
సాక్షి, రాజమండ్రి(తూర్పుగోదావరి): గోదావరికి వరద నీరు పొటెత్తింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 11.75 అడుగులకు నీటిమట్టం చేరింది. 10.08 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ఉధృతి రేపటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు తెలిపారు.
శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు..
కర్నూలు: శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు చేరుకుంటోంది. ఇన్‌ఫ్లో 4.05 లక్షల క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 31,784 క్యూసెక్కులుగా ఉంది. ఎడమగట్టు (తెలంగాణ) కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. పూర్తిస్థాయి 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 117 టీఎంసీలు ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 863.70 అడుగులకు నీరు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment