కాశ్మీర్ లో 1,200 పైగా స్కూళ్లు ధ్వంసం
జమ్మూ:ఈనెల్లో జమ్మా కాశ్మీర్ లో సంభవించిన వరద బీభత్సం ఆ రాష్ట్రాన్ని అతలాకుతులం చేసింది. అక్కడ భారీ వర్షాలు, వరదల్లో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లో విద్యా పరమైన మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,276 ప్రభుత్వ పాఠశాలలు ధ్వంసమయ్యాయి. వీటిలో 1,000 పాఠశాలల్లో వసతులు పూర్తిగా ధ్వంసం కాగా, 200 పైగా పాఠశాలలు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. విద్యార్థులు తిరగి తరగతలకు హాజరుకావాలంటే విద్యాసంస్థల పునరుద్ధరణను సత్వరం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది.
మరమ్మతులకు, పునరుద్ధరణకు గాను జమ్ము కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ రూ. 62కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. జమ్ములోని లోతట్టు ప్రాంతాల్లో 70 గ్రామాల్లోని పాఠశాలల్లో ఇంకా బురద, బంకమట్టి పేరుకుపోయి ఉందని, సరిహద్దులోని జమ్ము, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు.