24 మంది దుర్మరణం
బీజింగ్: చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లోని మెయిజౌ నగరంలో బుధవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. చైనాలో ‘లేబర్ డే’సందర్భంగా ఐదు రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి.
దీంతో గ్వాంగ్‌డాంగ్– ఫుజియాన్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెయిజౌ నగరంలోని కొండప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాలపాలయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment