gongidi sunitha reddy
-
నాకున్న ఇబ్బంది ఒక్కటే !..రేపు కేసీఆర్ గారినే నేరుగా అడుగుతా
-
ఆలేరు తదుపరి అభ్యర్థి ఎవరు?
ఆలేరు నియోజకవర్గం ఆలేరు నియోజకవర్గం నుంచి టిఆర్ ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన గొంగిడి సునీతారెడ్డి రెండోసారి విజయం సాదించారు. ఆమె తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 32062 ఓట్ల ఆదిక్యతతో గెలుపొందారు. ఇక్కడ నుంచి ఇండ పిెండెంట్గా పోటీచేసిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నరసింహులు పరాజయం చెందారు. సునీతకు 92813 ఓట్లు రాగా, బిక్షమయ్యకు 60751 ఓట్లు వచ్చాయి. ఇక్కడ నుంచి బిఎస్పి అభ్యర్దిగా పోటీ చేసిన కె.రామచంద్రారెడ్డికి సుమారు 12వేల ఓట్లు వచ్చాయి. సునీతా రెడ్డి సామాజికవర్గం పరంగా రెడ్డి వర్గానికి చెందిన నేత. ఆలేరు నియోజకవర్గంలో 2014లో గొంగిడి సునీత, కాంగ్రెస్ సిటింగ్ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్‌పై 31447 ఓట్ల ఆదిక్యతతో విజయం సాధించారు. తెలంగాణ ఉద్యమ ప్రభావం ఇక్కడ స్పష్టంగా కనిపించింది. బిజెపి-టిడిపి కూటమి పక్షాన పోటీచేసిన డాక్టర్ కాసం వెంకటేశ్వర్లుకు 6530 ఓట్లు వచ్చాయి. ఆలేరులో పిడిఎఫ్ రెండుసార్లు, కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఐదుసార్లు, టిడిపి మూడుసార్లు, టిఆర్ఎస్ నాలుగుసార్లు గెలిస్తే, ఒకసారి ఇండి పెండెంటు నెగ్గారు. సీనియర్ నేత మోత్కుపల్లి నర్శింహులు ఆలేరులో ఐదుసార్లు, తుంగతుర్తిలో ఒకసారి మొత్తం ఆరుసార్లు గెలుపొందారు. నాలుగుసార్లు టిడిపి పక్షాన, ఒకసారి కాంగ్రెస్ ఐ తరుపున, మరోసారి ఇండి పెండెంటుగా నెగ్గారు. 1995లో టిడిపి చీలిక సమయంలో ఎన్.టిఆర్ టిడిపి పక్షాన ఉండి, తర్వాత కాంగ్రెస్ ఐలో చేరారు. 1999లో కాంగ్రెస్ ఐ పక్షాన గెలుపొందిన ఈయన తదుపరి కాలంలో టిడిపిలో చేరి తుంగతుర్తి నుంచి ఒకసారి గెలిచారు. తదుపరి ఆయన 2014లో ఖమ్మం జిల్లా మదిర నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత కాలంలో టిడిపికి దూరం అయి 2019లో బిజెపిలో చేరారు. ఆ తర్వాత టిఆర్ఎస్లో చేరారు. గతంలో ఎన్.టి.ఆర్. క్యాబినేట్లో మోత్కుపల్లి పని చేశారు. ఆలేరు నుంచి ఆరుట్ల కమలాదేవి మూడుసార్లు గెలవగా, ఆమె భర్త భువనగిరిలో ఒకసారి, మెదక్ జిల్లా నుంచి మరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. వీరిద్దరూ ఒకే సమయంలో శాసనసభలో ఉండడం విశేషం. కాగా మహబూబ్‌నగర్ జిల్లాలో మక్తల్, దేవరకద్రల నుంచి గెలుపొందిన దయాకరరెడ్డి, సీతలకు ఇలాంటి అవకాశం రెండువేల తొమ్మిదిలో దక్కింది. రెండువేల పద్నాలుగులో నల్లగొండ జిల్లాకే చెందిన మాజీ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలిస్తే, ఆయన సతీమణి పద్మావతి కోదాడ నుంచి గెలుపొంది, తెలంగాణ శాసనసభకు వెళ్లిన జంటగా నమోదయ్యారు. 2004లో గెలిచిన టిఆర్ఎస్ నేత డాక్టర్ నగేష్ టిఆర్ఎస్ తెలంగాణ వ్యూహంలో భాగంగా రాజీనామాచేసి ఉప ఎన్నికలో పోటీచేసి రెండోసారి గెలిచారు. 2009లో టిఆర్ఎస్ టిక్కెట్ రాలేదు. ఆలేరులో ఏడుసార్లు రెడ్లు ఒకసారి బిసి గెలిచారు. ప్రస్తుతం గెలిచిన సునీత రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు. ఆలేరు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ప్రభుత్వ విప్ గొంగిడి సునీతకు కరోనా
సాక్షి, యాదాద్రి భువనగిరి: ప్రాణాంతక కరోనా వైరస్ రాజకీయ నాయకులను నీడలా వెంటాడుతోంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా బారిన పడుతున్న రాజకీయ నేతల సంఖ్య పెరుగుతోంది. వరుస పెట్టి నాయకులు కరోనా బారిన పడుతున్నారు. వీరిలో టీఆర్ఎస్ నాయకులే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్‌కు కరోనా సోకిన విషయం తెలిసిందే. అయితే హోంశాఖ మంత్రి కరోనా నుంచి కోలుకుని సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. తాజాగా మరో టీఆర్ఎస్ నాయకురాలు కరోనా బారిన పడ్డారు. (గుండెపోటుతో మరో డీఎస్పీ మృతి) ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వం విప్ గొంగిడి సునీత కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇటీవల ఆమెకు కరోనా లక్షణాలు కనిపించడంతో వైద్యం నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఈ క్రమంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా తేలినట్లు శుక్రవారం వైద్యులు తెలిపారు. దీంతో సునీత అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. (తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌కు కరోనా) అయితే ఎమ్మెల్యే సునీత ఇటీవల తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో ఆమెతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అంతేగాక ఆమె భర్త, నల్గొండ డీసీసీబీ ఛైర్మన్ గొంగిడి మహేందర్‌రెడ్డికి కూడా కరోనా టెస్టులు నిర్వహించారు. ఫలితం ఇంకా రావాల్సి ఉంది. కాగా కరోనా బారిన పడిన మొదటి టీఆర్ఎస్ మహిళా నాయకురాలు సునీతానే. ఇప్పటి వరకు టీఆర్ఎస్లో ఏడుగురికి కరోనా సోకింది. (కరోనా నుంచి కోలుకున్న మహమూద్ అలీ) -
ప్రభుత్వానికి విరాళంగా వృద్ధాశ్రమం
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పెద్దకొండూరులో నిర్మించిన మేరెడ్డి సత్యనారాయణరెడ్డి జానకమ్మ వానప్రస్థాశ్రమాన్ని ఆశ్రమ నిర్వాహకులు ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు మేరెడ్డి సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతులు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావును గురువారం కలిసి పూర్తి వివరాలు అందిం చారు. ‘ఎకరంన్నర భూమిలో 6 వేల చదరపు అడుగుల భవనాన్ని సొంత ఖర్చులతో నిర్మిం చాం. అనారోగ్యం కారణంగా భవనంతో పాటు పూర్తి ఆశ్రమాన్ని ప్రభుత్వానికి విరాళం గా ఇవ్వడంతో వృద్ధులకు సేవలు కొనసాగేలా చూడాలి’అని కేటీఆర్‌ను కోరారు. ఈ అంశం పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో మాట్లాడతారని కేటీఆర్ చెప్పారు. వృద్ధ దంపతులు ప్రారంభించిన సేవా కార్యక్రమాన్ని కొనసాగించేలా ప్రభుత్వం నుంచి అవసరమైన సహాయం అందేలా చూస్తామని దంపతులకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌తో కేటీఆర్ మాట్లాడారు. వృద్ధ దంపతుల సేవా దృక్పథాన్ని, దాతృత్వాన్ని కేటీఆర్ కొనియాడారు. -
రైతు సంక్షేమమే కేసీఆర్ లక్ష్యం
సందర్భం పంటకు గిట్టుబాటు ధరలేక, అప్పు కట్టలేక, విల విలలాడిన రైతు కళ్లలో ఇప్పుడు మార్పును చూస్తున్నాం. ఒకవైపు సాగునీళ్ళు, మరొక వైపు కరెంట్‌పై ఆశలు వదులుకున్న రైతు, నేడు గుండెనిండా ధైర్యంతో వ్యవసాయం చేసుకునే రోజులు వచ్చాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా రైతు కావడంతో వారి సమస్యలపై పూర్తిగా అవగాహన ఉంది. దేశంలో ఎక్కడాలేని విధంగా కొత్త తరహా రైతు పథకాలు ప్రవేశ పెట్టి రైతుల ఆదాయం పెంపు దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ గుణాత్మక మార్పులతో రైతులకు భరోసా ఇస్తున్న తెలంగాణ వ్యవసాయ అనుకూల పథకాలను దేశవ్యాప్తంగా ఆర్థికరంగ నిపుణులు, మేధా వులు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొనియాడుతున్నాయి. ఇటీవల ఓ రైతును కలిశాను. వ్యవసాయం దండుగ అని హైదరాబాద్‌లో కూలీ పని చేసుకుంటున్న ఆ రైతు తన జీవితంలో వచ్చిన మార్పు గురించి చెబుతుంటే నా కళ్లు చెమర్చాయి. ఆ సంభాషణ మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను రాజాపేట దగ్గర ఓ ఊరికి వెళ్తూ బొందుగుల వద్ద ఓ వ్యక్తిని చూసి ‘నేను ఎవరో తెలుసా’అని అడిగా. ఆయన తెలుసు ‘‘మీరు గొంగిడి సునీతమ్మవు’’ కదా అన్నాడు. అతడితో పది నిమిషాలు మాట్లాడా. తన పేరు యాదగిరి అనీ, వ్యవసాయం చేస్తుంటాననీ చెప్పాడు. ‘ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పెట్టుబడి సాయం ఎలా ఇస్తే బాగుంటుందని అడిగా. తహసీల్దార్ ద్వారానా, వ్యవసాయాధికారి ద్వారానా, లేక నగదు రూపంలో ఇస్తే బాగుంటుందా’ అని అడిగా. ‘ఎలా ఇచ్చినా సాయం చేస్తున్నాడు సంతోషం’ అన్నాడు. అయితే, వ్యవసాయం మానేసి ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ పోయి ఉప్పల్‌లో కూలీ పని చేసుకునేవాడిననీ, భార్య ఇళ్లలో పనిచేసేదని చెప్పాడు. ‘ముఖ్య మంత్రిగా కేసీఆర్ వచ్చినంక కరెంట్ మంచి గిస్తుండు. పోయినేడు, అంతకు ముందేడు, మొన్నేడు బొందుగుల చెరువుల నీళ్లు నింపిండ్రని తెలిసింది. కేసీఆర్సారు పెట్టుబడి సాయం కూడా ఇస్తుండని తెలిసింది. అప్పుడే బాకి ఎట్లన్న గడతనని ధైర్యం చేసి ఊర్లకొచ్చిన. వచ్చి పదిహేను రోజులైంది,ఇల్లు బాగుచేసుకున్న. ఎనిమిదేండ్ల కింద ఇడిచి పెట్టిన యవసాయం మళ్లీ మొదలు పెడుతున్న. బోర్ల బాయిల నీళ్ళు ఉన్నయి, పొద్దున్నే ట్రాక్టర్ మాట్లాడిన, రేపు వస్తనన్నాడు. ఇయాల మోటరు తెచ్చుకునేందుకు భువనగిరికిపోతున్న..’అని ఆనందంగా చెప్పాడు. ‘మోటరుకు పైసలు కావాలే కదా’ అని అడిగా. తనకు తెలిసిన అతడు ఉన్నాడనీ, ఇప్పటికైతే తీసుకొస్తననీ చెబుతూ ‘పైసలు తొందరగా ఇప్పియాలమ్మా, నీకు దండం పెడుతా’ అనుకుంటూ అటుగా వస్తున్న ఆటోను ఆపి వెళ్లిపోయిండు. అతని మాటల్లో ఒక ధైర్యం, గర్వం కనిపించాయి. రైతురుణమాఫీని విడిగా చూడకుండా, సమగ్ర వ్యవసాయ వ్యూహంలో భాగంగా చూసినవారికి దాని ప్రాధాన్యం అర్థమవుతుంది. ఆర్థికవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు తమ పరిధిలోనే ఆలోచిస్తారు. కానీ పాలకులు మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని పరిష్కారాలు అన్వేషిస్తారు. ముఖ్యమంత్రి వ్యవసాయరంగ వ్యూహం ఈ విధంగా రూపొందినదే. రైతులకు అవసరమైన నీటి వసతి, విద్యుత్, పెట్టుబడి, యంత్రాలు, గిడ్డంగులు, మార్కెట్ సౌకర్యం, పంటకు మద్దతు ధర మొదలైనవి అందించడంతోపాటు, రైతు సమన్వయ సమితుల ఏర్పాటు ద్వారా పంటవేయడం మొదలుకొని మార్కెటింగ్ కొరకు పకడ్బందీ వ్యవస్థ నిర్మాణం సాగుతున్నది. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే రైతులకు 17 వేల కోట్లతో రుణ మాఫీ చేశారు. 2009 నుంచి 2014 సమయంలో సంభవించిన అనేక నష్టాలకు సాయం చేసి ఆదుకున్నారు. ఇప్పుడు రైతు సమన్వయ సమితులు ఏర్పాటు చేసి అనునిత్యం రైతు లకు దగ్గరగా ఉంటూ, వారికి కావాల్సిన అవసరాలను తీర్చుతూ సలహాలు, సూచనలు అందించే విధంగా రైతులతోనే గ్రామాలలో కమిటీలు ఏర్పాటు చేశారు. వ్యవసాయక్షేత్రంలో మంచిచెడులను చర్చించుకుని, అధికారుల సలహాలతో ముందుకు కదిలేందుకు రైతువేదికలను ఏర్పాటు చేసి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణాధికారిని నియమించారు. మట్టి నమూనాలను పరీక్షించేందుకు ఆధునిక సాంకేతిక పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ధరను నిర్ణయించే హక్కును రైతులకు ఇవ్వాలన్నదే కేసీఆర్ సంకల్పం. అవసరమైన చోట శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ వ్యవసాయ పనిముట్లు కూడా అందించి పంట కాలనీలను ఏర్పాటుచేయడం, రైతన్న ఏ పంట వేసుకున్నా ఆ పంటకు డిమాండ్ తగ్గకుండా చేయాలని కేసీఆర్ సంకల్పించారు. రైతు సంపన్నుడై అంతిమంగా అప్పులు లేని దశకు చేరుకోవాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యం. వ్యాసకర్త ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత -
అమ్మ దేవత వంటిది: విప్ సునీత
యాదగిరిగుట్ట: సృష్టిలో అమ్మ దేవతవంటిది ప్రభుత్వ విప్ గొంగిడి సునీత అన్నారు. మాతృదినోత్సవం సందర్భంగా ఆదివారం నల్లగొండ జిల్లా యాదగిరిగుట్టలోని తన నివాసంలో ఆమె కేక్ కేట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... అమ్మలేని సృష్టి ఊహించలేనిదని ఆమె అన్నారు. దేవత వంటి అమ్మను నేడు పిల్లలు రోడ్డున పడేస్తున్నారని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పరిస్థితి రాకుండా అమ్మను ప్రేమగా చూసుకోవాలని ఆమె సూచించారు. -
హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
భువనగిరి : సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతారెడ్డి కోరారు. గురువారం స్థానిక రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 3వ తేదీన రంగారెడ్డి జిల్లా చిలుకూరులో 3.30 గంటలకు హరితహారం మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభిస్తారన్నారు. ఈనెల 5వ తేదీన ఆలేరు నియోజకవర్గంలోని యాదగిరిగుట్టలో మొక్క లు నాటే కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ పాల్గొంటారని తెలిపారు. నేడు అటవీ విస్తీర్ణం తగ్గిపోయి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగాయని పేర్కొన్నారు. అడవుల పెంపకం ద్వారా వాతావరణంలో చల్లదనాన్ని పెంచడంతో పాటు సమాజంలో సమస్యగా మారిన కోతులను తిరిగి అడవులకు పంపవచ్చన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో మొక్కలు నాటడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలతో పాటు, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, వాణిజ్య వర్గాలు, కంపెనీలు హరితహారంలో పాల్గొం టాయని వివరించారు. తెలంగాణ వ్యాప్తంగా వరుసగా మూడు సంవత్సరాల్లో 2. 30 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. అన్ని నర్సరీల్లో మొక్కలు పంపకానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఆలేరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 33 వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు చెప్పారు. ఇందుకోసం 17 రకాల 67 లక్షల మొక్కలు సిద్ధంగా ఉన్నాయన్నారు. -
వీఐపీ రిపోర్టర్ : ఎమ్మెల్యే గొంగిడి సునీతా రెడ్డి