Chief Minister Omar Abdullah
-
చర్చలతోనే విద్వేషాలకు తెర
భారత్, పాక్ సమస్యలపై జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా శ్రీనగర్: భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న అపరిష్కృత సమస్యలకు చర్చలతోనే పరిష్కారం లభిస్తుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అభిప్రాయపడ్డారు. సార్క్ సదస్సుకు ప్రధాని నరేంద్రమోదీ, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌లు హాజరైన నేపథ్యంలో ఒమర్ ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. నాల్గో విడతలో జరగనున్న సోన్వార్ అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన ఒమర్ బుధవారం మీడియాతో మాట్లాడారు. స్వయం ప్రతిపత్తికి భంగం వాటిల్లనివ్వం: ఎన్సీ జమ్మూకశ్మీర్ స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉంటామని నేషనల్ కాన్ఫరెన్స్ తన మేనిఫెస్టోలో ప్రతినబూనింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆలీ అహ్మద్ సాగర్ తదితర నేతలు అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. కాగా, కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని రాష్ట్రంలోని రాజకీయ పక్షాల కార్యకర్తలకు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ పిలుపునిచ్చింది. ఈ మేరకు పుల్వామా ప్రాంతంలో పోస్టర్లు వెలిశాయి. -
ఆ స్కూళ్ల నష్టం రూ.64 కోట్ల పైమాటే!
జమ్మూ: రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో అక్కడి జన జీవనానికి భారీ నష్టం వాటిల్లింది. అక్కడి విద్యావ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నమైంది. రాష్ట్రంలో 1,400 పాఠశాలలు వరద బారిన పడ్డాయి. వీటిలో కొన్ని పాఠశాలలు పూర్తిగా వరద తాకిడికి కొట్టుకుపోగా, మరికొన్ని తీవ్రం దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ పాఠశాలల పునరుద్దరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వరదల్లో స్కూళ్ల నిమిత్తం దాదాపు రూ.64 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు విద్యాశాఖ అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,000 పాఠశాలల్లో వసతులు పూర్తిగా ధ్వంసం కాగా, 200 పైగా పాఠశాలలు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. విద్యార్థులు తిరగి తరగతలకు హాజరుకావాలంటే విద్యాసంస్థల పునరుద్ధరణను సత్వరం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు ఆరంభించింది. -
కాశ్మీర్ లో 1,200 పైగా స్కూళ్లు ధ్వంసం
జమ్మూ:ఈనెల్లో జమ్మా కాశ్మీర్ లో సంభవించిన వరద బీభత్సం ఆ రాష్ట్రాన్ని అతలాకుతులం చేసింది. అక్కడ భారీ వర్షాలు, వరదల్లో భారీ నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే. జమ్మూ కాశ్మీర్ లో విద్యా పరమైన మౌలిక సదుపాయాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,276 ప్రభుత్వ పాఠశాలలు ధ్వంసమయ్యాయి. వీటిలో 1,000 పాఠశాలల్లో వసతులు పూర్తిగా ధ్వంసం కాగా, 200 పైగా పాఠశాలలు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. విద్యార్థులు తిరగి తరగతలకు హాజరుకావాలంటే విద్యాసంస్థల పునరుద్ధరణను సత్వరం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మరమ్మతులకు, పునరుద్ధరణకు గాను జమ్ము కాశ్మీర్ పాఠశాల విద్యాశాఖ రూ. 62కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. జమ్ములోని లోతట్టు ప్రాంతాల్లో 70 గ్రామాల్లోని పాఠశాలల్లో ఇంకా బురద, బంకమట్టి పేరుకుపోయి ఉందని, సరిహద్దులోని జమ్ము, రాజౌరి, పూంఛ్ జిల్లాల్లోని కొన్ని పాఠశాలలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అధికారులు పేర్కొన్నారు. -
అంచనా వేశాకే కేంద్రాన్ని ఆశ్రయిస్తాం
శ్రీనగర్: జమ్ము కాశ్మీర్‌ను అతలాకుతలం చేసిన వరద బీభత్సంలో నష్టం కొన్ని వేలకోట్ల రూపాయల మేర ఉండవచ్చని, నష్టంపై సమగ్రమైన అంచనా తర్వాతే సాయంకోసం కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శుక్రవారం చెప్పారు. నష్టానికి సంబంధించిన తుది లెక్కలు ఇప్పుడప్పుడే నిర్ధారించలేమన్నారు. శ్రీనగర్‌లో తన తాత్కాలిక కార్యాలయంలో ఒమర్ మాట్లాడుతూ, వరద కారణంగా జమ్ము కాశ్మీర్‌లోని అన్ని రంగాలూ తీవ్రంగా నష్టపోయాయని, ఇళ్లు, దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలకు, రహదార్లు, వంతెనలు, నీటి పథకాలు వంటి మౌలిక సదుపాయాలు, వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయని అన్నారు. నష్టాన్ని అంచనావేసే ప్రక్రియ కొనసాగుతోందని, వష్టం వివరాలను సాధ్యమైనంత త్వరగా సమీకరించాలని అన్ని జిలాల అధికారులను ఆదేశించామని చెప్పారు. -
జాతీయ ఉపద్రవంగా ప్రకటించండి
ప్రధానికి జమ్మూకాశ్మీర్ రాష్ట్రం విజ్ఞప్తి శ్రీనగర్: భారీ వరదల ధాటికి విలవిలలాడిన జమ్మూ కాశ్మీర్ ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతోంది. వరద నీరు శనివారం నాటికి కొద్దిగా తగ్గుముఖం పట్టింది. 1.5 లక్షల మందిని ఇప్పటి వరకూ రక్షించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి శనివారం ఇక్కడ ప్రకటించారు. అయితే, ఇంకా 1.5 లక్షల మంది వరదనీటిలోనే చిక్కుకుని ఉన్నట్లు జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. సెంట్రల్ కాశ్మీర్లో వరదనీరు తగ్గుముఖం పట్టిందని, అయితే ఇంకా ప్రమాదకర స్థాయి కంటే పైనే ఉందని చెప్పారు. అది ఆ స్థాయి నుంచి తగ్గిన తర్వాత జీలం నదీ తీరంలో ఉల్లంఘనలను తొలగిస్తామన్నారు. వరదనీరు తగ్గుముఖం పడుతుండడంతో వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉంటాయేమోననే ఆందోళనలు తలెత్తుతున్నాయి. ఆదుకోవాలంటూ ప్రధానికి వినతి జమ్మూకాశ్మీర్ చరిత్రలో 109 ఏళ్లలో సంభవించి న అతిపెద్ద విలయంగా అధికారులు తేల్చడం తో... ఈ ప్రకృతి విపత్తును ‘జాతీయ విపత్తుగా’ ప్రకటించాలని జమ్మూ కాశ్మీర్‌కు చెందిన మం త్రుల బృందం ప్రధాని నరేంద్రమోడీని శని వారం ఢిల్లీలో ప్రత్యేకంగా కలసి విజ్ఞప్తి చేసింది. ఉదారంగా ఆర్థిక సాయం అందించాలని, రాష్ట్రంలో పరిస్థితులు కుదుటపడేందుకు ప్రత్యేక పునరావాస ప్యాకేజీ ప్రకటించాలని కోరింది. ఢిల్లీకి 24 మంది తెలుగు విద్యార్థులు జమ్మూ కాశ్మీర్ వరదల నుంచి క్షేమంగా బయటపడిన మరో 24 మంది తెలుగు విద్యార్థులు శనివారం ఢిల్లీలోని ఏపీ భవన్‌కు చేరుకున్నారు. వీరందరినీ ఏపీ ప్రభుత్వ ఖర్చులతో వారి స్వస్థలాలకు పంపేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తెలిపారు. సహాయక చర్యల్లో డీఆర్డీవో బృందం సాక్షి, హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్ వరద బాధితులకు తక్షణ సహాయం అందించేందుకు రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో) బృందం కూడా రంగంలోకి దిగింది. ఔషధాలు, ఆహార పదార్థాలతో మంగళవారం శ్రీనగర్‌కు చేరుకున్న డీఆర్డీవో బృందం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొంటోందని డీఆర్డీవో అధికారులు తెలిపారు. 9 టన్నుల ఆహార పదార్థాలను వరద బాధితులకు పంపిణీ చేస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్ సేవల కోసం డీఆర్డీవోకు చెందిన ‘శాట్‌కామ్’ మొబైల్ శాటిలైట్ సర్వీసెస్ టర్మినల్‌ను శ్రీనగర్‌కు విమానంలో తరలించారని, ఈ టర్మినల్ ద్వారా శ్రీనగర్ సీఆర్పీఎఫ్ కార్యాలయాన్ని ఢిల్లీలోని కంట్రోల్ రూంకు అనుసంధానం చేశారని తెలిపారు.