యాదగిరిగుట్ట : మాట్లాడుతున్న మోత్కుపల్లి నర్సింహులు
సాక్షి,తుర్కపల్లి : ఆలేరుకు గోదావరి జలాల సాదనే తన లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.గురువారం తుర్కపల్లి మండలంలో రుస్తాపూర్, జాలబావి తండా, చౌక్లతండా, పీర్యతండా, మోతీరాంతండా, రామోజీనా యక్‌తండా, పల్లెపహాడ్, గొల్లగూడెం గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.తలాపున తపాస్‌పల్లి రిజర్వాయర్ పారుతున్నా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని పేర్కొన్నారు.
ప్రతి తెల్ల రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారుడికి నెలకు 5 వేల రూపాయలు ఇచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గజం ఉప్పలయ్య, గ్రామ, మండల స్థాయి నాయకులు మ«ధుసూదన్‌రెడ్డి, మారగోని శ్రీరాంమూర్తి, మహేశ్, జహంగీర్, మోత్కుపల్లి రఘు, సీతానారాయణ, కోట భిక్షపతి, బొల్లారం జగదీశ్, పాముల రాజు, బోరెడ్డి జానార్దన్‌రెడ్డి, ఎడవల్లి మైసయ్య, మోత్కుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.
చివరి పోటీ.. అవకాశం ఇవ్వండి:
యాదగిరిగుట్ట : నా రాజకీయ జీవితంలో ఇవే నా చివరి ఎన్నికలు.. ఆలేరు నియోజకవర్గ ఓటర్లంతా ఒక్క సారి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని బీఎల్‌ఎఫ్ బలపర్చించిన అసెంబ్లీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గాన్ని 15 ఏళ్లుగా ఎవ రూ పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో గెలిపిస్తే గంధమల్ల రిజర్వాయర్ పూర్తిచేసి, తపాసుపల్లి ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తానన్నారు.
Comments
Please login to add a commentAdd a comment