ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఓరుగల్లు జిల్లా రాజకీయంగా ఉద్యమాల పరంగా వ్యాపార వాణిజ్య పరంగా వరంగల్ జిల్లా ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఆరు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో వరంగల్ తూర్పు కేంద్ర బిందువుగా మారుతూ వస్తుంది. 2023 లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలు రాజకీయంగా ప్రాధన్యతను సంతరించుకున్నాయి. ప్రతిసారి వరంగల్ తూర్పులో త్రిముఖపోటీ ఉన్నట్టుగానే ఈసారి కూడా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్యనే త్రిముఖ పోటీ ఉండబోతోంది. అయితే ఇక్కడ ఓ వాదన ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేను తప్పిస్తేనే బీఆర్‌ఎస్‌కు ఫలితం దక్కుతుందని ఆపార్టీ నాయకులే భావిస్తున్నారు. కానీ అధిష్టానం మాత్రం ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ కట్టబెట్టింది. దాంతో ఇక్కడ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది.
ఎన్నికలను ప్రభావితం చేసే కీలక అంశాలు :
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పద్మశాలి, మైనారిటీ దళితులు ఎవరికి మద్దతు ఇస్తారో ఆ అభ్యర్థి గెలుపు ఖాయం. తూర్పు నియోజకవర్గం జనరల్ స్థానం. ఇక్కడ పరిశ్రమలు లేవు. ఉన్న ఆజంజాహి మిల్లు పోయింది. ఇక ఎక్కువగా దినసరి కూలీలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ప్రజలు మార్పు కోరుకుంటే కచ్చితంగా అది అమలు అయ్యి తీరుతుంది. రాష్ట్రంలో కేంద్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య సయోధ్య ఉందన్న నమ్మకంతో పాటు మణిపూర్ ఘటనలు దళితులను మైనారిటీ ముస్లింలను కొంత కలవరపెడుతుంది. ఈ ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా చూపెడుతుంది.
ప్రధాన పార్టీల అభ్యర్ధులు :
వరంగల్ తూర్పు నియోజకవర్గం మొదటి నుండి కాంగ్రెస్ కంచుకోట. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండుసార్లు టీఆర్ఎస్ అభ్యర్థులు విజయ ఢంక మోగించారు. ఇక్కడ మైనార్టీ ఓట్లు వన్‌సైడ్‌గా పడుతాయని ఓ ప్రచారం ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి రెండుసార్లు శాసనసభ్యులుగా గెలిచినప్పటికీ వరంగల్ నియోజకవర్గం మారలేదు. దీంతో ప్రజల్లో పార్టీ పట్ల కొంత అసహనం ఉంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో హేమా హేమీ నాయకులు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీ నుండి శాసన మండలి డిప్యూటీ వైస్ చైర్మన్ బండా ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, రోడ్డు భవనాల శాఖ చైర్మన్ మెట్టు శ్రీనివాస్, మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి లాంటి వారు టికెట్ కోసం ప్రయత్నం చేయగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌కే టికెట్ దక్కింది. ఇక కాంగ్రెస్ నుండి కొండ సురేఖ తోపాటు డిసిసి అధ్యక్షులు ఎర్రబెల్లి స్వర్ణ సైతం టిక్కెట్ ఆశిస్తున్నారు. బిజెపి నుండి రాష్ట్రమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు తో పాటు ఘంటా రవికుమార్ పోటీకి సిద్దమయ్యారు.
వృత్తిపరంగా ఓటర్లు..
ఈ నియోజకవర్గంలో దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు
భౌగోళిక పరిస్థితులు..
నగరంతో పాటు శివారు కాలనీలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రపంచ పర్యాటక కేంద్రంగా పేరు ఉన్న ఖిల్లావరంగల్ కోట ఉంది. ఎంజీఎం ఆసుపత్రితో పాటు కాకతీయ మెడికల్ కళాశాల, 1100కోట్లతో 24అంతస్తులతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మిస్తున్నారు. నదులు అడవులు కొండలు లేవు.. కానీ వరంగల్ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల మద్య భద్రకాళి అమ్మవారు ఆలయంతోపాటు చెరువు ఉంటుంది.
నియోజకవర్గం గురించిన ఆసక్తికర అంశాలు :
ప్రధానంగా డ్రైనేజ్ మంచినీటి సమస్యలు నగర ప్రజలను వేధిస్తున్నాయి. వర్షం వస్తే వణుకుపుట్టించేలా వరదలు వచ్చి నగరంతోపాటు పలుకాలనీలు జలమయం అవుతున్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే నరేందర్ మేయర్ గా ఎమ్మెల్యేగా వరంగల్ నగరంతో పాటు నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. కానీ చెప్పేవి మాత్రం కొండంతలు.నరేందర్ శాసనసభ్యులు గా గెలిచి నాలుగు సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క అభివృద్ధి పని కూడా పూర్తిచేయలేదనే విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment