Aleru constituency
-
ఉద్యమ పతాక.. ఆలేరు
యాదాద్రి: నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాడంలో భూమి, భుక్తి, విముక్తి కోసం పోరు నడిపిన గడ్డ, మహిళా చైతన్యానికి ప్రతీక, మలిదశ తెలంగాణ ఉద్యమానికి దక్షిణ తెలంగాణలోనే పెట్టనికోట ఆలేరు. ఈ నియోజకవర్గం నిత్య చైతన్యంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు, కళలు, సాహిత్యం, సాంస్కృతిక, క్రీడా రంగాలకు నిలయం. ఇక్కడి ఓటరు తీర్పు విలక్షణం. ఈ నియోజకవర్గంలో ఐదు సార్లు మహిళా ఎమ్మెల్యేలు గెలుపొందారు. ఇక్కడి నుంచి మోత్కుపల్లి నర్సింహులు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది.. పలుమార్లు మంత్రిగా పని చేశారు. ఆలేరుకు ప్రత్యేక స్థానం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం కలిగి ఉంది. 1952లో ఏర్పాటైన నియోజకవర్గం జనరల్ కేటగిరీ నుంచి 1978లో ఎస్సీ రిజర్వ్డ్ చేయబడింది. 2009లో జనరల్ కేటగిరిలోకి మారింది. నల్లగొండ, సిద్దిపేట, మేడ్చల్, జనగామ, సూర్యాపేట, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో ఉన్న ఈ నియోజకవర్గంలో ఆలేరు, యాదగిరిగుట్ట, రాజాపేట, తుర్కపల్లి, మోటకొండూరు, బొమ్మలరామారం, గుండాల, ఆత్మకూర్(ఎం) మండలాలు ఉన్నాయి. భౌగౌళికంగానూ.. ఓటర్ల సంఖ్యా పరంగా ఆలేరు అతిపెద్ద నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2,27,738 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,14,388 మంది పురుషులు, 1,13,332 మంది మహిళలు, 18 మంది ఇతరులు ఉన్నారు. 1952 నుంచి 2018 వరకు 16 సార్లు జరిగిన ఎన్నికల్లో పీడీఎఫ్ రెండు సార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ ఐ ఐదు సార్లు, టీడీపీ మూడుసార్లు, టీఆర్ఎస్ నాలుగు సార్లు, ఇండిపెండెంట్ ఒకసారి గెలుపొందారు. పాడి పంటలకు నెలవు పాడి పంటలకు నెలవు ఆలేరు. ఇక్కడి రైతులు సాగర్ ఆయకట్టు సమానంగా ధాన్యం పండిస్తారు. పత్తి కూడా అధికంగా పండుతుంది. దేవా దుల, బునాదిగాని కాల్వలతోపాటు బోరు బావులపై ఆధారపడి పంటలు సాగు చేస్తారు. పాడి పరిశ్రమ, నేత, గీత వృత్తులు ప్రధానం. ఇక్కడి నుంచి పనుల కోసం హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన గంధమల్ల రిజర్వాయర్ పూర్తయితే సాగునీటికి ఢోకా ఉండదు. ఎమ్మెల్యేలుగా ఆరుట్ల దంపతులు ఆలేరు ప్రాంతంలో తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఆరుట్ల దంపతులు ముందుండి నడిపించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ దంపతులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుంచి మూడుసార్లు వరుసగా గెలపొందారు. ఈమె భర్త ఆరుట్ల రామచంద్రారెడ్డి మెదక్ జిల్లా రామాయంపేట, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుస విజయాల మోత్కుపల్లి.. మోత్కుపల్లి నర్సింహులు ఆలేరు నియోజకవర్గంలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలుగుదేశం ఆవిర్భావంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన మోత్కుపల్లి నర్సింహులు ఎన్టీఆర్ మంత్రివర్గంలో గనులు, భూగర్భ జలవనరులు, సాంఘిక సంక్షేమ, విద్యుత్, పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. టీడీపీ నుంచి మూడుసార్లు ఇండిపెండెంట్‌గా ఒకసారి, కాంగ్రెస్ నుంచి ఒకసారి విజయం సాధించారు. ఆలయాలకు నిలయం.. ఆలేరు నియోజకవర్గానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక ఆలయాల సంపద, తెలంగాణ సాయుధపోరాట నేపథ్యం ఉంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవాలయం, కొలనుపాక జైన దేవాలయం, శ్రీసోమేశ్వరాలయం ఇక్కడి ప్రత్యేకత. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఈ నియోజకవర్గంలోనే ఉంది. తెలంగాణ ప్రభుత్వం రూ.1200 కోట్లతో ఆలయ పునర్నిర్మాణం, విస్తరణ పనులు చేపట్టింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆలయంగా తీర్చిదిద్దింది. తెలంగాణ సాయుధపోరాట సేనానులు ఆరుట్ల కమలాదేవి, రామచంద్రారెడ్డి దంపతులు, రేణికుంట రామిరెడ్డి, కుర్రారం రామిరెడ్డి వంటి వీరులగన్న భూమి ఆలేరు. శాసనసభలో తొలి మహిళా ప్రతిపక్ష నేత ఆరుట్ల కమలాదేవి ఇక్కడివారే కావడం గమనార్హం. -
ఆలేరు తదుపరి అభ్యర్థి ఎవరు?
ఆలేరు నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం నుంచి టిఆర్ ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన గొంగిడి సునీతారెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆమె తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 32062 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఇక్కడ నుంచి ఇండ పిెండెంట్గా పోటీచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు పరాజయం చెందారు. సునీతకు 92813 ఓట్లు రాగా, బిక్షమయ్యకు 60751 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బిఎస్పి అభ్యర్దిగా పోటీ చేసిన కె.రామచంద్రారెడ్డికి సుమారు 12వేల ఓట్లు వచ్చాయి. సునీతా రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందిన నేత. ఆలేరు నియోజకవర్గంలో 2014లో గొంగిడి సునీత, కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 31447 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. బిజెపి-టిడిపి కూటమి పక్షాన పోటీచేసిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుకు 6530 ఓట్లు వచ్చాయి. ఆలేరులో పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ నాలుగుసార్లు గెలిస్తే, ఒకసారి ఇండి పెండెంటు నెగ్గారు. సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులు ఆలేరులో ఐదుసార్లు, తుంగతుర్తిలో ఒకసారి మొత్తం ఆరుసార్లు గెలుపొందారు. నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి కాంగ్రెస్ ఐ తరుపున, మరోసారి ఇండి పెండెంటుగా నెగ్గారు. 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్.టిఆర్ టిడిపి పక్షాన ఉండి, తర్వాత కాంగ్రెస్ ఐలో చేరారు. 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందిన ఈయన తదుపరి కాలంలో టిడిపిలో చేరి తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచారు. తదుపరి ఆయన 2014లో ఖమ్మం జిల్లా మదిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో టిడిపికి దూరం అయి 2019లో బిజెపిలో చేరారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు. గతంలో ఎన్.టి.ఆర్. క్యాబినేట్లో మోత్కుపల్లి పని చేశారు. ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి మూడుసార్లు గెలవగా, ఆమె భర్త భువనగిరిలో ఒకసారి, మెదక్ జిల్లా నుంచి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఒకే సమయంలో శాసనసభలో ఉండడం విశేషం. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్, దేవరకద్రల నుంచి గెలుపొందిన దయాకరరెడ్డి, సీతలకు ఇలాంటి అవకాశం రెండువేల తొమ్మిదిలో దక్కింది. రెండువేల పద్నాలుగులో నల్లగొండ జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలిస్తే, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి గెలుపొంది, తెలంగాణ శాసనసభకు వెళ్లిన జంటగా నమోదయ్యారు. 2004లో గెలిచిన టిఆర్ఎస్ నేత డాక్టర్ నగేష్ టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా రాజీనామాచేసి ఉప ఎన్నికలో పోటీచేసి రెండోసారి గెలిచారు. 2009లో టిఆర్ఎస్ టిక్కెట్ రాలేదు. ఆలేరులో ఏడుసార్లు రెడ్లు ఒకసారి బిసి గెలిచారు. ప్రస్తుతం గెలిచిన సునీత రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
అంబేద్కర్‌లా సీఎం కేసీఆర్‌కు చరిత్రలో స్థానం: మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. దళితబంధు పథకం అమలు చేయడంపై మరో అంబేడ్కర్‌గా పోల్చి చెప్పారు. తన ఆలేరు నియోజకవర్గంలోని వాసాలమర్రిలో దళితబంధు ప్రారంభించడం తనకు చాలా ఆనందంగా ఉందని తెలిపారు. దళితబంధులాంటి పథకం ఎవరు తీసుకురాలేదని.. అంత ధైర్యం ఎవరూ చేయలేదని మోత్కుపల్లి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోత్కుపల్లి మాట్లాడుతూ.. దళితబంధును బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు దేశవ్యాప్తంగా అమలయ్యేలా చూడగలరా..? అని ప్రశ్నించారు. ఢిల్లీకి వెళ్లి దేశమంతా అమలయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ పథకాన్ని ఆపాలని చాలా మంది చూస్తున్నారు, మన మీద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఒక సీనియర్ నాయకుడిగా ఒక రాజకీయ పార్టీకి రాజీనామా చేసి ప్రజల కోసం బయటికి వచ్చినట్లు తెలిపారు. డబ్బు తీసుకుని వస్తా అని చెప్పి తీసుకుని వచ్చిన మొగాడు సీఎం కేసీఆర్ అని ప్రశంసించారు. దళితులు ఇంకా బలహీన వర్గాలుగా ఉంచాలని చాలా మంది కుట్ర చేస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. మరో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌లా సీఎం కేసీఆర్ చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. మరియమ్మ ఘటన అయిన తరువాత కేసీఆర్ ఇలాంటి ఘటనలు జరిగితే తీవ్ర చర్యలు తీసుకుంటామని చెప్పారని గుర్తుచేశారు. అలానే వరంగల్‌లో ఎస్సైపై అత్యాచారం కేసులో వెంటనే చర్యలు తీసుకున్నారని తెలిపారు. ప్రజల కోసం బతికే నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. -
ఆలేరు: పోలింగ్‌కు సర్వం సిద్ధం
సాక్షి, ఆలేరు : పోలింగ్ నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈనెల 7న పోలింగ్ జరగనుం ది. ఇందుకు గాను నియోజకవర్గానికి సంబం ధించి ఈవీఎంలు, వీవీప్యాట్లను ఇండోర్ స్టేడియంలోని ప్రత్యేక రూంలో భద్రపరిచారు. గురువారం ఎన్నికల సామగ్రి, సిబ్బందిని తరలించేం దుకు ఇండోర్ స్టేడియంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఎన్నికల నిర్వహణలో పాల్గొనే సిబ్బందికి శిక్షణ పూర్తయింది. అలాగే ఓటర్ స్లిప్పుల పంపిణీ కూడా పూర్తి చేశారు. 2,09,266 మంది ఓటర్లు.. ఆలేరు నియోజకవర్గంలో 2,09,266 మంది ఓట ర్లు ఉన్నారు. ఇందులో స్త్రీలు 1,04,040 మంది, పురుషులు 1,05,207 మంది, ఇతరులు 19 మంది ఉన్నారు. మొత్తం 303 పోలింగ్ కేంద్రాల ను ఏర్పాటు చేశారు. 360 మంది ఎన్నికల ప్రిసైడింగ్ అధికారులు, 360 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లను నియమించారు. 34 మంది సెక్టోరియల్ అధికారులను నియమించారు. 606 మం ది పీఓలను నియమించగా ఒక్కో పోలింగ్ కేం ద్రంలో ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు విధులు నిర్వహిస్తారు. నియోజకవర్గంలో 37 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. సమస్మాత్మక గ్రామాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహించనున్నారు. డిజిటల్ సర్వేలెన్స్.. నియోజకవర్గంలో అన్ని పోలింగ్ కేంద్రాల్లో డిజిటల్ సర్వేలెన్స్ ద్వారా వీడియో చిత్రీకరణకు వెబ్‌కాస్టింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేశారు. పోలింగ్ సిబ్బందిని సకాలంలో చేరవేసేందుకు వాహనాలను ఏర్పాటు చేశారు. 24 కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 16కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్, 43 కేంద్రాల్లో ఆన్లైన్ రికార్డింగ్, 223 కేంద్రాల్లో ఆన్‌డ్రాయిడ్ మొబైల్ రికార్డింగ్, 25 మంది వీడియోగ్రాఫర్లను నియమించారు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సరళిని పర్యవేక్షించేందుకు మైక్రో అబ్జర్వర్లను నియమించారు. 455 ఈవీఎంలు, 363 వీవీప్యాట్లు, 352 కంట్రోల్ యూనిట్లను ఏర్పాటు చేశారు. దివ్యాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు.. నియోజకవర్గంలో దివ్యాంగ ఓటర్లు 3,592 మంది ఉన్నారు. వీరిని ఎన్నికల రోజున పోలింగ్ కేంద్రానికి తరలించేందుకు 197 ఆటోలను ఏర్పాటు చేశారు. పోలింగ్ స్టేషన్లోకి సులువుగా వెళ్లేందుకు ర్యాంపులను ఏర్పాటు చేశారు. వీరి కోసం వీల్చైర్లను అందుబాటులో ఉంచారు. అంధుల కోసం బ్యాలెట్లో బ్రెయిలీ లిపితో అభ్యర్థుల క్రమసంఖ్యగల కార్డును అమరుస్తారు. వీరు ఓటేసేందుకు సహాయకులను అనుమతిస్తారు. ఒక పోలింగ్ కేంద్రంలో మహిళలకు ప్రత్యేకం.. మహిళల ఓటింగ్ శాతం పెంచేందుకు ఈసారి ప్రయోగాత్మకంగా ఆలేరులోని బాలికల ఉన్నత పాఠశాలలో ఒక మహిళ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో పూర్తిగా మహిళా సిబ్బందినే నియమించారు. దీంతో పాటుగా నియోజకవర్గంలో ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని అన్ని వసతులతో ఆకర్షణీయంగా తీర్చుదిద్దుతారు. పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక సహాయక కేంద్రం ఉంటుంది. మోడల్ పోలింగ్ కేంద్రంలో ఫర్నిచర్, తాగునీరు, దివ్యాంగులు సులువుగా వెళ్లేందుకు ర్యాంపు, మరుగుదొడ్లు, మూత్రశాలలు తదితర సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. బరిలో వీరే.. ఆలేరు శాసనసభ స్థానానికి 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బూడిద భిక్షమయ్యగౌడ్ (కాంగ్రెస్), గొంగిడి సునీత (టీఆర్ఎస్), దొంతిరి శ్రీధర్‌రెడ్డి (బీజేపీ), మోత్కుపల్లి నర్సింహులు (బీఎల్ఎఫ్), కల్లూరి రాంచంద్రారెడ్డి (బీఎస్పీ), కందడి మణిపాల్‌రెడ్డి (తెలుగు కాంగ్రెస్), కొత్త కృష్ణ (అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్), రేగు ఆనంద్ (బీఆర్ఎస్), జన్నె సరిత (ఎస్పీ), గుజ్జుల రాంచంద్రారెడ్డి, బొల్లారం రమేష్, వైల శ్రీనివాస్‌రెడ్డి, మొరిగాడి కృష్ణ, దీరావత్ గోపినాయక్ వీరంతా స్వతంత్రులు. పకడ్బందీగా ఏర్పాట్లు .. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశాం. నూరు శాతం పొలింగ్ నమోదు కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకు ప్రతి పోలింగ్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లను చేశాం. ఎన్నికల విధుల్లో ఉన్న ప్రతి అధికారి వారి పరిధి మేరకు ఎన్నికలు సవ్యంగా జరిగేందుకు తమవంతుగా కృషి చేయాలి. ఓటు హక్కు ఉన్నవారు తప్పనిసరిగా వినియోగించుకోవాలి – మందడి ఉపేందర్‌రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ -
రాజకీయ రంగంలో 'ఆమె'కు అన్యాయమే!
అవనిలో సగభాగమైన అతివలకు రాజకీయ రంగంలో ప్రధాన పార్టీలు మొండి చేయి చూపిస్తున్నాయి.మగవారితో సమానంగా అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. స్థానిక సంస్థల్లో మాత్రం రిజర్వేషన్ ఉంటుంది కనుక కచ్చితంగా మహిళలకు 50శాతం స్థానాలు కేటాయిస్తారు. తప్పని పరిస్థితుల్లో భర్తలు తమ భార్యలను రంగంలోకి దింపుతున్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రధాన పార్టీలు మహిళలను నిర్లక్ష్యం చేశాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాల్లో 202మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే ఈ నియోజకవర్గాల్లో కేవలం 13 మంది మహిళలు మాత్రమే పోటీలో ఉన్నారు. సాక్షి, ఆలేరు : ఆలేరు నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున గొంగిడి సునీత, ఇండిపెండెంట్ అభ్యర్థిగా జన్నె సరిత పోటీ చేస్తుండగా కోదాడ నుంచి నల్లమాద పద్మావతి కాంగ్రెస్ తరఫున, నాగార్జునసాగర్‌లో నివేదితారెడ్డి (బీజేపీ), సౌజన్య బీఎల్ఎఫ్ తరఫున పోటీల్లో ఉన్నారు. అలాగే నల్లగొండ నియోజకవర్గంలో ఇండిపెండెంట్‌గా పర్వీన్, సూర్యాపేటలో ప్రజాబంధు పార్టీ తరఫున పాల్వయి వనజ, హుజూర్‌నగర్‌లో ఇండిపెండెంట్‌గా బానోతు పద్మ, నకిరేకల్‌లో ఎన్సీపీ అభ్యర్థిగా స్వరూపరాణి, తుంగతుర్తిలో టీపీపీఐ అభ్యర్థిగా ఇందిరా, ఎన్జేపీఐ అభ్యర్థిగా పాల్వయి పద్మ, ఇండిపెండెంట్లుగా సృజన, శిల్పలు ఎన్నికల బరిలో నిలిచారు. ఓటర్లుగా మహిళలే అధికం ఉమ్మడి జిల్లాలో పురుషుల కంటే మహిళల ఓట్లే అధికంగా ఉన్నాయి. పురుషులు 12,80,959 స్త్రీలు 12,85,194 ఇతరులు 112 మంది ఉన్నారు. సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో పురుషుల కన్న మహిళలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలో మొ త్తం ఓట్లు 25,66,265 ఓట్లు ఉన్నాయి. నాటినుంచి ఎనిమిది మంది మహిళలే .. 1952 నుంచి 2014 వరకు ఉమ్మడి జిల్లాలో 8 మంది మహిళలు మాత్రమే శాసన సభకు ఎన్నికయ్యారు. వీరిలో ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి, నకిరేకల్ నుంచి మూసాపేట కమలమ్మ, తుంగతుర్తి నుంచి మల్లుస్వరాజ్యం, నల్లగొండ నుంచి గడ్డం రుద్రమాదేవి, భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి, దేవరకొండ నుంచి భారతిరాగ్యానాయక్, ఆలేరు నుంచి గొంగిడి సునీత, కోదాడ నుంచి పద్మావతిలు ఎన్నికయ్యారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు ఆమోదమేదీ..? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి ప్రశ్న : మీరు రాజకీయాల్లోకి ఎలా వచ్చారు? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: చంద్రబాబునా యుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రిగా పనిచేస్తున్న తన భర్త ఎలిమినేటి మాధవరెడ్డి 2000 సంవత్సరంలో మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వద్ద నక్సల్స్ మందుపాతర పేల్చిన సంఘటనలో మృ తిచెందారు. దీంతో రాజకీయంలోకి ప్రవేశించాల్సి వచ్చింది. ప్రశ్న : ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఎలా వచ్చింది? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: 2000 సంవత్సరంలో తన భర్త మాధవరెడ్డి మృతి అనంతరం ప్రజల కోరిక మేరకు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వచ్చింది. ప్రశ్న : మీ పదవీ కాలంలో ఏయే కార్యక్రమాలు నిర్వహించారు? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: తాను మూడుసార్లు భువనగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందాను. నా పదవీకాలంలో నియోజకవర్గంలోని చౌటుప్పల్, బీబీనగర్ మండల పరిషత్ కార్యాలయాలను నిర్మించబడింది. మూసీ పరీవాహక ప్రాంతంలోని శివారెడ్డిగూడెం, గోసుకొండ గ్రామాలకు మూసీ నీటి కాల్వను నిర్మించబడింది. బునాదిగాని, పిలాయిపల్లి కాల్వ నిర్మాణానికి సర్వే చేసి ప్రభుత్వ అనుమతుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. వేలిమినేడులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంతోపాటు మరి రెండు ప్రాంతాల్లో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఏర్పాటు చేశాం. రోడ్లు, పాఠశాల భవనాలను నిర్మించాం. ప్రశ్న : అప్పటి పరిస్థితుల్లో మహిళలకు ఎలాంటి అవకాశాలు లభించాయి? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటి పరిస్థితుల్లో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్ ప్రకారం సీట్లు కేటాయించారు. మహిళలకు పెద్దపీట వేశారు. ప్రశ్న : ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా యి, మహిళలకు అవకాశాలు ఉన్నాయా లేవా? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: ప్రస్తుతం రాజకీయాల్లో అలాగే ఉన్నాయి. మహిళలకు చట్టసభల్లో 33శాతం రిజర్వేషన్ కల్పించాలని బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. కానీ ఇంత వరకు అది జరగడం లేదు. జనాభాలో 50శాతం ఉన్న మహిళలకు ప్రాతినిధ్యం ఉండాలి. ప్రస్తుతం మాత్రం ఫర్వాలేదు. ప్రశ్న : అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలి తేడా ఎలా ఉంది? ఎలిమినేటి ఉమామాధవరెడ్డి: అప్పటికి ఇప్పటికీ ప్రచార శైలిలో చాలా తేడా ఉంది. అప్పట్లో కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చేవారు. రాజకీయాల్లో మనస్ఫూర్తిగా పని చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. మరిన్ని వార్తాలు... -
జాతీయ.. ప్రాంతీయ పార్టీల గుర్తులు
సాక్షి, ఆలేరు : జాతీయ, ప్రాంతీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు మంజూరు చేస్తుంది. అదే విధంగా వివిధ పా ర్టీలకు ఎన్నికల గుర్తులు కేటాయిస్తుంది. ఒక సార్వత్రిక ఎన్నికల్లో ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఏవైనా నాలుగు రాష్ట్రాల్లో ఓట్లలో నాలుగు శాతం సంపాదించ గలిగితే దానిని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తిస్తుంది. ఒక పార్టీ రాష్ట్రం, లేదా ఒక ప్రాంతంలో నాలుగుశాతం ఓట్లు సాధిస్తే దాన్ని ప్రాంతీయ పార్టీగా చెబుతారు. జాతీయ, ప్రాంతీయ పార్టీల ఎన్నికల గుర్తులను కూడా ఎన్నికల సంఘం కేటాయిస్తుంది. సిద్ధాంత రీత్యాగానీ.. వ్యక్తుల వల్లగానీ పార్టీ చీలిపోయినప్పుడు ఆ పార్టీ గుర్తును ఏ వర్గానికి కేటాయించాలన్న వివాదం ఏర్పడ్డ సమయంలో ఎన్నికల సంఘం సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. జాతీయ పార్టీలు.. దేశంలో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఏడు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు ఇతర పార్టీలకు, ప్రాంతీయ పార్టీలకు, స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించదు. దేశంలోని జాతీయ పార్టీలు.. ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, భారతీయ జనతాపార్టీ, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (ఎం), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ , నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ. రిజిస్టర్డ్, అన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు రిజిస్టర్డ్ అన్ రికగ్నైజ్డ్ పార్టీలు కూడా పోటీల్లో ఉంటాయి. ఈ పార్టీలను కొందరు వ్యక్తులు, సంస్థలు పార్టీ పేరుతో ఎన్నికల సంఘంలో నమోదు చేస్తుంటాయి. ఎన్నికల్లో పోటీ చేసినా.. చేయకపోయినా అవి అలాగే కొనసాగుతుంటాయి. ఒక వేళ పోటీ చేసినట్లయితే ఆ పార్టీ అభ్యర్థులకు ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌గా ఉంచే వాటి నుంచి గుర్తులు కేటాయిస్తుంది. అయితే వారికి ఇండిపెండెంట్ అభ్యర్థులకన్నా ముందు గుర్తులు ఎంపిక చేసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రస్తుతం మన దేశంలో సుమారు 1983 రిజిస్టర్డ్, ఆన్ రికగ్నైజ్డ్ పార్టీలు ఉన్నాయి. తెలంగాణలో 73 వరకు ఉన్నాయి. అదే విధంగా 164 ఫ్రీ సింబల్స్‌ను సిద్ధంగా ఉంచుతారు. -
ముహూర్త బలంతో నామినేషన్ల జోరు
సాక్షి, యాదాద్రి : జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. నామినేషన్లు వేయడానికి ఈనెల 19వ తేదీ వరకు గడువు ఉన్నప్పటికీ మంచిరోజు, ముహూర్త బలం బుధవారమే ఉండటంతో భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. భువనగిరి అసెంబ్లీ అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి ఎంవీ భూపాల్‌రెడ్డికి, ఆలేరు అభ్యర్థులు రిటర్నింగ్ అధికారి మందడి ఉపేందర్‌రెడ్డికి తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. నామినేషన్ వేసిన వారు.. భువనగిరి అసెంబ్లీ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి తరఫున ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా కోకన్వీనర్ కొలుపుల అమరేందర్‌తోపాటు మరో ముగ్గురు నామినేషన్ దాఖలు చేశారు. ఇదే స్థానంనుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తరఫున ఆయన కుమార్తె కీర్తిరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె వెంట అభ్యర్థి అనిల్‌కుమార్‌రెడ్డితోపాటు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి, మాజీ జెడ్పీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి, డీసీసీ మాజీ అధ్యక్షుడు గర్ధాసు బాలయ్య ఉన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్యగౌడ్ నామినేషన్ వేశారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు జనగాం ఉపేందర్‌రెడ్డి, కొలుపుల హరినాథ్, కట్టెగొమ్ముల సాగర్‌రెడ్డి ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి తరఫున మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈనెల 12న నా మినేషన్ల ప్రారంభమైన తొలిరోజునే ఆమె స్వ యంగా వచ్చి నామినేషన్ దాఖలు చేసిన విష యం తెలిసిందే. అలాగే బీఎల్ఎఫ్ అభ్యర్థి మో త్కుపల్లి నర్సింహులు నామినేషన్ వేశారు. ఆయన వెంట గీరెడ్డి ముకుందారెడ్డి, కైరంకొండ శ్రీదేవి, ఆంజనేయులు ఉన్నారు. బీజేపీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట కావటి సిద్ధిలింగం, తునికి దశరథ ఉన్నారు. అదే విధంగా నకిరేకల్ కాంగ్రెస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్య, టీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం తరఫున ఆయన సతీమణి పుష్ప నకిరేకల్‌లో నామినేషన్లు వేశారు. జన సమీకరణతో మనోసారి నామినేషన్లు.. మంచి ముహూర్తం ఉందన్న కారణంతో బుధవారం సాదాసీదాగా నామినేషన్లు వేసిన ప్రధాన పార్టీల అభ్యర్థులు భారీ జన సమీకరణ మధ్య మరోసారి నామినేషన్లు వేయడానికి సిద్ధమవుతున్నారు. భువనగిరిలో ఈనెల 16న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, 19న పైళ్ల శేఖర్‌రెడ్డి నామినేషన్లు వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.బీజేపీ మద్దతుతో రంగంలోకి దిగబోతున్న యువతెలంగాణ పార్టీ అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి సైతం భారీ ఎత్తున నామినేషన్ వేయడానికి సిద్ధం అవుతున్నారు. ఆలేరులో బీఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు ఈ నెల 17న, కాంగ్రెస్ అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్ 19న భారీ ర్యాలీలు, బహిరంగ సభలను నిర్వహించడానికి సమాయత్తం అవుతున్నారు. మొదలైన రాజకీయం ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారు కావడం, నామినేషన్లు వేస్తుండడంతో జిల్లా రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రెండు నెలలుగా ప్రచారంలో ఉన్న టీఆర్ఎస్కు తమ పోటీ అభ్యర్థులు ఎవరో తెలియకపోవడంతో కొనసాగిన టెన్షన్‌కు తెర దించుతూ కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఆయా పార్టీలు ప్రకటించాయి. కాం గ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంలో జరిగిన జాప్యంతో ఒక దశలో కాంగ్రెస్ శ్రేణులు స్తబ్దుగా ఉన్నాయి.కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు పోటాపోటీగా ప్ర చారానికి పదునుపెడుతున్నాయి. ఆయా పార్టీల్లోని అసంతృప్తివాదులను తమ వైపు తిప్పుకోవడానికి రెండు పార్టీలు గాలం వేస్తున్నాయి. ఇందుకోసం అవసరమైన అన్ని రకాల చర్యలకు శ్రీకారం చుట్టాయి.సామాజిక వర్గాల సమీకరణలు, తెరపైన ఇంటింటి ప్రచారం, ఆశీర్వాద సభలు, ఆత్మీయ సమ్మేళనాలు, బైక్ ర్యాలీలు నిర్వహిస్తున్న పార్టీలు తెర చాటున సభలు, సమావేశాలతో తమ వైపుకు ఓటర్లను ఆకర్షించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. భువనగిరి టీఆర్ఎస్ అభ్యర్థి పైళ్ల శేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అందెల లింగంయాదవ్ను తనవైపు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు. ఇదిలా ఉండగా ఆలేరు నియోజకవర్గంలోటీఆర్ఎస్ పార్టీకి చెందిన తుర్కపల్లి జెడ్పీటీసీ ఆపార్టీని వీడుతున్నట్లు సమాచారం. అయితే ఆమెతోపాటు మరికొందరు ముఖ్య నాయకులను కాంగ్రెస్‌లో చేర్చుకోవడానికి ఆపార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆలేరు నియోజకవర్గంలో ఇప్పటికే టీఆర్ఎస్లోకి పెద్ద ఎత్తున కాంగ్రెస్, టీడీపీలకు చెందిన నాయకులు చేరారు. భువనగిరి నియోజకవర్గంలో టీఆర్ఎస్లోని అసంతృప్తి నాయకులను తమ వైపు తిప్పుకోవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంది. -
పారిశ్రామికవాడగా మారుస్తా
సాక్షి,మోటకొండూర్ : ఆలేరును పారిశ్రామిక వాడగా తయారు చేయటమే లక్ష్యంగా పనిచేస్తానని భారతీయ జనతా పార్టీ ఆలేరు నియోజకవర్గ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం మండలంలోని తన సొంత గ్రామం అయిన ఇక్కుర్తి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమాన్ని ప్రా రంభించారు. ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు పీసరి తిరుమలరెడ్డి ఆధ్వర్యంలో ఇక్కుర్తి, మాటూర్, అమ్మనబోలు గ్రామాల్లో మాట్లాడుతూ గత ఎమ్మెల్యేలు నియోజకవర్గం అన్ని వసరులు కలిగినా హైదరాబాద్‌కు అతిసమీపంలో ఉన్నా ఎలాంటి అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఆలేరు నియోజకవర్గల కన్వీనర్ కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు భానోతు శత్రునాయక్, జిల్లా కార్యదర్శి బొబ్బలి ఇం ద్రారెడ్డి, శిరిగె శ్రీనివాస్, కిసాన్‌మోర్చ జిల్లా అధ్యక్షుడు బొట్టు అబ్బ య్య, బీసీ మోర్చ జిల్లా అధ్యక్షులుæ బడుగు జహంగీర్, జోరుక ఎల్లేష్, సిరబో యిన మల్లేష్, మల్లేష్, శ్రీను పాల్గొన్నారు. మార్పు కోసం వస్తున్నాం.. యాదగిరిగుట్ట : అభివృద్ధిలో వెనుకబడిన ప్రజల్లో మార్పు తీసుకురావడానికి వస్తున్న బీజేపీని ఒక్క సారి ఆశీర్వదించండి అని ఆ పార్టీ ఆలేరు అసెంబ్లీ అభ్యర్థి దొంతిరి శ్రీధర్‌రెడ్డి అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల్లో మార్పు తీసుకువచ్చి వారిని చైతన్యం చేయడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. అనంతరం ఆర్యవైశ్య యువజన సంఘం మండల అధ్యక్షుడు బెలిదె అశోక్ కుమార్, కళ్లెం మహేష్, రచ్చ భరత్, మిట్ట ప్రసాద్, గుజ్జ శేఖర్‌తో పాటు మాసాయిపేటకు చెం దిన 100 మంది యువకులు బీజేపీలో చేరారని వెల్లడించారు.బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రాఘవుల నరేందర్, మండల అధ్యక్షుడు రచ్చ శ్రీని వాస్, ప్రధాన కార్యదర్శి రాయగిరి రాజు, తొడిమే రవీందర్‌రెడ్డి, రంగ సత్యం, భాస్కర్‌రెడ్డి, చిత్తర్ల కృష్ణ, రొయ్యల నగేష్, బాలస్వామి, ప్ర శాంత్, శ్రీశైలం, ఠాగూర్ నవీన్, రాము, కోల అనిల్ పాల్గొన్నారు. బీజేపీతోనే అభివృద్ధి తుర్కపల్లి : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి దొంతురి శ్రీధర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానికంగా బీజేపీ మండల కార్యాలయాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన నిధులతో రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ మోదీని కించపరుస్తున్నారని తెలి పారు. కానుగంటి శ్రీనివాస్‌రెడ్డి, రావుల నరేందర్, యాట పెంటయ్య, కొక్కొండ లక్ష్మీనారాయణ, శత్రునాయక్, శేఖర్‌యాదవ్, మల్లేశ్‌యాదవ్, ఆకుల సైదులు, రమేశ్ పాల్గొన్నారు. -
గోదావరి జలాల సాధనే లక్ష్యం
సాక్షి,తుర్కపల్లి : ఆలేరుకు గోదావరి జలాల సాదనే తన లక్ష్యమని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.గురువారం తుర్కపల్లి మండలంలో రుస్తాపూర్, జాలబావి తండా, చౌక్లతండా, పీర్యతండా, మోతీరాంతండా, రామోజీనా యక్‌తండా, పల్లెపహాడ్, గొల్లగూడెం గ్రామాల్లో పర్యటించి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గం నుంచి పలుమార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేశానని తెలిపారు.తలాపున తపాస్‌పల్లి రిజర్వాయర్ పారుతున్నా స్థానిక ఎమ్మెల్యేలు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ప్రతి తెల్ల రేషన్‌కార్డు ఉన్న లబ్ధిదారుడికి నెలకు 5 వేల రూపాయలు ఇచ్చే విధంగా తన వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గజం ఉప్పలయ్య, గ్రామ, మండల స్థాయి నాయకులు మ«ధుసూదన్రెడ్డి, మారగోని శ్రీరాంమూర్తి, మహేశ్, జహంగీర్, మోత్కుపల్లి రఘు, సీతానారాయణ, కోట భిక్షపతి, బొల్లారం జగదీశ్, పాముల రాజు, బోరెడ్డి జానార్దన్‌రెడ్డి, ఎడవల్లి మైసయ్య, మోత్కుపల్లి రవి తదితరులు పాల్గొన్నారు. చివరి పోటీ.. అవకాశం ఇవ్వండి: యాదగిరిగుట్ట : నా రాజకీయ జీవితంలో ఇవే నా చివరి ఎన్నికలు.. ఆలేరు నియోజకవర్గ ఓటర్లంతా ఒక్క సారి అవకాశం ఇచ్చి తనను గెలిపించాలని బీఎల్ఎఫ్ బలపర్చించిన అసెంబ్లీ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. యాదగిరిగుట్ట మండలం గౌరాయపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఆలేరు నియోజకవర్గాన్ని 15 ఏళ్లుగా ఎవ రూ పట్టించుకోకపోవడంతో అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులే నేటికీ కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఎన్ని కల్లో గెలిపిస్తే గంధమల్ల రిజర్వాయర్ పూర్తిచేసి, తపాసుపల్లి ప్రాజెక్టు ద్వారా ఆలేరు నియోజకవర్గానికి గోదావరి జలాలు తీసుకువస్తానన్నారు. -
మిషన్’ ముమ్మరం
రూ.800 కోట్లతో‘మిషన్ భగీరథ’ పనులు భువనగిరి, ఆలేరు సెగ్మెంట్ల పరిధిలోని ఐదు లక్షల మందికి తాగునీరు ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి జలాలు అందించేందుకు చర్యలు భువనగిరి: ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భువనగిరి, ఆలేరు నియో జకవర్గాల్లోని ఐదు లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.800కోట్లతో పనులు చేపట్టారు. ఏప్రిల్ చివరినాటికి ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వ కార్యదర్శులు ఎస్పీ సింగ్, స్మితా సబర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశారు. జిల్లాకు చెందిన రాష్ర్టమంత్రి జి.జగదీష్‌రెడ్డి, భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు ఈ పనులపై సమీక్షలు నిర్వహించారు. భువనగిరి, ఆలేరు సెగ్మెంట్లకు రూ.800 కోట్లు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మంచినీరు అందించడానికి ప్రభుత్వం రూ. 800 కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఒకరికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున రెండు నియోజకవర్గాల్లోని 568 గ్రామాలకు, 5,11,930 మందికి, భువనగిరి మున్సిపాలిటీలో 53,339 మందికి రక్షిత తాగు నీరందిస్తారు. ఇందుకోసం అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, పైప్లైన్లు నిర్మిస్తున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ 900 ఎంఎల్డీల నీరు అందించనున్నారు. ఇందుకోసం 44 ఓహెచ్ఎస్ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్‌లు అవసరం అవుతాయి. ఇప్పటికే 15 ఓహెచ్ఎస్, జీఎల్‌ఎస్‌ఆర్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో 29 నిర్మాణం చేపట్టారు. ఇందులో 24 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందుకోసం 300 కిలోమీటర్ల మేరకు వేసే పైప్‌లైన్ పనుల్లో 50 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ..తెలంగాణ వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా రెండు నియోజకవర్గాలకు తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టును రూపొందించింది. రంగారెడ్డి జిల్లా షామీర్ పేట పరిధిలోని ఘనపూర్ గుట్టపై నున్న ఓహెచ్బీఆర్నుంచి అలియాబాద్, మూడు చింతలపల్లిపల్లి, బొమ్మలరామారం మండలం తూంకుంట, జలాల్పూర్,తుర్కపల్లి మండలం మాదాపూర్ మీదుగా తుర్కపల్లి వరకు పైప్‌లైన్ వేస్తారు. తుర్కపల్లి శివారులోభారీ స్టాక్ పాయింట్ అంటే 50 లక్షల లీటర్ల సామర్థ్య కలిగిన ( బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నిర్మిస్తారు. అక్కడి నుంచి రెండు విభాగాలుగా విభజించి నీటిని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సరఫరా చేస్తారు. భువనగిరి నియోజకవర్గంలో .. తుర్కపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా భువనగిరి మున్సిపాలిటీ, రాయగిరి, ఆత్మకూర్ (ఎం)మండలాలకు ఒకమార్గం, భువనగిరిలోని నల్లగొండ రోడ్డు మీదుగా వలిగొండవరకు ముగ్దుంపల్లి మీదుగా పోచంపల్లి వరకుపైప్లైన్లు వేస్తున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో గల ట్యాంకులను నింపుతారు.అక్కడి నుం చి స్థానిక ప్రచాయతీలు నీటి సరఫరా చేసుకోవాలి.\ఆలేరు నియోజకవ ర్గంలో..తుర్కపల్లి రిజర్వాయర్ నుంచి వెంకటాపురం, దత్తాయపల్లి, బేగంపేట, రేనికుంట మీదుగా రాజాపేట వరకు ఆక్కడి నుంచి యాదగిరిగుట్ట, సైదాపురం గుట్ట, వంగపల్లి మీదుగా ఆలేరు నుంచి గుండాల వరకు రిజర్వాయర్లు, పైప్లైన్లు నిర్మిస్తున్నారు. భూసేకర ణ ఇలా.. పైప్‌లైన్ నిర్మాణం కోసం సింగిల్ రోడ్డు వెంట 25 ఫీట్లు, డబుల్ రోడ్డువెంట 50 ఫీట్ల దూరంలో తవ్వుతారు. ఈ దూరంలో ప్రజలకు సంబంధించిన కట్టడాలు,చెట్లు ఇతరత్రా ఆస్తులు ఉంటే పరిహారం చెల్లిస్తారు. భూమిఅడుగున ఒకటిన్నర లోతులో వేసే పైప్ లైన్‌కు ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు. అయితే భూసేకరణ పేరుతో ఎలాంటి జాప్యం జరుగకుండా చూడాలని రెవెన్యూ, ఆర్‌ఆండ్‌బీ అధికారులకు ఆదేశాలు అందాయి.