రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో అక్కడి జన జీవనానికి భారీ నష్టం వాటిల్లింది. అక్కడి విద్యావ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నమైంది.
జమ్మూ: రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన భారీ వర్షాలతో అక్కడి జన జీవనానికి భారీ నష్టం వాటిల్లింది. అక్కడి విద్యావ్యవస్థ కూడా పూర్తిగా చిన్నాభిన్నమైంది. రాష్ట్రంలో 1,400 పాఠశాలలు వరద బారిన పడ్డాయి. వీటిలో కొన్ని పాఠశాలలు పూర్తిగా వరద తాకిడికి కొట్టుకుపోగా, మరికొన్ని తీవ్రం దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఆ పాఠశాలల పునరుద్దరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ వరదల్లో స్కూళ్ల నిమిత్తం దాదాపు రూ.64 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు విద్యాశాఖ అంచనా వేసింది.
రాష్ట్రవ్యాప్తంగా 1,000 పాఠశాలల్లో వసతులు పూర్తిగా ధ్వంసం కాగా, 200 పైగా పాఠశాలలు వరదల తాకిడికి కొట్టుకుపోయాయి. విద్యార్థులు తిరగి తరగతలకు హాజరుకావాలంటే విద్యాసంస్థల పునరుద్ధరణను సత్వరం చేపట్టవలసిన ఆవశ్యకత ఏర్పడటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తులు ఆరంభించింది.