శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టు నిర్వాసిత గ్రామల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నిర్వాసిత గ్రామాలను ఖాళీచేయించే ప్రయత్నంలో పోలీస్ పహార ఏర్పాటు చేశారు. పోలీసులను నిర్వాసితులు తీవ్రంగా అడ్డుకున్నారు. ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించేంత వరకూ ఖాళీ చేయబోమని తేల్చి చెప్పారు. అంత వరకు ప్రాజెక్టు పనులను జరగనివ్వబోమని హెచ్చరించారు. దీంతో నిర్వాసిత గ్రామాల్లో సెక్షన్ 144, 30 విధించారు.
గ్రామాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను విశాఖ డీఐజీ సీఎచ్ శ్రీకాంత్ పర్యవేక్షించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు నిర్వహించుకోవాలని సూచించారు. సమస్య పరిష్కారానికి సామరస్యంగా కృషిచేయాలన్నారు. గతంలో జరిగిన విద్వంసం నేపథ్యంలోనే గ్రామాల్లో పోలీస్ బలగాలను పిలిపించినట్లు డీఐజీ తెలిపారు. ఇది వరకు పలుమార్లు జరిపిన చర్చలు విఫలం కావడంతో నిర్వాసిత గ్రామాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి.
పోలీస్ పహారాలో వంశధార నిర్వాసితులు
Published Mon, Aug 7 2017 5:01 PM | Last Updated on Mon, Sep 17 2018 6:18 PM
Advertisement