ఓ మహిళ మృతి, ఇళ్లొదిలి వెళ్లిన వేలాది మంది
కాన్‌బెర్రా: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌ను వరదలు ముంచెత్తాయి. అవి ముంచెత్తడంతో వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు. సోమవారం రికార్డు స్థాయిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని, వరద నీరు రెండో అంతస్తు స్థాయికి పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. వరదలతో టౌన్స్ విల్లే, పర్యాటక కేంద్రమయిన కెయిర్న్‌స్ మధ్య రహదారులు తెగిపోయాయి.
ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని కొన్ని ప్రాంతాల్లో 700 మిల్లీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. పలు ప్రాంతాల్లో 24 గంటల్లో ఆరు గంటల్లోనే 250 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరదలతో హెర్బర్ట్ నది నీటిమట్టం 15.2 మీటర్లకు చేరుకుంది. కుండపోత వర్షాలు, ఈదురు గాలులు మరింత ఆకస్మిక వరదలకు దారితీసే అవకాశం ఉందని బ్యూరో హెచ్చరించింది. సుమారు 200,000 మంది జనాభా ఉన్న టౌన్స్‌విల్లే నగరంలో గత 60 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరదలు వచ్చాయని క్వీన్స్‌ల్యాండ్ ప్రీమియర్ డేవిడ్ క్రిసఫుల్లీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment