సాక్షి, అమరావతి: కొద్దిరోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ ఎగువన ఉన్న రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా గోదావరికి ఉధృతి పెరిగింది
కాగా, ధవళేశ్వరం వద్ద ప్రస్తుతం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 15.07 లక్షల క్యూసెక్కులు ఉందని అధికారులు తెలిపారు. గోదావరి పరిస్థితిని స్టేట్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు ఏపీ విపత్తుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్ స్పష్టం చేశారు. ఈ మేరకు వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు సూచనలు అందిస్తున్నట్టు వెల్లడించారు.
ఇక, భారీ వర్షాల నేపథ్యంలో రేపు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేసే అవకాశం ఉంది. ఈ క్రమంలో వరద ప్రభావితం చేసే మండలాల్లో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యల్లో మొత్తం 5 ఎన్డీఆర్ఎఫ్, 4 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పనిచేస్తున్నాయి. కాగా, లోతట్టు ప్రాంత ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: బలపడిన అల్పపీడనం.. పలుచోట్ల భారీ వర్షాలు
Comments
Please login to add a commentAdd a comment