ల గుర్తింపు, ఏర్పాటు బాధ్యతను ఇరిగేషన్ హెడ్వర్క్స్ఈఈకు అప్పగించారు. ఆయా గ్రామాల పరిధిలోఉన్న బోట్స్‌మెన్ సొసైటీల మధ్య ఏకాభిప్రాయంతో ఒక సొసైటీకి పూడికతీత బాధ్యతలు అప్పగించనున్నారు. వారి మధ్య సయోధ్య కుదరని పక్షంలో లాటరీ ద్వారా ఎంపిక చేయనున్నారు. రవాణాకు సంబంధించి ట్రాన్సిట్పాస్లు జారీ బాధ్యత కూడా ఈఎన్సీకే అప్పగించారు. అయితే నిబంధనల అమలును మాత్రం డ్వామా పర్యవేక్షించ నుంది. క్యూబిక్ మీటర్ ఇసుక రూ.415 ధరతో ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తారు. ఇదే రేటుకు ప్రజలకు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఏజెన్సీ గుర్తింపు, కేటాయింపు ప్రక్రియను నాలుగైదు రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఏదేమైనా ఫిబ్రవరి మొదటి వారంలో ఇక్కడ నుంచి ఇసుక అందుబాటులోకి రానుంది. ఇదేరీతిలో ప్రతి ఏటా ఆగస్టులో ఇసుక పూడికతీత చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది. తాండవ నదిలో కూడా ఇదే రీతిలో పూడికతీతకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కూడా పూడికతీతకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఏ మేరకు తీయవచ్చునన్న విషయంపై ఇంకా నిర్ధారణ జరగలేదు. పట్టాల్యాండ్‌లో పూడికతీతకు అనుమతులు మరొకపక్క పి.గన్నవరం మండలం లంకల గన్నవరంలో అన్నాబత్తుల వెంకటరమణమూర్తికి చెందిన సర్వేనెం 53, 54, 55ల పరిధిలో విస్తరించి ఉన్న 17 ఎకరాల పట్టా భూముల్లో సుమారు 2,15,624 క్యూబిక్ మీటర్ల ఇసుక వెలికితీతకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. జిల్లాలో జొన్నాడ, అయినవిల్లి రీచ్‌ల సమీపంలో స్టాక్ పాయింట్ల వద్ద ఉన్న 40వేల క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు మార్చి 5వ తేదీ వరకు, రాజమండ్రి రీచ్ సమీపంలో ఉన్న స్టాక్ పాయింట్ వద్ద 47,300 క్యూబిక్ మీటర్ల ఇసుక రవాణాకు జూలై 1వ తేదీ వరకు అనుమతులున్నాయి. మొత్తమ్మీద ఇసుక కష్టాలను కొంతలో కొంత ఈ పూడికతీత అనుమతులు తీర్చనున్నాయి.