‘మిషన్ భగీరథ’ పనుల పురోగతిపై సమీక్షిస్తున్న సీఎం కేసీఆర్. చిత్రంలో మంత్రి జూపల్లి, పరమేశ్వరన్ అయ్యర్, సీఎస్ ఎస్పీ సింగ్, రాజీశ్ శర్మ
► నిర్ణీత సమయంలో ‘భగీరథ’ పూర్తి చేస్తాం
► రాష్ట్రంలోని ప్రతి పల్లెకు మంచి నీరు ఇస్తాం: కేసీఆర్
► ఇంటింటికీ ఇంటర్నెట్ సేవలు అందించనున్నాం
► సీఎంతో కేంద్ర బృందం భేటీ
► ‘భగీరథ’ అద్భుత పథకమన్న కేంద్ర బృందం
సాక్షి, హైదరాబాద్: పంచాయతీరాజ్ వ్యవస్థలోని అన్ని అంచెలను పటిష్టంగా అమలుచేస్తే గ్రామీణ వ్యవస్థ అభివృద్ధిలో పురోగమిస్తుందని ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలను తాగునీటి సమస్య నుంచి విముక్తి చేస్తామని..ఇందుకోసం మిషన్ భగీరథ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. ‘భగీరథ’ పైపులతోపాటు ఇంటర్నెట్ కేబుల్ వేసి, ఇంటింటికీ ఇంటర్నెట్‌ను అందించనున్నామని తెలి పారు. మిషన్ భగీరథతో పాటు రాష్ట్రంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల పనితీరును పరిశీలిం చేందుకు కేంద్ర తాగునీటి సరఫరా, గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కార్యదర్శి పరమేశ్వరన్ అయ్యర్ ఆధ్వ ర్యంలోని బృందం రాష్ట్రానికి వచ్చింది. గురువారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో మర్యాద పూర్వకం గా భేటీ అయింది. ఈ భేటీలో తాగునీటి సరఫరాకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు.
దేశంలోనే ఇది అద్భుతం: మిషన్ భగీరథ పథకం దేశంలోనే అద్భుతమైన పథకమని, ఇది దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని పరమేశ్వరన్ అయ్యర్ పేర్కొన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించి వచ్చిన అనంతరం ప్రధాని మోదీ స్వయంగా తమకు ఈ విషయాన్ని చెప్పారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గ్రామీణ నీటి సరఫరా కార్యాచరణను పరిశీలించడానికి తాము వచ్చామన్నారు. మిషన్ భగీరథ నిర్మాణ పనులతో పాటు పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు తీరుపై జిల్లా కలెక్టర్లతో పరమేశ్వరన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి తెలుసుకున్నారు.
పనులు పూర్తయి పథకం అమల్లోకి వస్తే..తాగునీటిని అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తుందన్నారు. రాష్ట్రంలోని 1,041 ఫ్లోరైడ్ బాధిత గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీటిని అందిస్తున్నందుకు కేంద్రం ఇవ్వా ల్సిన రూ.800 కోట్ల నిధులను త్వర లో విడుదల చేస్తామన్నారు. పనులు పూర్తయిన తర్వాత ఇన్సెంటీవ్‌గా మరిన్ని నిధులను అందిస్తామన్నారు. వివిధ దేశాల్లో తాగునీటి సరఫరా కోసం అక్కడి ప్రభుత్వాలు చేపడుతున్న కార్య క్రమాలను సీఎంకు వివరించిన అయ్యర్... చైనా, వియత్నాం, కెనడా వంటి దేశాలు కూడా ఇంత పకడ్బందీగా అమలు పర్చలేకపోయాయన్నారు. కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, జగదీశ్ రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.