వంశధారపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు | cpm leaders slams on ap govt over vamsadhara project | Sakshi

వంశధారపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

Published Mon, Jun 20 2016 10:10 AM | Last Updated on Sat, Aug 18 2018 8:08 PM

వంశధార ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు అన్నారు.

శ్రీకాకుళం: వంశధార ప్రాజెక్టును పూర్తి చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చౌదరి తేజేశ్వరరావు అన్నారు. మండలంలో వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న రిలే నిరహార దీక్షా శిబిరాన్ని ఆదివారం సందర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెలల తరబడి నిర్వాసితులు దీక్షలు చేస్తుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్లయినా లేదన్నారు. తక్షణమే 2013 ఆర్‌ఆర్ చట్టం వర్తింపు చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో నిర్వాసిత సంఘం రాష్ట్ర కార్యదర్శి గంగరాపు సింహాచలం, బ్యారేజీ సెంటర్ నిర్వాసితులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement