మిషన్’ ముమ్మరం
రూ.800 కోట్లతో‘మిషన్ భగీరథ’ పనులు
భువనగిరి, ఆలేరు సెగ్మెంట్ల పరిధిలోని ఐదు లక్షల
మందికి తాగునీరు ఇంటింటికీ నల్లాల ద్వారా గోదావరి జలాలు అందించేందుకు చర్యలు
భువనగిరి: ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన మిషన్‌భగీరథ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భువనగిరి, ఆలేరు నియో
జకవర్గాల్లోని ఐదు లక్షల మంది ప్రజలకు తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.800కోట్లతో పనులు చేపట్టారు. ఏప్రిల్ చివరినాటికి ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీరు అందనుంది. ఈ ప్రాజెక్టు పనులను ప్రభుత్వ కార్యదర్శులు ఎస్‌పీ సింగ్, స్మితా సబర్వాల్ క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేశారు. జిల్లాకు చెందిన రాష్ర్టమంత్రి జి.జగదీష్‌రెడ్డి, భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు ఈ పనులపై సమీక్షలు నిర్వహించారు.
భువనగిరి, ఆలేరు సెగ్మెంట్లకు రూ.800 కోట్లు భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలకు మంచినీరు అందించడానికి ప్రభుత్వం రూ. 800 కోట్లు మంజూరు చేసింది. గ్రామీణ ప్రాంతంలో ఒకరికి 100 లీటర్లు, పట్టణ ప్రాంతాల్లో 135 లీటర్ల చొప్పున రెండు నియోజకవర్గాల్లోని 568 గ్రామాలకు, 5,11,930 మందికి, భువనగిరి మున్సిపాలిటీలో 53,339 మందికి రక్షిత తాగు నీరందిస్తారు. ఇందుకోసం అవసరమైన చోట్ల రిజర్వాయర్లు, పైప్‌లైన్లు నిర్మిస్తున్నారు. దీని ద్వారా ప్రతిరోజూ 900 ఎంఎల్‌డీల నీరు అందించనున్నారు.
ఇందుకోసం 44 ఓహెచ్‌ఎస్‌ఆర్, జీఎల్‌ఎస్‌ఆర్‌లు అవసరం అవుతాయి. ఇప్పటికే 15 ఓహెచ్‌ఎస్, జీఎల్‌ఎస్‌ఆర్‌లు అందుబాటులో ఉన్నాయి. మరో 29 నిర్మాణం చేపట్టారు. ఇందులో 24 పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. ఇందుకోసం 300 కిలోమీటర్ల మేరకు వేసే పైప్‌లైన్ పనుల్లో 50 కిలోమీటర్ల పైప్‌లైన్ పనులు పూర్తయ్యాయి.నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ..తెలంగాణ వాటర్ సప్లై ప్రాజెక్టు ద్వారా రెండు నియోజకవర్గాలకు తాగు నీరు అందించేందుకు ప్రభుత్వం ప్రాజెక్టును రూపొందించింది.
రంగారెడ్డి జిల్లా షామీర్ పేట పరిధిలోని ఘనపూర్ గుట్టపై నున్న ఓహెచ్‌బీఆర్‌నుంచి అలియాబాద్, మూడు చింతలపల్లిపల్లి, బొమ్మలరామారం మండలం తూంకుంట, జలాల్‌పూర్,తుర్కపల్లి మండలం మాదాపూర్ మీదుగా తుర్కపల్లి వరకు పైప్‌లైన్ వేస్తారు. తుర్కపల్లి శివారులోభారీ స్టాక్ పాయింట్ అంటే 50 లక్షల లీటర్ల సామర్థ్య కలిగిన ( బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) నిర్మిస్తారు. అక్కడి నుంచి రెండు విభాగాలుగా విభజించి నీటిని ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు సరఫరా చేస్తారు. భువనగిరి నియోజకవర్గంలో .. తుర్కపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా భువనగిరి మున్సిపాలిటీ, రాయగిరి, ఆత్మకూర్ (ఎం)మండలాలకు ఒకమార్గం, భువనగిరిలోని నల్లగొండ రోడ్డు మీదుగా వలిగొండవరకు ముగ్దుంపల్లి మీదుగా పోచంపల్లి వరకుపైప్‌లైన్లు వేస్తున్నారు. ఆయా మండలాల్లోని గ్రామాల్లో గల ట్యాంకులను నింపుతారు.అక్కడి నుం చి స్థానిక ప్రచాయతీలు నీటి సరఫరా చేసుకోవాలి.\ఆలేరు నియోజకవ ర్గంలో..తుర్కపల్లి రిజర్వాయర్ నుంచి వెంకటాపురం, దత్తాయపల్లి, బేగంపేట, రేనికుంట మీదుగా రాజాపేట వరకు ఆక్కడి నుంచి యాదగిరిగుట్ట, సైదాపురం గుట్ట, వంగపల్లి మీదుగా ఆలేరు నుంచి గుండాల వరకు రిజర్వాయర్‌లు, పైప్‌లైన్లు నిర్మిస్తున్నారు.
భూసేకర ణ ఇలా..
పైప్‌లైన్ నిర్మాణం కోసం సింగిల్ రోడ్డు వెంట 25 ఫీట్లు, డబుల్ రోడ్డువెంట 50 ఫీట్ల దూరంలో తవ్వుతారు. ఈ దూరంలో ప్రజలకు సంబంధించిన కట్టడాలు,చెట్లు ఇతరత్రా ఆస్తులు ఉంటే పరిహారం చెల్లిస్తారు. భూమిఅడుగున ఒకటిన్నర లోతులో వేసే పైప్ లైన్‌కు ఎలాంటి నష్టపరిహారం చెల్లించరు. అయితే భూసేకరణ పేరుతో ఎలాంటి జాప్యం జరుగకుండా చూడాలని రెవెన్యూ, ఆర్‌ఆండ్‌బీ అధికారులకు ఆదేశాలు అందాయి.