వరంగల్ తూర్పు నియోజకవర్గం
వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన నన్నపునేని నరేందర్ విజయం సాదించారు. వరంగల్ మేయర్‌గా ఉన్న నరేందర్ 2018లో అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది పి.రవిచంద్రపై 28142 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తొలిసారి నరేందర్ గెలు పొందారు. ఆయనకు 82461 ఓట్లు రాగా, రవిచంద్రకు 54225 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన కె.సతీష్‌కు సుమారు 4700 ఓట్లు వచ్చాయి. నన్నపునేని నరేందర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు.
2014లో మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్‌ఎస్‌లో చేరి అప్పట్లో మంత్రిగా ఉన్న బసవరాజు సారయ్యను 55085 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సురేఖ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఉమ్మడి ఏపిలో 2009 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత, రోశయ్య మంత్రి వర్గంలో ఉంటూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు మద్దతుగా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో కొంతకాలం కీలక నేతగా ఉన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు గాను ఆమెపై అనర్హత వేటు పడిరది. తదుపరి పరకాలకు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి సుమారు 1500 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తదుపరి తెలంగాణ అంశంలో జగన్ తో వచ్చిన విబేధాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటపడి మళ్లీ కాంగ్రెస్ ఐ లో చేరారు.
అక్కడ ఇమడలేక 2014 ఎన్నికల ముందు టిఆర్‌ఎస్‌లో చేరి వరంగల్ తూర్పు సీటును తీసుకుని గెలుపొందారు. ఒకప్పుడు ఈమెకు టిఆర్‌ఎస్ నాయకులకు, కెసిఆర్‌కు ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది ఆమె ఈ పార్టీ లోకి వచ్చి గెలుపొందడం విశేషం. గతంలో ఆమె శాయంపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాని ఆ నియోజకవర్గం 2009లో రద్దు అయింది.బసవరాజు సారయ్య మూడుసార్లు ఎన్నికయ్యారు. రజక వర్గానికి చెందిన సారయ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు.
వరంగల్‌లో ఒకసారి గెలిచిన టి. పురుషోత్తంరావు గతంలోవర్ధన్నపేట నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంటుగా గెలిచిన బి. నాగభూషణరావు 1983, 85లలో టిడిపి తరుపున గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు ఎమ్.ఎస్.రాజలింగం ఇక్కడ ఒకసారి, చిల్లంచెర్లలో మరోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన మీర్జాబేగ్, మరోసారి హనుమకొండలో నెగ్గారు.
పురుషోత్తంరావు గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలోమంత్రిగా ఉండగా, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రిమోట్‌ఏరియా అభివృద్ధి కమిటీ ఛ్కెర్మన్ పదవి ఇచ్చారు. వరంగల్ , వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో కలిపి ఒకసారి రెడ్డి, ఆరుసార్లు బిసి నేతలు,ఐదుసార్లు బ్రాహ్మణ, ఒకసారి వెలమ,ఒకసారి ముస్లిం,ఒకసారి కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment