vamsadhara project
-
వంశధార పనులు చేసింది నేనే
ఎల్.ఎన్.పేట/కొత్తూరు (శ్రీకాకుళం):వంశధార ప్రాజెక్టు పనులను తానే చేపట్టానని.. తానే పూర్తి చేశానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టుల పరిశీలనలో భాగంగా గురువారం శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మరోసారి అధికారం ఇస్తే వంశధార నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూస్తానన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే విద్యుత్ చార్జీలు పెంచనని, అవకాశం కలిసి వస్తే విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత అంచలంచెలుగా 20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని స్పష్టం చేశారు. వలంటీర్లు తప్పుడు పనులు చేసుకుని తిరుగుతున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని, 18 ఏళ్లు పైబడిన వారి నుంచి పింఛన్ వచ్చేంత వరకు ప్రతినెలా ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. తల్లికి వందనం పేరుతో ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ రూ.15 వేల చొప్పున ఇస్తామన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న తనపై తప్పుడు కేసులు పెడుతున్నారని, హత్యాప్రయత్నం కేసు నమోదు చేశారని అన్నారు. పోలీసులు తమను కాపాడాలని, తర్వాత వారికి సహకరిస్తామని చెప్పారు. వంశధార నిర్వాసితుల నిరసన చంద్రబాబు కొత్తూరు మండలం గూనభద్ర వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కేవలం టీడీపీ నాయకులు మాత్రమే హాజరయ్యారని, నిజమైన నిర్వాసితులకు అనుమతి ఇవ్వలేదని ఇరపాడుకు చెందిన జి.శాంతకుమార్, పాడలికి చెందిన జి.వెంకటరమణలతో పాటు పలువురు నిర్వాసిత మహిళలు వేదిక ముందు నిరసన తెలిపారు. దీనివల్ల నిర్వాసితులకు ఒరిగేదేమీ లేదన్నారు. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు బలగాలతో తమను నెట్టేసిన చంద్రబాబు ఇప్పుడు తమ వద్దకు రావడం సరికాదని పాడలి ముంపు గ్రామానికి చెందిన పలువురు అన్నారు. వీరి నిరసనను టీడీపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఎస్ఐ గోవిందరావు సిబ్బందితో వచ్చి నిర్వాసితులను చెదరగొట్టారు. కార్యక్రమంలో కింజరాపు అచ్చెన్నాయుడు, రామ్మోహన్నాయుడు, కలమట వెంకటరమణ, కిమిడి కళావెంకటరావు తదితరులు పాల్గొన్నారు. -
గోదావరి, కృష్ణాలో వరద తగ్గుముఖం
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/చింతూరు/శ్రీశ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): పరీవాహక ప్రాంతాల(బేసిన్)లో వర్షాలు తగ్గడంతో గోదావరి, కృష్ణా నదుల్లో వరద ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 39.8 అడుగులకు తగ్గడంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు 48 గేట్ల నుంచి విడుదల చేస్తున్న ప్రవాహంలో ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,05,222 క్యూసెక్కులు వస్తోంది. ఇక్కడి నుంచి గోదావరి డెల్టాకు 11 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,94,222 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు కృష్ణాలో వరద ప్రవాహం తగ్గింది. కృష్ణా ప్రధాన పాయపై ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్రపై ఉన్న తుంగభద్ర డ్యామ్, భీమాపై ఉన్న ఉజ్జయిని డ్యామ్‌లు నిండుగా ఉండటంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తున్నారు.ప్రస్తుతం శ్రీశైలంలో 884.4 అడుగుల్లో 212.43 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 2,25,787 క్యూసెక్కులు చేరుతుండగా.. కుడి కాలువ ద్వారా 9,104, ఎడమ కాలువ ద్వారా 8,108, ఏఎమ్మార్పీ ద్వారా 2,400, వరద కాలువ ద్వారా 400, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 32,195 క్యూసెక్కులు, స్పిల్ వే 22 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 1,73,580 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 586 అడుగుల్లో 301.1 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి వదులుతున్న జలాల్లో పులిచింతలలోకి 2,01,752 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 5 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 1,31,213 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రం ద్వారా 8 వేలు వెరసి 1,39,213 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులో 169.71 అడుగుల్లో 37.95 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 1,36,531 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 12,901 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. 1,23,630 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధార, నాగావళి పోటాపోటీ: వంశధార, నాగావళి నదులు పోటాపోటీగా ప్రవహిస్తున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 48,583 క్యూసెక్కులు వస్తున్నాయి. ఆయకట్టుకు 1,665 క్యూసెక్కులు, కడలిలోకి 38,307 క్యూసెక్కులను వదిలేస్తున్నారు. నాగావళి నుంచి తోటపల్లి బ్యారేజ్‌లోకి 23,330 క్యూసెక్కులు చేరుతుండగా.. ఆయకట్టుకు 1,520 క్యూసెక్కులు, మిగులుగా ఉన్న 21,256 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
సిక్కోలు చిరకాల కల.. ఈ నెల 9న ఒడిశా ముఖ్యమంత్రితో సీఎం జగన్ భేటీ
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : నేరడి నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడీ అంటున్నారు. ఒక్కో అడ్డంకినీ అధిగమిస్తూ సిక్కోలు చిరకాల స్వప్నాన్ని నెరవేర్చేందుకు ముందడుగు వేస్తున్నారు. అందులో భాగంగా జల వివాదాలు పరిష్కరించుకునేందుకు 9వ తేదీన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్‌తో భేటీ కానున్నారు. ఈ చర్చలు ఫలవంతమై నేరడి నిర్మితమైతే అక్షరాలా రెండున్నర లక్షల ఎకరాల్లో బంగారం పండుతుంది. వంశధార స్టేజ్–2, ఫేజ్–2 పనుల్లో భాగంగా ప్యాకేజీ–87,88, హిరమండలం రిజర్వాయర్ పనుల కో సం ఇప్పటికే రూ. 1600 కోట్లు ఖర్చు చేయగా, ప నులు పూర్తి చేసేందుకు మరో రూ.600 కోట్లు అవసరం ఉంది. ఈ పనులు చేస్తూనే మరోవైపు నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టనున్నారు. రూ. 585 కోట్ల అంచనా వ్యయంతో ఇప్పటికే ప్రాజెక్ట్ రూపకల్పన చేయగా, తాజా ధరల మేరకు రివైజ్డ్ అంచనా వేసి ప్రాజెక్ట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. వైఎస్సార్ చొరవతోనే.. నేరడికి ఎప్పుడో శంకుస్థాపన పడినా పనుల్లో వేగం చూసింది మాత్రం వైఎస్సార్ హయాంలోనే. 1962 సెప్టెంబర్ 30న ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మద్య 50ః50 ప్రాతిపదికన వంశధార బేసిన్లో 115 టీఎంసీల నీటిని పంచుకునేందుకు ఒప్పందం జరిగింది. 2005లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి రూ. 944.90 కోట్లతో వంశధార ప్రాజెక్ట్ రెండో దశ నిర్మా ణానికి శ్రీకారం చుట్టారు. వంశధారపై నేరడి బ్యారే జీ నిర్మించి, అక్కడి నుంచి హై లెవెల్ కెనాల్ ద్వారా సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు వరద జలాలను తరలించి, గొట్టా బ్యారేజీ కింద 2.10 లక్షల ఎకరాలను స్థిరీకరించడంతో పాటు కొత్త గా 45 వేల ఎకరాలకు నీరందించాలని నిర్ణయించా రు. ఒడిశా ప్రభుత్వం నేరడికి అభ్యంతరం చెప్పడంతో భామిని మండలం కాట్రగడ్డ వద్ద వంశధారపై సైడ్‌వ్యూయర్ నిర్మించి అక్కడి నుంచి వరద జలాల ను సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లకు తరలించేలా అలైన్మెంట్ మార్చి పనులు చేపట్టారు. వివాదం తేలిన తర్వాత నేరడి బ్యారేజీ నిర్మా ణం చేపట్టాలని నిర్ణయించారు. కన్నెత్తి చూడని బాబు.. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్–13న ట్రి బ్యునల్ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు అమలయ్యేలా చూడడంలో అప్పటి సీఎం చంద్రబాబునాయుడు నిర్లక్ష్యం వహించారు. అప్పట్లోనే ఒడిశాతో చర్చలు జరిపి ఉంటే ఈ పాటికే ప్రాజెక్ట్ నిర్మాణం ఓ కొలిక్కి వచ్చి ఉండేది. కానీ వైఎస్సార్‌కు పేరు వస్తుందని బాబు ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి చూడలేదు. దీంతో జిల్లా రైతులకు నిరీక్షణ తప్పలేదు. వైఎస్సార్ తర్వా త మళ్లీ వైఎస్ జగన్ హయాంలోనే ఈ పనులకు కదలిక వచ్చింది. చదవండి: (Andhra Pradesh: ఆస్పత్రులకు ఆహ్వానం) ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే..? ►వంశధార జల వివాదంపై ట్రిబ్యునల్ ఆంధ్రాకు అనుకూలమైన తీర్పునిచ్చింది. ►నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్ ఆదేశించింది. ►115 టీఎంసీల నీరు వంశధారలో లభ్యత కాగా, రెండు రాష్ట్రాలు చెరి సగం పంచుకోవాలని సూ చించింది. ►బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని స్పష్టం చేసింది. ►కాట్రగడ్డ సైడ్ వ్యూయర్ వద్ద ఏర్పాటు చేసే హెడ్ రెగ్యులేటర్‌ను ఏటా జూన్ 1 నుంచి ఎనిమిది టీ ఎంసీలు మళ్లించే వరకూ లేదా నవంబర్ 30 వర కూ తెరిచి ఉంచాలని, డిసెంబర్ –1న మూసి వేయాలని షరతు పెట్టింది. ►నేరడి బ్యారేజీ నిర్మాణం పూర్తయిన తర్వాత కాట్ర గడ్డ సైడ్ వ్యూయర్‌ను పూర్తిస్థాయిలో తొలగించాలని, వంశధార నదీ యాజమాన్యం బోర్డు ఏర్పా టు ఉండాలని స్పష్టం చేసింది. ప్రభుత్వం చొరవ.. ట్రిబ్యునల్‌లో రాష్ట్ర ప్రభుత్వం సరైన వాదనలు వినిపించగలిగింది. దీంతో నేరడి బ్యారేజీ నిర్మాణానికి ట్రిబ్యునల్ అనుమతి లభించింది. ఏపీ అవసరాల కోసం బ్యారేజీకి కుడివైపున హెడ్ స్లూయిస్ నిర్మాణానికి అంగీకారం తెలిపింది. రూ. 8 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో కుడి స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒడిశా కోసం ఎడమవైపున కూడా స్లూయిస్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ట్రిబ్యునల్ ఎంత మేర నీటి అవసరమో అన్న విషయాన్ని గెజిట్ విడుదల చేసిన ఆరు నెలలు లోగా ఏపీకి తెలియజేయాలని సూచించింది. ప్రయోజనాలెన్నో.. ►నేరడి బ్యారేజీ నిర్మాణంతో ఖరీఫ్‌లో 2.50 లక్షల ఎకరాలకు, రబీలో 2 లక్షల ఎకరాలకు నీరు అందించవచ్చు. ►ఉద్దానం ప్రాంతానికి తాగునీటి సమస్య తీరుతుంది. ►ఇప్పటికే రూ. 700 కోట్లతో ఉద్దానంలో మంచినీటి పథకం పనులు జరుగుతున్నాయి. ►వంశధార–నాగావళి నదుల అనుసంధానానికి అనుగుణంగా పూర్తిస్థాయిలో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ►ఒడిశాలో 30 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వవచ్చు. ►హిరమండలం రిజర్వాయర్‌లోకి 19 టీఎంసీల నీరు చేరాలంటే 10 వేల క్యూసెక్కులకు పైగా నీటి ప్రవాహం 40 రోజుల పాటు రెగ్యులర్‌గా ఉండాలి. అదే నేరడి బ్యారేజీ నిర్మాణం జరిగితే ఈ సమస్య తప్పుతుంది. -
వంశధార ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరం: సీఎం జగన్
సాక్షి, అమరావతి: వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ తీర్పు సంతోషకరమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ట్రిబ్యునల్ నిర్ణయం ఏపీ, ఒడిశాకు ప్రయోజనకరంగా ఉంటుందని తెలిపారు. గెజిట్ విడుదలైన తర్వాత వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. నేరడి బ్యారేజీ శంకుస్థాపనకు ఒడిశా ముఖ్యమంత్రిని ఆహ్వానిస్తామని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. కాగా వంశధార నదీ జలాల వినియోగంపై ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ ఇచ్చిన తుది తీర్పునే వీడబ్ల్యూడీటీ (వంశధార జల వివాదాల ట్రిబ్యునల్) ఖరారు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 13, 2017న ఇచ్చిన తుది తీర్పుపై అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం–1956 సెక్షన్–5(3) కింద ఒడిశా సర్కార్ లేవనెత్తిన అభ్యంతరాలను తోసిపుచ్చింది. ఈ మేరకు సోమవారం వీడబ్ల్యూడీటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందకం శర్మ ఉత్తర్వులు జారీ చేస్తూ కేంద్రానికి నివేదించారు. వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తే.. ఆ తీర్పు అమల్లోకి వస్తుంది. తుది తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఆధారంగా కేంద్రం ఆ తీర్పును నోటిఫై చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. చదవండి: వంశధార జలాల వివాదానికి చరమగీతం ఆ ఘటన నా మనసును కలచివేసింది: సీఎం జగన్ -
టీడీపీ నేతలతో కుమ్మక్కై..
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ఎన్నికలకు ముందు బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టు పేరుతో కాంట్రాక్టర్లకు లబ్ధి చే కూర్చి ప్రజాధనం మింగేద్దామని టీడీపీ నాయకులు వేసిన ప్లాన్ ఎట్టకేలకు బట్టబయలైంది. ఈ బాగోతంలో అధికారులతో పాటు అప్పటి వంశధార ఎస్ఈ సురేందర్ పేరు కూ డా బయటకు రావడం విస్మయం కలిగిస్తోంది. ప్రారంభం కాని ప్రాజెక్టులను రద్దు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించడంతో ఫర్వాలేకపోయింది. లేదంటే ఈ ప్రా జెక్టు ముసుగులో వేల కోట్ల రూపాయలను తినేసేవారే. టీడీపీ నేతలను పక్కన పెడితే బాధ్యత గల అధికారిగా పనిచేయాల్సిన గత ఎస్ఈ అవినీతిలో భాగస్వామి కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అంతా కలిపి కుమ్మక్కై దోచేద్దామని ప్రయత్నించినా ఈ ప్రభుత్వం అడ్డుకోగా, అంతకుముందే డీపీఆర్, ఇతరత్రా పేరిట లక్షలాది రూపాయల అక్రమాలకు పాల్పడిన వ్యవహారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలినట్టు సమాచారం. (చదవండి: ప్రకాశం జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ..) టీడీపీ హయాంలో దోపిడీకి ప్రణాళిక వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 110 కిలోమీటర్ల పొడవునా హైలె వల్ కెనాల్ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని అప్పటి సర్కార్ నిర్ణయించింది. వంశధార, బాహుదా నదులు అనుసంధానం చేసి, 75వేల ఎకరా ల ఆయకట్టుకు నీరందించేందుకు రూ.1075 కోట్లతో 2015 లో బాహుదా ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశా రు. 2019 ఫిబ్రవరి 11న ఇదే ప్రాజెక్టును 2లక్షల ఎకరాల ఆయకట్టుకు పెంచి రూ.6,326.62కోట్లతో డిజైన్ చేసి టెండర్ల నోటిఫికేషన్ పిలిచారు. ఇందులో 90వేల ఎకరాలు స్థిరీకరణ కింద, లక్షా 10వేల ఎకరాల కొత్త ఆయకట్టు కింద నిర్దేశించారు. నాలుగేళ్ల కాలంలో లక్షా 25వేల ఎకరాల మేర అ దనపు ఆయకట్టు చూపించి, రూ. 5,251 కోట్ల మేర అదనంగా అంచనా వ్యయం పెంచారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందు డిజైన్ చేసి, ఫిబ్రవరి 11న టెండర్లు పిలిచారు. అదే నెల 27న ప్రైస్‌బిడ్ టెండర్లు తెరిచారు. (చదవండి: ఆ పాపం ముమ్మాటికీ చంద్రబాబుదే) వంశధార ప్రాజెక్టు రెండో దశలో హిరమండలం రిజర్వాయర్ నుంచి 110 కిలోమీటర్ల పొడవున హైలెవల్ కెనాల్ తవ్వి ఇచ్ఛాపురం సమీపంలోని బాహుదా నదిలోకి వంశధార జలాలను తరలించి రెండు నదులను అనుసంధానం చేయాలని సర్కార్ నిర్ణయించింది. హిరమండలం రిజర్వాయర్ నుంచి తరలించడం ద్వారా ఇచ్ఛాపురం, టెక్కలి, పలాస నియోజకవర్గాల్లోని 14 మండలాల్లో 2లక్షల ఎకరాలకు నీరందించాలనేది ప్రాజెక్టు ఉద్దేశం. ఈ కెనాల్‌కు అనుబంధంగా 8.30 టీఎంసీల సామర్థ్యంతో ఆరు రిజర్వాయర్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఆ మేరకు ఎన్నికల షెడ్యూల్‌కు ముందు పరిపాలన అనుమతి ఇచ్చే సింది. ఈ పనులను ఐదు ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలవాల్సి ఉండగా చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పనులను ఖరారు చేశారు. అంచనా వ్యయం పెంచి.. నాటి సీఎం చంద్రబాబునాయుడు స్వ యంగా జోక్యం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు డిజైన్ దగ్గరి నుంచి టెండర్ల పిలిచే వరకు కథ నడిపించారు. దానికి అప్పట్లో పనిచేసిన బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్టు సర్కిల్ సూపరింటెండెంట్ సురేందర్‌రెడ్డిని పావుగా వాడుకున్నా రు. చంద్రబాబు ఒత్తిడి మేరకు కేవలం రెండు ప్యాకేజీల కింద నాటి సూపరింటెండెంట్ ఇంజినీర్ పనులను ఖరారు చేశారు. 0 కిలోమీటర్ల నుంచి 55 కిలోమీటర్ల వరకూ కాలువ తవ్వకం, పెద్ద లో గిడి, రంగసాగరం, మల్లివీడు రిజర్వా యర్ల నిర్మాణానికి రూ.1618.24 కోట్లతో, 55 కిలోమీటర్ల నుంచి 110 కిలోమీటర్ల వరకూ కాలువ తవ్వకం, ఆళ్లకోలి, హంసరాళి, కంచిలి రిజర్వాయర్ల నిర్మాణ పనులకు రూ. 2,452.85కోట్లను అంచనా వ్యయంగా నిర్ణయించి లంప్సమ్– ఓపెన్ విధానంలో టెండర్లు పిలిచారు. టెండర్ల నోటిఫికేషన్ జారీ చేయకుముందే తన అనుయాయులైన ఇద్దరు కాంట్రాక్టర్లు రెండు ప్యాకేజీలకు షెడ్యూల్ దాఖలు చేసేలా ఒక్కొక్కరు ఒక్కో ప్యాకేజీ దక్కించుకునేలా వ్యూహరచన చేసి, ఆ కాంట్రాక్టర్‌కు ఉన్న అర్హతలనే టెండర్లలో నిబంధనలు పొందుపరిచారు. ఇంకేముంది.. అనుకున్నట్టే కుమ్మక్కైన వారికి రూ.1618.24కోట్ల ప్యాకేజీని రూ. 1695.11 కోట్లకు, రూ.2452.85కోట్ల ప్యాకేజీని రూ.2572.06కోట్లకు కట్టబెట్టారు. ఇదంతా వేల కోట్లు కొట్టేసేందుకు వ్యూహాత్మకంగా డిజైన్ చేసిన ప్రాజెక్టుగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇందులో గత ఎస్ఈ సురేందర్ పాత్ర డీపీఆర్ పేరుతో రూ.64,20,345 అడ్డగోలుగా ఇచ్చి ప్రభు త్వ ఖజానా ఖాళీ చేశారు. డబుల్ చెక్ బెంచ్‌మార్క్ లెవల్స్ చూసి పోల్స్ వెయ్యడానికి సాధారణంగా 2శాతం మాత్రమే వెచ్చించాలి కాని 20 శాతం నిధులు వెచ్చించి వృధాగా ఖ ర్చు చేశారు. 120 కిలోమీటర్ల మేర (కొండలు, నదులు, రోడ్లు) వంటి ప్రాంతాల్లో ఆయా ప్రాంతాలను బట్టి కెనాల్ మొత్తం గ్రిడ్ లెవల్లు తీయాలి, పుస్తకాల్లో రికార్డు చేయాలి. అవేమీ లేకుండా నిధులు కాజేశారన్న వాదనలు ఉన్నాయి. ఎస్ఈ, ఈఈగా వ్యవహరించి పుస్తకాల్లో రికార్డు చేయకుండా అందులో పేర్కొన్న సెక్షన్లతో సంబంధం లేకుండా పే మెంట్ చేశారు. అన్ని రికార్డులు ఇచ్చిన తర్వాతే 25 శాతం నిధులు మంజూరు చేయాల్సి ఉన్నా అవేమీ లేకుండా మధ్యలోనే ఆ 25 శాతం నిధులు రిలీజ్ చేశారు. క్వాలిటీ కంట్రోల్ సరి్టఫికెట్ లేకుండా ఒక్క బిల్లు కూడా ఇవ్వకూడదు. కానీ ఎ ల్‌ఎస్ 1పార్ట్ బిల్లు, 2 అండ్ 3 బిల్లులు చేసేశారు. ప్రాథమిక అంచనాలో రూ.1040 కోట్లుగా ఇచ్చి అమాంతంగా ఆ ప్రా జెక్టు రేటును రూ.6342.55కోట్లకి పెంచేసి ఆ నిధుల కోసం పథక రచన చేశారని ఎస్ఈపై నిర్వహించిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో తేలినట్టు తెలిసింది. అంతేకాకుండా కాంట్రాక్టర్ నకిలీ బ్యాంకు గ్యారెంటీని ఇవ్వగా, అదేదీ చూడకుండా తీసుకుని కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇచ్చేశారని, ఇలాంటి నకిలీదేదైనా జరిగితే ప్రభుత్వానికి తెలియజేయాల్సి ఉన్నా అవేమీ చేయకుండా కాంట్రాక్టర్‌తో ఒప్పందం చేసుకుని తిరిగి ఇచ్చేశారని విచారణలో తేలినట్టు సమాచారం. అంతేకాకుండా వంశధార ట్రిబ్యునల్ టీమ్ ఖర్చుల పేరుతో ఎలాంటి సాంకేతిక మంజూరు లేకుండా సురేంద్ర ఇష్టం వచ్చిన వ్యక్తులకు ఇచ్చేసి అక్రమాలకు పాల్పడ్డారని తేల్చారు. కార్యాలయంలో కేస్ వర్కర్లు అంటే సూపరింటెండెండ్, జేఈ, ఏఈ, ఈఈలతో సంబంధం లేకుండా ఎస్టిమేట్ల మీద ఎస్ఈ సంతకాలతోనే ఫైల్ రన్ చేసేశారని విచారణలో తేలినట్టు సమాచారం. -
జూన్ నాటికి వంశ'ధార'
సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి అనుసంధానం పనులను జూన్ నాటికి పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది. దీనికి అవసరమైన రూ.463.29 కోట్లను విడుదల చేయాలని ఆర్థిక శాఖకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. నీటి సంవత్సరం ప్రారంభమయ్యేలోగా పనులు పూర్తి చేసి వంశధార జలాలను కొత్తగా 60 వేల ఎకరాల ఆయకట్టుకు అందించడంతోపాటు 2.47 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరించడానికి మార్గం సుగమం చేయాలని నిర్ణయించారు. వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా రూపురేఖలను సమూలంగా మార్చే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పనులకు ప్రాధాన్యతనిస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో ప్రారంభమై.. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం నేరడి వద్ద వంశధార నదిపై బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో రైతులకు ముందస్తుగా సాగు, తాగునీటిని అందించాలనే లక్ష్యంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి.. వంశధార ప్రాజెక్టు రెండో దశ డిజైన్‌లో మార్పులు చేసి 2004లో చేపట్టారు. కాట్రగడ్డ వద్ద వంశధారపై తాత్కాలికంగా సైడ్ వియర్(మత్తడి) నిర్మించి, రోజుకు ఎనిమిది వేల క్యూసెక్కుల నీటిని తరలించి 0.069 టీఎంసీల సామర్థ్యంతో సింగిడి వద్ద ఒకటి, 0.404 టీఎంసీలు నిల్వ చేసుకునేలా పారాపురం వద్ద మరొకటి.. హీరమండలం వద్ద 19.05 టీఎంసీల సామర్థ్యంతో మరొక రిజర్వాయర్‌ను నిర్మించే పనులను చేపట్టారు. 2009 నాటికే సింహభాగం పూర్తయ్యాయి. మిగిలిన పనులను పూర్తి చేయడంలో 2009– 2019 మధ్య ఉన్న ప్రభుత్వాలు విఫలమయ్యాయి. జూన్‌లోనే నారాయణపురం ఆయకట్టుకు నీళ్లు.. నాగావళిలో జూలై ఆఖరు నాటికిగానీ వరద ప్రారంభం కాదు. దీని వల్ల నాగావళి నదిపై ఉన్న నారాయణపురం ఆనకట్ట కింద 37 వేల ఎకరాల్లో సకాలంలో ఖరీఫ్ పంటలు సాగు చేయలేని దుస్థితి నెలకొంది. ఈ దుస్థితిని తప్పించేందుకు హీరమండలం రిజర్వాయర్ నుంచి రోజుకు ఐదు వేల క్యూసెక్కుల వంశధార జలాలు 33.24 కిమీల పొడువున తవ్వే హైలెవల్ కెనాల్ ద్వారా నారాయణపురం జలాశయంలోకి తరలిస్తారు. తద్వారా వంశధార–నాగావళి నదులను అనుసంధానం చేసే పనులనూ జూన్ నాటికి పూర్తిచేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ హైలెవల్ కెనాల్ కింద కొత్తగా 15 వేల ఎకరాల ఆయకట్టుకు, నారాయణపురం ఆయకట్టుకూ ఖరీఫ్‌లో సకాలంలో నాట్లుపడేలా నీళ్లివ్వాలని నిర్ణయించారు. వంశధార ప్రాజెక్టు రెండో దశ, వంశధార–నాగావళి నదుల అనుసంధానం వల్ల కొత్త, పాత కలిపి 3.07 లక్షల ఎకరాలు సస్యశ్యామలమవుతాయని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. శరవేగంగా పూర్తిచేయాలని... వంశధార ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా చేపట్టాలని ఈనెల 13న నిర్వహించిన సమీక్షలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్ పనుల్లో మిగిలిన వాటిని వరద ప్రారంభమయ్యేలోగానూ, సింగిడి బ్యారేజీ పనులను జూన్ నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. హీరమండలం రిజర్వాయర్ స్పిల్ వే, రివిట్మెంట్ పనులు పూర్తి చేయడం ద్వారా 19.05 టీఎంసీలు నిల్వ చేసేందుకు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. జూన్‌లోనే జాతికి అంకితం చేయాలని నిర్ణయించారు. -
నొక్కేసింది.. కక్కించాల్సిందే
సాక్షి, అమరావతి: భైరవానితిప్ప ప్రాజెక్టు(బీటీపీ) ఎత్తిపోతల, వంశధార ప్రాజెక్టు రెండో దశ, గాలేరు–నగరి సుజల స్రవంతి ప్రాజెక్టుల కాలువల్లో నీటి ప్రవాహం మాటేమోగానీ అక్రమాలు పోటెత్తాయని నిపుణుల కమిటీ తేల్చింది. గత ప్రభుత్వ హయాంలో పాత కాంట్రాక్టర్లపై 60–సీ నిబంధన కింద వేటు వేసి.. మిగిలిన పనుల వ్యయాన్ని భారీగా పెంచేసి.. ఎంపిక చేసిన కాంట్రాక్టర్లకే పనులప్పగించి, ప్రజాధనం దోచుకున్నారని స్పష్టం చేసింది. అంచనా వ్యయం పెరగడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పెరిగిందని.. పనులు మాత్రం పూర్తి కాలేదని పేర్కొంది. ఈ వ్యవహారంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరిపించి.. కాంట్రాక్టర్లు దోచేసిన సొమ్మును వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ మేరకు తాజాగా తన నివేదికను సమర్పించింది. భూసేకరణ లేకుండానే పనులా? అనంతపురం జిల్లాలో హంద్రీ–నీవా తొలి దశలో భాగమైన జీడిపల్లి రిజర్వాయర్ నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టులోకి(బీటీపీ) నీటిని ఎత్తిపోసి, ఆయకట్టుకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించే పనులకు అక్టోబర్ 24, 2018న రూ.968.99 కోట్లతో అప్పటి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. హంద్రీ–నీవాలో నీటి లభ్యతపై అధ్యయనం చేయకుండానే.. 3.7 టీఎంసీల సామర్థ్యంతో బీటీపీ ఎత్తిపోతలకు అనుమతిచ్చారని నిపుణుల కమిటీ పేర్కొంది. కాలువ పనులను రూ.358.20 కోట్లకు బీఎస్సార్ ఇన్ఫ్రాకు.. 14 పంప్‌హౌస్‌ల మెకానికల్ పనులను రూ.175 కోట్లకు మరో కాంట్రాక్టు సంస్థకు కట్టబెట్టారు. తక్కువ సామర్థ్యం కలిగిన పంప్‌లు వాడేందుకు స్కెచ్ వేశారు. కాలువల తవ్వకానికి 1,407 ఎకరాలు అవసరం కాగా, ఒక్క ఎకరా కూడా సేకరించకుండానే రూ.33.02 కోట్ల విలువైన(8.94 శాతం) పనులు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. నీటి లభ్యతను పున:సమీక్షించి, ఈ పథకం పనులు చేపట్టడంపై తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. వంశధారకు అవినీతి మకిలి వంశధార ప్రాజెక్టు రెండో దశ అంచనా వ్యయాన్ని రూ.933 కోట్ల నుంచి రూ.1,616.23 కోట్లకు పెంచేస్తూ ఫిబ్రవరి 26, 2016న అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. - 87వ ప్యాకేజీ పనులను 2005లో ‘హార్విన్’కు రూ.72.64 కోట్లకు అప్పగించారు. రూ.11.48 కోట్ల విలువైన పనులను ఆ సంస్థ చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసి, కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసింది. మిగిలిన రూ.61.16 కోట్ల పనుల వ్యయాన్ని రూ.181.58 కోట్లకు పెంచేసి.. 18 నెలల్లో పూర్తి చేసేలా అప్పటి టీడీపీ నేత సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ ప్రాజెక్టŠస్ సంస్థకు అప్పగించడంపై నిపుణుల కమిటీ విస్మయం వ్యక్తం చేసింది. అంచనా వ్యయాన్ని ఒకేసారి 300 శాతం పెంచినా సీఎం రమేష్ సంస్థ సకాలంలో పనులు పూర్తి చేయలేకపోయిందని వివరించింది. పనులు పూర్తి చేయని రిత్విక్ సంస్థకు అదనంగా రూ.11.35 కోట్ల విలువైన పని అప్పగించడాన్ని తప్పుబట్టింది. ఇప్పటివరకూ ఆ సంస్థ రూ.98 కోట్ల విలువైన పనులు చేసినట్లు అధికారులు నివేదిక ఇచ్చారని.. చేసిన పనులను సక్రమంగా లెక్కించకుండానే బిల్లులు చెల్లించారని తెలిపింది. - 88వ ప్యాకేజీ పనులను 2005లో రూ.66.68 కోట్లకు శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ దక్కించుకుంది. 2016 నాటికి రూ.20.76 కోట్ల విలువైన పనులు చేసింది. 2016లో ఆ సంస్థపై సర్కార్ వేటు వేసింది. మిగిలిన రూ.45.92 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.1,79.51 కోట్లకు పెంచేసి సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ సంస్థ అప్పగించింది. ఈ పనులు 18 నెలల్లో పూర్తి చేయాలి. కానీ, ఇప్పటికి రూ.69.34 కోట్ల విలువైన పనులను మాత్రమే చేసింది. 38.63 శాతం పనులు చేయని ఆ సంస్థకే అదనంగా రూ.18.91 కోట్ల పనులను అప్పగిస్తూ ఒప్పందాలు చేసుకోవడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. - చేయని పనులకు 87వ ప్యాకేజీలో రూ.14.68 కోట్లు.. 88వ ప్యాకేజీలో రూ.3.18 కోట్లు చెల్లించారు. ఆ సొమ్మును తక్షణమే రికవరీ చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. కాంట్రాక్టర్ల అలసత్వం వల్ల ఆయకట్టుకు నీళ్లందకపోవంతోపాటు ఖజానాపై భారీ ఎత్తున భారం పడిందని తేల్చింది. పనులు చేయని కాంట్రాక్టర్ల నుంచి జరిమానా వసూలు చేయాలని, అక్రమాలకు పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్‌కు సిఫార్సు చేసింది. గాలేరు–నగరిలో.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం తొలి దశ పనులు 2014 నాటికే పూర్తయ్యాయి. కానీ, అంచనా వ్యయాన్ని రూ.2,155.45 కోట్ల నుంచి రూ.2,800.82 కోట్లకు పెంచుతూ 2015లో సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పాత కాంట్రాక్టర్లపై వేటు వేసి.. అయిన వారికి అప్పగించి భారీ ఎత్తున దోచేశారని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. - గాలేరు–నగరిలో 29వ ప్యాకేజీ పనులను రూ.171.63 కోట్లకు 2005లో దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ 2014 నాటికే రూ.166.69 కోట్ల పనులు పూర్తి చేసింది. కేవలం రూ.4.94 కోట్ల పనులు మాత్రమే మిగిలాయి. ఈ పనుల వ్యయాన్ని రూ.110.91 కోట్లకు పెంచేసి సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌కు అప్పగించి.. బిల్లులు చెల్లించేశారని.. ఈ అక్రమాలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగంతో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. కాంట్రాక్టర్ దోచేసిన సొమ్మును రికవరీ చేయాలని సర్కార్‌కు నిపుణుల కమిటీ సూచించింది. - గాలేరు–నగరి 30వ ప్యాకజీ పనుల్లో భాగమైన అవుకు సొరంగం పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడటం వల్ల సొరంగం బదులుగా లూప్ వేయాల్సి వచ్చింది.. ఈ పనులకు రూ.50.69 కోట్లు చెల్లించారని.. ధరల సర్దుబాటు కింద రూ.14.07 కోట్లను అదనంగా దోచిపెట్టారని పేర్కొంది. -
‘నేరడి’పై ట్రిబ్యునల్ కీలక ఆదేశం
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, అమరావతి: నేరడి బ్యారేజీ నిర్మాణ పనులకు మార్గం సుగమం చేసే దిశగా వంశధార నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) నేతృత్వంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, ఒడిశా ప్రభుత్వాలు సంయుక్తంగా సర్వే చేసి, ఆరు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఈ నివేదిక ఆధారంగా జనవరి 10, 2020న ఉత్తర్వులు జారీ చేస్తామని స్పష్టం చేసింది. తాజా ఆదేశాలను రెండు నెలలపాటు నిలుపుదల చేయాలని ఒడిశా చేసిన విజ్ఞప్తిని కూడా ట్రిబ్యునల్ తిరస్కరించింది. వంశధార ట్రిబ్యునల్ చైర్మన్ ముకుంద శర్మ నేతృత్వంలో సభ్యులు జస్టిస్ బీఎన్ చతుర్వేది, ప్రతిభారాణి, సీఎస్ విద్యానాథన్, డి.శ్రీనివాసన్, గుంటూరు ప్రభాకర్, గణేశన్ ఉమాపతి, వై.రాజగోపాలరావు, ఎమ్మెస్ అగర్వాల్, సుఖ్‌దేవ్ సారంగి, కటారి మోహన్, వసీం ఖాద్రీలతో కూడిన బృందం గతేడాది డిసెంబర్ 22 నుంచి 29 మధ్య శ్రీకాకుళంతో పాటు ఒడిశాలో వంశధార పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టులను పరిశీలించారు. తమ అధ్యయనంలో వెల్లడైన అంశాల ఆధారంగా గతంలో ఇరు రాష్ట్రాల వాదనలు విన్న వంశధార ట్రిబ్యునల్.. సీడబ్ల్యూసీ నేతృత్వంలో నేరడి బ్యారేజీ వల్ల ఇరు రాష్ట్రాల్లో ముంపునకు గురయ్యే ప్రాంతాలను సర్వే చేసి.. మ్యాపులు తయారీ చేసి జూన్ 30లోగా ఇవ్వాలని ఏప్రిల్ 5న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో నేరడి బ్యారేజీ నిర్మాణం వల్ల ఆంధ్రప్రదేశ్‌లో ముంపునకు గురయ్యే భూములను సర్వే చేయడానికి రూ. 15.68 లక్షలు, ఒడిశాలో ముంపునకు గురయ్యే భూములను గుర్తించే పనులకు రూ. 5.91 లక్షల వ్యయంతో ఏపీ సర్కార్ టెండర్లు పిలిచింది. కానీ, ఒడిశా సర్కార్ సంయుక్త సర్వేకు అంగీకరించలేదు. ఇదే విషయాన్ని సోమవారం ఏపీ సర్కార్ వంశధార ట్రిబ్యునల్‌కు వివరించింది. దాంతో.. వరదలు తగ్గాక అంటే అక్టోబర్ ఆఖరు నుంచి ఆరు వారాల్లోగా సర్వేను పూర్తి చేసి నివేదిక ఇవ్వాలని వంశధార ట్రిబ్యునల్ ఆదేశించింది. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది రాజగోపాల్, రాష్ట్ర అధికారులు ట్రిబ్యునల్ విచారణకు హాజరయ్యారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జలకళాంధ్ర..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సరిగ్గా దశాబ్దం తర్వాత కృష్ణా, గోదావరి, వంశధార నదులు పోటాపోటీగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఆగస్టు 11వ తేదీ నాటికే నదీ పరీవాహక ప్రాంతంలో ప్రాజెక్టులు నిండుకుండల్లా మారాయి. కృష్ణా, వంశధార నదుల్లో సెప్టెంబరు వరకూ.. గోదావరి నదిలో అక్టోబర్ వరకూ వరద ప్రవాహం ఉంటుంది. రుతుపవనాల వల్ల సమృద్ధిగా వర్షాలు కురిస్తే పెన్నా నది కూడా పొంగుతుంది. వర్షాలు ఇలాగే కొనసాగితే మధ్య తరహా ప్రాజెక్టులు సైతం నిండుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. 2009 తర్వాత జీవనదులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకోవడంతో సింహభాగం ప్రాజెక్టుల కింద ఆయకట్టులో ఖరీఫ్, రబీ పంటల సాగుకు అవకాశం ఏర్పడిందని సాగునీటి రంగ నిపుణులు చెబుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఇప్పటికే గోదావరి డెల్టాలో 10.13 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. కృష్ణా డెల్టాలో 13.09 లక్షల ఎకరాలకు సాగునీరు విడుదల చేశారు. వంశధార నది పోటెత్తుతుండటంతో గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే 25.53 లక్షల ఎకరాల్లో వరి పంట సాగులో రైతులు నిమగ్నమయ్యారు. ఉత్తరాంధ్రలో నాగావళి నది ఉధృతంగా ప్రవహించడంతో తోటపల్లి జలాశయం నిండిపోయింది. తోటపల్లి జలాశయం కింద ఉన్న ఆయకట్టు 1.18 లక్షల ఎకరాలకు నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని 10.38 లక్షల ఎకరాలకు ఆదివారం ఆంధ్రపదేశ్ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్, తెలంగాణ మంత్రి జగదీష్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. నాగార్జున సాగర్ ఆయకట్టుకు ఆగస్టు రెండో వారంలోగా నీటిని విడుదల చేయడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఆనందోత్సాహాలు కృష్ణా, తుంగభద్ర నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండడం, ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తుండడంతో రాయలసీమ, నెల్లూరు జిల్లాల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ నీటితో శ్రీశైలం కుడిగట్టు కాలువ (ఎస్ఆర్బీసీ) కింద 1.54 లక్షల ఎకరాల్లో పంటల సాగులో రైతులు నిమగ్నమయ్యారు. తెలుగుగంగ ప్రాజెక్టు కింద కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల్లో 4.36 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. ఈ ఆయకట్టులో పంటల సాగుకు రైతులు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగుగంగ ప్రధాన కాలువ ద్వారా సోమశిల, కండలేరు జలాశయాలను నింపనున్నారు. దీనివల్ల పెన్నా డెల్టా పరిధిలోని 2.47 లక్షల ఎకరాలు, సోమశిల ప్రాజెక్టు కింద 1.56 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ప్రణాళిక రచించారు. తుంగభద్ర నది పరవళ్లు తొక్కుతుండడంతో ఇప్పటికే తుంగభద్ర జలాశయం నిండిపోయింది. ఈ ఏడాది తుంగభద్రలో నీటి లభ్యత పెరిగే అవకాశం ఉంది. తుంగభద్ర నదిపై ఆధారపడిన కర్నూలు–కడప(కేసీ) కెనాల్‌కు ఇప్పటికే నీటిని విడుదల చేశారు. ఈ కెనాల్ కింద 2.66 లక్షల ఎకరాల్లో పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. తుంగభద్ర జలాశయం నుంచి ఎగువ కాలువ(హెచ్చెల్సీ), దిగువ కాలువలకు(ఎల్లెల్సీ) సోమవారం నుంచి నీటిని విడుదల చేయనున్నారు. హెచ్చెల్సీ కింద 2.2 లక్షల ఎకరాలు, ఎల్లెల్సీ కింద 1.51 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. ఈ ఏడాది గాలేరు–నగరి, హంద్రీ–నీవా తొలి దశ ఆయకట్టుకు నీళ్లందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. మధ్యతరహా ప్రాజెక్టుల ఆయకట్టులోనూ... భూపతిపాలెం, ముసురుమిల్లి వంటి మధ్య తరహా ప్రాజెక్టులు నిండిపోయాయి. దాంతో ఆయా ప్రాజెక్టుల కింద ఆయకట్టులో పంటల సాగును రైతులు ప్రారంభించారు. కృష్ణా, గోదావరి, వంశధార, నాగావళి నదీ పరివాహక ప్రాంతాల్లోని ఎత్తిపోతల పథకాల కింద ఆయకట్టుకు సైతం అధికారులు నీటిని విడుదల చేశారు. చిన్న తరహా ప్రాజెక్టులు, చెరువులు కొంతవరకు నిండాయి. నీటి లభ్యత ఆధారంగా వాటి ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో గోదావరి డెల్టాతోపాటు నీటి లభ్యత ఆధారంగా మరిన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది రబీ పంటకు కూడా సాగునీరందించే అవకాశాలు ఉండటంతో రైతన్నల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటి వరకు సాగుకు నీటి విడుదలిలా - ధవళేశ్వరం నుంచి గోదావరి డెల్టాలోని 10.13 లక్షల ఎకరాలకు - కృష్ణా డెల్టాలోని 13.09 లక్షల ఎకరాలకు - గొట్టా బ్యారేజీ నుంచి 2.31 లక్షల ఎకరాలకు - తోటపల్లి జలాశయం కింద ఉన్న 1.18 లక్షల ఎకరాలకు - సాగర్ ప్రాజెక్టు కుడి కాలువ కింద 11.74 లక్షల ఎకరాలకు, ఎడమ కాలువ కింద ఏపీ, తెలంగాణలోని 10.38 లక్షల ఎకరాలకు -
పొంచి ఉన్న జలగండం..
సాక్షి, వీరఘట్టం (శ్రీకాకుళం):తోటపల్లి ప్రాజెక్టు వద్ద ప్రమాద స్థాయికి చేరిన వరదనీరు అల్పపీడనం కారణంగా ఒడిశాలో కురుస్తున్న భారీ వర్షాలకు తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తడంతో బుధవారం నదిలో నీటి ప్రవాహం పెరిగి నాగావళి ఉగ్రరూపం దాల్చింది. మంగళవారం రాత్రి ప్రాజెక్టు వద్ద 103.80 మీటర్ల లెవెల్ ఉన్న నీటిప్రవాహం బుధవారం ఉదయం 6 గంటలకు 104.1 మీటర్లకు చేరింది. అలాగే ప్రాజెక్టు గరిష్ట నీటి సామర్థ్యం 2.5 టీఎంసీలకు వరద నీరు చేరడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఉదయం 6 గంటలకు 5 గేట్ల ద్వారా 26 వేల క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. ప్రతి గంటకు ప్రాజెక్టు వద్ద నీటి ఉద్ధృతి పెరుగుతుండడంతో అప్రమత్తమైన అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తివేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాజెక్టుకు వరద తాకిడి తగ్గుముఖం పట్టడంతో 55,511 క్యూసెక్కుల చొప్పు న మధ్యాహ్నం రెండు గంటల వరకు ఒకేలా నీటిని నదిలోకి విడిచిపెట్టారు. రాత్రికి వరద నీరు పోటెత్తే అవకాశం ఉన్నందున సిబ్బందిని అప్రమత్తం చేశామని ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. రెండేళ్ల తర్వాత.. రెండేళ్ల తర్వాత తోటపల్లి ప్రాజెక్టుకు వరద నీరు ఇంతలా పోటెత్తిందని అధికారులు అంటున్నారు. కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నాగావళి పరవళ్లు తొక్కుతుండడంతో సమీప గ్రామ ప్రజలు ప్రవాహాన్ని చూసేందుకు బారులు తీరుతున్నారు. అప్రమత్తమైన యంత్రాంగం నాగావళి నదిలో నీటి ప్రవాహం పెరుగుతుందని తెలియడంతో వీరఘట్టం రెవెన్యూ సిబ్బంది తహసీల్దార్ ఎస్.కిరణ్‌కుమార్, ఆర్.ఐ రమేష్, ప్రసాదరావు,సీనియర్ అసిస్టెంట్ షన్ముఖరావులు నాగావళి నదీ తీర ప్రాంతాలైన కడకెల్ల, కిమ్మి, పనసనందివాడ గ్రామాల వద్ద నీటి ప్రవాహాన్ని పరిశీలించా రు. ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోకి వెళ్లవద్దని సూచించారు. నాటు పడవలను నదిలో నడపవద్దని జాలర్లను హెచ్చరించారు. మహోగ్ర వంశధార కొత్తూరు: ఒడిశాలోని మోహన, గుడారి, గుణుపూర్, గుమ్మడల్లో భారీగా వానలు పడుతుండడంతో వంశధారకు భారీగా వరద నీరు వస్తోంది. దీంతో బుధవారం తెల్లవారుజాము నుంచి నదిలో నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద గట్లు లేని కుంటిబద్ర, వసప, మాతల, అంగూరు, ఆకులతంపర, పెనుగోటివాడ, వీఎన్ పురం, హంస, కడుములతో పాటు గ్రామాల్లోని పంట పొలాలను నీరు ముంచెత్తింది. అలాగే మాతల–నివగాం, మదనాపురం–నివగాం, వసపకాలనీ, కుంటిభద్ర, సిరుసువాడ–కుంటిభద్ర, వీరనారాయనపురం–మాతల, అంగూరు–సోమరాజపురంల, సోమరాజపురం–ఆకులతంపర రోడ్ల మీదుగా వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు ఆగిపోయాయి. ఆంధ్రా–ఒడిశా రాష్ట్రాలకు ప్రధాన రహదారి అయిన పీహెచ్ రోడ్డు నందు మాతల వద్ద రోడ్డు మీద నుంచి వరద నీరు ప్రవహించడంతో ఒడిశా రాష్ట్రానికి వెళ్లాల్సిన వాహనాలు నిలిచిపోయాయి. వరద నీరు ఉద్ధృతంగా ప్రవహించడంతో కుంటిభద్ర శివాలయంలోకి నీరు చేరింది. నివగాం ఎస్సీ వీధి, కొత్తవీధుల వద్ద వరద గట్టు అల్పంగా ఉన్నందున వరద నీరు నివగాంలోకి వస్తుందేమోనని స్థానికులు భయపడుతున్నారు. ఐటీడీఏ పీఓ సాయి కాంత్ వర్మ నివగాం, మాతల, అంగూరు, వసపతో పాటు పలు వరద ప్రాంతాల్లో సందర్శించారు. వరద ఉద్ధృతి వల్ల నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నివగాం వద్ద వరద గట్టు తక్కువ ఎత్తు ఉన్నందున ఏ మాత్రం వరద నీరు పెరిగిన నివగాంలోకి వరద నీరు వస్తుందని పీవోకు వైఎస్సార్ సీపీ నేత పీఏసీఎస్ పర్స్‌న్ ఇన్చార్జి లోతుగెడ్డ తులసీవరప్రసాదరావు, టంకాల రమణరావు, కన్నయ్య సామి, దార్ల గణేష్ ఆచారిలతోపాటు పలువురు పీఓకు వివరించారు. ముంపు గ్రామాల్లో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు సారిపల్లి ప్రసాద్, కలమట రమేష్‌లతో పాటు పలువురు పర్యటించి వదర బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భారీగా వరద హిరమండలం: వంశధార ఉగ్రరూపం దాల్చింది. ఒడిశాలో ఎడతెరిపి లేని వానలతో గొట్టా బ్యారేజీ వద్ద 22 గేట్లకు గాను ముందుగా 19 గేట్లను ఎత్తి వేసి కిందకు నీటిని విడిచిపెట్టారు. బుధవారం ఉదయం ఆరు గంటలకు ఒక్కసారిగా నీటి ఉద్ధృతి పెరిగింది. ఉదయం ఆరు గంటల సమయానికి 18 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 14832 క్యూసెక్కుల నీటిని బయటకు విడిచిపెట్టారు. ఎడమ కాలువ ద్వారా 1269 క్యూసెక్కుల నీరు, కుడికాలువ ద్వారా 458 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అయితే ఏడు గం టల సమయానికి ఒక్కసారిగా ఇన్‌ఫ్లో పెరిగింది గంట వ్యవధిలో 47,612 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో పూర్తిగా 22 గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు విడిచిపెడుతున్నారు. సాయంత్రం 6 గంటలకు 91,054 క్యూసెక్కులకు పెరిగింది. వరద పెరగడంతో నదీ తీర గ్రామాలైన జిల్లోడిపేట ,భగీరధపురం, నీలాదేవిపురం,అక్కరాపల్లి, అంబావల్లి, పిండ్రువాడ, రెల్లివలస తదితర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి తీవ్రంగా మారుతుండడంతో కలెక్టర్ జె.నివాస్, ఎస్పీ అమ్మిరెడ్డి పాలకొండ ఆర్డీఓ కుమార్, వంశధార ఎస్ఈ రంగారావులు బుధవారం బ్యారేజీని సందర్శించారు. నదీ తీర ప్రాంతాలను పరిశీలించారు. ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వంశధార వరద ఓ వైపు కొనసాగుతుండగా మహేంద్ర తనయ కూడా ఉద్ధృతంగా ప్రవహించడంతో జిల్లోడుపేట గ్రామస్తులు భయంభయంగా గడుపుతున్నారు. గ్రామాన్ని ఎస్పీ అమ్మిరెడ్డి, ఎమ్మెల్యే రెడ్డి శాంతితో పాటు పలువురు పరిశీలించారు. గ్రామాన్ని ఖాళీ చేయాలని సూచించారు. అలాగే ఎమ్మెల్యే రెడ్డి శాంతి గొట్టా బ్యారేజీని పరిశీలించారు. ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో గురించి ఆరా తీశారు. జిల్లోడిపేట గ్రామానికి మహేంద్రతనయ నదిపై పడవ ప్రయాణం చేసి ప్రజలను అప్రమత్తం కావాలని సూచించారు. ఆమెతో పాటు గొట్టా బ్యారేజీ డీఈ ప్రభాకరరావు,తహసీల్దారు జి.సురేష్, ఎంపీడీవో ప్రభావతి, డీటీ లావణ్య ఉన్నారు. వంశధారలో పెరుగుతున్న వరద నీరు ఎల్.ఎన్.పేట: వంశధార నది బుధవారం ఉదయం నుంచి ఉగ్రరూపం దాల్చింది. నదిలో గంట గంటకు వరదనీరు పోటెత్తడంతో తీర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ ఏడాది వంశధార నదిలో ఇంత ఎక్కువ స్థాయిలో వరదనీరు రావడం ఇదే మొదటిసారి. తీరంలో ఉన్న పంట పొలాలు నీట మునిగిపోగా, పండ్ల తోటల్లోకి వరదనీరు వచ్చి చేరింది. వాణిజ్య పంటలైన సారికంద పంట వరద నీటిలో మునిగిపోయింది. పం టలకు నష్టం వాటిల్లుతుందని బాధిత రైతులు ఆందోళన చెందుతున్నారు. తప్పిన ముప్పు సరుబుజ్జిలి: వంశధారలో భారీగా వరద నీరు వస్తున్నందున యరగాం ఇసుక రీచ్‌లో లోడింగ్ కోసం ఉంచిన 8 ట్రాక్టర్లు నీట మునిగాయి. కళా సీలు, డ్రైవర్లు ఒడ్డుకు పరుగెత్తి ప్రాణాలు కాపాడుకున్నారు. ట్రాక్టర్లను లోడింగ్ కోసం వరుస క్రమంలో ఉంచడంతో అన్నింటినీ వరద సమయంలో బయటకు తీసుకురావడం కుదరలేదు. ముందు వరుసలో రెండు ట్రాక్టర్లను కష్టపడి ఒడ్డుకు చేర్చారు. తర్వాత అధికారులకు సమాచారం ఇవ్వడంతో మైన్స్ అధికారులతోపాటు, ఆమదాలవలస సీ ఐ ప్రసాదరావు, తహసీల్దార్ సూరమ్మ తదితరులు ఘటనా స్థలానికి వచ్చారు. గత ఈతగాళ్లు ట్రాక్టర్లు సరిగ్గా ఎక్కడున్నాయో గుర్తించి పొక్లెయిన్ల సాయంతో వాహనాలను ఒడ్డుకు చేర్చారు. ఆనకట్ట వద్ద నాగావళి ఉగ్రరూపం రాజాం/సంతకవిటి : సంతకవిటి మండలంలో రంగారాయపురం గ్రామం వద్ద నాగావళి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహించింది. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో నది వద్ద 47,500 క్యూసెక్కుల నీరు ఆనకట్ట వద్ద నమోదైందని జేఈ శ్రీనివాసరావు తెలిపారు. ఇక్కడ 60 వేల క్యూసెక్కుల నీరు నమోదైతే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. నీరు అధికంగా ఆనకట్ట వద్దకు వచ్చి చేరడంతో కుడి, ఎడమ కాలువలకు సంబంధించిన రెగ్యులేటర్ తలుపులు మూసేశారు. తీర ప్రాంతాలు విలవిల రేగిడి: అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురిశాయి. దీంతో బుధవారం నాగావళి నది ఒక్కసారిగా పోటెత్తింది. తోటపల్లి ప్రాజెక్టు నుంచి 40 వేల క్యూసెక్కుల నీరు నాగావళిలోకి విడిచిపెట్టారు. దీంతో నదిలో వరద ఉద్ధృతంగా ఉంది. ఒక్కసారిగా నీటి ప్రవాహం పెరగడంతో మండలంలోని బొడ్డవలస, పుర్లి, కొమెర, ఖండ్యాం, కె.వెంకటాపురం గ్రామాల ప్రజలు ఆందోళన చెందారు. కె.వెంకటాపురం పాఠశాల చుట్టూ వరదనీరు చేరడంతో పాఠశాల హెచ్ఎం గ్రామస్తులకు సమాచారం అందించారు. దీంతో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు కింజరాపు సురేష్‌కుమార్, వీఆర్వో రమణమూర్తి, పంచాయతీ కార్యదర్శి జగదాంబ, గ్రామస్తులు విద్యార్థులను వరద నీటిలో నుంచి సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. దీంతో పెనుప్రమాదం తప్పింది. తహసీల్దార్ బి.సత్యం, ఎస్సై బి.రేవతి, ఆర్ఐ శ్రీనివాసరావులు నదీతీర గ్రామాలైన బొడ్డవలస, పుర్లి తదితర గ్రామాలను పరిశీలించారు. బొడ్డవలస గ్రామంలోకి వరద వచ్చే అవకాశాలు ఉండడంతో గ్రామస్తులను అప్రమత్తం చేశారు. అవసరమనుకుంటే సంకిలి ఉన్నత పాఠశాలకు గ్రామస్తులను తరలించేందుకు చర్యలు చేపడుతున్నామని తహసీల్దార్ తెలి పారు. ఓపెన్‌హెడ్ చానళ్లు సాయన్న, తునివాడ, రేగిడి చానళ్లు నీటితో కళకళలాడుతున్నాయి. ఇంత వరకు ఖరీఫ్ అంతంత మా త్రంగానే జరిగింది. ప్రస్తుతం నాగావళి నది లో నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో కొంతమేర ఖరీఫ్ దమ్ములకు ఉపయోగపడడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఐటీడీఏలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు సీతంపేట: జిల్లాలో వరదల దృష్ట్యా ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. సీతంపేట, ఎల్‌ఎన్‌పేట, పాలకొండ, ఆమదాలవలస, హిరమండలం, బూర్జ, భామిని, కొత్తూరు, వీరఘట్టం, జలుమూరు తదితర మండలాలకు చెందిన ముంపు ప్రాంతాల వారు 08945 258331 నంబర్‌కు ఫోన్ చేయాలని ఐటీడీఏ పీఓ సాయికాంత్ వర్మ ఓ ప్రకటనలో తెలిపారు. -
వంశధార, నాగావళికి వరదనీటి ఉధృతి
సాక్షి, శ్రీకాకుళం: ఒడిశాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీకాకుళం జిల్లాలోని వంశధార, నాగావళి నదుల్లో వరదనీరు పెరుగుతోంది. గొట్టా బ్యారేజి వద్ద లక్షా 10వేల క్యూసెక్ల ఇన్‌ఫ్లో, నాగావళిలో 75 వేల క్యూసెక్ల ఇన్ ఫో వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జిల్లా అధికారులు రెడ్ ఆలెర్ట్ ప్రకటించారు. ఈ క్రమంలో నదీ పరివాహక ప్రాంతాల్లో సహయక చర్యలకు కోసం పోలీసు, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. కొత్తూరు మండలం పొనుగోటువాడ గ్రామం జల దిగ్బంధంలో ఉంది. ఈ వరదల నేపథ్యంలో జిల్లా ఇన్చార్చి, దేవాదయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రజలను అప్రమత్రం చేయాలని జిల్లా కలెక్టర్ జె. నివాస్‌తో ఫోన్ మట్లాడారు. అదేవిధంగా వారిని సురక్షితమైన ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను సిద్ధం చేసుకోవాలి ఆదేశించారు. దీంతో పాటు నదులు, వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయకుండా హెచ్చరికలు జారీ చేయమని తెలిపారు. వరద ప్రభావం ఉన్న అన్ని గ్రామాలను అప్రమత్తం చేయాలని కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. వరద ఉధృతితో అధికారులు వంశధార నదికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ, నాగావళి నదికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. -
‘వైఎస్సార్ మరణించగానే వంశధారను నిర్వీర్యం చేశారు’
సాక్షి, అమరావతి : ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతమైన శ్రీకాకుళం జిల్లాను సస్యశ్యామలం చేయాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వంశధార ప్రాజెక్టును ప్రారంభించారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి గుర్తుచేశారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ హయంలో 80 శాతం భూసేకరణ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. వైఎస్సార్ మరణం తర్వాత ప్రాజెక్టును పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత స్పీకర్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఈ సందర్భంగా వంశధార ప్రాజెక్టుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడారు. వంశధార పూర్తయితే 5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆమె తెలిపారు. రైతులు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. గత ఐదేళ్లుగా వంశధార నిర్వాసితులను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోలేదని విమర్శించారు. చంద్రబాబు హయంలో నిర్వాసితుల ఆందోళనను దేశం మొత్తం చూసిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయంలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని కోరారు. గత పాలకులు వంశధార ప్రాజెక్టు నిధులను స్వాహా చేశారని ఆరోపించారు. ప్రజాతీర్పును వంచించి అక్కడి ఎమ్మెల్యే టీడీపీ పంచన చేరారని గుర్తుచేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యే, జిల్లా మంత్రి ప్రభుత్వం అండతో అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు. నిర్వాసితులకు జరిగిన అన్యాయాన్ని బయటకు తీయాలని కోరారు. అనంతరం మాట్లాడిన నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. వంశధార ప్రాజక్టు నిర్వాహితులకు పరిహారం చెల్లింపుపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అవినీతిని వెలికి తీసీ చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిర్వాసితులకు ఇచ్చే ప్యాకేజీల విషయంలో కూడా అవినీతి జరడం దారుణమన్నారు. -
అవినీతి ధార
సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు పనుల్లో అవినీతి.. ‘ధార’లా ప్రవహిస్తోంది. ఐదేళ్లలో కేవలం 15 శాతం పనులు పూర్తి చేయడానికి రూ.930.01 కోట్లు ఖర్చు చేసిన టీడీపీ ప్రభుత్వం.. ఒక్క ఎకరాకు కూడా నీళ్లందించలేకపోయింది. కానీ రూ.92.02 కోట్ల పనుల వ్యయాన్ని రూ.1,104.13 కోట్లకు పెంచేయడం ద్వారా చంద్రబాబు తన బినామీలకు వందలాది కోట్ల రూపాయల మేర లబ్ధి చేకూర్చారు. ఇంకా రూ.266.13 కోట్లు ఖర్చు చేస్తే గానీ ప్రాజెక్టు పనులు పూర్తి కావని అధికార వర్గాలు చెబుతుండటం గమనార్హం. అత్యంత వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో వంశధార రెండో దశ పనులకు రూ.933.90 కోట్ల వ్యయంతో శ్రీకారం చుట్టారు. ఒడిశా అభ్యంతరం వ్యక్తం చేయగా.. దీనిపై ట్రిబ్యునల్ తీర్పు వెలువడేవరకు ఆగకుండా ఆయకట్టు రైతులకు త్వరగా ప్రయోజనం చేకూర్చేందుకు ఆ ప్రాజెక్టును రీ డిజైనింగ్ చేయించారు. వంశధారపై బామిని మండలం కాట్రగడ వద్ద సైడ్ వియర్ నిర్మించి.. అక్కడ్నుంచి కాలువ ద్వారా నీటిని మళ్లించి.. సింగిడి, పారాపురం, హిరమండలం రిజర్వాయర్లలో నిల్వ చేసి.. గొట్టా బ్యారేజీ కింద 2,10,510 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు కొత్తగా 45 వేల ఎకరాలకు నీళ్లందించి 3.26 లక్షల మంది దాహార్తి తీర్చాలని వైఎస్సార్ నిర్ణయించారు. - వంశధారపై సైడ్ వియర్ నిర్మాణం, 14.205 కి.మీ. మేర వరద కాలువ తవ్వకం, సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను 87వ ప్యాకేజీ కింద 2005లో హార్విన్ కన్స్ట్రక్షన్స్ సంస్థ రూ.72.64 కోట్లకు దక్కించుకుంది. ఇందులో 29.54 కోట్ల పనులను పూర్తి చేసింది. రూ.43.10 కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తయ్యేవి. - వంశధార ప్రాజెక్టు రెండో దశలో 14.205 కి.మీ. నుంచి 34.100 కి.మీ. వరకు వరద కాలువ తవ్వకం, పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణ పనులను 88వ ప్యాకేజీ కింద శ్రీనివాస కన్స్టక్షన్స్ 2005లో రూ.66.88 కోట్లకు దక్కించుకుంది. రూ.31.24 కోట్ల విలువైన పనులను పూర్తి చేశారు. మరో రూ.35.64 కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తయ్యేవి. - హిరమండలం రిజర్వాయర్ నిర్మాణం, స్పిల్ వే రెగ్యులేటర్, హై లెవల్ కెనాల్.. లింక్ కెనాల్, సర్ప్లస్ చానల్ తవ్వకం పనులను రూ.353.50 కోట్లకు 2005లో సోమా పటేల్ ఏఎస్ఐ(జేవీ) సంస్థ దక్కించుకుంది. 2014 నాటికి రూ.259 కోట్ల విలువైన పనులు పూర్తి చేశారు. ఇంకో రూ.94.5 కోట్లు ఖర్చు చేస్తే ఈ పనులు పూర్తయ్యేవి. మరోవైపు భూసేకరణ, నిర్వాసితుల పరిహారం చెల్లింపు, పనులకు కలిపి 2014 నాటికి మొత్తంగా రూ.841.88 కోట్లు ఖర్చు చేసి 85 శాతం పనులు పూర్తి చేశారు. బినామీలకు లబ్ధి.. టీడీపీ అధికారంలోకి వచ్చాక వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులకు 2014–15లో రూ.16.15 కోట్లు, 2015–16లో రూ.34.57 కోట్లు, 2016–17లో రూ.463.37 కోట్లు, 2017–18లో రూ.261.54 కోట్లు, 2018–19లో రూ.154.38 కోట్లు.. మొత్తంగా రూ.930.01 కోట్లు ఖర్చు చేసింది. గతంలో 2017 జూన్ నాటికే వంశధార నుంచి నీళ్లు అందిస్తామని చెప్పిన టీడీపీ ప్రభుత్వం.. ఇప్పటికి కూడా ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేకపోయింది. ఒక్కటంటే ఒక్క ఎకరాకు నీళ్లందించలేకపోయింది. కానీ పెంచేసిన అంచనా వ్యయం ప్రకారం సీఎం చంద్రబాబు.. తన బినామీలకు రూ.650 కోట్లకుపైగా లబ్ధి చేకూర్చారు. ఆ మేరకు చంద్రబాబు కమీషన్లు కూడా వసూలు చేసుకున్నట్లు అధికార వర్గాల సమాచారం. ఇంకా ఈ ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ.266.13 కోట్లు అవసరమని చెబుతుండటం గమనార్హం. అంచనా వ్యయం పెంచి.. బినామీలకు కట్టబెట్టి 2014లో చంద్రబాబు అధికారంలోకి రాగానే 87, 88 ప్యాకేజీల కాంట్రాక్టర్లపై వేటు వేశారు. ఇంకా 15 శాతం పనులే మిగిలి ఉండగా.. ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని మాత్రం రూ.933.90 కోట్ల నుంచి రూ.2,038.03 కోట్లకు పెంచేశారు. ఆ తర్వాత 87వ ప్యాకేజీలో మిగిలిన రూ.43.10 కోట్ల పనుల వ్యయాన్ని రూ.162.10 కోట్లకు పెంచేసి సీఎం రమేశ్ సంస్థకు అప్పగించారు. 88వ ప్యాకేజీలో మిగిలిన రూ.35.64 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.179 కోట్లకు పెంచేసి తన బినామీకి చెందిన సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్కు అప్పగించారు. ఇక హీరమండలం రిజర్వాయర్ పనులు చేస్తున్న సోమ(జేవీ) సంస్థ తమ బినామీకి చెందినదే కావడంతో దాన్ని మాత్రం కొనసాగించారు. -
రాజన్న కల..సాకారమయ్యే వేళ!
వంశధార నది... జిల్లాలో అతిపెద్ద నది! కానీ ఆయకట్టుకు నీటి సమస్య తీరట్లేదు! ఏటా 50 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది! దీనికి కాస్తయినా అడ్డుకట్ట వేస్తే మండు వేసవిలోనూ గలగలమని జలాలను పొలాల్లో పారించవచ్చు! ఇది జిల్లా ప్రజల దశాబ్దాల కల! దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ కలలను సాకారం చేయడానికి 2006 సంవత్సరంలో సంకల్పించారు. అప్పటి మంత్రి ధర్మాన ప్రసాదరావు, దివంగత ప్రఖ్యాత ఇంజనీరు సీఆర్ఎం పట్నాయక్ల చొరవ, ప్రణాళిక అందుకు ముందుకు నడిపించాయి. వారి సంకల్పం ఇన్నాళ్లకు కార్యరూపం దాల్చుతోంది. వంశధార ఫేజ్–2 స్టేజ్–2 ప్రాజెక్టులో భాగమైన హిరమండలం జలాశయంలోకి ఈనెల 10వ తేదీ నుంచి గంగమ్మ అడుగుపెట్టనుంది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : వాస్తవానికి వంశధార రెండు దశల ప్రాజెక్టు... రెండు రాష్ట్రాల ప్రయోజనం కోసం ముఖ్యంగా రాష్ట్రంలోకెల్లా అభివృద్ధిలో వెనుకబడిన ఈ జిల్లాలో 2.55 లక్షల ఎకరాలకు సాగునీటి కోసం తలపెట్టిన కార్యక్రమం. 1962వ సంవత్సరంలోనే దీనికి పునాదిరాయి పడినా స్టేజ్–1 గొట్టా బ్యారేజీకే పరిమితమైంది. 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే ఫేజ్–2 స్టేజ్–2 పనులు వేగవంతమయ్యాయి. కానీ 2009 సంవత్సరంలో ఆయన అకాల మరణం ఈ పనులకు శాపమైంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత ప్రాజెక్టు పనులపై హడావుడి మొదలెట్టింది. కేవలం రూ.421 కోట్ల మేర నిధులిచ్చి యూత్ ప్యాకేజీ పేరుతో కొంతమేర పరిహారం చేతిలో పెట్టింది. మరోవైపు 87 ప్యాకేజీ పనులు 40 శాతం, 88 ప్యాకేజీ పనులు 35 శాతం ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. హిరమండలం జలాశయం పనులు మాత్రం 20 శాతం పూర్తి చేయాల్సి ఉంది. అయితే జలాశయంలో ప్రస్తుతానికి నీరు నింపడానికి ఇబ్బంది ఉండదు. స్థానిక వనరులే కీలకం.. వాస్తవానికి వంశధార నదిలో నుంచి వచ్చే వరద నీటిని భామిని మండలంలోని కాట్రగడ–బి వద్దనున్న సైడ్‌వియర్ నుంచి వరదకాలువలోకి మళ్లించాల్సి ఉంటుంది. ఆ కాలువ ద్వారా భామిని మండలంలోని సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి, తర్వాత కొత్తూరు మండలంలోని పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి నీరు వస్తుంది. తర్వాత అక్కడి నుంచి ప్రధానమైన హిరమండలం జలాశయంలోకి నీరు వస్తుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వంశధార నదినీటి కన్నా స్థానిక క్యాచ్మెంట్పైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. స్థానికంగా ఉండే కొండలపై బాగా వర్షాలు పడితే జక్కర్లు ద్వారా తులగాం గెడ్డలోకి దాదాపు రెండు మూడు టీఎంసీల వరకూ నీరు వస్తుంది. హిరమండలం జలాశయం గట్టు పనులు దాదాపు పూర్తికావడంతో ట్రయల్‌రన్‌గా 4 టీఎంసీల నీరు నింపడానికి వంశధార ప్రాజెక్టు ఇంజనీర్లు సన్నద్ధం అవుతున్నారు. అదే సైడ్‌వీయర్ ద్వారా వరదనీరు రావాలంటే నదిలో కనీసం 15 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండాలి. ప్రస్తుతం ఆరు వేల క్యూసెక్కులే ఉంది. అందులో ఈలోగా స్థానిక క్యాచ్మెంట్ నుంచి వచ్చే నీటిని జలాశయంలోకి మళ్లించనున్నారు. రెండు నెలల ప్రక్రియ.. హిరమండలం జలాశయంలోకి ఈనెల 10వ తేదీ నుంచి నీరు పారించడానికి ఏర్పాట్లు చేసినట్లు వంశధార ఎస్ఈ డి.సురేంద్రరెడ్డి చెప్పారు. కనీసం రెండు నెలల పాటు ఈ ట్రయల్ రన్ కొనసాగుతుందన్నారు. తద్వారా నాలుగు టీఎంసీల నీరు నింపగలిగితే, అది వచ్చే రబీ నాటికి ఆయకట్టులోని 1.50 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒకవైపు స్పిల్‌వే, హెడ్రెగ్యులటరీ పనులు వేగవంతం చేస్తూనే ఈ సంవత్సరానికి జలాశయంలో నీరు నిల్వ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఈ విషయమై జిల్లా కలెక్టరు కె.ధనంజయ్‌రెడ్డి స్పందిస్తూ... ఈ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేయగలిగితే తర్వాత రిజర్వాయర్‌లోకి 8 టీఎంసీల నీటిని నింపే ప్రక్రియను ప్రారంభమవుతుందని అన్నారు. ఇది మూడు దశలలో జరుగుతుందన్నారు. ఏదేమైనా వంశధార రెండో దశ ప్రాజెక్టు జలాలు అందుబాటులోకి వస్తుండటం రైతుల్లో ఆనందాన్ని నింపే విషయమే. ఎస్ చలువే ఈ ప్రాజెక్టు.. వంశధార రెండో దశ ప్రాజెక్టుకు ఆనాడు రాజశేఖరరెడ్డి చొరవ చూపించకపోతే ఈనాడు ఇలాకూడా చూసుండేవాళ్లం కాదు. జిల్లాపై ప్రత్యేక ప్రేమతో ప్రాజెక్టు పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. గతంలో పాలించిన చంద్రబాబు సహా అప్పటివరకూ ఏ ముఖ్యమంత్రీ వంశధారపై ధైర్యం చేయలేకపోయారు. త్వరలోనే వంశధార ఫలాలు రైతులకు అందే అవకాశం కలుగుతుందంటే అది వైఎస్ చలువే. సిక్కోలు ప్రజలకు అపర భగీరథుడు ఎవ్వరంటే ముమ్మాటికీ ఆయన్నే ప్రజలు తలచుకుంటారు. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి -
అసంపూర్తి వంశధార!
ఈ చిత్రం చూశారా?.. భామిని మండలం పసుకుడి వద్ద వంశధార వరద కాలువపై రెండేళ్లుగా నిర్మిస్తున్న వంతెన. కానీ ఇప్పటికీ పనులు పూర్తికాలేదు. అయితే పూర్తయినట్లు చూపించడానికి వంతెనను రెండు స్తంభాలకే పరిమితం చేస్తున్నారు. మిగతా స్తంభాల మధ్య మట్టిని పూడ్చేస్తున్నారు. కాలువలో నీటిప్రవాహం పెరిగితే ఆ మట్టి కాస్త కొట్టుకుపోదనే భరోసా లేదు. ఇలాంటి స్ట్రక్చర్ల నిర్మాణాలు వంశధార ప్రాజెక్టు పనుల్లో మరెన్నో! సాక్షి ప్రతినిధి-శ్రీకాకుళం : వంశధార ఫేజ్-2 స్టేజ్-2... మండువేసవిలోనూ జిల్లాకు సాగు, తాగునీరు అందించే బృహత్తర పథకం! దివంగత ముఖ్యమంత్రి డాక్టరు వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రసాదించిన ఓ వరం! ఆయన హయాంలోనే సగానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి! కానీ ఆయన అకాల మరణం ఈ ప్రాజెక్టుకు శాపమైంది! తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రెండేళ్ల క్రితమే టీడీపీ ప్రభుత్వం కళ్లు తెరిచి ప్రాజెక్టు పనులపై దృష్టి పెట్టింది! కానీ నిర్మాణ కంపెనీలు నిర్మాణ వ్యయం పెంపుపై పెట్టిన దృష్టి... ప్రాజెక్టు పనులను సత్వరమే పూర్తి చేయడంపై పెట్టలేదు! ఒకవైపు నిర్వాసిత గ్రామాలను ఖాళీ చేయించేసి ఇదిగో అది గో ప్రారంభం అంటూ టీడీపీ నాయకులు చెబుతూ వచ్చారు! ప్రాజెక్టు పనులు మాత్రం ఎక్కడా కొలిక్కి రాలేదు! కానీ ఈనెల 15వ తేదీన శ్రీకాకుళంలో స్వాతంత్య్ర దినోత్సవానికి రానున్న ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రారంభింపజేస్తామని టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు! వాస్తవానికి వంశధార ఫేజ్-2 స్టేజ్-2 పనులు మూడు భాగాలుగా జరుగుతున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే హిరమండలం uమొదటిపేజీ తరువాయి రిజర్వాయర్ మట్టి పనులు 80 శాతం పూర్తయ్యాయి. భామిని, కొత్తూరు మండలాల్లో 87 ప్యాకేజీ పనులు 31 శాతం, కొత్తూరు మండలంలో 88 ప్యాకేజీ పనులు 36 శాతం పనులు జరిగాయి. తర్వాత రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు పెద్దగా పట్టించుకోలేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి రెండేళ్లు అసలు ఈ పనుల కొనసాగింపుపై దృష్టి పెట్టలేదు. కానీ తర్వాత హడావుడి మొదలెట్టింది. మొత్తం నిర్మాణ వ్యయం అంచనాలను రూ.934 కోట్ల నుంచి రూ.1616.23 కోట్లకు టీడీపీ ప్రభుత్వం పెంచేసింది. 87, 88 ప్యాకేజీల పనుల నుంచి పాత కాంట్రాక్టు సంస్థలను తప్పించి తన అనుయాయులకు అప్పగించింది. కానీ పనులు మాత్రం గత రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రాజెక్టును ప్రారంభించి ఆ క్రెడిట్‌ను తమ ఖాతాలో వేసుకోవడానికి టీడీపీ నాయకులు హడావుడి చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగా సత్వరమే పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా 87 ప్యాకేజీ పనులు చేస్తున్న రిత్విక్ సంస్థ మాత్రం బేఖాతరు చేస్తోంది. ఈ సంస్థ టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌కు చెందినది కావడం గమనార్హం. ఇప్పటివరకూ తూతూ మంత్రంగా చేస్తున్న పనులు కూడా వర్షాల ప్రారంభంతో పడకేశాయి. 87 ప్యాకేజీ పనులిలా... ప్రాజెక్టు 87 ప్యాకేజీలో మొత్తం 13 కిలోమీటర్ల పొడవున 93,105 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 27.84 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు చేయాల్సి ఉంది. తొలుత ఈ పనులను హార్విన్స్ సంస్థ చేపట్టింది. 7 కి.మీ. మేర పూర్తి చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మిగిలిన పనులను రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించింది. గత ఏడాది జూలై నాటికి 19,512 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 13.11 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి చేసింది. తర్వాత ఈ జూలై నెలాఖరునాటికి 76,567 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, 23.95 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తి అయ్యాయి. ఇంకా 16,538 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 3.88 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు చేయాల్సి ఉంది. 88 ప్యాకేజీ పనులిలా... ప్రాజెక్టు 88 ప్యాకేజీ కింద మొత్తం 20 కి.మీ. మేర 1,07,589 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్, 40.87 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిపనులు చేయాల్సి ఉంది. దీనిలో 20 శాతం పనులు చేసిన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థను తొలగించి టీడీపీ ప్రభుత్వం సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించింది. గత ఏడాది జూలై నాటికి 43 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, 18 లక్షల క్యూబిక్ మీటర్ల మేర మట్టిపనులు పూర్తయ్యాయి. తర్వాత ఈ ఏడాది జూలై నెలాఖరు నాటికి 92,045 క్యూబిక్ మీటర్లు కాంక్రీట్, అలాగే 32.18 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు పూర్తయ్యాయి. ఇంకా 15,544 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు, అలాగే 8.68 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు మిగిలే ఉన్నాయి. హిరమండలం రిజర్వాయర్‌లో... ప్రధానమైన హిరమండలం రిజర్వాయరు పనుల్లో ప్రస్తుతం స్పిల్‌వే లింక్, కెనాల్ కాంక్రీట్ పనులే జరుగుతున్నాయి. అలాగే ఎర్త్‌డ్యామ్, గట్టు రాతి కట్టడాల మిగులు పనులు కూడా పూర్తి కాలేదు. ఇటీవల వర్షాలతో ఈ పనులకు ఆటంకం కలిగింది. ఐవోబీ సమావేశాల్లో వంశధార పనులపై అధికారులు సమీక్షిస్తూ కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేస్తునే ఉన్నారు. కానీ పనులు మాత్రం వేగవంతం కావట్లేదు. -
ఛూ మంత్రకాళీ!
టీడీపీ నాయకులు చెప్పే మాటలకు, ఆచరణలో చేతలకు పూర్తి వైరుధ్యం ఉంటోందనేది బహిరంగ రహస్యమే! తాము ప్రకృతి వనరులను పవిత్రంగా చూసుకుంటామని, ప్రజాధనానికి పరిరక్షకులమని తరచుగా వారి ప్రసంగాలు వినిపిస్తుంటాయి. కానీ వంశధార కరకట్టల టెండర్ల మాటున రూ. 21.83 కోట్ల ప్రజాధనానికి ఎందుకు రెక్కలొచ్చాయో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకే ఎరుక! ఇప్పటికే పనులు చేస్తున్న నిర్మాణ సంస్థలను పొమ్మనలేక పొగబెట్టి, తర్వాత తమకు కావాల్సిన సంస్థలు అంచనా వ్యయం కన్నా అధికంగా కోట్ చేసినా పనులు కట్టబెట్టారు! సుమారు రూ.22 కోట్లు ప్రజాధనం పక్కదారి పడుతుంటే ఇప్పుడేమి చెబుతారో చూడాలి మరి! సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం : వర్షాకాలం వస్తే చాలు వంశధార నదిలో వరద పోటెత్తుతుంది. నదిలో ప్రవాహం అరలక్ష క్యూసెక్కుల దాటితే చాలు జిల్లాలోని పరివాహక ప్రాంతాల్లోని ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతుంటాయి! గట్టు బలహీనంగా ఉన్నచోట్ల వరద పంటపొలాలు, గ్రామాలను ముంచెత్తుతూనే ఉంటుంది. ఈ దృష్ట్యానే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే జిల్లాలో వంశధారతో పాటు నాగావళి నదుల నదుల గట్లు కట్టుదిట్టం చేయాలని సంకల్పించారు. కరకట్టల నిర్మాణ పనులను ప్రారంభించారు. తర్వాత ఆయన అకాల మరణం, ప్రభుత్వాల అలసత్వం కారణంగా ఆ పనులు మందగమనంలోకి వెళ్లిపోయాయి. వాటిని పూర్తి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన టీడీపీ మూడున్నరేళ్ల పాటు ఏమాత్రం పట్టించుకోలేదు. తమకు నష్టం వస్తున్న దృష్ట్యా కొంతమేర అంచనా వ్యయం సవరించాలని నిర్మాణ సంస్థలు మొత్తుకున్నా స్పందించలేదు. చివరకు పనుల ఆలస్యం సాకుతో ఆ సంస్థలకు పనులను టీడీపీ ప్రభుత్వం రద్దుచేసింది. తర్వాత అంచనా వ్యయం సవరించి కొత్తగా టెండర్లు పిలిచింది. కానీ అంచనా వ్యయానికి మించి అదనంగా కోట్ చేసినా తమకు నచ్చిన మూడు సంస్థలకు మూడు ప్యాకేజీలు ఒక్కొక్కటి చొప్పున దక్కేలా టీడీపీ ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు చక్రం తిప్పారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాజధాని కేంద్రంగా చక్రం తిప్పిన ఈ వ్యవహారంలో వంశధార ప్రాజెక్టు ఉన్నతాధికారి ఒకరు, జలవనరుల శాఖ, సర్కిల్ కార్యాలయంలో అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఓ అధికారి కీలక పాత్ర పోషించారనే గుసగుసలు ఆ శాఖ సిబ్బంది నుంచే వినిపిస్తున్నాయి. దీనిపై లోతుగా విచారణ జరిపిస్తే రూ.22 కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైన వ్యవహారంలో కీలక పాత్రధారులు, సూత్రధారుల గుట్టు రట్టవుతుందని చెబుతున్నారు. మూడు ప్యాకేజీలకూ ఆ కంపెనీలే... వంశధార నది కరకట్టల నిర్మాణ పనులను మొత్తం నాలుగు ప్యాకేజీలుగా జరుగుతున్నాయి. తొలి మూడు ప్యాకేజీలకు అంచనా వ్యయం సవరించి గత ఏడాది నవంబరులో టెండరు నోటిఫికేషన్లను ప్రభుత్వం జారీ చేసింది. శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అండ్ కంపెనీ (విజయవాడ), ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అనంతపురం), కేతన్ కన్స్ట్రక్షన్స్, జీవీవీ కన్స్ట్రక్షన్స్, ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (రాజమండ్రి)... ఈ ఐదు సంస్థలే మూడు ప్యాకేజీలకు పోటీపడ్డాయి. వాటిలో మూడు సంస్థలు ఒక్కో ప్యాకేజీ చొప్పున దక్కించుకున్నాయి. మొత్తం ఈ మూడు ప్యాకేజీల పనులకు రూ. 595.25 కోట్లు అంచనా వ్యయంకాగా, రూ.21.83 కోట్లు అదనంగా పెంచేయడం వల్ల నిర్మాణ వ్యయం రూ. 617.08 కోట్లకు చేరినట్లయ్యింది. ప్యాకేజీ–1లో భామిని మండలంలో బత్తిలి గ్రామం నుంచి కీసర గ్రామం వరకూ, అలాగే కొత్తూరు మండలంలో సిరుసువాడ నుంచి ఆకులతంపర గ్రామం వరకూ నది కుడివైపు గట్టు, కొత్తూరు మండలం కడుము గ్రామం నుంచి పొన్నుటూరు గ్రామం వరకూ ఎడమవైపు గట్టు కరకట్టల పనుల కోసం రూ. 238.66 కోట్లతో టెండర్లు పిలిచారు. గత ఫిబ్రవరి నెలలో తెరిచిన టెక్నికల్ బిడ్‌లో శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అండ్ కంపెనీ (విజయవాడ), ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (అనంతపురం), కేతన్ కన్స్ట్రక్షన్స్, జీవీవీ కన్స్ట్రక్షన్స్ సంస్థలు అర్హత సాధించాయి. ఇవన్నీ అంచనా వ్యయం కన్నా అధికంగా కోట్ చేసినవే. నిర్దేశించిన మొత్తం కన్నా 4.47 శాతం అదనంగా రూ. 249.32 కోట్లతో ప్రైస్ బిడ్ దాఖలు చేసిన శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అండ్ కంపెనీ టెండర్లను దక్కించుకుంది. మరో విశేషం ఏమిటంటే ఈ పోటీలో ఎల్–2గా నిలిచిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ 4.99 శాతం అదనంగా రూ. 250.56 కోట్లకు కోట్ చేసింది. దీనికి ప్యాకేజీ–1 పనులు దక్కకపోయినా ప్యాకేజీ–2 పనులు దక్కించుకోవడం గమనార్హం. ప్యాకేజీ–2లో హిరమండలం మండలంలోని రుగడ గ్రామం నుంచి జలుమూరు మండలంలోని కరకవలస గ్రామం వరకూ ఎడమవైపు గట్టు, హిరమండలం మండలంలోని గులుమూరు నుంచి ఎల్ఎన్ పేట మండలంలోని స్కాట్‌పేట వరకూ కుడివైపు గట్టు కరకట్టల నిర్మాణానికి రూ.143.02 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లు ఆహ్వానించారు. టెక్నికల్ బిడ్‌లో శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, కేతన్ కన్స్ట్రక్షన్స్ సంస్థలు అర్హత సాధించాయి. వాటిలో ప్రైస్‌బిడ్‌లో అంచనా వ్యయం కన్నా 4.2 శాతం అదనంగా రూ.149.02 కోట్లకు అంటే రూ.6 కోట్లు ఎక్కువగా కోట్ చేసిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు పనులు దక్కాయి. ప్యాకేజీ–3 కింద ఎల్ఎన్ పేట మండలంలోని స్కాట్‌పేట గ్రామం నుంచి ఆమదాలవలస మండలంలోని చవ్వాకులపేట గ్రామం వరకూ, అలాగే శ్రీకాకుళం మండలంలోని నవనంబాడు గ్రామం నుంచి గార మండలంలోని కళింగపట్నం వరకూ కరకట్టల నిర్మాణానికి రూ. 213.57 కోట్ల అంచనా వ్యయంతో రెండోసారి టెండర్లు పిలిచారు. టెక్నికల్ బిడ్‌లో శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్, కేతన్ కన్స్ట్రక్షన్స్ సంస్థలతో పాటు ఆర్ఎస్ఆర్ ఇన్ఫ్రా వర్క్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ (రాజమండ్రి) కూడా అర్హత పొందింది. అంచనా విలువ కన్నా 2.7 శాతం అదనంగా రూ. 218.74 కోట్లకు ప్రైస్‌బిడ్‌లో కోట్ చేసిన ఆర్ఎస్ఆర్ సంస్థకే పనులు దక్కాయి. ఈ పోటీలో 3.25 శాతం అదనంగా రూ. 219.89 కోట్లకు కోట్ చేసిన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ సంస్థ ఎల్–2గా నిలిచింది. శ్రీసాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ అండ్ కంపెనీ 4.89 శాతం అదనంగా రూ. 223.41 కోట్లకు కోట్ చేసి ఎల్–3గా మిగిలింది. ఈ సీజన్లో పునఃప్రారంభమయ్యేనా? వంశధార నది కరకట్టల నిర్మాణ పనులు ప్యాకేజీ–1లో 9.42 శాతం, ప్యాకేజీ–2లో 3.76 శాతం, ప్యాకేజీ–3లో 2.45 శాతం మాత్రమే ఇప్పటివరకూ పూర్తయ్యాయి. ప్యాకేజీ–1లో పనుల కోసం 460.48 ఎకరాల భూమి సేకరించగా, ఇంకా 82.40 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్యాకేజీ–2లో 32.12 ఎకరాలు మాత్రమే సేకరించగా ఇంకా 196.88 ఎకరాలు సేకరించాలి. ప్యాకేజీ–3లో 222 ఎకరాలు సేకరించగా, ఇంకా 131 ఎకరాలు సేకరించాల్సి ఉంది. మిగిలిన భూసేకరణ ప్రక్రియ ఇటీవల కాలంలో రెవెన్యూ, వంశధార ప్రాజెక్టు అధికారులు వేగవంతం చేశారు. కానీ తమకు తగిన నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండు చేస్తున్నారు. దీంతో భూసేకరణ ఇంకా కొలిక్కిరాలేదు. వచ్చే నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కరకట్టల నిర్మాణ పనులు పునఃప్రారంభ కార్యక్రమం నిర్వహిస్తామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇటీవల జరిగిన జిల్లా నీటిపారుదల సలహా సంఘం సమావేశంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఈ సీజన్ (వర్షాలు మొదలయ్యేలోగా)లో కరకట్టల నిర్మాణ పనులు పునఃప్రారంభమయ్యే సూచనలు కనిపించట్లేదు. ప్యాకేజీ–1పై న్యాయవివాదం వంశధార ప్యాకేజీ–1 పనులను కొంతవరకూ రాంకీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (హైదరాబాద్) చేసింది. పనులకు సంబంధించి గడువు ముగిసినప్పటికీ లావాదేవీలు పూర్తి చేయకుండానే ప్రభుత్వం రెండోసారి టెండర్లు పిలవడాన్ని సవాలు చేస్తూ ఆ సంస్థ మార్చి నెలలో హైకోర్టును ఆశ్రయించింది. ప్రస్తుతం ఈ న్యాయ వివాదం కొనసాగుతోంది. ఇది తేలేవరకూ మూడు ప్యాకేజీల పనులూ కొత్త కాంట్రాక్టర్లు చేయడానికి అవకాశం కనిపించట్లేదు. కానీ అధికారులు మాత్రం ఆ న్యాయ వివాదం వల్ల పనులకు ఆటంకం ఉండదని చెబుతున్నారు. -
ప్రభుత్వ దౌర్జన్యం దుర్మార్గం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం/సాక్షి, అమరావతి: వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాల్సిన ప్రభుత్వమే దౌర్జన్యానికి దిగడం దుర్మార్గమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తున్న దౌర్జన్యకాండను ప్రజల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. శ్రీకాకుళంలో వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం విపక్షాల పిలుపు మేరకు ‘చలో వంశధార’ నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం పోలీసులతో భగ్నం చేసింది. వామపక్ష పార్టీలతో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం రాత్రి నుంచి నిర్బంధంలోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం జిల్లావ్యాప్తంగా 39 మందిని అరెస్టు చేశారు. శ్రీకాకుళం చేరుకున్న సీపీఎం నాయకుడు మధు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, మాజీ ఎంపీ మిడియం బాబూరావు తదితరులను అదుపులోకి తీసుకొని రెండో పట్టణ పోలీసుస్టేషన్‌కు తీసుకెళ్లారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ గతంలో ప్రభుత్వాలు పెద్ద ప్రాజెక్టులను నిర్మించినా నిర్వాసితులపై పోలీసు బలగాలను ప్రయోగించిన దాఖలాలు లేవన్నారు. నిర్వాసితుల సమస్యలేమిటో చెప్పుకోవడానికీ అనుమతించకపోవడం దారుణమని విమర్శించారు. వంశధారతోపాటు పోలవరం తదితర ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై గళం వినిపించడానికి ఈనెల 16, 17∙తేదీల్లో విజయవాడలో 30 గంటల ధర్నా తలపెడుతున్నామని చెప్పారు. వైఎస్సార్సీపీ నాయకుల సంఘీభావం.. ‘చలో వంశధార’లో పాల్గొనకుండా వైఎస్సార్సీపీ రాజ కీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ధర్మాన కృష్ణదాస్, టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ తదితర నాయకులను పోలీసులు నరసన్నపేటలో అడ్డుకున్నారు. బయటకు రాకుండా హౌస్ అరెస్టు చేశారు. తర్వాత విడిచిపెట్టడంతో రెండో పట్టణ పోలీసుస్టేషన్లో ఉన్న వామపక్ష నాయకులకు సంఘీభావం ప్రకటించారు. ప్రజల సంక్షేమాన్ని విస్మరించి గాలి కబుర్లతోనే కాలక్షేపం చేస్తున్న ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజు దగ్గరపడిందని హెచ్చరించారు. ఇలా ఉండగా, అఖిలపక్ష నేతలను అరెస్ట్ చేయడాన్ని పది వామపక్ష పార్టీలు ఓ ప్రకటనలో ఖండించాయి. -
వంశధారతోనే కరువుకు శాశ్వత పరిష్కారం
-
వైఎస్ ముందుచూపు.. వంశధార ట్రిబ్యునల్ తీర్పు
వంశధార ప్రాజెక్టు రెండో దశ ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలని వైఎస్ నిర్ణయం నేరడి బ్యారేజీపై ఒడిశా అభ్యంతరంతో కాట్రగడ్డ సైడ్ వియర్ పనులకు తెరతీసిన వైనం వైఎస్సార్ చిత్తశుద్ధి వల్లే వంశధార ట్రిబ్యునల్‌లో రాష్ట్రానికి న్యాయం జరిగిందంటున్న సాగునీటి రంగ నిపుణులు సాక్షి, అమరావతి: మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపు, నిబద్ధత, దార్శనికత కారణంగానే... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వాదనతో వంశధార ట్రిబ్యునల్ ఏకీభవించిందని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కేటాయించిన నికర జలాలతోపాటూ మిగులు జలాలపై పూర్తి హక్కును దక్కించుకోవాలంటే.. వాటిని వినియోగించుకునేలా ప్రాజెక్టులు నిర్మించాలంటూ ఆది నుంచి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వాలకు సూచిస్తూ వచ్చారు. కృష్ణా ఉపనదులపై కర్ణాటక రాష్ట్రంలో 1995 నుంచి 2004 మధ్య అనుమతి లేకుండా అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఇదే అంశాన్ని ఎత్తిచూపుతూ.. కృష్ణా మిగులు జలాలపై రాష్ట్రానికి హక్కు రావాలంటే పెండింగ్ ప్రాజెక్టులను తక్షణమే చేపట్టాలంటూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడును డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. దాంతో బ్రిజేష్‌కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా తీర్పు ఇచ్చింది. మిగులు జలాలనూ పంపిణీ చేసింది. దీని వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ మిగులు జలాలపై హక్కును కోల్పోవాల్సి వచ్చింది. చెప్పిందే చేశారు.. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు జలయ/ê్ఞన్ని చేపట్టారు. 85 ప్రాజెక్టులను ఒకేసారి ప్రారంభించారు. ఇదే క్రమంలో 1977 నుంచి కాగితాలకే పరిమితమైన వంశధార ప్రాజెక్టు రెండో దశకు శ్రీకారం చుట్టారు. నేరడి బ్యారేజీపై ఒడిశా అభ్యంతరాలకు సమాధానం చెబుతూనే.. ఆయకట్టుకు ముందుగా నీళ్లందించాలన్న లక్ష్యంతో వంశధార నదిపై కాట్రగడ్డ వద్ద సైడ్ వియర్(మత్తడి) నిర్మించాలని నిర్ణయించారు. రూ.933.90 కోట్లతో వంశధార ప్రాజెక్టు రెండో దశ పనులను ఫిబ్రవరి 25, 2005న చేపట్టారు. 2005 నుంచి 2009 వరకూ రూ.657.32 కోట్లను వెచ్చించి పనులను శరవేగంగా పూర్తి చేయడానికి ప్రణాళిక రచించారు. మిగిలిన పనులను పూర్తి చేయడంపై దృష్టి సారించాల్సిన ప్రస్తుత ప్రభుత్వం అంచనా వ్యయాన్ని రూ.1626.23 కోట్లకు పెంచేసింది. పాత కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని వేటు వేసి అనుకూలురైన కాంట్రాక్టర్లకు అప్పగించింది. కానీ.. ఇప్పటికీ మిగిలిపోయిన పనులు మందగమనంతో సాగుతోండటం గమనార్హం. వంశధారలో న్యాయం... ఆంధ్రప్రదేశ్, ఒడిశా వాదనలు ఏడేళ్లపాటు విన్న వంశధార ట్రిబ్యునల్ బుధవారం తీర్పు ఇచ్చింది. కాట్రగడ్డ సైడ్ వియర్తోపాటూ నేరడి బ్యారేజీకి ఆమోదం తెలిపింది. వంశధారలో 57.50 టీఎంసీలను వినియోగించుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది. అప్పట్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వంశధార రెండో దశను చేపట్టకుండా ఉన్నా.. ముందుచూపుతో ఒడిశా అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కాట్రగడ్డ సైడ్ వియర్ చేపట్టకుండా ఉన్నా ఈ రోజున వంశధార ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ వాదనతో విభేదించి ఉండేదని సాగునీటి రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వెనుకబడిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను సస్యశ్యామలం చేయాలన్న చిత్తశుద్ధితో వైఎస్ వంశధార ప్రాజెక్టు రెండో దశను చేపట్టడం వల్లే వంశధార ట్రిబ్యునల్ రాష్ట్రానికి న్యాయం చేస్తూ తీర్పును ఇచ్చిందని అధికవర్గాలు వెల్లడిస్తున్నాయి. వైఎస్సార్ కలలు సాకారం వంశధార జలవివాదాల ట్రిబ్యునల్ తీర్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా వచ్చిందంటే ఈ ఘనత దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుంది. ఆయన చూపించిన ప్రత్యామ్నాయ ప్రణాళిక ప్రకారం వంశధార నదిపై నేరడి బ్యారేజీ నిర్మిస్తే రెండు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు ద్వారా హిరమండలం ప్రధాన జలాశయంలోకి వరద నీటిని మళ్లించి పూర్తిస్థాయిలో నిల్వ చేయవచ్చు. తద్వారా శ్రీకాకుళం జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. వైఎస్సార్ హయాంలోనే ఈ ప్రాజెక్టు పనులు చాలావరకూ పూర్తయ్యాయి. మిగిలిన పనులూ పూర్తికావాలంటే వైఎస్ మాదిరి దృఢ సంకల్పం, సహృదయంతో పనిచేసే ప్రభుత్వాన్ని తెచ్చుకోవాల్సిందే. ఇప్పుడున్న ప్రభుత్వానికి ఎంతసేపు ప్యాకేజీలు, కమీషన్లు తెచ్చే ఎత్తిపోతల పథకాలపై తప్ప భారీ ప్రాజెక్టులు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి లేదు. – ధర్మాన ప్రసాదరావు, మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
పోలీస్ పహారాలో వంశధార నిర్వాసితులు
శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసిత గ్రామాలను ఖాళీచేయించే ప్రయత్నంలో పోలీస్ పహార ఏర్పాటు చేశారు. పోలీసులను నిర్వాసితులు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేంత వరకూ ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. అంత వరకు ప్రాజెక్టు పనులను జరగనివ్వబోమని హెచ్చరించారు. దీంతో నిర్వాసిత గ్రామాల్లో సెక్షన్ 144, 30 విధించారు. గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను విశాఖ డీఐజీ సీఎచ్ శ్రీకాంత్ పర్యవేక్షించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు నిర్వహించుకోవాలని సూచించారు. సమస్య పరిష్కారానికి సామరస్యంగా కృషిచేయాలన్నారు. గతంలో జరిగిన విద్వంసం నేపథ్యంలోనే గ్రామాల్లో పోలీస్ బలగాలను పిలిపించినట్లు డీఐజీ తెలిపారు. ఇది వరకు పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్వాసిత గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. -
కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లకు...
-
కమీషన్ల కోసమే కాంట్రాక్టర్లకు పెంచుతున్నారు!
రైతులకు వెయ్యికోట్లిస్తే చంద్రబాబుకు ఏమీ రాదని, అదే కాంట్రాక్టర్లకు ఇస్తే మాత్రం 30 శాతం కమీషన్ వస్తుందని, అందుకే వంశధార రెండోదశ ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా ఆయన ఆపుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ధర్నాలు చేసి గొడవ చేస్తారు కాబట్టి యువకులను దువ్వడానికి యూత్ ప్యాకేజి పేరుతో మోసం చేస్తున్నారని ఆయన అన్నారు. వంశధార రెండోదశ ప్రాజెక్టు నిర్వాసితులతో శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఆయన ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే... వంశధార రెండోదశ ప్రాజెక్టు అందరికీ కావాలి. 934 కోట్ల రూపాయల ప్రాజెక్టు వ్యయంలో దాదాపు 700 కోట్ల పైచిలుకు పనులు వైఎస్ హయాంలోనే పూర్తయ్యాయి తర్వాత చంద్రబాబు సీఎం అవ్వడానికి ముందే మరో 190 కోట్లు మళ్లీ ఖర్చుచేశారు అంటే వంశధార రెండోదశ ప్రాజెక్టుకు చంద్రబాబు సీఎం అయ్యేనాటికే 870 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టారు. మిగిలినది కేవలం 53 కోట్ల రూపాయల పనులే అంటే ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయిపోయాయి మిగిలిన 10 శాతం పనులు పూర్తిచేసి ప్రతి రైతుకు ఆర్అండ్ఆర్ ప్యాకేజి ఇచ్చే ఒకే ఒక్క కార్యక్రమం పెండింగులో ఉన్నా, చంద్రబాబు ప్రభుత్వం వచ్చి మూడేళ్లయినా ఇంకా చేయలేదు రైతులంటే కొంచెం ప్రేమ ఉన్నా ఒక్క ఏడాదిలోనే ఈ ప్రాజెక్టు పూర్తిచేసేవారు కానీ మన ముఖ్యమంత్రికి మాత్రం రైతుల మీద ప్రేమ లేదు ఆయనకు కాంట్రాక్టర్ల మీద మాత్రం వ్యామోహం ఉంది 934 కోట్ల రూపాయల పనుల్లో కేవలం 54 కోట్ల రూపాయల పనులే ఆయన సీఎం అయ్యేసరికి మిగిలాయి దీన్ని ఈపీసీ ప్రాజెక్టు కింద కాంట్రాక్టు ఇచ్చారు. అంటే కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయకపోతే జైలుకు కూడా పంపచ్చు కానీ చంద్రబాబు కాంట్రాక్టర్లతో లాలూచీ పడి మిగిలిన 54 కోట్ల పనులను 400 కోట్లకు పెంచేశారు తన పార్టీకి చెందిన ఎంపీ సీఎం రమేష్ కూడా ఆయన బినామీగా కాంట్రాక్టులు చేస్తున్నారు రేట్లు ఎందుకు పెంచారంటే.. పెట్రోలు పెరిగింది, డీజిల్, సిమెంటు, స్టీలు పెరిగాయని చెవుల్లో పూలు పెడుతున్నారు కాంట్రాక్ట్ ఇచ్చే సమయానికి, ఇప్పటికి చూస్తే పెట్రోలు, డీజిల్, స్టీలు, సిమెంటు తగ్గాయి, ఇసుక ఉచితంగా ఇస్తున్నా రేట్లు ఎందుకు పెంచారని గట్టిగా ప్రశ్నించాను చంద్రబాబు మాత్రం కాంట్రాక్టర్ల కమీషన్ల కోసం విపరీతంగా పెంచేశారు మరి రైతులకు ఎందుకు ప్యాకేజి పెంచలేదని ఈ రైతులే చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు అప్పట్లో ప్రాజెక్టు పూర్తి కావాలని దానికోసం ఆశపడి, అప్పట్లో త్యాగమూర్తులు భూములిచ్చారు. వాళ్లంతా ఇప్పుడు అడుగుతున్నది ఒకటే. అప్పటి నుంచి పదేళ్లు పూర్తయినా ప్రాజెక్టు పూర్తికాలేదని, 2013కు సంబంధించిన ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి కావాలని అడిగితే తప్పేంటని రైతులు అడుగుతున్నారు మీరు అడిగే దాంట్లో తప్పేం లేదు, రైతులకు నేను అండగా నిలబడతా చంద్రబాబు సీఎం అయ్యేసరికి 97 వేల కోట్ల అప్పులున్నాయి. ఈ మూడేళ్లలో ఆ భారాన్ని 2.16 లక్షల కోట్లకు తీసుకుపోయారు అంటే మూడేళ్లలో 1.18 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు. బడ్జెట్ చూస్తే లక్షన్నర కోట్లు, అప్పులు 1.18 లక్షల కోట్లు.. మరి శ్రీకాకుళం జిల్లాకు వెయ్యి కోట్లు ఇచ్చి ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తవుతుంది కదా అని అడిగినా ఆయన ఈ పనులు చేయరు రైతులకు వెయ్యి కోట్లు ఇస్తే, ఆయనకు కమీషన్లు రావు.. కాంట్రాక్టర్లకు ఇస్తే 30 శాతం కమీషన్లు తీసుకోవచ్చు తోటపల్లి, వంశధార ప్రాజెక్టు పనులుఎవరైనా చేశారంటే వైఎస్ మాత్రమేనని చెప్పుకోవచ్చు కేవలం 10 శాతం మిగిలి ఉన్న పనులను చంద్రబాబు పూర్తి చేయకుండా, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజి ఇవ్వకుండా పబ్బం గడుపుకొంటున్నారు యువత ధర్నాలు చేస్తారు కాబట్టి వాళ్లను దువ్వడానికి ఏదో ఇస్తామన్నారు గానీ అవి కూడా సరిగా ఇవ్వలేదు. మేమంతా భూములు కోల్పోయాం, నా పిల్లలకు వయసు తక్కువని డబ్బులు ఇవ్వకపోతే ఏ డబ్బు ఇస్తారని మహిళా రైతులు అడుగుతున్నారు ఇదే శ్రీకాకుళం జిల్లాలో పక్కన 18 లక్షలు ఇస్తున్నారు, మాకు ఇల్లు లేదు, మన్ను లేదని సూటిగా ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు పాలన ఎల్లకాలం సాగదు.. ఏడాది, ఏడాదిన్నర పోతే వచ్చేది మన పరిపాలన అప్పుడు కచ్చితంగా 2013 భూసేకరణ చట్టం అమలుచేసి, మిగిలిన పరిహారం కూడా ఇస్తాం ప్రతి ఒక్కరికీ, ప్రతి ఇంటికీ మేలు చేసే కార్యక్రమం చేస్తాం సమస్య ఎక్కడ వస్తోందంటే, ప్రతి కుటుంబంలోను తక్కువ రేటు ఇచ్చి భూములు కొనుగోలు చేశారు పక్కనే ఇదే జిల్లాలో 18 లక్షల చొప్పున అణు విద్యుత్ ప్లాంటుకు భూమి తీసుకుంటున్నారు యూత్ ప్యాకేజి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చామన్నట్లు ఉంది మొత్తం 11 వేల కుటుంబాలకు కూడా యూత్ ప్యాకేజి అమలుచేయాలి కనీసం అప్పుడైనా కొద్దో గొప్పో న్యాయం కనిపిస్తుంది. మీకు నచ్చినవాళ్లకు, కమీషన్లు ఇచ్చినవాళ్లకు మాత్రమే ప్యాకేజి ఇస్తున్నారు నచ్చినవాళ్లకు మాత్రమే ఇస్తూ ప్యాకేజిని అపహాస్యం చేస్తున్నారు ముంపు గ్రామాలకు సంబంధించి అవస్థలు పడుతున్న ప్రజల నోట్లోంచి మాటలు విన్నాం కడుపునిండా బాధ ఉన్నా చిక్కటి చిరునవ్వుతో ఆప్యాయత కనబరుస్తున్న ప్రతి ఒక్కరికీ చేతులు జోడించి, శిరస్సు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నా న్యాయాన్ని పక్కనపెట్టి చేస్తున్న అన్యాయం కళ్లెదుటే కనిపిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు చంద్రబాబు నాయుడి ప్రభుత్వంపై తీవ్రంగా ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నిరకాలుగా అండదండలు కల్పిస్తుంది మీరు ధర్నా చేస్తున్నప్పుడు వచ్చి సంఘీభావం తెలిపాను, ఇప్పుడు మరోసారి వచ్చా ఎవరూ అధైర్యపడొద్దు.. చంద్రబాబు ప్రభుత్వం సంవత్సరం మాత్రమే ఉంటుంది ఆయన ప్రభుత్వం బంగాళాఖాతంలో కలిసే రోజు ముందుంది కచ్చితంగా 2013 భూసేకరణ చట్టాన్ని అమలుచేస్తామని చెబుతున్నా నష్టపోయినదానికి మీ అందరికీ ఆ చట్టం ప్రకారం నష్టాన్ని పూడుస్తాం మొత్తం 11వేల కుటుంబాలకు న్యాయం జరిగేలా కచ్చితంగా చేస్తామని హామీ ఇస్తున్నాం ధైర్యంగా ఉండండి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నివిధాలుగా మీకు తోడుగా ఉంటుంది. -
అచ్చెన్న నీటి మూటలు
► నత్తనడకన వంశధార ప్రాజెక్టు పనులు ► బడ్జెట్లో నిధులు అంకెలకే పరిమితం ► జూన్ నాటికి సాగునీరు హామీ హుష్‌కాకి! ► కాంట్రాక్టర్లు టీడీపీ నేతల అనుయాయులే ► హెచ్చరికలు సమీక్ష సమావేశాలకే పరిమితం? వంశధార ప్రాజెక్టు... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే రిజర్వాయరు పనులు 80 శాతం, 87, 88 ప్యాకేజీల్లో 20 శాతం చొప్పున పూర్తయ్యాయి. ప్రాజెక్టును సాకారం చేస్తామంటూ గత ఎన్నికల్లో టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు! మంత్రి అచ్చెన్నాయుడు మరో అడుగు ముందుకేసి... ఈ ఏడాది జూన్ నాటికే రిజర్వాయర్‌లో నీరు నింపిస్తామంటూ ఊరిస్తూ వచ్చారు. తీరా ఈ మూడేళ్లలో జరిగిన పనులు చూస్తే పట్టుమని పది శాతం మించలేదు. దీనికి కారణం కాంట్రాక్టర్ల అలసత్వమేనంటూ నెపం వారిపై నెట్టేసే పనిలో టీడీపీ నేతలు నిమగ్నమయ్యారు! కానీ మరోవైపు జిల్లాలో నదులు అనుసంధానం చేసేస్తామంటూ కొత్త పల్లవి అందుకున్నారు! సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: అభివృద్ధిలో వెనుకబడిన ఈ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి ఉద్దేశించిన వంశధార ప్రాజెక్టు పనులకు వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేశారు. భారీగా నిధులు కేటాయించారు. దీంతో ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయి. హిరమండలం రిజర్వాయరు పనులు దాదాపు పూర్తయ్యాయి. వరద కాలువ, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల పనులకు ఉద్దేశించిన 87, 88 ప్యాకేజీల పనులు 20 శాతం చొప్పున జరిగాయి. వైఎస్సార్ అకాల మరణం తర్వాత పనులు నిలిచిపోయాయి. వంశధార ప్రాజెక్టు సామర్థ్యం 19 టీఎంసీలు. కొద్దిపాటి పనులు చేస్తే ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ చేసే అవకాశం ఉంది. అందుకే వచ్చే జూన్ నాటికి నీరు పారిస్తామంటూ జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు, జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెబుతూవచ్చారు. కానీ తమకు న్యాయం చేయకుండా అధికార బలం ప్రయోగించి పనులు చేసేందుకు ముందుకెళ్లడంతో గత జనవరి నెలలో నిర్వాసితులు విధ్వంసం సృష్టించారు. కాంట్రాక్టర్ల ఆస్తులకు నిప్పుపెట్టారు. దీంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయాయి. ఇటీవల బడ్జెట్లో కూడా వంశధారకు అరకొరగానే ప్రభుత్వం నిధులు కేటాయించింది. రూ.600 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదిస్తే కేవలం రూ.54 కోట్లు మాత్రమే విదిల్చింది. అదీ అంకెల్లోనే! నత్తనడకన పనులు...: ప్రాజెక్టు 87 ప్యాకేజీలో మొత్తం 13 కిమీ పొడవున మట్టి, సిమెంట్పనులుచేయాల్సి ఉంది.తొలుత ఈ పనులను హార్వి న్స్ సంస్థ చేపట్టింది. ఏడు కిలోమీటర్ల మేర పూర్తి చేసింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకుడు సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించారు.కానీ ఇప్పటివరకూ కేవలం రెండు కిలోమీటర్ల మేరకుమాత్రమే పనులుపూర్తయ్యాయి. ఇంకా నాలుగు కిలో మీటర్ల మేర పనులు మిగిలిఉన్నాయి. దీనిలోనే వంతెనలు, కెనాల్స్ వంటి సిమెంట్ పనులు చేయాల్సి ఉంది. ఇవన్నీ ఒప్పందం ప్రకారం ఈ ఏడాది అక్టోబరు నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ► 88 ప్యాకేజీ కింద మొత్తం 20 కిమీ మేర మట్టి, సిమెంట్ పనులు చేయాల్సి ఉంది. కానీ 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. దీనిలో 20 శాతం పనులు చేసిన శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ సంస్థను తొలగించి టీడీపీ ప్రభుత్వం సాయిలక్ష్మి కన్స్ట్రక్షన్స్ సంస్థకు అప్పగించింది. ఇది టీడీపీ నాయకుల అనుయాయులకు చెందినదే కావడం విశేషం. ► హిరమండలం రిజర్వాయరు పనుల్లో భాగంగా ప్రస్తుతం స్పిల్‌వే లింక్, కెనాల్ కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి. స్పిల్‌వే పనుల్లో భారీ బండరాయి పడింది. దీన్ని ఎలా తొలగించాలనేదీ ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. ఇక ఎర్త్‌డ్యామ్, గట్టు రాతి కట్టడాల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్ బాధ్యత టీడీపీ నేతలదే..: వంశధార పనులు సకాలంలో పూర్తిగాకపోవడానికి మంత్రి అచ్చెన్నాయుడు, టీడీపీ నేతల వైఖరే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. 2017 అక్టోబరు నాటికి పనులు పూర్తిచేయాలనే షరతుతో గత ఏడాది కాంట్రాక్టు సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నాయి. తీరా అవి పనులు మొదలు పెట్టేసరికి నిర్వాసితుల సమస్య తెరపైకి వచ్చింది. పోలీసు బలంతోనైనా పనులు పూర్తి చేస్తామని మంత్రి అచ్చెన్న సమీక్ష సమావేశంలో హెచ్చరించడం, ఇదే అదనుగా పోలీసులను మోహరించి దుగ్గుపురం రోడ్డును తవ్వించేయడంతో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. యంత్రాలు ధ్వంసం కావడంతో కాంట్రాక్టు సంస్థలు రెండు నెలల పాటు పనులు నిలిపేశాయి. ఇప్పటికిప్పుడు ప్రారంభించినా అక్టోబరు నాటికి పూర్తయ్యే పరిస్థితి లేదు. జూన్ నుంచి వర్షాలు ప్రారంభమైతే పనులు జరగవు. మిగిలిన ఏప్రిల్, మే నెలల్లో ఎంతమేర జరుగుతాయనేదీ అనుమానమే! ఈ పనుల పెండింగ్‌కు బాధ్యత వహించాల్సిన టీడీపీ నాయకులు... నెపాన్ని కాంట్రాక్టు సంస్థలపై నెట్టేసేందుకు ప్రయత్నించడం గమనార్హం! -
వంశధారపై విద్యుదుత్పత్తి ప్రాజెక్టు లేనట్లే
అమరావతి: వంశధార నదిపై 20 మెగావాట్ల జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆర్థికంగా గిట్టుబాటు కాదని ఏపీ జెన్కో(విద్యుదుత్పత్తి సంస్థ) నిపుణుల బృందం తేల్చిచెప్పడంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టు రెండో దశలో భాగంగా నదిపై 19.5 టీఎంసీల సామర్థ్యంతో హిరమండలం రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. ఆ రిజర్వాయర్ స్లూయిజ్‌ల ద్వారా గొట్టా బ్యారేజీ ఎడమ కాలువకు నీళ్లందిస్తారు. రిజర్వాయర్‌లో నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు స్పిల్ వే ద్వారా గొట్టా బ్యారేజీకి దిగువన వంశధార నదిలోకి వరద నీటిని వదిలేస్తారు. రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 47.5 మీటర్ల వరకూ నీటిని వినియోగించుకోవచ్చు. అక్కడినుంచి గొట్టా బ్యారేజీకి అనుసంధానం చేస్తూ పెన్‌స్టాక్(గొట్టాల)ను ఏర్పాటు చేసి వాటికి 20 అడుగుల దిగువన టర్బైన్లను ఏర్పాటు చేసి రెండు వేల క్యూసెక్కుల నీరు విడుదల ద్వారా 20 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఈ కేంద్రం ఏర్పాటు చేయాలంటే రిజర్వాయర్‌లో పవర్ బ్లాక్‌ను ప్రత్యేకంగా నిర్మించాల్సి ఉంటుంది. పవర్ బ్లాక్ ఏర్పాటు అంశంపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చే బాధ్యతను జలవనరుల శాఖ ఈఎన్సీ(పరిపాలన) రవికుమార్, సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) సీఈ గిరిధర్ రెడ్డి, సలహాదారు రౌతు సత్యనారాయణ బృందానికి అప్పగించింది. వారి నివేదికను జెన్కోకు పంపగా ఇటీవల రిజర్వాయర్‌ను పరిశీలించిన జెన్కో నిపుణుల బృందం పెన్ స్టాక్‌ల ద్వారా జలవిద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు అధిక వ్యయం అవుతుందని, ఇది గిట్టుబాటు కాదని తేల్చిచెబుతూ సర్కార్‌కు మరో నివేదిక ఇచ్చింది. దీంతో జలవిద్యుదుత్పత్తి కేంద్రం ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్లు జలవనరుల శాఖ అధికారవర్గాలు వెల్లడించాయి. -
అంతన్నారు.. ఇంతన్నారు..!
► బడ్జెట్లో వంశధారకు మొండిచెయ్యి ► నెరవేరని మంత్రుల హామీలు ఎల్.ఎన్.పేట : ‘వంశధార రిజర్వాయర్ నిర్మాణ పనులు సకాలంలో పూర్తి చేస్తాం. ఎన్ని నిధులు ఇచ్చేందుకైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2017 జూన్ (ఖరీఫ్) నాటికి వంశధార నుంచి సాగునీరు అందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు నిర్వాసితులు సహకరించాలి...’ ఈ ఏడాది జనవరి 24న వ్యవసాయశాఖ మంత్రి దేవినేని ఉమ, జిల్లా మంత్రి అచ్చెన్న, ప్రభుత్వ విప్ కూన రవికుమార్, ఎంపీ రామ్మోహన్నాయుడులు కొత్తూరు, హిరమండలం మండలాల్లో పర్యటించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలివి. అయితే ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు బుధవారం అసెంబ్లీలో 2017–18 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్లో వంశధార పేరు ప్రస్తావనకే రాలేదు. బడ్జెట్ పద్దులో 32వ పేజీలో పొందు పర్చిన జలవనరుల విభాగంలో 96 నుంచి 101 ఉన్న అంశాల్లో వంశధార ప్రస్తావనే లేదు. ఆదే ప్రభుత్వంలో ఉన్న కొందరు మంత్రులు వంశధార పనులకు, నిర్వాసితులకు ఇచ్చే పరిహారానికి నిధుల సమస్యేలేదని చెపుతుండటం, ఆర్థిక మంత్రి నిధులే కేటాయించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గత సంవత్సరం కంటే ఈ ఏడాది 60 శాతం నిధులు అదనంగా కేటాయించామని ఆర్థికమంత్రి చెపుతున్న మాటలకు వాస్తవానికి పొంతన లేకుండా పోయింది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న 7 పథకాలను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. పట్టిసీమ, తోటపల్లి బ్యారేజ్, గండ్లకమ్మ రిజర్వాయరు, పోలవరం ఆర్ఎంఎస్సిలతో పాటు గోదావరి, కృష్ణా నదుల అనుసంధానానికి ఇచ్చిన ప్రాధాన్యం వంశధారకు లేకుండాపోయింది. నిధులు కేటాయింపే లేకుండా నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ ఏడాది జూన్ నాటికి సాగునీరు ఎలా ఇవ్వగలరని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరో రూ.650 కోట్లు కావాలి..: వంశధార ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఏటా పెరిగిపోతోంది. గత ఏడాది కేవలం రూ.92 కోట్లు మంజూరు చేసి చేతులు దులుపుకొన్నారు. నిర్వాసితులకు 2013 ఆర్ఆర్ చట్టం ప్రకారం వివిధ రకాల ప్యాకేజీలు చెల్లించేందుకు రూ.1200 కోట్లు అవసరం. 25 శాతం మిగిలి ఉన్న పనులు పూర్తి చేసేందుకు మరో రూ.650 కోట్ల పైనే నిధులు అవసరమవుతాయని ఇంజినీరింగ్ అధికారులు అంచనా వేస్తున్నారు. వంశధార పేరుతో ఎలాంటి నిధులు కేటాయించకపోవడంతో జిల్లా సాగునీటి వనరులు (ఇరిగేషన్)కు మంజూరు చేసిన నిధులతోనే నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. మోసం చేశారు..: వంశధార రిజర్వాయర్ నిర్మాణం పూర్తి చేసి ఈ ఏడాది జూన్‌కు సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు హామీలు గుప్పించారు. వీరి మాటలు, బడ్టెట్ కేటాయింపులు చూస్తే జిల్లా రైతులకు, నిర్వాసితులకు మోసం చేసేలా ఉన్నాయి. – రెడ్డి శాంతి, వైఎస్సార్ సీసీ జిల్లా అధ్యక్షురాలు. -
మంత్రులకు చుక్కెదురు
హిరమండలం(పాతపట్నం) : అసలు సమస్యను పక్కనబెట్టి...కంటి తుడుపు చర్యలతో సరిపెట్టుకుంటే సహించేది లేదని వంశధార నిర్వాసితులు రాష్ట్ర మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కింజరాపు అచ్చెన్నాయుడు, ప్రభుత్వ విప్ కూన రవికుమా ర్, ఎంపీ కింజరాపు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే కలమట వెంకటరమణలను నిలదీశారు. ప్రభుత్వం నిర్వాసితులకు మంజూరు చేసిన పరిహారం పంపిణీ కోసం వీరంతా కట్టుదిట్టమైన భద్రత మధ్య మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన సభకు హాజరయ్యారు. పది నిమిషాల్లోనే ముగ్గురు నిర్వాసిత యువతకు చెక్కులు అందజేసి వెనుదిరిగారు. సభకు భీమవరం గ్రామానికి చెందిన నిర్వాసితులు మాత్రమే హాజరు కావడంతో మంత్రులు అవాక్కయ్యారు. మంత్రులు వస్తున్నారని తెలిసినా నిర్వాసిత గ్రామాల ప్రజ లు ఎవరూ రాలేదు. వచ్చిన వారు ప్రభుత్వ తీరుపై...మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఈ నెల 31లోగా సమస్య లు పరిష్కరిస్తామన్నారు. కొన్ని సమస్యల పరిష్కారానికి తక్షణమే రూ.190 కోట్లు మంజూరు చేసినట్టు చెప్పారు. ఈ క్రమంలో నిర్వాసితులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల మీరు మాపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఇప్పుడు మరోలా మాట్లాడడం ఏమిటని నిలదీశారు. ఉన్న ఊరిని, భూములను విడిచి వెళ్లేందుకు సిద్ధపడి త్యాగాలు చేస్తే మమ్మల్నే అవమానిస్తారా? అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మాట్లాడుతుండగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. నిర్వాసితులకు మీరు చేసిందేమటని వేదిక వద్దకు దూసుకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ సమయంలో మంత్రులు మెళ్లగా అక్కడ నుంచి జారుకున్నారు. కలెక్టర్ లక్ష్మీనరసింహం, ఎస్పీ జె.బ్రహ్మారెడ్డి, జేసీ చక్రధరరావు, ఆర్డీవో గున్న య్య, భూసేకరణ విభాగం ప్రత్యేక కలెక్టర్ గోవర్ధనరావు, తహసీల్దార్ ఎం.కాళీప్రసాద్ పాల్గొన్నారు. నెలాఖరు నాటికి యూత్ ప్యాకేజి ఎల్.ఎన్.పేట/కొత్తూరు : వంశధార స్టేజ్–2, ఫేజ్–2 ప్రాజెక్టు నిర్మాణంలో నిర్వాసితులైన యూత్ ప్యాకేజి చెక్కులు పంపిణీ ఒకటి రెండు రోజులు అటుఇటుగా ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేశామని మంత్రులు దేవినేని ఉమ, అచ్చెన్నాయుడు వెల్లడించారు. మంగళవారం కొత్తూరు మండలం కృష్ణాపురం గ్రామంలో జరిగిన యూత్ ప్యాకేజీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో వీరు పాల్గొన్నారు. కార్యక్రమానికి విస్తృతమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
'వంశధార'పై దిగొచ్చిన బాబు సర్కార్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ ప్రభుత్వం ఎట్టకేలకు దిగివచ్చింది. వంశధార ప్రాజెక్టు నిర్వాసితులకు నష్ట పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. నిర్వాసితులకు మంగళవారం చెక్కుల పంపిణీ చేయనుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ రూ.150 కోట్లు విడుదల చేసింది. చదవండి : (వంశధార నిర్వాసితుల ఆందోళన.. ఉద్రిక్తత) గత కొద్దికాలంగా శ్రీకాకుళం జిల్లా హిరమండలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాడలి, తులగాం, దుగ్గుపురంలో వంశధార రిజర్వాయర్ పనులను నిర్వాసితులు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేంత వరకు ప్రాజెక్టు పనులను జరగనివ్వబోమని హెచ్చరించారు. స్థానికులతో ప్రభుత్వం జరిపిన చర్చలు పలుమార్లు విఫలం కావడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. నిర్వాసితుల సమస్యలపై ప్రతిపక్షాలు ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి. దీంతో బాబు సర్కార్ నష్టం పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయంపై నిర్వాసితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
'వంశధార'పై దిగొచ్చిన బాబు సర్కార్
-
నిర్వాసితులకు న్యాయం చేయాలి
శ్రీకాకుళం పాత» స్టాండ్ : వంశధార నిర్వాసితులకు న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల ప్రతినిధులు కలెక్టర్ పి.లక్ష్మీనరసింహంను కోరారు. ఈ మేరకు వారు ఆయన చాంబర్లో ఆదివారం కలిసి నిర్వాసితుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నిర్వాసితులు పదకొండేళ్లుగా పునరావాసం కోసం న్యాయమైన నష్ట పరిహారం కోసం కోరుతున్నా ఇప్పటికీ న్యాయం జరగలేదని తెలిపారు. పోలవరంలో 2013 చట్టం ప్రకారం ప్యాకేజి అమలవుతుందని, అదే విధానం, ప్యాకేజీని వంశధార నిర్వాసితులకు అమలు చే యాలని కోరారు. ఆ చట్టం ప్రకారం ప్రతి నిర్వాసితునికి ఐదు సెంట్ల స్థలంలో ఇల్లు కట్టివ్వాలని, మరో రూ.7లక్షలు ప్యాకేజి ఇవ్వాల్సిండగా, అందుకు విరుద్ధంగా స్థలానికి, ఇంటి నిర్మాణానికి, ప్యాకేజీకి మెుత్తానికి రూ.ఐదు లక్షలు ఇవ్వడం వల్ల నిర్వాసితులకు అన్యాయం జరుగుతుందని వారు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. పెరిగిన నిత్యావసరాలు, గృహ నిర్మాణ సరుకులకు అనుగుణంగా పరిహారం చెల్లించాలని, దీనిపై ఇంకా ప్రభుత్వ జాప్యం చేయడం, వాయిదాలు వేయడం, తక్కువ ప్యాకేజీని అందజేయడం సరికాదని నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు కోరిన చోట ఇవ్వాలని, ఇళ్లకు నష్టపరిహారం, వృత్తి ప్యాకేజీ అందజేయాలని కోరారు. నిర్వాసితుల పునరావాసం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించిన తరువాతే పనులు చేయాలని కోరారు. నిర్వాసితులు కలెక్టర్ ఆఫీసు వద్ద ధర్నా చేయ పూనుకుంటే ధర్నాను భగ్నం చేయడం సరికాదని ఇది ప్రజల హక్కులను హరించడమేనని వారు లె లిపారు. కలెక్టర్‌ని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ నేత టంకాల బాలక్రిష్ణ, కాంగ్రెస్ పార్టీ నేల రత్నల నర్సింహమూర్తి, సీపీఎం సీనియర్ నాయకులు చౌదరి తేజేశ్వరరావు, భవిరి కృష్ణమూర్తి, కొరాడ నారాయణరావు, తాండ్ర ప్రకాష్, తాండ్ర అరుణ తదితరులు ఉన్నారు. కలెక్టరు తీరు సరికాదు.. వంశధార నిర్వాసితుల సమస్యలపై కలెక్టర్‌ని కలిసిన అఖిలపక్షం నేతలలో కొందరిని చూసి పథకం జిల్లా కలెక్టర్ చులకనగా వ్యవహరించడం çపట్ల ఆ పార్టీల నేతలు అసంతృప్తిని వ్యక్తంచేశారు. జిల్లాకు పెద్దగా ఆయన వద్ద సమస్యలు తెలియజేయగా, వారికి పరిష్కారం చూపకుండా నాయకులపై చులకనగా మాట్లాడారని ఆది సరికాదని కమ్యూనిస్టు నేతలు అవేదన వ్యక్తం చేశారు. -
న్యాయం జరిగే వరకు పోరాటం
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ) : వంశధార నిర్వాసితులందరికీ న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, అరెస్టులతో ఉద్యమాన్ని అణచివేయలేరని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు టి.తిరుపతిరావు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. నగరంలోని డేఅండ్‌నైట్ కూడలి వద్ద ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాసితుల సమస్యల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. వంశధార నిర్వాసితులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు అరెస్టులతో భయపెట్టాలని చూస్తుందన్నారు. 2005 నుంచి ఇప్పటి వరకు ఆర్ఆర్ ప్యాకేజి, యూత్ ప్యాకేజిలు ఇవ్వకుండా సర్వేల పేరుతో కాలం గడుపుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో నిర్వాసితుల పట్ల ద్వంద్వ వైఖరిని అవలంభిస్తుందన్నారు. నిర్వాసిత కుటుంబానికి ఐదు సెంట్లు స్థలమిచ్చి ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2009లో ఇచ్చిన నిర్వాసితుల జీవోను అమలు చేయాలని కోరారు. నిరసన చేస్తున్న వారిని అరెస్టు చేసి రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఉదయం పది గంటలకు అరెస్టు చేసిన వీరిని మధ్యాహ్నం 2 గంటల సమయంలో వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. నిరసనలో సీపీఎం నాయకులు డి.గణేష్, వై.చలపతిరావు, బి.లక్ష్మి, బి.సత్యంనాయుడు, ఎన్.కనకమహలక్ష్మి, ఎల్లమ్మ, సూరమ్మ, లలిత, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
నిర్వాసితుల ధర్నా భగ్నం
శ్రీకాకుళం పాతబస్టాండ్: హిరమండలం రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులు కలెక్టరేట్ వద్ద చేపట్టిన 36 గంటల ధర్నాను సోమవారం ఉదయం పోలీసులు భగ్నం చేశారు. వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో చేశారు. అయితే ఈ ధర్నా ఉదయం ప్రారంభించగానే అక్కడ ఉన్న నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. నిర్వాసితులు ఇంకా రావాల్సివుండగా వారిని కలెక్టరేట్‌కి రాకుండా అడ్డుకున్నారు. ధర్నాలో ఉన్న నాయకులు చౌదరి తేజేశ్వరరావు, టి.తిరుపతిరావు, కె.నారాయణరావు, ఎం.తిరుపతిరావు, జి.సింహాచలంను పోలీసులు ఆరెస్టుచేశారు. తర్వాత వారిని వ్యక్తిగత పూచీ కత్తులపై విడిచిపెట్టారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆర్ఆర్ ప్యాకేజీని విడుదల చేయకుండా, నిబంధనలు పాటించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు 5 సెంట్లు ఇల్లు స్థలం కేటాయించాలని, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాని డిమాండ్ చేశారు. నిర్వాసితులను అడ్డుకున్న పోలీసులు హిరమండలం/కొత్తూరు: వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై శ్రీకాకుళంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద 36 గంటల పాటు ధర్నా చేసేందుకు వెళుతున్న నిర్వాసితులను పోలీసులు అడ్డుకున్నారు. హిరమండలం నుంచి శ్రీకాకుళం వైపు వెళ్లే బస్సులను, వాహనాలను తనిఖీలు చేసి నిర్వాసితులను గుర్తించి వెనుకకు పంపివేశారు. హిరమండలం మండలం దుగ్గుపురం గ్రామానికి చెందిన ఎన్.ఢిల్లేశ్వరరావుతో పాటు పలువురు నిర్వాసితులను బస్ నుంచి దించివేశారు. వీరిలో ఒక్క ఢిల్లేశ్వరరావుని పోలీస్ స్టేషన్‌కి తీసుకువెళ్లి అదుపులో ఉంచారు. మధ్యాహ్నం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు. అలాగే కొత్తూరు మండలంలోని ఇరపాడు గ్రామానికి చెందిన నిర్వాసిత యువకులను ధర్నాకు వెళ్లకుండా గులివిందల పేట వద్ద స్థానిక ఎస్ఐ విజయకుమార్ తన సిబ్బందితో కలిసి అడ్డుకొన్నారు. ఆటోలతో వెళుతున్న నిర్వాసితులను ఆటోలు దించి పోలీస్ స్టేషన్‌కు రావాలన్నారు. లేదా ఇంటికి వెళ్లిపోవాలని తెలిపారు. దీంతో చేసేది లేక గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారు. అలాగే కుంచాల సీతారాంతో పాటు 12 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. ‘ధర్నా భగ్నం దారుణం’ శ్రీకాకుళం(పీఎన్‌కాలనీ): వంశధార రిజర్వాయర్ నిర్వాసితులకు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు ఇచ్చిన పరిహారం ప్యాకేజీ ఇవ్వాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద ధర్నాకు సిద్ధమైన సీపీఎం పార్టీ నాయకులను అరెస్టు చేయడం దారుణమని ఆ పార్టీ జిల్లా కార్యదర్శి భవిరి కృష్ణమూర్తి అన్నారు. ఈ మేరకు శ్రీకాకుళం నగరంలో సీపీఎం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో పౌరులకు స్వేచ్ఛ లేకుండా పోతోందని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. కలెక్టరేట్ వద్ద 36 గంటలు ధర్నాకు బయలుదేరిన నిర్వాసితులను గ్రామాల నుంచి రాకుండా ముందస్తుగానే వారిని అడ్డుకోవడం టీడీపీ ప్రభుత్వానికి తగదన్నారు. జిల్లాలో ఎస్పీ తీరు చాలా దారుణంగా ఉందని తీరు మార్చుకోకుంటే ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరించారు. ప్రజలమీద ప్రభుత్వం, పోలీసుల తీరు మార్చుకోకుంటే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. -
పనులు చేస్తే ఊరుకోం
వంశధార ప్రాజెక్టు పనులను అడ్డుకున్న వై.ఆర్.పేట గ్రామస్తులు ఏబీ రోడ్డులో బైఠాయింపు గ్రామాన్ని 4(1)గెజిట్‌లో చేర్చాలని డిమాండ్ కొత్తూరు: గ్రామాన్ని 4(1) గెజిట్‌లో చేర్చేవరకు వంశధార ప్రాజెక్టు పనులు అడ్డుకుంటామని మండలంలోని యెన్ని రామన్నపేట(వైఆర్‌పేట) గ్రామస్తులు తేల్చి చెప్పారు. ఏపీ ప్రాజెక్టుల నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం ఆధ్వర్యంలో ప్రాజెక్టు రెండోదశ పనులను సోమవారం అడ్డుకున్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కరించే వరకు పనులు సాగనివ్వమంటూ యంత్రాల ముందుకు వెళ్లి నినదించారు. తక్షణమే గ్రామాన్ని 4(1) గెజిట్‌లో చేర్చి పరిహారాలు చెల్లించాలని కోరారు. విషయం తెలుసుకున్న ఈఈ అప్పలనాయుడు, డీఈఈలు, జేఈలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. పనులు అడ్డుకోవద్దని సూచించారు. ప్రస్తుతం వరద కాలువ పనులు మాత్రమే చేస్తున్నామని చెప్పారు. దీనికి వై.ఆర్.పేట గ్రామస్తులు స్పందిస్తూ ఐదేళ్లకిందట గ్రామాన్ని నిర్వాసిత గ్రామంగా గుర్తించారని, 4(1) గెజిట్‌లో చేర్చడంలో జాప్యం చేయడంపై మండిపడ్డారు. గ్రామస్తులు అందజేసిన వినతి పత్రంలో ఉన్న డిమాండ్లను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని ఈఈ తెలిపారు. నిర్వాసితులపై ప్రభుత్వ తీరుకు నిరసనగా అలికాం–బత్తిలి రోడ్డు వైఆర్‌పేట వద్ద బైఠాయించి వాహనరాకపోకలను అడ్డుకున్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ తిర్లంగి కృష్ణమోహన్, పాపారావు, జనార్దనరావు, నర్సింహమూర్తి, గోవిందరావు, కూన అర్జునరావులు పాల్గొన్నారు. -
వంశధారపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు అన్నారు. మండలంలో వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న రిలే నిరహార దీక్షా శిబిరాన్ని ఆదివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలల తరబడి నిర్వాసితులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. తక్షణమే 2013 ఆర్ఆర్ చట్టం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిర్వాసిత సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం, బ్యారేజీ సెంటర్ నిర్వాసితులు పాల్గొన్నారు. -
అనుసంధానంతోనే అభివృద్ధి
వంశధార నిర్వాసితులకు రూ.350కోట్లతో ప్యాకేజీ: సీఎం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నాగావళి, వంశధార నదుల అనుసంధానంతో శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. శ్రీకాకుళం పట్టణంలోని కోడి రామ్మూర్తి స్టేడియం పునఃనిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన ‘నీరు-ప్రగతి’ అవగాహన సదస్సులో సీఎం మాట్లాడుతూ వంశధార ప్రాజెక్టు పనుల సత్వర పూర్తికి ఫాస్ట్‌ట్రాక్‌లో టెండర్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. నిర్వాసితులకు అవసరమైతే రూ.350 కోట్ల వరకూ ఖర్చు చేసైనా ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. శ్రీకాకుళం పర్యటనలో సీఎంకు చేదు అనుభవం ఎదురైంది. సింగుపురం రెవెన్యూ పరిధిలోని అల్లి చెరువు వద్ద చేపట్టిన అభివృద్ధి పనుల పరిశీలనకు వెళ్లిన ఆయనఅక్కడ ఏర్పాటుచేసిన కార్యక్రమానికి సమీప గ్రామాల నుంచి మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ.. అందరూ మరుగుదొడ్లు కట్టుకున్నారా? అని ప్రశ్నించారు. దీనికి లేదని మహిళలంతా సమాధానమిచ్చారు. ‘మరుగుదొడ్డి కట్టుకోవాలి. లేదంటే మహిళల ఆత్మగౌరవానికి భంగం కలుగుతుంది. పదిహేను వేల రూపాయలు వస్తాయి. వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకోండి’ అంటూ చంద్రబాబు సూచించారు. దీంతో బైరివానిపేటకు చెందిన ఓ మహిళ స్పందిస్తూ... ‘ముందు కట్టుకున్న మరుగుదొడ్లకే బిల్లులు ఇవ్వట్లేదు. మిగతావాళ్లు కట్టుకున్నా ఉపయోగమేమిటి?’ అని ప్రశ్నించింది. మరో మహిళ లేచి... ‘గతంలో కట్టిన ఇళ్లకూ బిల్లులు ఇవ్వలేదు. ఇల్లు కట్టుకుందామని అంతకుముందున్న ఇల్లును కూల్చేసుకున్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రెండేళ్లయ్యింది... కొత్త ఇళ్లు ఒక్కటైనా ఇచ్చారా? ఇప్పటికీ ఏ ఒక్కరికీ మంజూరు లేదు’ అని ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి స్పందించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ డ్వాక్రా మహిళలకు రూ.3 వేలు బ్యాంకు ఖాతాలో జమ చేస్తూ, వడ్డీ మాఫీ చేశామన్నారు. దీంతో మరో మహిళ లేచి... వడ్డీలను పొదుపు నుంచి జమ చేశారని, పొదుపు చేసిన మొత్తానికి వడ్డీ ఇవ్వడం లేదని సీఎం దృష్టికి తీసుకొచ్చింది. తీరా ఆ రూ.3 వేలు కూడా బ్యాంకు వాళ్లు ఇవ్వట్లేదని, ఇక వాటివల్ల లాభమేమిటని ప్రశ్నించింది. దీనికి సీఎం సమాధానమిస్తూ రూ.3 వేలు చొప్పున మరో నెలలో జమ చేస్తామని, అంతకు ఎనిమిది రెట్లు ఎక్కువగా వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పారు. అయినా సీఎం సమాధానాలతో సంతృప్తి చెందని మహిళలు మరికొంత మంది ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. ఇది గమనించిన చంద్రబాబు మరో కార్యక్రమానికి సమయం కావస్తోందంటూ అక్కడి నుంచి వెనుదిరిగారు. ఇష్టానుసారం మాట్లాడుతున్న కేసీఆర్ కృష్ణా జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన వాటా గురించి అడిగితే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని సీఎం చంద్రబాబు అన్నారు. ట్రిబ్యునల్ ఆదేశాల ప్రకారం రాష్ట్రానికి వెయ్యి టీఎంసీల నీరు రావాల్సి ఉంటే కేవలం 85 టీఎంసీలు మాత్రమే దక్కాయని వెల్లడించారు. తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తయితే కృష్ణా డెల్టాలో సాగుకు నీరు కరువయ్యే పరిస్థితులు ఏర్పడతాయన్నారు. రాష్ట్రం హక్కుల కోసం రాజీపడబోమన్నారు. -
నిధులో రామకృష్ణా..!
నిధుల కోసం ఎదురు చూస్తున్న ప్రాజెక్టులు రెండేళ్లుగా ఎక్కడి పనులు అక్కడే ‘వంశధార’పైనే అందరి ఆశలు ‘ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం...’ ఎన్నికల ముందు ఈ మాట దాదాపు ప్రతి రోజూ చంద్రబాబు నోట వినిపించింది. కానీ రాష్ట్ర విభజన తర్వాత తొలి బడ్జెట్లో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ మాటను పట్టించుకోలేదు. కనీసం ఈ బడ్జెట్లోనైనా సాగునీటి బడ్జెట్లపై కరుణ చూపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. వంశధార, తోటపల్లిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నారు. ఇంకొన్ని కలలూ బడ్జెట్‌పైనే ఆధారపడి ఉన్నాయి. వంశధార పరిస్థితి ఇలా.. వంశధార ప్రాజెక్టు నిర్మాణ వ్యయం ఇప్పుడు రూ.1650 కోట్లకు పెంచారు. అయితే గత బడ్జెట్లో కేవలం రూ. 92 కోట్లు కేటాయించి పాల కులు చేతులు దులుపుకున్నారు. ఈ బడ్జెట్లోనైనా కేటాయింపులు జరగాల్సి ఉంది. అలాగే ఆఫ్‌షోర్ ప్రాజెక్టుకు రెండో దఫా శంకుస్థాపన చేశారు. మొదటి దానికే దిక్కులేదు. రెండోసారి శంకుస్థాపన చేయడంపై రైతుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గత బడ్జెట్లో కేటాయింపులిలా.. గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లాకు రూ.243.25 కోట్లు కేటాయింపులిచ్చారు. ఇందులో తోటపల్లి కాలువలకు రూ.161.98 కోట్లు, వంశధార ప్రాజెక్టు స్టేజ్-1కు రూ.17.99 కోట్లు, స్టేజ్-2కు రూ.52.28 కోట్లు, ఆఫ్‌షోర్‌కు రూ.6 కోట్లు, మడ్డువలస కాలువలకు రూ. 5 కోట్లు కేటాయించారు. వీటితోపాటు నేషనల్ అర్బన్ ఇన్ఫర్మేషన్ సిస్టంను గత బడ్జెట్లో మంజూరు చేశారు. ‘భావనపాడు’కు కేటాయింపులు నిల్ గత బడ్జెట్లో భావనపాడు, కళింగపట్నం మినీ పోర్టులు నిర్మిస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. భావనపా డు పోర్టు నిర్మాణానికి ప్రైవేటు భాగస్వామ్యంతో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. ఇంతవరకు ఎలాంటి కేటాయింపులు ఇవ్వలేదు. కానరాని పర్యాటకం బారువా తీరంలో పర్యాటకాభివృద్ధికి నిధులు కేటాయించడంతోపా టు టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో పేర్కొన్నారు. కానీ రూపాయి కూడా ఇవ్వలేదు. జిల్లాలోని తోటపల్లి కాలువ, గెడ్డల (మురుగు నీటి పారుదల వ్యవస్థ) ఆధునికీకరణకు రూ. 271 కోట్లతో గత ఏడాది జలవనరుల శాఖ సమగ్ర నివేదిక ఇచ్చింది. గెడ్డల ఆధునికీకరణ కు రూ. 111 కోట్లుతో గతంలో జలవనరుల శాఖ ఇన్విస్టిగేషన్ డివిజన్ నివేదికను ప్రభుత్వానికి పంపింది. రెల్లిగెడ్డతో సహా మొత్తం 52 గెడ్డల ఆధునికీకరణకు రూ. 90.98 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసిన నిధులు రాలేదు. నాగావళి, బాహుద, మహేంద్రతనయ నదుల ఓపెన్‌హెడ్ చానెళ్ల ఆధునికీకరణకు నిధులివ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. తోటపల్లి ప్రధాన కాలువలకు లైనింగుతో సహా వివిధ అడ్డంకులను అధిగమించే విధంగా మార్గమధ్యలో కట్టడాలను నిర్మించి పూర్తిస్థాయిలో కాలువలను ఆధునికీకరించేందుకు రూ. 124.83 కోట్లు గతంలో కోరినా ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది. మడ్డువలస... రెండో దశ కింద చేపట్టిన మడ్డువలస జలాశయం నిర్మాణం సహా కాలువల లైనింగు, పిల్ల కాలువల నిర్మాణాలు ఇంకా పూర్తి కాలేదు. ఇందుకు రూ. 14 కోట్లు అవసరం ఉందని గత ఏడాది అంచనా. అది ఇప్పుడు రూ.19 కోట్లకు చేరింది. గత బడ్జెట్లో రూ.6 కోట్లు కేటాయించినా నిధులు విడుదల కాలేదు. ‘కరకట్టల’ను కరుణిస్తారా? వంశధార నదికి ఇరువైపులా కరకట్టల నిర్మాణాల పైనా స్పష్టత లోపిస్తోంది. సుమారు రూ. 175 కోట్లు తో 177 కి.మీ పొడవునా నాలుగు ప్యాకేజీలుగా పనులు చేపట్టినా మధ్యలోనే నిలిచిపోయాయి. పాత ఒప్పందాల మేరకు కాంట్రాక్లర్లు చేసే పరిస్థితి లేదు. కొత్త రేట్లు ఇచ్చే అంశంపై ఎటూ నిర్ణయం తీసుకోలేదు. హామీల మాటేంటి? తీర ప్రాంతంలో భావనపాడు, కళింగపట్నం ఓడ రేవులకు బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని స్థానికులు ఆశిస్తున్నారు. భావనపాడు ఓడరేవు నిర్మాణంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. అక్కడ రేవు నిర్మాణంపై సమగ్రంగా అధ్యయనం చేసిన ఇండియన్ పోర్టు అసోసియేషన్ ఎకనమిక్ ఫీజుబులిటీ (టీఈఎఫ్)పై సానుకూలంగా నివేదిక ఇవ్వడంతో ప్రభుత్వం శ్రద్ధ కనబరచింది. ఆదిలోనే ఈ ప్రాజెక్టును ప్ర జలు వ్యతిరేకించడంతో అవాంతరాలు వచ్చి పడ్డాయి. మరో వైపు మూడు సంస్థలు ఈ పోర్టు నిర్మాణానికి ముందుకొచ్చాయి. ఇప్పటికే విశాఖపట్నం పోర్టు నిర్మాణానికి సానుకూలతతో ఉంది. మరోవైపు నిర్మించు-నిర్వహించు-అప్పగించు (బీఓటీ) పద్ధతితోపాటు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా గానీ, ప్రైవేటు భాగస్వామ్య సంస్థలతో ఉమ్మడిగా గాని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. నిర్మాణానికి అవసరమైన డిజైన్‌ను రూపొందించిన గత బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఈసారైనా బడ్జెట్లో కేటాయింపులు వస్తాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కళింగపట్నం ఓడరేవు నిర్మాణానికి అవసరమైన సర్వేలు జరిపిన ప్రభుత్వం నిన్నటివరకు యాంకరు పోర్టుతోపాటు డ్రె డ్జింగ్ ఏర్పాటు చేస్తామని నమ్మబలికారు. ఇప్పటికే డ్రెడ్జింగ్‌ను అంతర్వేదికి తరలించినట్టు బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా ప్రకటించడంతో జిల్లా ప్రజలకు ఆ ఆశ అడియాశగా మారింది. ‘ఆశ్రమం’ లేదు జిల్లాలోని వెనుకబడిన తరగతులు, సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ వసతిగృహాలను ఆశ్రమ పాఠశాలలుగా మారుస్తామని గత బడ్జెట్లో ప్రకటించినప్పటికీ కార్యరూపం దాల్చలేదు. జిల్లాలో సౌర విద్యుత్ వినియోగం పెంచడానికి 770 సోలార్ పంపుసెట్లు ఇస్తామని ప్రకటించినా కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత అవసరాలెన్నో అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ప్రభుత్వం తోటపల్లి ప్రాజెక్టుకు గత బడ్జెట్లో కేటాయింపులిచ్చారు. ప్రాజెక్టు పూర్తయితే విజయనగరం జిల్లాలో 62 వేల ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 58 వేల ఎకరాలు కొత్తగా సస్యశ్యామలం అవుతాయని అంచనా. గత బడ్జెట్లో కేటాయించి నిధులు పూర్తిస్థాయిలో ఖర్చుకాలేదు. పెరిగిన అంచనాలకు అనుగుణంగా ధరలు పెరిగితే తప్ప తోటపల్లి నుంచి పూర్తిస్థాయిలో నీరు అందించడం సాధ్యం కాదు. -
నిర్వాసితులకు అన్యాయం జరిగితే ఊరుకోం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి శ్రీకాకుళం అర్బన్: వంశధార నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాగునీటి ప్రాజెక్టుల్లోని నిర్వాసితుల పునరావాసం పట్ల టీడీపీ ప్రభుత్వం ఏమాత్రం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నారు. దారుణ నిర్లక్ష్యంతో నిర్వాసితులను సర్వనాశనం చేస్తుందన్నారు. తోటపల్లి ప్రాజెక్టు నిర్వాసితుల పోరాట ఫలితంగా పునరావాసంలో అనేక మార్పులు వచ్చినా వాటిని సక్రమంగా అమలు జరపడం లేదని ఆరోపించారు. ప్రభుత్వ లెక్క ప్రకారం యువతను మినహాయించి వంశధార నిర్వాసిత కుటుంబాలు 7,104 ఉండగా ఇప్పటివరకు ఇళ్ల స్థలాలు ఇచ్చింది మూడు వేలమందికేనని చెప్పారు. రిజర్వాయర్ పనులు ప్రారంభించి పదేళ్లు పూర్తయినప్పటికీ ఇప్పటికీ ఒక కొలిక్కి రాకపోవడం శోచనీయమన్నారు. ప్రభుత్వం ఈ ఏడాది ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామని ప్రకటిస్తోందని, ఆరునెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తే నిర్వాసితుల పరిస్థితి ఏమిటన్నారు. ఇంతవరకూ ఇళ్ల స్థలాలే ఇవ్వలేదని, కొంతమందికి 5 సెంట్లు, మరికొంతమందికి 2 సెంట్ల స్థలాన్ని కేటాయించారన్నారు. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా నీటిని విడుదల చేస్తే ఆ నీటిలో వారిని ముంచేందుకా అని ప్రశ్నించారు. 2005లో అప్పటి ధరల్లో నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి రూ. 53 వేలు నిర్ణయించగా ఇప్పుడు కూడా అంతే మొత్తం ఇస్తామనడం భావ్యం కాదన్నారు. అప్పటికీ ఇప్పటికీ 10 రెట్లు ధరలు పెరిగాయని గుర్తుచేశారు. ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని ప్రతిపక్ష వైఎస్సార్ సీపీ చూస్తూ ఊరుకోదని, అన్యాయానికి గురవుతున్న నిర్వాసితుల పక్షాన పోరాటం చేస్తామని ఆమె హెచ్చరించారు. -
‘నేరడి’ ఆశలు పదిలం
నేరడి బ్యారేజ్(భామిని): వంశధార విస్తరణ ప్రాజెక్టుపై ఆశలు చిగురిస్తున్నాయి. రైతు బాంధవుడు, దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి కలల ప్రాజెక్టు సాకారం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లా రైతుల ఆశల పంట పండనుంది. సుమారు 3.5 లక్షల ఎకరాలకు సాగు అందించే ఈ ప్రెజెక్టు నిర్మాణానికి అనుమతులు లభించే అవకాశాలు మెరుగుపడ్డాయి. పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్(సీడబ్ల్యుపీఆర్‌ఎస్)లో ఈ ప్రాజెక్టుపై శుక్రవారం మోడల్ సర్వే జరిగినట్లు అధికారవర్గాలు పేర్కొన్నాయి. వంశధార ట్రిబ్యునల్ కమిటీ చైర్మన్ జస్టిస్ డాక్టర్ ముకుందం శర్మ, సభ్యులు ఎం.ఎస్.చతుర్వేది, గులాం మహ్మద్‌లు ప్రాజెక్టు నమూనా ఆధారంగా వరద ప్రవాహాన్ని పరిశీలించి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం అందింది. ఒడిశా అభ్యంతరాలతో దశాబ్దాలుగా అంతర్ రాష్ట్ర వివాదంలో ఈ ప్రాజెక్టు నలుగుతున్న విషయం తెలిసిందే. దీంతో వంశధార ప్రాజెక్టు స్టేజ్-2లో భాగంగా భామిని మండలం నేరడి వద్ద బ్యారేజ్ నిర్మాణ ప్రతిపాదన అలాగే ఉండిపోయింది. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాద పరిష్కారానికి సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య ట్రిబ్యునల్ కమిటీ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలు, పూణే రీసెర్చ్ స్టేషన్లో జరిపిన అధ్యయనాల ఆధారంగా సమస్య పరిష్కారానికి మార్గం అన్వేషిస్తోంది. నమూనా పరిశీలనలో వీగిన ఒడిశా వాదన పూనేలో జరిపిన నమూనా పరిశీలనలో తమ ప్రాంతాలకు వరద ముప్పు ఉందన్న ఒడిశా వాదన వీగిపోయినట్లు తెలిసింది. ప్రాజెక్టు నిర్మిస్తే.. నదిలో 6 లక్షలపైచిలుక వరద ప్రహించినప్పుడు దాని బ్యాక్‌వాటర్‌తో తమ రాష్ట్రంలోని 10.5 కి.మీ. ప్రాంతం ముంపునకు గురవుతుందని ఒడిశా వాదిస్తోంది. ఈ నమూనా ప్రయోగంలో 6.5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహ పరిస్థితిని పరిశీలించగా ఎగువన ఒడిశాలోని 6.5 కి.మీ. లోపే ప్రమాదం ఉంటుందని గుర్తించారు. ఈ పరిశీలన ఒడిశా వాదనను బలహీనపరుస్తోంది. ఒడిశా ప్రభుత్వం వేసిన పిటిషన్ ఆధారంగా సుప్రీంకోర్టు సమస్యపై అధ్యయనానికి త్రిసభ్య కమిటీని నియమించింది. తొలిసారిగా ఈ కమిటీ 2013 ఏప్రిల్ 22న పర్యటించి వివాద స్థలాన్ని, ముంపు ప్రాంతాలను పరిశీలించింది. 2013 మే 13 నుంచి 21 వరకు కేంద్ర జల సంఘం పర్యవేక్షణలో ఆంధ్రా-ఒడిశా ఇంజినీరింగ్ బృందాలు నేరడి బ్యారేజ్‌కు ఎగువ, దిగువ ప్రాంతాల్లో రీసర్వే చేసి సీడబ్ల్యుఎస్కు నివేదించాయి. తిరిగి ఈ ఏడాది మార్చి 21న ట్రిబ్యునల్ కమిటీ నేరడి బ్యారేజ్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించింది. కాగా గత నెల 25 నుంచి ఇరు రాష్ట్రాల వాదనలు విన్న ట్రిబ్యునల్ ఒడిశాలో ముంపు నష్టాలు, అవసరమైన రక్షణ గోడలు, వరద గట్ల నిర్మాణ ప్రతిపాదనలపై పూర్తిస్థాయి నివేదికలు ఇవ్వాలని ఆదేశించడంతో విచారణ నిర్ణయాత్మక దశకు చేరుకుందని వంశధార ప్రాజెక్టు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూణేలో జరిగిన మోడల్ సర్వేలో త్రిసభ్య కమిటీతో పాటు వంశదార ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ శివరాంప్రసాద్, ఎస్ఈ రాంబాబు, డీఈఈలు నాగేశ్వరరావు, వెంకటరమణలు పాల్గొన్నారు.త్వరలో మరోసారి ప్రాజెక్టు ప్రాంతంలో ఇరురాష్ట్రాల అధికారులు సర్వేలు చేయనున్నారు. -
జలసిరులు.. అందరికీ సొంతం కావాలి
జగన్ మాట శ్రీకాకుళంలో జిల్లాలో నిర్మాణంలో ఉన్న వంశధార, మద్దువలస, తోటపల్లి, ఆఫ్‌షోర్ సహా జలయజ్ఞం కింద ప్రారంభించిన అన్ని సాగునీటి ప్రాజెక్టులనూ పూర్తిచేస్తాం. బాబు పాలనలో.. వంశధార మొదటి దశకు తొమ్మిదేళ్ల టీడీపీ ప్రభుత్వం సుమారు రూ.70 కోట్లు మాత్రమే కేటాయించింది. ఈ మొత్తంతో కాలువలు తవ్వడం ద్వారా 25 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేయగలిగారు. రెండోదశ విషయాన్ని ఆ ప్రభుత్వం ఏనాడూ ఆలోచించలేదు. ఇక మడ్డువలస, తోటపల్లి ప్రాజెక్టుల నిర్వహణకు నిధులు మంజూరు చేయడమే తప్ప విస్తరణ గురించి పట్టించుకోలేదు. ఆఫ్‌షోర్ ప్రాజెక్టు ఆలోచనే రాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2000 నుంచి 2003 వరకూ కరువు కరాళ నృత్యం చేసినా చంద్రబాబుకు పట్టలేదు. రణస్థలం, ఎచ్చెర్ల, లావేరు వర్షాధార మండలాలు. వీటికి సాగు, తాగునీరివ్వాల్సిన మడ్డువలస ప్రాజెక్టు విస్తరణ, తోటపల్లి జలాశయం కాలువల తవ్వకంపై శ్రద్ధ చూపలేదు. వైఎస్ హయాంలో.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన వెంటనే 2004లో జలయజ్ఞంలో భాగంగా శ్రీకాకుళం జిల్లాకు రూ.933 కోట్లతో వంశధార రెండోదశ పనులకు శ్రీకారం చుట్టారు. * రూ.310 కోట్లతో వంశధార, నాగావళి నదులకుకరకట్టల నిర్మించారు. * రూ.57 కోట్లతో మడ్డువలస ప్రాజెక్టు విస్తరించారు. * రూ.127 కోట్లతో ఆఫ్‌షోర్ ప్రాజెక్టు, రూ.452 కోట్లతో తోటపల్లి ప్రాజెక్టు నిర్మాణ పనులు మంజూరయ్యాయి. నాగావళి, వంశధార నదీ తీర గ్రామాలను వరదల నుంచి రక్షించేందుకు వీలుగా రూ.310 కోట్ల అంచనాతో కరకట్టల నిర్మాణానికి వైఎస్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. తొలివిడతగా రూ.30 కోట్లు మంజూరు చేసింది. మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకు జలయజ్ఞం కింద రూ.160 కోట్లు మంజూరు చేశారు. ఎచ్చెర్ల మండలానికి నీరు అందించాలన్న ప్రధాన లక్ష్యంతో ఈ నిధులు మంజూరు చేశారు. మహేంద్రతనయ నదిపై రూ.127 కోట్లతో ఆఫ్‌షోర్ జలాశయాన్ని వైఎస్ మంజూరు చేశారు. వజ్రపుకొత్తూరు, టెక్కలి, నందిగాం, పలాస మండలాలకు సాగునీరుతో పాటు పలాసకు తాగునీరు ఇవ్వాలన్నది ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో టీడీపీ హామీ ఇచ్చినా నెరవేరలేదు. వైఎస్ ముఖ్యమంత్రి అయ్యాక జలయజ్ఞంలో చేర్చి తొలి విడతగా రూ.20 కోట్లు మంజూరు చేశారు. తోటపల్లి బ్యారేజ్‌ను జలాశయంగా మార్చే ప్రాజెక్టుకు అప్పట్లో రూ.452 కోట్ల అంచనాతో మంజూరు చేశారు. ప్రాజెక్టు పూర్తయితే శ్రీకాకుళం జిల్లాలోని రాజాం, రణస్థలం, లావేరు, వంగరతో పాటు మరికొన్ని మండలాల్లో 48 వేల ఎకరాలకు అదనపు ఆయకట్టు లభిస్తుంది. రాజశేఖరరెడ్డి హయాంలో రూ.400 కోట్ల వరకు మంజూరు కాగా, 80% పనులు పూర్తయ్యాయి. వైఎస్ మరణానంతరం.. వైఎస్సార్ మరణం cరువాత సీఎంలుగా బాధ్యతలు చేపట్టిన రోశయ్య, కిరణ్ జలయజ్ఞం ప్రాజెక్టులకు నిధులు పెద్దగా మంజూరు చేయలేదు. దీంతో పనులు అర్ధంతరంగా నిలిచిపోయాయి. బడ్జెట్లలో జరిపిన అరకొర కేటాయింపులు, ఉద్యోగుల జీతభత్యాలకు సరిపోయేవి. ఈ కారణంగానే జిల్లాలో అదనపు ఆయకట్టు సాగులోకి రాలేదు. ఒడిశా రాష్ట్ర అభ్యంతరం పేరుతో వంశధార రెండోదశ పనులు నిలిపివేశారు. వాస్తవానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడం వల్లే పనులు ఆగిపోయాయి. వైఎస్ ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మేరకు 2.5 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగాలి. పనులు నిలిచిపోవడంతో కార్యాచరణకు నోచుకోలేదు. ఇప్పుడున్న ప్రాజెక్టు ద్వారా 50వేల ఎకరాల భూములకు నీరందడం లేదు. గొట్టా బ్యారేజీ విస్తరణ పనులు చేపట్టాల్సి ఉంది. వంశధార రెండోదశ ప్రాజెక్టుకు అంచనా వ్య యం మరో రూ.150 కోట్లకు పెరిగింది. నిధులు లేక నాగవళి, వంశధార తీర గ్రామాల్లో కరకట్టల నిర్మాణ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. మడ్డువలస ప్రాజెక్టు విస్తరణకు నిధులు విడుదల చేయకపోవడంతో కాలువ నిర్మాణాలు నిలిచిపోయాయి. మహేంద్ర తనయపై ఆఫ్‌షోర్ పనులూ నిలిపివేశారు. తోటపల్లి జలాశయం ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయకపోవడంతో అంచనా వ్యయం రూ.100 కోట్లు పెరిగింది. అసంపూర్తిగా ఎత్తిపోతల పథకం వైఎస్ మరణానంతరం ప్రాజెక్టుల పనులు పూర్తిగా నిలిచిపోయాయి. మా ప్రాంతం లో వంశధార కుడి కాలువపై నిర్మించిన అక్కులపేట ఎత్తిపోతల పథకం అసంపూర్తిగా ఉంది. దీంతో శివారు భూములకు సాగునీరు అందడంలేదు. పంటలు పండక వలస పోతున్నాం. - గొరివెళ్లి కృష్ణమూర్తి, రైతు, పొన్నాంపేట, ఆమదాలవలస మండలం వైఎస్ ఉన్నపుడే ప్రాజెక్టు పనులు జరిగాయి.. మా భూములన్నీ వర్షాధారమే. సాగునీరు లేక భూములన్నీ బీడువారాయి. మా కష్టాలను చూసిన వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు తోటపల్లి, మడ్డువలస ఫేజ్-2 సాగునీటి ప్రాజెక్టులు మంజూరు చేశారు. ఆయన హయాంలో సాగునీటి ప్రాజెక్టుల పనులు చురుగ్గా జరిగేవి. మరి కొద్దిరోజుల్లో సాగునీరు అందుతుందని సంబరపడ్డాం. ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయి నీరు రాక పంటలు పండటం లేదు. - లంకలపల్లి తవిటియ్య, రైతు, కేశవరాయునిపురం, లావేరు మండలం రెండు పంటలు పండించుకుంటున్నాం మడ్డువలస ప్రాజెక్టుతో వ్యవసాయంపై ఆశలు చిగురించాయి. కాలువల ద్వారా సాగునీరు సకాలంలో అందుతుండటంతో ఏడాదికి రెండు పంటలు పండించుకుంటున్నాం. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిధులు సకాలంలో మంజూరు చేయడంతో ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరిగాయి. అంతకముందు సాగునీరు లేక వ్యవసాయంపై విరక్తి కలిగి వలసపోయాం. వైఎస్ హయాంలో ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడం ఆనందానిచ్చింది. - కారు లక్ష్ముం, కేఎం వలస, రేగిడి మండలం ‘వంశధార’తో మహర్దశ వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరుచేసిన వంశధార ప్రాజెక్టుతో మా జిల్లా రైతాంగానికి మహర్దశ పట్టింది. వేలాది ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించిన ప్రాజెక్టు పనులు ఆయన మరణానంతరం నిలిచిపోయాయి. తరువాత వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు నిధులు మంజూరు చేయకపోవడం వల్ల పనులు ఆగిపోయాయి. రెండు పంటలకు నీరందించేందుకు తలపెట్టిన రిజర్వాయర్ పనులు జగన్ సీఎం అయితేనే పూర్తవుతాయి. - చింతాడ అప్పలనాయుడు, రైతు, తురకపేట, ఎల్ఎన్ పేట -
వంశధార-2కు మళ్లీ టెండర్
సాక్షి, హైదరాబాద్: వంశధార ప్రాజెక్టు రెండో దశ పనుల టెండర్లను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో నిర్ణయించిన ధరలతో పనులు చేయడానికి ప్రస్తుత కాంట్రాక్టర్ సుముఖంగా లేకపోవడంతో తాజాగా మరోసారి టెండర్లు ఆహ్వానించనుంది. వంశధార రెండవ దశలో భాగంగా నదికి కుడివైపున శ్రీకాకుళం జిల్లా కాట్రగడ్డ వద్ద సుమారు 300 మీటర్ల మేర కరకట్టను తొలగించి దాని స్థానంలో తక్కువ ఎత్తుతో కూడిన గోడవంటి నిర్మాణాన్ని (సైడ్‌వీర్) నిర్మిస్తారు. అక్కడినుంచి హీరమండలం రిజర్వాయర్ వరకు నీటిని తరలించాల్సి ఉంది. నదిలో ప్రవాహం ఎక్కువైనప్పుడు సైడ్‌వీర్ ద్వారా నీరు రాష్ట్ర భూభాగంలోకి వస్తుంది. ఇలా వచ్చే నీటిని సైడ్‌వీర్‌కు ఇరువైపులా నిర్మించే కట్టలు, ఎదురుగా కొంత దూరంలో నిర్మించే రెగ్యులేటర్ ద్వారా నిల్వ చేస్తారు. అక్కడినుంచి 34 కిలో మీటర్ల మేర తవ్వే కాలువ ద్వారా హీరమండలం రిజర్వాయర్‌లోకి తీసుకువెళతారు. సుమారు 8 వేల క్యూసెక్కుల సామర్థ్యం మేరకు ఈ కాల్వను తవ్వాల్సి ఉంది. ఈ పనులన్నిటికీ టెండర్లు గతంలోనే ఖరారయ్యాయి. అయితే ఒడిశా వ్యతిరేకత నేపథ్యంలో సుప్రీంకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పడగా.. ప్రాజెక్టు పనుల్ని చేసుకోవడానికి ట్రిబ్యునల్ రాష్ట్రానికి అనుమతి ఇచ్చింది. అయితే ప్రస్తుతం ధరలు పెరిగిపోవడంతో పాత ధరలతో పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.