
డెహ్రాడూన్ : భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తరాఖండ్ జలమయమైంది. జనజీవనం స్థంభించింది. ఉధృతమైన వరదల కారణంగా చమోలి జిల్లాలోని లంఖీ గ్రామంలో చూస్తుండగానే ఓ బంగ్లా కుప్పకూలింది. రాష్ట్ర విపత్తు స్పందన దళం హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించింది. బంగ్లాలో నివాసముండే ఏడుగురు శిథిలాల చిక్కుకున్నట్టు సమాచారం. దురదృష్టవశత్తూ వారిలో ఒక్కరు మినహా మిగతా ఆరుగురు మృత్యువాత పడ్డారు. ఇక రెండు రోజుల క్రితం తెహ్రీ జిల్లాలోని తార్థి గ్రామంలో ఓ ఇల్లు వరదల్లో పడి కొట్టుకుపోవడంతో 30 ఏళ్ల మహిళ, ఆరేళ్ల ఆమె తనయుడు ప్రాణాలు విడిచారు. రాష్ట్ర వ్యాప్తంగా వందలాది ఇళ్లు, పశువుల పాకలు వరదల తాకిడికి నేలమట్టమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment