Heavy floods
-
కిల్లర్స్.. గెటౌట్!
వాలెన్సియా: ఇటీవలి వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వాలెన్సియా నగరంలో స్పెయిన్ రాజ దంపతులకు చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం వరద బాధిత ప్రాంతంలో పర్యటనకు వచి్చన రాజు ఫిలిప్ పైకి వరద బాధితులు బురద విసురుతూ దూషించారు. వాలెన్సియా శివారులోని పైపోరా్టకు చేరుకున్న సమయంలో రాజు వెంట ఉన్న ప్రభుత్వాధికారులు స్థానికులతో మాట్లాడుతుండగా, కొందరు బిగ్గరగా ‘గెటౌట్! గెటౌట్!, కిల్లర్స్!’అంటూ కేకలు వేశారు. రాచకుటుంబీకులు, అధికారులపైకి గుడ్లు, బురద విసిరేందుకు ప్రయతి్నంచగా రక్షక సిబ్బంది గొడుగులతో వారిని కాపాడారు. పోలీసులు నిరసనకారులను వెనక్కి నెట్టేశారు. ఈ సమయంలో కింగ్ ప్రశాంతంగా బాధితులతో సంభాíÙంచేందుకు ప్రయతి్నంచారు. ఓ వ్యక్తి ఆయన భుజంపై తల ఆనించి, రోదించారు. రాజు వెంట రాణి లెటిజియా, వాలెన్సియా ప్రాంత ప్రెసిడెంట్ కార్లో మజోన్ ఉన్నా రు. గ్లవుజులతోపాటు ముంజేతిపై పడిన బురదతోనే రాణి స్థానికులతో మాట్లాడారు. ప్రధాని పెడ్రో సాంచెజ్ రాజు వెంట ఉన్నదీ లేనిదీ తెలియరాలేదు. ఇటీవలి భీకర వరదల్లో 200మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే. ముందస్తు హెచ్చరికలు చేయడంలో ప్రభుత్వం విఫలమవ్వడం వల్లే ఇంతటి స్థాయిలో నష్టం జరిగిందని జనం ఆగ్రహంతో ఉన్నారు. -
ఇదేమీ రాజకీయ సభకాదు.. సాయం చేసేందుకు వచ్చిన ప్రభం‘జనం’
స్పెయిన్‌లో ఇటీవలి భారీ వర్షాలు, వరదల్లో 210 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, చాలా మంది జాడ తెలియకుండా పోయారు. ఒక్క వలెన్సియాలోనే 155 మంది చనిపోయారు. సునామీ స్థాయిలో సంభవించిన తుపాను కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించడం తెలిసిందే. ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున సహాయక పనులకు చేపట్టింది. వేలాదిగా ఆర్మీని రంగంలోకి దించింది. వరదలతో దెబ్బతిన్న వలెన్సియా నగర వీధుల్లో పేరుకుపోయిన బురదను తొలగిస్తున్న ప్రజలు..సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటామంటూ స్వచ్ఛందంగా తరలివచ్చిన వారితో శుక్రవారం వలెన్సియాలోని సిటీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ కల్చరల్ కాంప్లెక్స్ ఆవరణ కిక్కిరిసిపోయిందిలా..! స్పెయిన్‌ను వణికించిన వరదలుభారీ వర్షంతో ఆకస్మికంగా సంభవించిన వరదలతో స్పెయిన్ అతలాకుతలమైంది. తూర్పు, దక్షిణ స్పెయిన్‌లో భారీ వర్షాలు పడటంతో వరదలు వచ్చాయి. తద్వారా భారీ సంఖ్యలో కుటుంబాలు వీధిన పడ్డాయి. వందల సంఖ్యలో మరణాలు చోటు చేసుకున్నాయి.ఆకస్మిక భారీ వరదలకు మృత్యువాత పడ్డ వారి సంఖ్య 210కి చేరింది. మృతదేహాలను సహాయ బృందాలు వెలికి తీయగా, శిథిలాలుగా మారిన ఇళ్లు, బురదలో మునిగిన వీధులు.. గల్లంతు అయిన వారి కోసం బంధువులు పడే ఆందోళనలతో ఎక్కడ చూసినా విషాద ఛాయలే కనిపిస్తున్నాయి. -
వరద గుప్పిట్లో బెంగళూరు
-
శ్రీవారి మెట్లమార్గం మూసివేత
-
అన్నిటికీ అదే ‘పదివేలు’.. కష్టాలు వేనవేలు
పొద్దున్నే పనులకు వెళ్లిపోవడం, సాయంత్రానికి ఇల్లు చేరి కుటుంబమంతా సంతోషంగా గడపడం.. నిత్యం జరిగేది ఇదే. కానీ ఒక్క రాత్రితో అంతా కకావికలమైపోయింది. మున్నేరు వర దతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని, అన్నీ వదిలేసి పరుగులు పెట్టాల్సి వచ్చింది.. వరద తగ్గాక వచ్చి చూస్తే.. బియ్యం, ఉప్పు, పప్పు ఏదీ లేదు.. టీవీ, ఫ్రిడ్జ్, బైక్, ఇతర సామగ్రి ఏదీ మిగల్లేదు.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. ఇంట్లో ఏమీ మిగల్లేదు.. పునరావాస కేంద్రాల్లో పెట్టింది తినడం, కన్నీటితో ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడటమే మిగిలింది. ప్రభుత్వమేమో ‘లెక్క’ తేల్చి సాయం చేస్తామంటూ సర్వే మొదలుపెట్టింది. ఇప్పటికే వరద ముంచి మూడు రోజులైంది. సర్వే తేలేసరికి మరో 2,3 రోజులూ అవుతుంది. పైగా ప్రభుత్వం ఇస్తామంటున్నది రూ.10 వేలు. నిండా మునిగిపోయిన తమకు ఈ సాయంతో ఏమాత్రం ఉపశమనం ఉంటుందని బాధితులు నిలదీస్తున్నారు. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: భారీ వరదలతో ఖమ్మం జిల్లాలో సర్వం కోల్పోయిన మున్నేటి ముంపు బాధితులు తీవ్ర ఆందోళనలో పడిపోతున్నారు. వేలాది మంది పునరావాస కేంద్రాల్లో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేదు. వరదల్లో మునిగిన ఇళ్లలో ఏమీ మిగల్లేదు. ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ముంపు వివరాల లెక్క తేల్చేందుకు సర్వే చేపటింది. అది ముగిశాక బాధితుల బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేల చొప్పున జమ చేస్తామని ప్రకటించింది. దీనిపై బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరదలతో ఇప్పటికే మూడు రోజులు గడిచిందని, సర్వే పూర్తయి, డబ్బులు వచ్చేవరకు మరికొన్ని రోజులు పడుతుందని.. అప్పటివరకు ఎలా బతకాలని వాపోతున్నారు. వినాయక చవితి పండుగకు పస్తులు ఉండేల్సిందేనా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వేతో నిమిత్తం లేకుండా ఇంటింటికి తక్షణ ఆర్థిక సాయం చేస్తే కొంతైనా ఉపశమనం ఉంటుందని అంటున్నారు. సర్వే చేసి ఇస్తామన్న రూ.10 వేలు ఏమాత్రం సరిపోవని.. కనీసం రూ.50 వేలు అందించాలని కోరుతున్నారు. ఖమ్మంలోని స్వర్ణభారతి కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులు సర్వేతో సాయం జాప్యం..వరదలతో మున్నేటి పరీవాహకంలో ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో 10 వేల మంది నిరాశ్రయులయ్యారు. ఇళ్లలో సామగ్రి మొత్తం కొట్టుకుపోయింది. తడిసి పాడైపోయింది. ఈ క్రమంలో ముంపు వివరాల సేకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 1నుంచి ఇంటింటి సర్వే ప్రారంభించింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 14 డివిజన్లతోపాటు ఖమ్మం రూరల్ మండలంలో 250 మంది సిబ్బంది నియమించి.. ఒక్కొక్కరికి 60 నుంచి 70 ఇళ్ల వివరాలు సేకరించే బాధ్యతను అప్పగించింది. వారు ఇంటి యజమాని పేరు, బ్యాంకు ఖాతా, ఫోన్ నంబర్లను సేకరిస్తున్నారు. అయితే సిబ్బంది తక్కువగా ఉండటంతో సర్వే ఆలస్యం అవుతోందని విమర్శలు వస్తున్నాయి. ఎటు చూసినా చెత్తాచెదారం.. దుర్గంధం మున్నేటికి రెండువైపులా 9 కిలోమీటర్ల మేర ఖమ్మం నగరం, ఖమ్మం రూరల్ మండలాల్లో మున్నేరు ముంపు దుర్గంధమయం చేసింది. ఎగువ నుంచి భారీగా వచ్చిన వరదతో.. బురద, చెత్తాచెదారం, కట్టెలు, వ్యర్థాలు కొట్టుకువచ్చి కాలనీలు, ఇళ్లలో చేరాయి. 8 వేలకుపైగా ఇళ్లలో బురద చేరింది. వరద కాస్త తగ్గుముఖం పట్టాక ముంపు ప్రాంతంలోని ఏ కాలనీలో, ఏ ఇంట్లో చూసినా.. బురద, చెత్తాచెదారంతో దుర్వాసన వస్తోంది. వరదలో కొట్టుకొచ్చిన పాములు, తేళ్లు, కప్పలు, ఇతర జంతువుల కళేబరాలు కుళ్లిపోయి మరింత దుర్గంధం వస్తోంది. వరదకు కొట్టుకొచ్చిన పెద్ద దుంగలు, విరిగిపడిన చెట్లు, కరెంటు స్తంభాలు, రేకులు వంటివాటితో రోడ్లు, వీధులన్నీ నిండిపోయి.. అడుగు తీసి అడుగు వేయలేని దుస్థితి నెలకొంది. నెమ్మదిగా పనులు.. నీళ్లు సరిపోక అవస్థలు మున్నేరు ముంపు ప్రాంతాల్లో బురద, చెత్తను జేసీబీలు, ట్రాక్టర్లతో తొలగిస్తూ.. కాలనీల్లో రోడ్లను శుభ్రం చేసేందుకు ట్యాంకర్లు, ఫైరింజన్లను వినియోగిస్తున్నారు. బాధితులకు నీళ్లు అందించేందుకు ట్యాంకర్లు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాతోపాటు నల్లగొండ, వరంగల్ జిల్లాల నుంచి 980 మంది పారిశుధ్య కార్మీకులను కూడా రంగంలోకి దింపారు. కానీ పారిశుధ్య పనుల వేగం సరిపోవడం లేదు. ఇళ్లు, సామగ్రిని శుభ్రం చేసుకోవాలనుకున్నా.. ట్యాంకర్ల నీళ్లు అందడం లేదని బాధితులు వాపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లోనే ట్యాంకర్లు తిరుగుతున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు మొదలు! మున్నేరు లోతట్టు ప్రాంతాలైన.. ఖమ్మం నగరంలోని 14 డివిజన్లలో ఉన్న 40 కాలనీలు, ఖమ్మంరూరల్ మండలంలోని 20 కాలనీల్లో చెత్తాచెదారం మరింత ఎక్కువగా నిండిపోయింది. మురుగు ప్రవహిస్తుండటం, ఇళ్లలో బురద, తడి ఆరకపోవడంతో వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముంపు ప్రాంతాల్లో 13 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. చాలా మంది బాధితులు ఎలర్జీ, చర్మ సంబంధిత ఇబ్బందులు, జ్వరాలతో వస్తున్నార ని వైద్య సిబ్బంది చెప్తున్నారు. సీజనల్ జ్వరాలు, జలుబుకు తోడు ఎక్కువ సమయం కలుషిత నీటిలో గడపడం వల్ల ఎలర్జీలు, చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవారు ఆస్పత్రికి వస్తున్నారని ఇక్కడి ఆరోగ్య కేంద్రంలోని స్టాఫ్ నర్సు మలిదు కృష్ణవేణి వెల్లడించారు. ప్రాణాలు తప్ప ఏమీ మిగల్లేదు ఖమ్మం రూరల్ మండలంలో నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం కాలనీలోని ఓ ఇంట్లో భూక్యా హుస్సేన్ ఆరేళ్లుగా అద్దెకు ఉంటున్నారు. హమాలీ పనిచేస్తూ జీవిస్తున్నారు. గత ఏడాది మున్నేరు వరదల సమయంలో కూతురి పెళ్లి కోసం దాచిపెట్టిన రూ.2లక్షల నగదు, నగలు చోరీకి గురయ్యాయి. ఈసారి వరదల్లో పూర్తిగా నష్టపోయారు. ప్రాణాలు తప్ప ఏమీ మిగలలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సాయం పెంచితేనే ఆదుకున్నట్టు.. ఇంట్లో సమస్తం మున్నేటి పాలయ్యాయి. అద్దె ఇంట్లో ఉంటూ కూలీ పనులకు వెళ్లి జీవించేవాళ్లం. ఇప్పుడు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు వచ్చాం. ఇంటికి వెళ్లి చూస్తే సామాగ్రి ఏదీ కూడా పనికిరాకుండా పోయింది. ప్రభుత్వం తక్షణ సాయం రూ.10 వేలు ఇస్తా మని చెప్పింది. ఆ డబ్బు తిండికి అవసరమైన సరుకులు, పాత్రలు కొనేందుకు కూడా సరిపోవు. రూ.10 వేలు ఇచ్చినా మా కుటుంబం పునరావాస కేంద్రంలోనే ఉండి పొట్ట నింపుకోవాల్సిందే. సాయం పెంచి అందిస్తేనే ఆదుకున్నట్టు అవుతుంది. – బానోతుక్షి్మ, లాల్‌సింగ్ వెంకటేశ్వరనగర్, ఖమ్మంఆర్థిక సాయం త్వరగా ఇవ్వాలివరదతో ఇంట్లో ఏమీ మిగల్లేదు. ప్రభుత్వం ఇస్తామన్న రూ.10 వేల సాయం దేనికి సరిపోదు. వరదతో బెడ్లు, బట్టలు, బియ్యం, సరుకులు అన్నీ కొట్టుకుపోయాయి. ఇంటికి వెళ్లిన తర్వాత మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. ప్రభుత్వం ఆర్థిక సాయం త్వరగా అందజేయాలి. బురదతో నిండిపోయిన ఇళ్లను శుభ్రం చేయించాలి. – మిడిగొడ్డి రాజయ్య, ఆండాళ్లు గోళ్లబజార్, ఖమ్మంఇంత విపత్కర పరిస్థితి ఎన్నడూ చూడలేదు: సర్వే సిబ్బంది మున్నేటి ముంపులో సర్వం కోల్పోయిన వారి వివరాలను సేకరించేందుకు వచ్చిన సిబ్బంది కూడా అక్కడి పరిస్థితులను చూసి చలించిపోతున్నారు. ఖమ్మంరూరల్, వేంసూరు మండలాల్లో ఏఎస్‌ఓలుగా పనిచేస్తున్న వసంత, మరో ఉద్యోగికి సర్వే డ్యూటీ వేశారు. ముంపు ప్రాంతానికి వచ్చినవారు.. తాము 13 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు.వరద తగ్గినా.. బాధలు తగ్గలేదుసూర్యాపేట జిల్లాలో ఇంకా కోలుకోని నాలుగు గ్రామాలు కోదాడ రూరల్/అనంతగిరి (కోదాడ): భారీ వర్షాలతో నీట మునిగిన సూర్యాపేట జిల్లా కోదాడ మండలం తొగర్రాయి, కూచిపూడి, అనంతగిరి మండలంలోని కిష్టాపురం, గోండ్రియా గ్రామాలు ఇంకా కోలుకోలేదు. నాలుగు గ్రామాల్లోనూ ఇళ్లలోని నిత్యావసర వస్తువులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు అన్నీ తడిసి పాడైపోయాయి. వరదల కారణంగా ఇళ్లలో బురద చేరింది. తినడానికి సరైన తిండి లేదని, దుప్పట్లు లేక చలికి వణికిపోతున్నామని బాధితులు వాపోతున్నారు. మరోవైపు గడ్డివాములు కొట్టుకుపోవడం, బురద నీటిలో తడిసి పాడైపోవడంతో.. పశువులకు మేత లేని పరిస్థితి నెలకొందని రైతులు చెబుతున్నారు. తొగర్రాయిలో శివాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలు ఇంకా బురదలోనే ఉన్నాయి. గోండ్రియాల గ్రామంలోని తిరపతమ్మతల్లి, గంగమ్మతల్లి ఆలయం, ప్రభుత్వ పాఠశాల ప్రహరీ, పునాదుల్లోని పిల్లర్లు తేలిపోయేలా కోతకు గురయ్యాయి. -
Heavy Rains: వరద విధ్వంసం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్వర్క్: మూడు రోజుల పాటు కురిసిన కుండపోత వానలు రాష్ట్రంలో విధ్వంసం సృష్టించాయి. వందల గ్రామాలకు వెళ్లే రహదారులు కొట్టుకుపోయాయి. అనేక చోట్ల చెరువులు, కాలువలకు గండ్లు పడ్డాయి. లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఏకబిగిన కురిసిన వానలతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తడంతో వేలాది ఇళ్లు నీటమునిగాయి. సామగ్రి, నిత్యావసరాలు పాడైపోయాయి. ద్విచక్రవాహనాలు, కార్లు దెబ్బతిన్నాయి. సోమవారం మధ్యాహ్నం సమయానికి వర్షాలు తగ్గుముఖం పట్టినా.. వరదలు ఇంకా తగ్గలేదు. ఈ క్రమంలో పోలీసులు, డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఖమ్మం జిల్లాలో తొలిసారిగా డ్రోన్ల సాయంతో వరదలో చిక్కుకున్న ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. భారీ వర్షాలతో ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో ఎక్కువ నష్టం జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు కలసి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లాల ఇన్చార్జి మంత్రులు తమ జిల్లాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి.. 4వేల మందిని వాటిలోకి తరలించారు. ఖమ్మం సర్వం మున్నేరార్పణం భారీ వరదలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు పరీవాహక ప్రాంతం అల్లకల్లోలమైంది. వరద తాకిడితో పదులకొద్దీ ఇళ్లు నేలమట్టం అయ్యాయి. వందలాది ఇళ్ల పైకప్పులు, గోడలు కూలిపోయాయి. ఇళ్లలో ఉన్న వస్తువులతోపాటు ద్విచక్ర వాహనాలు, కార్లు కూడా కొట్టుకుపోయాయి. ఒక్కసారిగా వచ్చిన వరదతో లోతట్టు ప్రాంత ప్రజలు కట్టుబట్టలతో పునరావాస కేంద్రాలకు చేరారు. ఖమ్మం నగరంతోపాటు పాలేరు నియోజకవర్గంలోని ఖమ్మంరూరల్ మండల పరిధిలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఫ్రిడ్జ్‌లు, టీవీలు, ఇతర ఎల్రక్టానిక్ సామాగ్రి తడిసి దెబ్బతిన్నాయి. ఖమ్మంలోని మోతీనగర్‌లో ఓ కుటుంబం దాచుకున్న బంగారం, డబ్బులు వరదనీటిలో కొట్టుకుపోయాయి. ఎఫ్‌సీఐ గోడౌన్ వద్ద 250కిపైగా లారీలు నీట మునిగిపోయాయి. ఒక్కో లారీ మరమ్మతుకు రూ.లక్షకుపైగా ఖర్చవుతుందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలోని ఆకేరు వాగు పొంగి తిరుమలాయపాలెం మండలాన్ని ముంచెత్తింది. పాలేరు వరదతో కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ఖమ్మం నగరంలో రామన్నపేట, వెంకటేశ్వరనగర్, పద్మావతినగర్, సారథినగర్, మామిళ్లగూడెం, బొక్కలగడ్డ, కాల్వొడ్డు, నయాబజార్, మంచికంటి నగర్, మోతీనగర్, పెద్దమ్మతల్లిగుడి రోడ్డు, ప్రకాశ్‌నగర్, దంసలాపురం కాలనీ.. ఖమ్మంరూరల్ మండలంలోని పోలేపల్లి, సాయిగణే‹Ùనగర్, కరుణగిరి, పెద్దతండా ప్రాంతాలు, చింతకాని, ముదిగొండ, మదిర, ఎర్రుపాలెం మండలాల్లోని పలు గ్రామాల్లో తీవ్ర నష్టం జరిగింది. మున్నేరు వరద తగ్గడంతో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. రోడ్లపై ఉన్న బురదను తొలగిస్తున్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న బాధితులు ఇళ్లకు చేరుకొని అన్నీ శుభ్రం చేసుకుంటున్నారు. యంత్రాంగం విఫలమవడంతోనే.. మున్నేరు వరద విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. గత ఏడాది కూడా జూలై 26 అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు మున్నేరు పరీవాహక ప్రాంతాన్ని వరద ముంచింది. ఆ సమయంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తూ, పునరావాస కేంద్రాలకు తరలించారు. కానీ ఈసారి అదే తరహాలో మున్నేరుకు భారీ వరద వస్తున్నా.. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడంలో విఫలమయ్యారని స్థానికులు మండిపడుతున్నారు. జల విలయంలోనే మహబూబాబాద్! భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో, అందులోనూ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర విధ్వంసం జరిగింది. నెల్లికుదురు మండలం రావిరాల మొదలుకొని వందలాది గ్రామాలు నీట మునిగాయి. చాలా గ్రామాల చుట్టూ ఇంకా వరద కొనసాగుతుండటంతో జలదిగ్బంధంలోనే ఉండిపోయాయి. ప్రజలు ఇళ్లలో తడిసిపోయిన సామగ్రిని చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తేరుకొని తొగరాయ్రి, కూచిపూడి గ్రామాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో అంతర గంగ వరదతో కకావికలమైన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలు సోమవారం కూడా తేరుకోలేదు. ఆ రెండు గ్రామాలు 70శాతానికిపైగా మునగడంతో.. ప్రజలు నిత్యవసర వస్తువులతోపాటు పంట పొలాలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయారు. తొగýర్రాయి, కూచిపూడి, గణపవరంలలో వెయ్యికి పైగా వ్యవసాయ మోటార్లు కొట్టుకుపోయినట్టు రైతులు వాపోతున్నారు. కోదాడ మండలంలో తీవ్రంగా నష్టపోయిన తొగర్రాయి, కూచిపూడి గ్రామాలను ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి సోమవారం సందర్శించారు. ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. మిగిలింది కట్టుబట్టలే! ఈ ఫొటోలో కనిపిస్తున్నది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం చెరువు పక్కన ఉన్న మోహనరావు ఇల్లు. ఇంటి ముందు ఎయిర్ కంప్రెషర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. శనివారం సాయంత్రం భారీ వర్షాలతో చెరువు కట్ట తెగడంతో నీరంతా ఒక్కసారిగా ముంచెత్తింది. మోహన్‌రావు, ఆయన భార్య, ఇద్దరు కుమారులు దూరంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. కానీ ఇల్లు దెబ్బతిన్నది, సామగ్రి అంతా కొట్టుకుపోయింది. తమకు కట్టుబట్టలే మిగిలాయని మోహనరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఇల్లు చూసినా ఇదే దుస్థితి మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రావిరాల గ్రామంలో వరద బీభత్సానికి అన్ని ఇళ్లలో బియ్యం, నిత్యావసరాలు, ఇతర సామగ్రి అంతా తడిసి పాడైపోయాయి. ‘‘తినడానికి తిండి గింజలు లేకుండా పోయి బతకలేని పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం ఆదుకుని నిరుపేద కుటుంబాలను చేరదీయాలి’’ అని గ్రామానికి చెందిన రాస యాకన్న ఆవేదన కోరుతున్నాడు. తడిసిపోయిన బియ్యాన్ని బయటపడేస్తూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. ఫారంలో ఒక్క కోడీ మిగల్లేదు.. మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో బెజ్జం సమ్మయ్య, ఎస్కే అమీర్ కలిసి కోళ్లఫారం నడుపుతున్నారు. ఆదివారం భారీ వర్షంతో ఫారంలోకి వరద ముంచెత్తింది. ఒక్కటీ మిగలకుండా రెండున్నర వేల కోళ్లు మృతి చెందాయి. ‘‘ఒక్కో కోడి కేజీన్నర బరువుదాకా పెరిగింది. నాలుగైదు రోజుల్లో కంపెనీ వారికి అప్పగించాల్సి ఉంది. అలాంటిది నోటిదాకా వచ్చిన కూడును వరద లాగేసింది..’’ అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల నిండా.. కంకర, ఇసుక మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం వెంకటగిరి రోడ్డుకు సమీపంలోని వరిచేన్లలో వేసిన కంకర, ఇసుక మేటలివి. ఇటీవల ఇక్కడ రోడ్డు పనులు ప్రారంభించారు. దానికోసం తెచ్చిన కంకర, ఇసుక అంతా వరదకు కొట్టుకొచ్చి పొలాల్లో చేరింది. తిరిగి పొలాన్ని బాగు చేసుకోవాలంటే చాలా ఖర్చవుతుందని రైతులు వాపోతున్నారు. -
అమరావతిలో వరద బీభత్సం నిలిచిపోయిన హైకోర్టు కార్యకలాపాలు
-
జలదిగ్బంధంలో విజయవాడ..
-
వరదల్లో మునిగిన కార్లు, బస్సులు
-
హిమాచల్ ప్రదేశ్ లో వరద బీభత్సం..
-
కేదార్‌నాథ్‌లో సాగుతున్న సహాయక చర్యలు
రుద్రప్రయాగ్/సిమ్లా: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్‌లో చిక్కుకుపోయిన తీర్థయాత్రికుల కోసం మూడు రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10,500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కేదార్నాథ్, భింబలి, గౌరీకుండ్ల్లో చిక్కుకుపోయిన మరో 1,500 మందిని బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. వారంతా సురక్షితంగానే ఉన్నారని స్పష్టం చేసింది. యాత్రికులను తరలించేందుకు వైమానిక దళం చినూక్, ఎంఐ–17 హెలికాప్టర్లను శుక్రవారం రంగంలోకి దించింది. పర్వత మార్గంలో కుండపోతగా కురిసిన వర్షాల కారణంగా పలువురు గల్లంతైనట్లు వస్తున్న వార్తలను అధికారులు ఖండించారు. శుక్రవారం లించోలిలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తిని యూపీలోని సహరాన్‌పూర్‌కు చెందిన శుభమ్ కశ్యప్‌గా గుర్తించారు. భారీ వర్షాల కారణంగా గౌరీకుండ్–కేదార్నాధ్ ట్రెక్కింగ్ మార్గంలో 25 మీటర్ల మేర రహదారి కొట్టుకుపోయింది. అడ్డంకులను తొలగించి, రహదారిని పునరుద్ధరించే వరకు వేచి ఉండాలని రుద్రప్రయాగ్ యంత్రాంగం యాత్రికులను కోరింది.హిమాచల్‌లో ఆ 45 మంది కోసం గాలింపుహిమాచల్ ప్రదేశ్‌లోని కులు, సిమ్లా, మండి జిల్లాల్లో వరద బీభత్సంలో గల్లంతైన 45 మంది కోసం గాలింపు కొనసాగుతోంది. మండి జిల్లా రాజ్బన్ గ్రామంలో రాతి కింద చిక్కుకున్న వ్యక్తిని గుర్తించారు. కులు జిల్లా సమెజ్ గ్రామంలో గల్లంతైన పోయిన 30 మంది కోసం డ్రోన్ల సాయంతో గాలిస్తున్నారన్నారు. శ్రీఖండ్ మహాదేవ్ ఆలయంలో చిక్కిన 300 మంది, మలానాలో చిక్కుకున్న 25 మంది పర్యాటకులు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు. -
నీటమునిగిన పంటలు పశువులకు మేత లేదు రైతుల ఆవేదన
-
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం
-
భద్రాచలం: గోదావరి మహోగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
సాక్షి, ఖమ్మం జిల్లా: భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 53 అడుగులకు గోదావరి నీటిమట్టం చేరుకోవడంతో చివరిదైనా మూడో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భద్రాచలం నుంచి కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరికి వరద ఉధృతి కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. చర్ల, వెంకటాపురం, వాజేడు వెళ్లే రహదారులపైకి వరద నీరు రావడంతో ఇప్పటికే రాకపోకలు నిలిచిపోయాయి.ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికతూర్పుగోదావరి: ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గంట గంటకూ వరద పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద 13.9 అడుగులకు నీటిమట్టం చేరింది. సముద్రంలోకి 13 లక్షల 6వేల క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. గోదావరి ఏటిగట్లపై ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పలు చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. బొబ్బిల్లంకలో ఏటిగట్లు కోతకు గురవుతోంది. గట్టుకు గండిపడే ప్రమాదం ఉందని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇనుప బస్తాలతో మరమ్మత్తులు చేపట్టారు.జాతీయ రహదారిపైకి భారీగా వరద నీరు..చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. 40 అడుగులకు నది నీటిమట్టం చేరింది. డొంకరాయి జలాశయానికి వరద పోటెత్తింది. 4 గేట్ల ద్వారా 10,936 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 9 రోజులుగా సుమారు 50 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. నాలుగు మండల్లాలల్లో జనజీవనం స్తంభించింది. జాతీయ రహదారిపైకి వరద నీరు భారీగా చేరింది. ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. ఇన్ ఫ్లో 3,59,889 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 61,348 క్యూసెక్కులు, పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు. కాగా, ప్రస్తుత నీటి మట్టం 865.70 అడుగులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ 125.1322 టీఎంసీలు. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. -
జలదిగ్బంధంలో ఏజెన్సీ గ్రామాలు..
-
కుదేలైన వ్యవసాయం.. రైతుల బతుకులపై నీళ్లు!
నాటు వేసిన పొలం ఇసుకలో మునిగింది ► రెండున్నర ఎకరాలు కౌలుకు తీసుకొని ఈ మధ్యనే వరి నాట్లు వేయించా. భారీ వర్షాలతో పాలేరు రిజర్వాయర్ అలుగు పోసింది. ఆ వరదతో పొలం మునిగి ఇసుక మేట వేసింది. రూ.40 వేల వరకు పెట్టిన పెట్టుబడి వరద పాలైంది. ఈ ఇసుకను తీయడానికి, మళ్లీ సాగు చేయడానికి అప్పు తేవాల్సిందే. – భూక్యా ఉపేందర్, హాట్యతండా, కూసుమంచి మండలం, ఖమ్మం జిల్లా సాక్షిప్రతినిధి, వరంగల్: రాష్ట్రవ్యాప్తంగా పదిరోజుల పాటు కురిసిన భారీ వర్షాలు వేల గ్రామాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉప నదులు, వాగులు ముంచెత్తి రైతుల ఆశలపై నీళ్లుచల్లాయి. రెండేళ్ల కిందటి షాక్ నుంచి రైతులు పూర్తిగా కోలుకోకముందే.. మొలక దశలోని పంటలను వరదలు తుడిచిపెట్టాయి. మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పోటెత్తిన గోదావరి, ఉప నదులతో పొలాల్లో భారీగా ఇసుక మేటలు పడ్డాయి. నది సమీప మండలాల ప్రజలను కదిలిస్తే కన్నీరే ఎదురవుతోంది. ఇంకా తేరుకోని జనం..: భారీ వర్షాలు, వరదల నష్టం నుంచి బాధితులు ఇంకా కోలుకోలేదు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్ జిల్లాల్లో పలుచోట్ల పొలాలు కోతకు గురై, ఇసుక మేటలు వేసి, ఇప్పట్లో పంట వేయలేని స్థితికి చేరాయి. మరో నెల రోజుల్లో పంటలు వేయకపోతే ఈ వానాకాలం సీజన్లో ఇక సాగు చేయడం కుదరదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే రెండు నెలలుగా దుక్కులు, విత్తనాలు, నార్లు పోయడానికి ఎకరానికి సగటున రూ.18 వేల వరకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక కొండాయి, మోరంచపల్లి తదితర పల్లెలు ఘొల్లుమంటున్నాయి. వరదలతో పాడి పశువులతోపాటు ఇళ్లు, ఆస్తులను కోల్పోయి రైతులు బిక్కుబిక్కుమంటున్నారు. ఎన్పీడీసీఎల్ పరిధిలో రూ.60 కోట్ల నష్టం ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్డీపీసీఎల్) పరిధిలోని 16 జిల్లాల్లో వర్షాల వల్ల రూ.60 కోట్ల నష్టం వాటిల్లింది. సుమారు 20 వేల విద్యుత్ స్తంభాలు దెబ్బతినగా.. 3,200 ట్రాన్స్ఫార్మర్లు, 140 సబ్స్టేషన్లు నీటమునిగాయి. 742 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. ఇందులో 3 గ్రామాలకు తప్ప అన్నింటికీ విద్యుత్ సరఫరా పునరుద్ధరించినట్లు అధికారులు తెలిపారు. సర్వస్వం కోల్పోయి.. ములుగు జిల్లా కొండాయిలో ప్రజలు వరదలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కొత్తూరుకు పరుగులు పెట్టారు. వరద తగ్గాక నేలకూలిన ఇళ్లు, మొండిగోడలు, తడిసిన బియ్యం, కొట్టుకుపోయిన సామగ్రిని చూసి గుండెలవిసేలా ఏడ్చారు. గ్రామానికి చెందిన గిరిజన రైతు దంపతులు బొల్లికుంట లక్ష్మి, ధనుంజయలకు చెందిన రెండెకరాల వరి నారు పూర్తిగా కొట్టుకుపోయింది. రెండు దుక్కిటెద్దులు గల్లంతయ్యాయి. ఇల్లు దెబ్బతిన్నది. చేతిలో చిల్లిగవ్వలేదు. ప్రభుత్వం ఆదుకుంటుందన్న ఆశతో బతుకుతున్నామని వారు చెప్తున్నారు. నారుపోయి.. ఇసుక చేరి.. ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు పేరు దేవేందర్‌గౌడ్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామం. వ్యవసాయమే జీవనాధారం. ఇటీవలే మూడెకరాల్లో వరి నాట్లు వేశారు. కానీ మోరంచవాగు వరదతో వరి నారు పూర్తిగా కొట్టుకుపోయింది. పొలంలో ఇసుక మేటలు వేసింది. దీంతో ఈసారి పంట వేయలేని పరిస్థితి నెలకొందని దేవేందర్‌గౌడ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఈయన ఒక్కడే కాదు.. మోరంచపల్లిలో మరికొందరు రైతులదీ ఇదే గోస. చిరువ్యాపారం.. చిన్నాభిన్నం ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు దొడ్ల ప్రేమలీల. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవిస్తోంది. గత నెల 28న రాత్రి పోటెత్తిన వరదలో సుమారు రూ.3 లక్షల విలువైన కిరాణా సామగ్రి, వస్తువులు కొట్టుకుపోయాయి. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె వాపోతున్నారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలోని అవుతాపురం, రాజ్మాన్సింగ్ తండా, పోచంపల్లి, గంట్లకుంట, రంగాపురం వరకు రూ.8.70 కోట్లతో సుమారు 11 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం చేపట్టారు. 2023 జనవరిలో ఇది పూర్తి కావాల్సి ఉన్నా జాప్యమైంది. ఇటీవలి భారీ వర్షాలతో పోచంపల్లి గ్రామ పరిధిలో ఇలా రోడ్డు కొట్టుకుపోయింది. మూడెకరాల్లో ఇసుక మేటలు వేసింది నా వ్యవసాయ భూమి పెద్దవాగు సమీపంలోని ఉంది. భారీ వర్షాలకు చెక్‌డ్యాం తెగి వరద పొలాన్ని ముంచేసింది. రూ.50వేలకుపైగా నష్టపోయా. 2021లోనూ నాతోపాటు అనేక మంది రైతులు ఇలాగే చెక్‌డ్యాం తెగి నష్టపోయారు. ఇప్పుడు అదే పునరావృతమైంది. – నవీన్ యాదవ్, రైతు, సుంకేటు, నిజామాబాద్ జిల్లా -
బీజింగ్‌లో అనూహ్య వరదలు
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో కనీసం 20 మంది చనిపోగా మరో 27 మంది గల్లంతయ్యారు. బీజింగ్ ఎండల తీవ్రత అంతగా ఉండదు. కానీ, ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. అదేవిథంగా, భారీ వర్షాలు కురియడం కూడా అరుదే. ఈసారి మాత్రం అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. జనావాసాలు నీట మునిగాయి. రహదారులు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన ఘటనల్లో బీజింగ్ సిటీ సెంటర్లో 11 మంది చనిపోగా, 27 మంది జాడ తెలియకుండాపోయారు. నగర పరిధిలోని హుబే ప్రావిన్స్‌లో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికార మీడియా తెలిపింది. -
సంతోషం వ్యక్తం చేస్తున్న వరద బాధితులు
-
ఎడతెరిపి లేని వానలతో జలదిగ్బంధంలో మంచిర్యాల
-
లంకల్ని ముంచెత్తిన గోదావరి
-
Heavy Rains : చెత్తనంతా తిరిగిచ్చి.. లెక్క సరిచేసి"నది"..
న్యూఢిల్లీ: ఉత్తర భారతదేశంలో కురిసిన వర్షాలకు ఆయా ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి వరద ఉధృతమైంది. దీంతో ఒక నదిలోని ప్లాస్టిక్ మొత్తం అక్కడున్న బ్రిడ్జి మీద పేరుకుపోవడంతో ఆ చెత్తనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఐ.ఎఫ్.ఎస్ అధికారి పర్వీన్ కాస్వాన్. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటలకే బాగా వైరల్ అయ్యి లక్షల మందికి చేరింది. కొద్దిరోజులుగా వర్షాలతోనూ, వరదలతోనూ ఉత్తరాది మొత్తం అతలాకుతలమైంది. కొన్ని ప్రాంతాల్లో గతమెన్నడూ లేనంత భారీగా వర్షాలు పడగా ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఉధృతంగా వరదలు కూడా వచ్చాయి. ఈ వరదల్లో మనుషులు నదుల్లో పారేసిన చెత్త మొత్తం తిరిగి భూమి మీదకు చేరింది. అలా ప్లాస్టిక్ చెత్త చేరిన ఒక బ్రిడ్జిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అక్కడి ఫారెస్టు అధికారి. దీనికి అందరినీ ఆలోచింపజేసే వ్యాఖ్యను జోడించి "ప్రకృతి -1, మనిషి-0.. మనం ఏదైతే ఇచ్చామో అది మొత్తం తిరిగి వచ్చేసింది.." అని రాశారు. నడవటానికి కూడా వీలు లేకుండా ఉన్న ఈ బ్రిడ్జి వీడియోకి నెటిజనుల నుంచి విశేష స్పందన తోపాటు వ్యంగ్యమైన కామెంట్లు కూడా వచ్చాయి. ప్రకృతి ఎప్పుడూ మనుషుల ఋణం ఉంచుకోదని, ఎప్పుడు లెక్క అప్పుడే సరిచేస్తుందని.. ఎప్పటికైనా మనిషిపై ప్రకృతిదే పైచేయని రాశారు. Nature - 1, Humans - 0. River has thrown all the trash back at us. Received as forward. pic.twitter.com/wHgIhuPTCL — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 11, 2023 ఇది కూడా చదవండి: మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు.. -
యమునా నది ఉగ్రరూపం.. ఢిల్లీ హై అలర్ట్..
ఎడతెరిపి లేకుండా కురుస్తన్న వర్షాలు ఉత్తరాదినా అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. గతకొన్నిరోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ప్రజలు అల్లాడుతున్నారు. దేశ రాజధాని ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్‌లో వర్ష బీభత్సం నెలకొంది. నదులు, వాగులు కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో మౌలిక సదుపాయలకు, సహాయక చర్యలకు అంతరాయం ఏర్పడుతోంది. యమునా నది మహోగ్రం. ఢిల్లీలో యమునా నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా నుంచి వరద పోటెత్తడంతో నది నీటిమట్టం పెరిగింది. ఓల్డ్ ఢిల్లీ రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటి మట్టం 207.18 మీటర్ల ప్రమాదకర స్థాయికి చేరింది. అత్యధికంగా 207.49 మీటర్లతో పాత రైల్వే బ్రిడ్జిని తాకుతూ ప్రవహిస్తోంది. #WATCH | Water level of river Yamuna continues to rise in Delhi. Visuals from Old Railway Bridge. Today at 8 am, water level of the river was recorded at 207.25 metres at the Bridge, inching closer to the highest flood level - 207.49 metres. The river is flowing above the… pic.twitter.com/e46LLHdeVe — ANI (@ANI) July 12, 2023 దీంతో అప్రమత్తమైన ఢిల్లీ సర్కార్ యమునా నది పరివాహక ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారి కోసం శిబిరాలు ఏర్పాటు చేసి, ఆహారం, తాగునీరు అందించింది. యమునా నదిలో నీటి మట్టం పెరగడంతో ఐటీవో ఛత్ ఘాట్ మునిగిపోయింది. కూర్చోవడానికి ఏర్పాటు చేసిన బెంచీలు కూడా నీట మునిగాయి. ప్రస్తుతం యమునా నది నీటిమట్టం 207.25 మీటర్లుగా ఉంది. Mathura, Uttarakhand | The water level of the Yamuna River is increasing due to rain. All the police stations along the banks of the river have been instructed to increase vigilance in the area. Coordination is also being established with other agencies so that if there is… pic.twitter.com/lHHAVVTn6f — ANI UP/Uttarakhand (@ANINewsUP) July 11, 2023 ప్రమాదకర స్థాయిని అధిగమించి సెంట్రల్ వాటర్ కమిషన్ (సీడబ్ల్యూసీ) వరద పర్యవేక్షణ పోర్టల్ ప్రకారం.. యమునా నది నీటి మట్టం రికార్డు స్థాయికి చేరుకుంది. ఓల్డ్ రైల్వే బ్రిడ్జి వద్ద మంగళవారం నీటి మట్టం రాత్రి 8 గంటలకు 206.76 మీటర్గలు ఉండగా బుధవారం ఉదయం 7 గంటలకు 207.18 మీటర్లకు పెరిగింది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ఉధృతితో పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. #WATCH | Aftermath of the flood that ravaged Manali in Himachal Pradesh due to incessant heavy rainfall in the region. pic.twitter.com/z7dDd5qVSB — ANI (@ANI) July 12, 2023 పదేళ్లలో ఇదే తొలిసారి యమున నది ఇంత ప్రమాదకర స్థాయిలో ప్రవహించడం గత పదేళ్లలో ఇదే అత్యధికమని అధికారులు వెల్లడించారు. చివరగా 2013లో నది 207.32 మీటర్ల స్థాయికి చేరిందని తెలిపారు. ఎగువ పరీవాహక ప్రాంతాలలో నిరంతర వర్షపాతం, వారాంతానికి ఢిల్లీ, సమీప ప్రాంతాలలో భారీ వర్షపాతం కారణంగా నీటి మట్టం గణనీయంగా పెరిగిందని ఆయన వివరించారు. గతేడాది సెప్టెంబరులోనూ యమునా నది రెండుసార్లు ప్రమాద స్థాయిని అధిగమించి నీటిమట్టం 206.38 మీటర్లకు చేరుకుంది. మరోవైపు పాత రైల్వే వంతెనపై అన్నీ రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. Delhi on high alert. Yamuna flowing above the danger mark. (@AnmolBali9/ @AkshayDongare_ )#Delhi #YamunaRiver #ITVideo pic.twitter.com/CZduuY2avD — IndiaToday (@IndiaToday) July 11, 2023 హిమాచల్‌లో జల విలయం మరోవైపు ఉత్తరాదిన విస్తారంగా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, నివాసాలు వరద నీటిలో మునిగిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇంటి మందు పార్క్ చేసిన బైక్‌లు, కార్లు కొట్టుకుపోయాయి. కాలనీల్లోకి వరద నీరు చేరడంతో చెరువులలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. వరదల కారణంగా ఉత్తరాదిన మరణించిన వారి సంఖ్య సెంచరీ దాటింది. మూడు రోజుల్లో 31 మంది ఒక్క హిమాచల్ ప్రదేశ్‌లోనే గత మూడురోజుల్లో వరద ఉద్ధృతికి, కొండ చరియలు విరగిపడిన ఘటనలో 31 మంది మరణించగా.. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి 80 మంది మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో 1,300 రోడ్లు, 40 ప్రధాన బ్రిడ్జిలు దెబ్బతిన్నాయి. 1,284 రూట్లలో బస్సు సర్వీసులను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. వరదలకు, కొండచరియలు విరిగిపడటం, రోడ్లు దెబ్బతినడంతో కారణంగా చండీగఢ్-మనాలి, సిమ్లా-కల్కా జాతీయ రహదారులు మూసివేయడంతో సిమ్లా మనాలితో సహా అనేక ప్రాంతాలలో నిత్యావసర వస్తువుల సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సిమ్లా, సిర్మౌర్, కిన్నౌర్ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. హిమాచల్‌లో చిక్కుకొన్న 300 మంది ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లా సరిహద్దులోని జుమ్మాగఢ్ నదిపై ఉండే ఓ వంతెన వరద ధాటికి కొట్టుకుపోయింది. హిమాచల్ ప్రదేశ్ లో ప్రతికూల వాతావరణం కారణంగా చందేత్రల్ ప్రాంతంలో 300 మందికి పైగా చిక్కుకుపోయారు. వారిలో అత్యధికులు పర్యాటకులే ఉన్నారు. ఈ రాత్రికి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే అవకాశాలున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గడంతో సహాయ చర్యలు ముమ్మరం చేశారు. హర్యానాలోని అంబాలాలో ఓ గురుకుల పాఠశాల హాస్టల్లోకి వరద నీరు ప్రవేశించడంతో 730 విద్యార్థినులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. వరద బాధితులతో కలిసి సీఎం భోజనం కసోల్, మణికరణ్, ఖీర్ గంగా, పుల్గా ప్రాంతాల్లో ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు ఏరియల్ సర్వే నిర్వహించారు. కులులోని సైన్జ్ ప్రాంతంలోనే దాదాపు 40 దుకాణాలు, 30 ఇళ్లు కొట్టుకుపోయాయి. కులులో చిక్కుకుపోయిన పర్యాటకులతో ముఖ్యమంత్రి సంభాషించి, వారితో కలిసి భోజనం చేశారు. 15 వరకు స్కూల్స్ బంద్ న్ని ప్రభుత్వ పాఠశాలలను జూలై 15 వరకు మూసివేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కాంపిటీటివ్ (ప్రిలిమినరీ) పరీక్షను ఆగస్టు 20కి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీషెడ్యూల్ చేసింది. రాష్ట్రంలో సంభవించిన విపత్తుల నేపథ్యంలో బాధిత కుటుంబాలందరికీ ముఖ్యమంత్రి రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. -
కొనసాగుతున్న కుండపోత వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆ జిల్లా వ్యాప్తంగా సగటున 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 13.2 సెం.మీ. వర్షం పడింది. కారెంపూడి మండలం శంకరపురంసిద్ధాయిలో 8.6 సెం.మీ, నకరికల్లు మండలం చాగల్లులో 7.3, నాదెండ్ల మండలం గణపవరంలో 7, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. ఇక కాకినాడ సిటీలో పలుచోట్ల 15–16 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరయ్యపాలెంలో 6.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెలలో 6.1, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 5.9, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బెజత్పురంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని నల్లడ్రెయిన్కు గండి పడింది. ఫలితంగా వందలాది ఎకరాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 28.6 మి.మీ., కృష్ణా జిల్లాలో 16.3 మి.మీ.గా నమోదైంది. ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒంగోలు నగరంలో ముసురుపట్టినట్లు రోజుకు నాలుగైదుసార్లుగా వర్షం పడుతూనే ఉంది. నల్లవాగు, చిలకలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఎగువన కురిసిన వర్షాలకు మల్లవరం రిజర్వాయర్ ద్వారా శనివారం అర్ధరాత్రి నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం బ్యారేజీకి చెందిన 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎగువ నుంచి 5,09,431 క్యూసెక్కుల వరద వస్తుండగా, కాలువలకు 2,827 క్యూసెక్కులు, సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ఐదు లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం ఇదే తొలిసారి. అలాగే, జూన్ 1 నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకూ మొత్తం 1,035.768 టీఎంసీలు కడలిలో కలవడం గమనార్హం. అలాగే, నాగార్జునసాగర్‌లో 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇక ఆదివారం సా. 6 గంటలకు శ్రీశైలంలోకి 4,01,187 క్యూసెక్కులు చేరుతుండటంతో తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,59,978 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి దిగువకు 3,67,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.650 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.760 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. -
భద్రాచలం, ధవళేశ్వరం వద్ద ఉద్ధృతంగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/విజయపురిసౌత్: గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద 47.7 అడుగులు, ధవళేశ్వరం వద్ద 15 అడుగుల వద్ద నీటి మట్టం ఉంది. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల ద్వారా విడుదల చేస్తున్న జలాల్లో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 15,05,850 క్యూసెక్కులు వస్తుండగా.. గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 14,94,850 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇచ్చాయి. దాంతో ఎగువన గోదావరిలో వరద తగ్గింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజ్‌లోకి వరద 7.40 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. దాని దిగువన ఉన్న తుపాకులగూడెం బ్యారేజ్‌లోకి 8.84 లక్షలు, సీతమ్మసాగర్‌లోకి 11.47 లక్షల క్యూసెక్కులకు ప్రవాహం తగ్గింది. ఆ నీటినంతా దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శనివారం నుంచి భద్రాచలం, ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం తగ్గుముఖం పట్టనుంది. స్థిరంగా వంశ‘ధార’ వర్షాల ప్రభావం వల్ల వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 22,809 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు 2,215 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 20,594 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. నాగావళిలోనూ వరద కొనసాగుతోంది. తోటపల్లి బ్యారేజ్‌లోకి 6,358 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,838 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ఆ జలాలు నారాయణపురం ఆనకట్ట మీదుగా బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. నిలకడగా కృష్ణమ్మ బేసిన్లో కురుస్తున్న వర్షాల వల్ల కృష్ణాలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,89,909 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులు, కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కులు, స్పిల్ వే 8 గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,23,864 క్యూసెక్కులు.. మొత్తం 3,06,217 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.8 అడుగుల్లో 214.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జున సాగర్‌లోకి 1,74,167 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువకు 8,831, ఎడమ కాలువకు 8,193, ఏఎమ్మార్పీకి 600, వరద కాలువకు 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,927, స్పిల్ వే 16 గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 1,23,216 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586.2 అడుగుల్లో 301.35 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 1,36,582 క్యూసెక్కులు చేరుతుండగా.. విద్యుత్కేంద్రం ద్వారా 8 వేలు, స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,30,616 క్యూసెక్కులు.. మొత్తం 1,38,616 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,35,847 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 12,797 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 1,23,050 క్యూసెక్కులను బంగాళాఖాతంలోకి వదిలేస్తున్నారు. -
కృష్ణా నది ప్రాజెక్టులకు భారీగా వరద