Warangal East Assembly Constituency
-
వరంగల్ తూర్పు: త్రిముఖ పోటీ! కానీ బీఆర్ఎస్కు ఆయనే మైనస్సా?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఓరుగల్లు జిల్లా రాజకీయంగా ఉద్యమాల పరంగా వ్యాపార వాణిజ్య పరంగా వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు కేంద్ర బిందువుగా మారుతూ వస్తుంది. 2023 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధన్యతను సంతరించుకున్నాయి. ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖపోటీ ఉన్నట్టుగానే ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది. అయితే ఇక్కడ ఓ వాదన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పిస్తేనే బీఆర్ఎస్కు ఫలితం దక్కుతుందని ఆపార్టీ నాయకులే భావిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు : వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పద్మశాలి, మైనారిటీ దళితులు ఎవరికి మద్దతు ఇస్తారో ఆ అభ్యర్థి గెలుపు ఖాయం. తూర్పు నియోజకవర్గం జనరల్ స్థానం. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న ఆజంజాహి మిల్లు పోయింది. ఇక ఎక్కువగా దినసరి కూలీలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటే కచ్చితంగా అది అమలు అయ్యి తీరుతుంది. రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య సయోధ్య ఉందన్న నమ్మకంతో పాటు మణిపూర్ ఘటనలు దళితులను మైనారిటీ ముస్లింలను కొంత కలవరపెడుతుంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా చూపెడుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్ధులు : వరంగల్ తూర్పు నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ ఢంక మోగించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు వన్‌సైడ్‌గా పడుతాయని ఓ ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచినప్పటికీ వరంగల్ నియోజకవర్గం మారలేదు. దీంతో ప్రజల్లో పార్టీ పట్ల కొంత అసహనం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హేమా హేమీ నాయకులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుండి శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి లాంటి వారు టికెట్ కోసం ప్రయత్నం చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుండి కొండ సురేఖ తోపాటు డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజెపి నుండి రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు ఘంటా రవికుమార్ పోటీకి సిద్దమయ్యారు. వృత్తిపరంగా ఓటర్లు.. ఈ నియోజకవర్గంలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు భౌగోళిక పరిస్థితులు.. నగరంతో పాటు శివారు కాలనీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు ఉన్న ఖిల్లావరంగల్ కోట ఉంది. ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల, 1100కోట్లతో 24అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నదులు అడవులు కొండలు లేవు.. కానీ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల మద్య భద్రకాళి అమ్మవారు ఆలయంతోపాటు చెరువు ఉంటుంది. నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు : ప్రధానంగా డ్రైనేజ్ మంచినీటి సమస్యలు నగర ప్రజలను వేధిస్తున్నాయి. వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు వచ్చి నగరంతోపాటు పలుకాలనీలు జలమయం అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ మేయర్ గా ఎమ్మెల్యేగా వరంగల్ నగరంతో పాటు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. కానీ చెప్పేవి మాత్రం కొండంతలు.నరేందర్ శాసనసభ్యులు గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు ఉన్నాయి. -
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో నెక్స్ట్ లీడర్ ఎవరు..?
వరంగల్ తూర్పు నియోజకవర్గం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీచేసిన నన్నపునేని నరేందర్ విజయం సాదించారు. వరంగల్ మేయర్‌గా ఉన్న నరేందర్ 2018లో అసెంబ్లీకి పోటీచేసి విజయం సాధించారు. ఆయన తన సమీప కాంగ్రెస్ ఐ ప్రత్యర్ది పి.రవిచంద్రపై 28142 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. తొలిసారి నరేందర్ గెలు పొందారు. ఆయనకు 82461 ఓట్లు రాగా, రవిచంద్రకు 54225 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిజెపి పక్షాన పోటీచేసిన కె.సతీష్‌కు సుమారు 4700 ఓట్లు వచ్చాయి. నన్నపునేని నరేందర్ మున్నూరు కాపు వర్గానికి చెందినవారు. 2014లో మాజీ మంత్రి కొండా సురేఖ టిఆర్ఎస్లో చేరి అప్పట్లో మంత్రిగా ఉన్న బసవరాజు సారయ్యను 55085 ఓట్ల ఆధిక్యతతో ఓడిరచారు. సురేఖ రాజకీయ జీవితం అనేక మలుపులు తిరిగింది. ఉమ్మడి ఏపిలో 2009 లో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అనూహ్య మరణం తర్వాత, రోశయ్య మంత్రి వర్గంలో ఉంటూ వై.ఎస్.రాజశేఖరరెడ్డి కుమారుడు జగన్‌కు మద్దతుగా పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్‌లో కొంతకాలం కీలక నేతగా ఉన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై వచ్చిన అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇచ్చినందుకు గాను ఆమెపై అనర్హత వేటు పడిరది. తదుపరి పరకాలకు జరిగిన ఉప ఎన్నికలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పక్షాన పోటీచేసి సుమారు 1500 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. తదుపరి తెలంగాణ అంశంలో జగన్ తో వచ్చిన విబేధాల కారణంగా ఆ పార్టీ నుంచి బయటపడి మళ్లీ కాంగ్రెస్ ఐ లో చేరారు. అక్కడ ఇమడలేక 2014 ఎన్నికల ముందు టిఆర్ఎస్లో చేరి వరంగల్ తూర్పు సీటును తీసుకుని గెలుపొందారు. ఒకప్పుడు ఈమెకు టిఆర్ఎస్ నాయకులకు, కెసిఆర్‌కు ఉప్పు, నిప్పుగా ఉండేది. అలాంటిది ఆమె ఈ పార్టీ లోకి వచ్చి గెలుపొందడం విశేషం. గతంలో ఆమె శాయంపేట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. కాని ఆ నియోజకవర్గం 2009లో రద్దు అయింది.బసవరాజు సారయ్య మూడుసార్లు ఎన్నికయ్యారు. రజక వర్గానికి చెందిన సారయ్య ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో స్థానం పొందారు. వరంగల్‌లో ఒకసారి గెలిచిన టి. పురుషోత్తంరావు గతంలోవర్ధన్నపేట నుంచి రెండుసార్లు విజయం సాధించారు. 1962లో ఇండిపెండెంటుగా గెలిచిన బి. నాగభూషణరావు 1983, 85లలో టిడిపి తరుపున గెలుపొందారు. ప్రముఖ స్వాతంత్య్ర యోధుడు ఎమ్.ఎస్.రాజలింగం ఇక్కడ ఒకసారి, చిల్లంచెర్లలో మరోసారి గెలిచారు. ఇక్కడ ఒకసారి గెలిచిన మీర్జాబేగ్, మరోసారి హనుమకొండలో నెగ్గారు. పురుషోత్తంరావు గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి ప్రభుత్వంలోమంత్రిగా ఉండగా, రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక, రిమోట్ఏరియా అభివృద్ధి కమిటీ ఛ్కెర్మన్ పదవి ఇచ్చారు. వరంగల్ , వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో కలిపి ఒకసారి రెడ్డి, ఆరుసార్లు బిసి నేతలు,ఐదుసార్లు బ్రాహ్మణ, ఒకసారి వెలమ,ఒకసారి ముస్లిం,ఒకసారి కమ్మ సామాజికవర్గం నేతలు గెలిచారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..