guangdong province
-
చైనాలో వరద బీభత్సం: 53 మంది మృతి
బీజింగ్: ఆకస్మిక వర్షాలు, వరదలతో దక్షిణ చైనా వణికిపోతోంది. వర్షాల ధాటికి కొండ చరియలు విరిగిపడుతున్నాయి. బురద ప్రవాహం గ్రామాలను ముంచెత్తుతోంది. వరదల కారణంగా గాంగ్‌డాంగ్ ప్రావిన్స్‌లో 47 మంది, ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. వర్షాలు, వరదల వల్ల భారీగా ఆస్తినష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. పెద్ద సంఖ్యలో ఇళ్లు కూలిపోయాయి. -
చైనాలో కొట్టుకుపోయిన ఎక్స్‌ప్రెస్ వే..
బీజింగ్: చైనాలో ప్రధాన రహదారి కొట్టుకుపోయిన ఘటనలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌లోని మెయిజౌ నగరంలో బుధవారం వేకువజామున ఘటన చోటుచేసుకుంది. చైనాలో ‘లేబర్ డే’సందర్భంగా ఐదు రోజుల సెలవులు బుధవారం నుంచే మొదలయ్యాయి. దీంతో గ్వాంగ్డాంగ్– ఫుజియాన్ ఎక్స్‌ప్రెస్ రహదారిపై వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. భారీ వర్షాల కారణంగా మెయిజౌ నగరంలోని కొండప్రాంతంలో ఉన్న 18 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. అనూహ్య పరిణామంతో 20 వరకు వాహనాలు అందులో పడిపోయాయి. కొన్ని వాహనాల్లో మంటలు చెలరేగి దగ్ధమయ్యాయి. వాటిలో ఉన్న 54 మందిలో 24 మంది చనిపోగా మరో 30 మంది గాయాలపాలయ్యారు. -
వెరైటీగా ప్రపోజ్ చేశాడు!
బీజింగ్: ప్రియురాలికి తన ప్రేమను విభిన్నంగా తెలిపాడో ప్రేమికుడు. వెరైటీగా ప్రపోజ్ చేసి వార్తల్లోకెక్కాడో చైనా లవర్. డైమండ్ రింగ్ బదులుగా డైపర్స్ తో తన ప్రేమను వ్యక్తం చేశాడు. 50పైగా డైపర్ ప్యాక్స్ తో ప్రపోజ్ చేశాడని స్థానిక మీడియా వెల్లడించింది. గ్వాంగ్ డాంగ్ ప్రావిన్స్ లోని గ్వాంగ్ జౌ నగరానికి చెందిన ఫెంగ్ రెండేళ్ల పాటు తన ప్రియురాలితో ప్రేమాయణం సాగించాడు. ఆమె నెల తప్పిందని తెలుసుకుని తన ప్రేమను వెరైటీగా తెలపాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా రంగంలోకి దిగాడు. తన స్నేహితుల సహాయంతో 4500 డైపర్లు కొని వీటిని 50 బ్యాగుల్లో పెట్టి హృదయాకారంలో ప్యాక్ చేశాడు. పెర్ల్ నది ఒడ్డున తన ప్రియురాలికి దీన్ని బహూకరించి ప్రేమను వ్యక్తం చేశాడు. అంతేకాదు మరో సర్ ప్రైజ్ కూడా ఇచ్చాడు. డ్రోన్ సహాయంతో మరో డైపర్ బ్యాగ్ ను ఆమెకు అందించాడు. ఇది ఓపెన్ చేయగానే ఫెంగ్ ప్రియురాలి ముఖం సంభ్రమాశ్చర్యాలతో వెలిగిపోయింది. డైపర్ బ్యాగ్ లోపల డైమండ్ రింగ్ పెట్టి ఆమెను ఆశ్చర్యపరిచాడు. 'ఈరోజు నుంచి నిన్ను, మనకు పుట్టబోయే బిడ్డను సంతోషంగా ఉంచడం నా బాధ్యత. నన్ను పెళ్లి చేసుకోమని కోరుతున్నా' అని ప్రపోజ్ చేయగా ఆమె వెంటనే అంగీకరించింది. -
దొంగ గారు.. భలే దొరికారు!
చదివింత... ‘ఎరక్కపోయి వచ్చాను... ఇరుక్కుపోయాను’’ అంటూ తీరిగ్గా రోజుల తరబడి విచారిస్తూ కూర్చున్నాడు ఆ దొంగ. ఆ కూర్చోవడం కూడా ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ మీద. చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్థుల భవనంలో చోరీకి ప్రయత్నించాడతను. ఆ ప్రయత్నంలో ఒక ఏసీ యూనిట్ మీదకు ఎక్కి అక్కడి నుంచి ఎలా దిగాలో తెలియక అక్కడే కూర్చుండిపోయాడు. తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో అలా ఇరుక్కుపోయిన ఈ దొంగగారిని భవనంలోని వారు గుర్తించి, ‘‘చోరుడా... ఇదేమీ చోద్యమురా?’’ అని కోపగించుకోకపోగా అయ్యో పాపం అనుకుంటూ అతనికి సాయం చేసేందుకు ప్రయత్నించారు. అయితే వారి సాయాన్ని తీసుకోవడానికి ముఖం చెల్లని ఆ దొంగ అదే చోట అలాగే కూర్చుండిపోయాడు. అదీ అరవై గంటల పాటు. దీంతో కాళ్ల దగ్గర తీవ్రమైన వాపు వచ్చేసరికి ఇక సాయం తీసుకోక తప్పలేదు. ఏకంగా అన్ని గంటల పాటు ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం నీళ్లు తప్ప అన్నీ వద్దన్న ఈ దొంగ ప్రస్తుతం పోలీసుల ఆతిథ్యంలో ఉన్నాడు. ...::: సత్యవర్షి