బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో మునుపెన్నడూ లేని విధంగా కురిసిన భారీ వర్షాలు, వరదలతో కనీసం 20 మంది చనిపోగా మరో 27 మంది గల్లంతయ్యారు. బీజింగ్ ఎండల తీవ్రత అంతగా ఉండదు. కానీ, ఈ ఏడాది వేసవిలో రికార్డు స్థాయిలో ఎండలతో జనం ఇబ్బందులు పడ్డారు. అదేవిథంగా, భారీ వర్షాలు కురియడం కూడా అరుదే.
ఈసారి మాత్రం అసాధారణ స్థాయిలో వర్షాలు కురిశాయి. జనావాసాలు నీట మునిగాయి. రహదారులు, వాహనాలు కొట్టుకుపోయాయి. వరదలకు సంబంధించిన ఘటనల్లో బీజింగ్ సిటీ సెంటర్‌లో 11 మంది చనిపోగా, 27 మంది జాడ తెలియకుండాపోయారు. నగర పరిధిలోని హుబే ప్రావిన్స్‌లో మరో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 5 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని అధికార మీడియా తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment