
సాక్షి, శ్రీకాకుళం: ఒడిశాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో వరదనీరు పెరుగుతోంది. గొట్టా బ్యారేజి వద్ద లక్షా 10వేల క్యూసెక్‌ల ఇన్‌ఫ్లో, నాగావళిలో 75 వేల క్యూసెక్‌ల ఇన్ ఫో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లా అధికారులు రెడ్ ఆలెర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సహయక చర్యలకు కోసం పోలీసు, రెవెన్యూ, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కొత్తూరు మండలం పొనుగోటువాడ గ్రామం జల దిగ్బంధంలో ఉంది.
ఈ వరదల నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్చి, దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలను అప్రమత్రం చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్‌తో ఫోన్ మట్లాడారు. అదేవిధంగా వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి ఆదేశించారు. దీంతో పాటు నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా హెచ్చరికలు జారీ చేయమని తెలిపారు. వరద ప్రభావం ఉన్న అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతితో అధికారులు వంశధార నదికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ, నాగావళి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment