
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లోని ఓ ఆస్పత్రిలో మంగళవారం మధ్యాహ్నం చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో 21 మంది చనిపోయారు. ఈ ఘటనలో 71 మందిని కాపాడినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు చేపట్టామన్నారు.
మరో ఘటనలో 11 మంది...
ఝెజియాంగ్ ప్రావిన్స్ జిన్‌హువా నగరంలోని ఓ తలుపుల తయారీ ఫ్యాక్టరీలో సోమవారం సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయారు. కలప, రసాయనాల కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment