లక్ష్మీపంప్‌హౌస్‌లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్లు.. కొత్తవాటికి ఆర్డర్‌? | Kaleshwaram Project 6 New Motors Ordered For Laxmi Pump House | Sakshi
Sakshi News home page

Laxmi Pump House: లక్ష్మీపంప్‌హౌస్‌లో పూర్తిగా దెబ్బతిన్న ఆరు మోటార్లు.. కొత్తవాటికి ఆర్డర్‌?

Published Wed, Aug 10 2022 10:26 AM | Last Updated on Wed, Aug 10 2022 10:31 AM

Kaleshwaram Project 6 New Motors Ordered For Laxmi Pump House - Sakshi

కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధి లక్ష్మీపంప్‌హౌస్‌లోకి గత నెల 14న వరద నీరు చేరి రక్షణ గోడ కూలి మోటార్లు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం డీవాటరింగ్‌ ప్రక్రియ పూర్తయింది. పంప్‌హౌస్‌లోకి తాత్కాలికంగా నిచ్చెనలు తయారు చేసి కూలీలు, ఇంజనీర్లు దిగుతున్నారు. దీంతో పంప్‌హౌస్‌లో మొత్తం 17 మోటార్లు, పంపులకు గాను ఆరు మోటార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు సమాచారం. దీంతో ఫిన్‌లాండ్, ఆస్ట్రియా దేశాలకు ఆరు మోటార్ల కోసం సీడీఓ (సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌)కు డిజైన్స్‌ పంపినట్లు తెలిసింది.

ఇంజనీరింగ్‌ అధికారులంతా అదేపనిలో పడ్డట్లు సమాచారం. ఇక్కడి ఇంజనీర్లు మోటార్లకు సంబంధించిన కంపెనీలకు చెందిన విదేశాల్లోని నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలియవచ్చింది. మిగతా మోటార్లలో ఐదు వరకు.. ఉన్న స్థానం నుంచి పక్కకు జరిగి వంగినట్లు చెబుతున్నారు. మరికొన్ని మోటార్లు పాక్షికంగా చెడిపోయినట్లు సమాచారం. రక్షణ గోడ పూర్తిగా నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఫోర్‌బేకు పంప్‌హౌస్‌ మధ్యలో పొడవునా మళ్లీ పూర్తిగా నిర్మాణం చేయడానికి డిజైన్స్‌ రెడీ చేసినట్లు తెలిసింది. కాగా, వర్షాకాలం కావడంతో గోడ నిర్మాణం సాధ్యం కాదని, వరద తగ్గుముఖం పట్టిన తర్వాత చేపట్టనున్నారని ఇంజనీర్లు చెబుతున్నారు. 

కాళేశ్వరంలో గోదావరి ఉధృతి 
తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి.  కాళేశ్వరం వద్ద గోదావరి 11.70 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తోంది. 7.30 లక్షల క్యూసెక్కుల నీరు లక్ష్మీబ్యారేజీకి తరలిపోతోంది. ములుగు జిల్లా పేరూరు వద్ద సాయంత్రానికి గోదావరి నీటిమట్టం 14 మీటర్లకు చేరింది. పూసూరు బ్రిడ్జి వద్ద గోదావరి పరవళ్లు తొక్కుతోంది. టేకులగూడెం గ్రామ చివరన 163 నంబర్‌ జాతీయ రహదారి మునిగిపోవడంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement