ఆలేరు నియోజకవర్గం
ఆలేరు నియోజకవర్గం నుంచి టిఆర్ ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన గొంగిడి సునీతారెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆమె తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 32062 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఇక్కడ నుంచి ఇండ పిెండెంట్‌గా పోటీచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు పరాజయం చెందారు. సునీతకు 92813 ఓట్లు రాగా, బిక్షమయ్యకు 60751 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బిఎస్పి అభ్యర్దిగా పోటీ చేసిన కె.రామచంద్రారెడ్డికి సుమారు 12వేల ఓట్లు వచ్చాయి. సునీతా రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందిన నేత.
ఆలేరు నియోజకవర్గంలో 2014లో గొంగిడి సునీత, కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 31447 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. బిజెపి-టిడిపి కూటమి పక్షాన పోటీచేసిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుకు 6530 ఓట్లు వచ్చాయి. ఆలేరులో పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్‌ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్‌ఎస్ నాలుగుసార్లు గెలిస్తే, ఒకసారి ఇండి పెండెంటు నెగ్గారు. సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులు ఆలేరులో ఐదుసార్లు, తుంగతుర్తిలో ఒకసారి మొత్తం ఆరుసార్లు గెలుపొందారు.
నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి కాంగ్రెస్ ఐ తరుపున, మరోసారి ఇండి పెండెంటుగా నెగ్గారు. 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్.టిఆర్ టిడిపి పక్షాన ఉండి, తర్వాత కాంగ్రెస్ ఐలో చేరారు. 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందిన ఈయన తదుపరి కాలంలో టిడిపిలో చేరి తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచారు. తదుపరి ఆయన 2014లో ఖమ్మం జిల్లా మదిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో టిడిపికి దూరం అయి 2019లో బిజెపిలో చేరారు. ఆ తర్వాత టిఆర్‌ఎస్‌లో చేరారు.
గతంలో ఎన్.టి.ఆర్. క్యాబినేట్‌లో మోత్కుపల్లి పని చేశారు. ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి మూడుసార్లు గెలవగా, ఆమె భర్త భువనగిరిలో ఒకసారి, మెదక్ జిల్లా నుంచి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఒకే సమయంలో శాసనసభలో ఉండడం విశేషం. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్, దేవరకద్రల నుంచి గెలుపొందిన దయాకరరెడ్డి, సీతలకు ఇలాంటి అవకాశం రెండువేల తొమ్మిదిలో దక్కింది.
రెండువేల పద్నాలుగులో నల్లగొండ జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలిస్తే, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి గెలుపొంది, తెలంగాణ శాసనసభకు వెళ్లిన జంటగా నమోదయ్యారు. 2004లో గెలిచిన టిఆర్‌ఎస్ నేత డాక్టర్ నగేష్ టిఆర్‌ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా రాజీనామాచేసి ఉప ఎన్నికలో పోటీచేసి రెండోసారి గెలిచారు. 2009లో టిఆర్‌ఎస్ టిక్కెట్ రాలేదు. ఆలేరులో ఏడుసార్లు రెడ్లు ఒకసారి బిసి గెలిచారు. ప్రస్తుతం గెలిచిన సునీత రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు.
ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment